27 December 2018

లాటిన్ అమెరికాలో ముస్లింలు (Islam in Latin America)




పదిహేను శతాబ్దంలో స్పెయిన్ దేశస్థులు అమెరికాను కనుగొన్నప్పుడు వారు ఆఫ్రికా ఉత్తర మరియు పశ్చిమ ప్రాంతాల నుండి బానిసలను తెచ్చారు. ఆ బానిసలు లాటిన్ అమెరికాలోని  బ్రెజిల్, వెనిజులా, కొలంబియా మరియు కొన్ని కరేబియన్ దీవులలో  ఇస్లాంను పరిచయం చేసారు.
Bottom of Form


పదహారవ శతాబ్దం చివరినాటికి, బానిసల తో పాటు  ఇండియా నుండి వచ్చిన వలస కార్మికులతో  అక్కడ ముస్లింల జన సాంద్రత పెరిగింది. .కొన్ని పత్రాల ప్రకారం, 1850 మరియు 1860 మధ్య అరబ్ ముస్లింల భారీ వలసలు అమెరికన్ భూభాగాల్లో జరిగాయి.
17 వ శతాబ్దం ప్రారంభంలో ఇస్లాం మొదటి సారిగా లాటిన్ అమెరికాలోకి వచ్చినప్పటికీ, 1920 మరియు 1960 లలో జరిగిన వలసల పలితంగా అరబిక్ మూలానికి చెందిన ఒట్టోమన్ పౌరులు ఈ ఖండంలో వచ్చారని తెలుస్తుంది. లాటిన్ అమెరికా ఖండంలో సిరియన్, పాలస్తీనా, లెబనీస్ ముస్లింలు ఒట్టోమన్ భూభాగాల నుండి వచ్చారు. వారు లాస్ టుర్కోస్ Los Turcos గా ప్రస్తావించబడ్డారు.



మెజారిటీ ప్రజలు సిరియా మరియు లెబనాన్ నుండి వచ్చారు మరియు అర్జెంటీనా, బ్రెజిల్, వెనిజులా మరియు కొలంబియా దేశాలలో వీరు నివసిoచసాగినారు. కొందరు పరాగ్వేలో భారత ఉపఖండం నుండి వలస వచ్చిన వారు తో కలిసి జీవించ సాగారు. ఈ ఇమ్మిగ్రేషన్ చాలా తీవ్రమైనది, ఇమ్మిగ్రేషన్ కొంతతకాలం పాటు  చాలా తీవ్రoగా సాగినది. ప్రస్తుతం బ్రెజిల్ మరియు వెనిజులాలో బాగా సాగుతుంది.
 
ఈ దేశాలలోముస్లింలు   కాలక్రమం లో ఇస్లామిక్ సమాజాలు, కేంద్రాలు, మసీదులు మొదలైనవాటిని ఏర్పరచారు. ప్రస్తుతం అన్ని లాటిన్ అమెరికన్ దేశాలలో, ముస్లిం వలసదారులు మరియు స్థానికులు ఉన్నారు. లాటిన్ అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న ధర్మం ఇస్లాం.  అక్కడి ముస్లిం జనాభా వేగంగా పెరుగుతున్నది

గణాంకాల ప్రకారం, లాటిన్ అమెరికాలో ముస్లింల సంఖ్య నాలుగు మిలియన్లకు పైగా ఉన్నారు. అర్జెంటీనాలో 700,000 మంది మరియు బ్రెజిల్లో 1.5 మిలియన్ల మంది ఉన్నారు. లాటిన్ అమెరికాలోని ఇస్లామిక్ జనాభా లో  50% మంది వలస  ముస్లింలు  మిగతా  వారు, మెక్సికన్లు, స్పానిష్లు, ఇటాలియన్లు, కొలంబియన్లు, అర్జెంటీనియన్లు మొదలైన దేశాలో నవ ముస్లింలు గా మారినవారు.

లాటిన్ అమెరికా లోని 18-24 మధ్య వయస్సున్న యువత విశేషంగా మహిళలు ఇస్లాం పట్ల  ఆకర్షించబడ్డారు. వీరు తమ పేర్లను సహితం ఇస్లాం కు అనుగుణంగా మార్చుకోన్నారు. మెక్సికో, అర్జెంటీనా, కొలంబియా మరియు బ్రెజిల్ దేశాలలో సాధారణంగా మసీదులలో ప్రతి నెల విశ్వాసం యొక్క ప్రకటన జరుగుతుంది. ఇస్లాం మతం పట్ల ప్రజలు ఈ ఖండంలో మరింత సన్నిహితమైన మరియు సంపూర్ణ శ్రద్ధ చూపుతున్నారు.

 లాటిన్ అమెరికా ఖండంలోని మొత్తం జనాభా సుమారు 625 మిలియన్లు. ఈ ఖండంలోని మొత్తం ముస్లిం జనాభా 4 మిలియన్లు. ఇందులో అరబిక్ నేపథ్యం మరియు కొత్తగా ధర్మం స్వికరించిన వారు  కూడా ఉన్నారు. అనధికారంగా ఇంకా ఎక్కువ ఉండవచ్చు. రాబోయే కాలంలో, ఇస్లాం ధర్మం యువతలో వేగంగా  వ్యాపిస్తుంది అని ఒక అంచనా.

సాధారణంగా లాటిన్ అమెరికా లోని ప్రతి దేశం యొక్క రాజధాని నగరంలో ఒక మసీదు ఉంది. కొన్ని నగరాల్లో 3-4 మరియు కొన్ని చోట్ల ఒకటి మాత్రమే ఉన్నాయి. రాజధాని నగరాల వెలుపల సాధారణంగా చిన్న మసీదులు ఉన్నాయి, అవి సాధారణంగా అపార్ట్మెంట్ బ్లాకుల అడుగు భాగాలలో ఉన్నాయి. డియానెట్ Diyanet (Directorate of Religious Affairs (మతపరమైన వ్యవహారాల డైరెక్టరేట్) లాటిన్ అమెరికాలోని రెండవ పెద్ద నగరాల్లో మసీదులను నిర్మించుతుంది.అవి 150-200 మంది ప్రార్ధనావసరాలను తీర్చగలవు, పైగా నిర్మాణశైలి బాల్కన్  పద్దతి  లోఉండి అవి ఆకర్షణ కేంద్రంగా ఉంటాయి.

లాటిన్ అమెరికాలో ఒక మసీదు అనేది ఒక ప్రార్థనా స్థలంగా కాదు, అది ప్రజలకు  ఇస్లాం మతంను  పరిచయం చేయటానికి మరియు వివరించే ఒక ప్రదేశం. తన వాస్తుశిల్పం కారణంగా ఇది పర్యాటకులకు ఒక గమ్యస్థానం. లాటిన్ అమెరికాలో నిర్మించబడ్డ ఒక మసీదు 'దృశ్య ప్రచారం కేంద్రంగా' ఉపయోగపడుతుంది. 

లాటిన్ అమెరికాలో ముస్లింల నాయకులు గా   సాధారణంగా మసీదు ఇమామ్లు  మరియు మస్జిద్ నిర్వహణ కమిటీ సబ్యులు అయి ఉంటారు. వీరి మద్య  వ్యక్తిగత కారణాల లేదా రాజకీయ భావజాలంలో తేడా ఉండవచ్చు. కొన్ని మసీదులలో తబ్లిక్ లేదా కొన్నింటిలో  అలాగే సలాఫీ గ్రూపు సభ్యులను చూడవచ్చు. స్పానిష్లో ఇస్లామిక్ సాహిత్యం లేకపోవటం వలన ఈ కొరతను అభినందించటానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
కొత్త పోప్ అర్జెంటీనా వాసి. నూతన పోప్ మరియు అర్జెంటీనాలోని ముస్లిం నాయకులు గతం నుండి మంచి వ్యక్తిగత మిత్రులు.

లాటిన్ అమెరికా ముస్లింలు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిలో ఇస్లామిక్ సంస్కృతి మరియు మతం యొక్క అవగాహన లేకపోవడం, అరబిక్  భాష బోధన లేకపోవడం, ఆర్ధిక వనరుల కొరత మరియు స్పానిష్లో ఇస్లామిక్ సాహిత్యం లేకపోవడం. 

ఇక్కడ చాలామంది ముస్లింలకు  వివాహం, అంత్యక్రియలు, ఖననం మొదలైన వాటికి సంభందిoచిన ప్రాథమిక ముస్లింల ఆచారాల గురించి తెలియదు. అదేవిధంగా వారు హలాల్ మాంసం లబించక పోవడo మరియు ఇస్లామిక్ బట్టల దుకాణాలు: వంటి సమస్యలను కలిగి ఉన్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. లాటిన్ అమెరికాలో ఇస్లామిక్ వస్త్రధారణ స్థానిక దేశాల వాతావరణం మరియు సంస్కృతిని బట్టి ఉంటుంది
లాటిన్ అమెరికా ముస్లింలకు ముస్లింలకు అత్యంత అవసరం అయిన విషయం ఇస్లామిక్ విద్య. ఇస్లామిక్ విద్యను అందించే పుస్తకాలు,పాఠశాలలు తగినంతగా లేవు. కొన్ని ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా ఇస్లాం విద్యను పొందటానికి కొంతమంది విద్యార్ధులను ఈజిప్టు మరియు సౌదీ అరేబియా పంపుతున్నారు. ఈ విషయం లో డైయనేట్ను కృషి చేస్తున్నాయి.

వీటి కృషి ఫలితంగా, స్పానిష్ బాషలో ఇస్లామిక్ పుస్తకాలు మరియు వెబ్సైట్లు వేలుబడినవి. ఇస్లాం మతం పై స్పానిష్  పుస్తకాల యొక్క సామూహిక పంపిణీ, జరుగుతుంది. ఇస్లామిక్ కొత్త సంవత్సరం మరియు ఇస్లామిక్ పండుగుల కోసం ప్రభుత్వ అధికారిక సెలవలు  (ఉదాహరణకు, అర్జెంటీనా లో), ఇస్తున్నారు.

నేడు, లాటిన్ ముస్లిం సమాజంలోని అనేక మంది సభ్యులు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ కాంగ్రెస్లలో పాల్గొంటారు, అరబ్ దేశాలలోని విశ్వవిద్యాలయాలలో యువ లాటిన్ ముస్లింలు అధ్యయనం చేస్తున్నారు  మరియు అనేకమంది తమ ఇస్లామిక్ మతం మరియు సంప్రదాయాల గురించి వారి జ్ఞానాన్ని పెంచుకోవాలని కోరుకుంటారు. ఇస్లాం స్వీకరించిన ప్రజల సంఖ్య కూడా రోజు రోజు పెరుగుతోంది. ఈ పరిస్థితి దృష్ట్యా, లాటిన్ అమెరికా మరియు కరేబియన్ దేశాల్లోని 19 దేశాల ముస్లిం ప్రతినిధులు 1997 లో బ్యూనస్ ఎయిర్స్లో సమావేశమయి "లాటిన్ అమెరికా ఇస్లామిక్ అసోసియేషన్" ఏర్పాటు చేసారు.  

లాటిన్ అమెరికా ముస్లింలు   వ్యాపారంలో విజయవంతమయ్యారు, వారి సామాజిక స్థితి బాగానే ఉంది. వారు సామాజికంగా గౌరవం పొందుతున్నారు. మరియు కొన్ని దేశాలలో ముస్లింలు  గవర్నర్ల, సెనేటర్లు, ప్రతినిధులు మరియు ప్రాముఖ్యతగల  ఇతర స్థానాలలో ఉన్నారు. ఎక్వాడోర్ మరియు అర్జెంటీనా, వెనిజులాలో అనేకమంది ముస్లిం పార్లమెంటు సభ్యులు ఉన్నారు. వారు సాంఘిక సమైక్యతలో విజయవంతమయ్యారు

ప్రాంతం లోని కాథలిక్కులు మరియు ముస్లింలకు మద్య    సంబంధాలు చాలా బాగుంటాయి మరియు వ్యతిరేకత లేదు. 9/11 సంఘటనలచే ప్రభావితమైన కొంతమంది ముస్లింలను ఉగ్రవాదాలుగా  చిత్రీకరించేందుకు ప్రయత్నించారు, కాని వారు అందులో విజయవంతం కాలేదు.

చివరగా లాటిన్ అమెరికా లోని ముస్లింలు ఇస్లామిక్ సమాజాలను కలిగి ఉన్న ప్రదేశాలలో మసీదుల నిర్మాణం లో సహకరించాలి; వారు  పేదలకు  మరియు జబ్బుపడిన వారికి, అవసరం ఉన్నవారికి  మానవతా సహాయం కోసం ఒక ఫండ్ ఏర్పాటుకు సహకరించాలి; వివాహం, అంత్యక్రియలు, సమాధుల వంటి అంశాలలో అందరు ముస్లింలు సంఘటితంగా ఉండి వివిధ కార్యకలాపాలను నిర్వహించడానికి మసీదులను ప్రోత్సహించాలి. అంతమంగా లాటిన్ అమెరికాలోని  ముస్లింలు వారి పొరుగువారికి సహాయం చేయాలి, వారికి ఇస్లాం యొక్క సౌందర్యాన్ని చూపించి, వారి దేశాలలో ఉత్పాదక పౌరులుగా ఉండటానికి కట్టుబడి ఉండాలి.