10 January 2021

సింధ్ ఇబ్న్ అలీ(?- 864) Sind ibn Ali(?-864)



 

సింధ్ ఇబ్న్ అలీ గా పిలవబడే అబూ అల్-తయ్యిబ్ సనాద్ ఇబ్న్ అలీ అల్-యాహుది Abu al-Tayyib Sanad ibn Ali al-Yahudi అబ్బాసిద్ ఖలీఫా అల్-మామున్ ఆస్థానం లో పనిచేసిన ఒక ఇరాకి యూదు ఖగోళ శాస్త్రవేత్త, అనువాదకుడు, గణిత శాస్త్రవేత్త, ఇంజీనీర్ మరియు పాలిమత్.  సింధ్ ఇబ్న్ అలీ తండ్రి అలీ-మూసా ఇస్లాం ధర్మం లోకి మారి  బాగ్దాద్‌లో నివసించి మరియు పనిచేసిన ఖగోళ శాస్త్రవేత్త. సింధ్ ఇబ్న్ అలీ అనేక గణిత మరియు ఖగోళ గ్రంథకర్త.

 సింధ్ ఇబ్న్ అలీ టోలోమి రాసిన ఆల్మాజెస్ట్ ను అధ్యయనం చేశాడు. సింధ్ ఇబ్న్ అలీ ఇరవై సంవత్సరాల వయస్సులో టోలోమి పై తన కున్న పరిజ్ఞానంతో    అల్-మామున్ ఆస్థానంలో పనిచేస్తున్న ప్రముఖ గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త.అల్-అబ్బాస్ ఇబ్న్ సైద్ అల్-జవహరి (మ. 860) ని ఆకట్టుకున్నాడు. అల్-జవారీ మార్గదర్శకత్వంలో సింధ్ ఇబ్న్ అలీ బాగ్దాద్‌లో మరియు అల్-మమున్ ఆస్థానం లో పండితులకు చేరువయ్యాడు,

ముస్లిం ప్రపంచంలో మొదటి ఖగోళ పట్టిక “జిజ్ అల్-సింద్ హింద్  Zij al-Sindhind”. సింధ్ ఇబ్న్ అలీ “జిజ్ అల్-సింద్ హింద్ Zij al-Sindhind” ను అనువదించాడు మరియు సవరించాడు. ఒక గణిత శాస్త్రజ్ఞుడు గా  సింధ్ ఇబ్న్ అలీ,  అల్-ఖ్వారిజ్మి al-Khwarizmi  యొక్క సహోద్యోగి మరియు యాకాబ్ ఇబ్న్ టారిక్‌ Yaqūb ibn Tāriq  తో కలిసి పనిచేశారు, మరియు  వారు భూమి యొక్క వ్యాసం diameter మరియు ఇతర ఖగోళ వస్తువులని కొలిచారు.. సింధ్ ఇబ్న్ అలీ “కితాబ్ అల్-అబార్ వా-ఎల్-ముకబాలా Kitāb al-ğabr wa-l-muqābala  పై వ్యాఖ్యానం కూడా వ్రాసాడు మరియు అల్-ఖ్వారిజ్మి రచనలను నిరూపించడానికి సహాయం చేశాడు. అరబిక్ సంఖ్యలకు దశాంశ పాయింట్ సంజ్ఞామానాన్ని decimal point notation సింధ్ ఇబ్న్ అలీ ప్రవేశ పెట్టాడు.

అల్-మామున్ పాలనలో, ఖగోళ పరిశీలనలకు ఖలీఫా  మద్దతు ఇచ్చాడు బాగ్దాద్ లోని అల్-షమ్మసియా అని పిలువబడే ప్రాంతంలో యాహ్యా బి అబి మన్సూర్ Yahya b. Abi Mansur వంటి ఇతర ఖగోళ శాస్త్రవేత్తలతోకలసి  సింధ్ ఇబ్న్ అలీ ఖగోళ పరిశీలనలు జరిపారు. సింధ్ ఇబ్న్ అలీ అల్-మమున్ స్పాన్సర్ చేసిన ఖగోళ యాత్రలలో కూడా పాల్గొన్నాడు

సింధ్ ఇబ్న్ అలీ జిజ్ (ఖగోళ పట్టికలు) పుస్తకాన్ని తయారు చేశాడని భావిస్తున్నారు, "ధృవీకరించబడిన పట్టికలు“Verified Tables " అని పిలువబడే ప్రసిద్ధ జిజ్ అల్-ముంతాహాన్ zij al-mumtahan అభివృద్ధిలో సింధ్ ఇబ్న్ అలీ పాల్గొన్నాడని పండితులు ఊహిస్తున్నారు.

సింధ్ ఇబ్న్ అలీ కొన్ని గణిత రచనలను రాసినట్లు సమాచారం. వాటిలో “అల్-హిసాబ్ అల్-హిందీ, అల్-జామ్ వా అల్-తఫ్రిక్ మరియు అల్ జబర్ వా అల్-ముకాబలేహ్ al-Hisab al-Hindi, al-Jam’ wa al-tafriq, and al Jabr wa al-muqabaleh” ఉన్నాయి. ఈ గ్రందాలు  వరుసగా “భారతీయ సంఖ్యలు/ అర్ధమాటిక్, కూడికలు, వ్యవకలనం మరియు బీజగణితం Indian numerals/artihmatic, addition and subtraction and algebra” పై వ్రాయబడినవి. సింధ్ ఇబ్న్ అలీ “బుక్ 10 అఫ్ యూక్లిడ్స,   ఎలిమెంట్స్ ఆన్ ఇరేషనల్ మ్యాగ్నిట్యుడ్స్Book 10 of Euclid’s Elements, on irrational magnitudes పై వ్యాఖ్యానం కూడా రాశాడు.

వృత్తిపరమైన అసూయ తో  బను ముసా  సోదరులు,  సింధ్ ఇబ్న్ అలీ ని అబ్బాసిద్ ఖలీఫా  అల్-ముతావాకిల్ నిర్మించిన కొత్త రాజధాని సమర్రా నుండి దూరంగా ఉంచారు మరియు సింద్ ఇబ్న్-ఆలిని  ను బాగ్దాద్కు పంపించటానికి కారణమయ్యారు. బను ముసా సోదరులు (జాఫర్ ముహమ్మద్ ఇబ్న్ ముసా  ఇబ్న్ షకీర్ Ja’far Muhammad ibn Mūsā ibn Shākir  మరియు అహ్మద్ ఇబ్న్ ముసా  ఇబ్న్ షకీర్ Ahmad ibn Mūsā ibn Shākir)  ఇద్దరూ సింధ్ ఇబ్న్ అలీ బదులుగా  అల్-ఫర్గానికి ఒక గొప్ప కాలువను త్రవ్వే పనిని అప్పగించారు తద్వారా మంచి ఇంజనీర్ అయిన సింధ్ ఇబ్న్ అలీ ను విస్మరించారు. అల్-ఫర్గాని కాలువ నిర్మాణం లో గొప్ప లోపం చేసాడు, కాలువ యొక్క ఆరంభం మిగతా వాటి కంటే లోతుగా ఉంది మరియు నీరు అల్-జాఫారియా కు చేరుకోలేదు. సింధ్ ఇబ్న్ అలీ తన ప్రతిభ తో అల్-ఫర్గాని లెక్కల తప్పును దిద్దుబాటు చేసి  బను ముసా  సోదరులను  మరియు అల్-ఫర్గాని Al-Farghani’s ని అబ్బాసిద్ ఖలీఫా  అల్-ముతావాకిల్   విధించే కఠినమైన శిక్ష నుండి   రక్షించినాడు. ఇది సింధ్ ఇబ్న్ అలీ యొక్క గణిత నైపుణ్యం మరియు అతని మేధాతనం యొక్క ఉదాహరణ.

అల్-బిరుని మరియు అల్-ఖాజిని al-Biruni and al-Khazini వంటి ఇస్లామిక్ శాస్త్రవేత్తలు  తమ రచనలలో సింధ్ ఇబ్న్ అలీ పేరు ప్రస్తావించారు. అల్-మామున్‌ స్పాన్సర్ చేసిన  యాత్రలో సింధ్ ఇబ్న్ అలీ పాల్గొన్నప్పుడు జ్యామితిని ఉపయోగించి భూమి యొక్క చుట్టుకొలత ను circumference of the earthకొలిచాడు..రుతువుల కాల పరిమితిని కొలిచాడు,

సింధ్ ఇబ్న్ అలీ క్రీ.శ 864 తరువాత మరణించారు

 

No comments:

Post a Comment