అల్-అజ్జాజ్ ఇబ్న్ యూసుఫ్ ఇబ్న్ మాసర్ 786న జన్మించారు 833లో మరణించారు.అల్-అజ్జాజ్ ఇబ్న్ యూసుఫ్ ఇబ్న్ మాసర్; (786–833 CE) ఒక గణిత శాస్త్రవేత్త మరియు అనువాదకుడు. అతను అబ్బాసిడ్ సామ్రాజ్యం యొక్క రాజధాని బాగ్దాద్లో హౌస్ అఫ్
విజ్డం లో పనిచేసాడు. .
అల్-అజ్జాజ్ ఇబ్న్ యూసుఫ్ ఇబ్న్ మాసర్ జీవితం గురించి దాదాపు ఏమీ తెలియదు. అతను అబ్బాసిడ్ సామ్రాజ్యం యొక్క రాజధాని అయిన బాగ్దాద్లో 8వ శతాబ్దం చివరి మరియు 9వ శతాబ్దం ప్రారంభంలో నివసించాడు మరియు అత్యంత ప్రభావవంతమైన అనువాదకులలో ఒకడు అని మాత్రమే మనకు తెలుసు.
అల్-అజ్జాజ్ ఇబ్న్ యూసుఫ్ ఇబ్న్ మాసర్ టోలెమి యొక్క మెగెల్ సాంటాక్సిస్ Megále Sýntaxis (తరువాత ఆల్మాజెస్ట్ అని పిలుస్తారు) మరియు యూక్లిడ్స్ ఎలిమెంట్స్ అనువదించాడు.
9వ శతాబ్దం ఆరంభంలో, అతను ఎలిమెంట్స్ను ఒకే గ్రీకు మాన్యుస్క్రిప్ట్ ఆధారంగా, అరబిక్లోకి ఖలీఫా హరూన్ అల్ రషిడ్ యొక్క విజిర్ అయిన యాయ్య ఇబ్న్ ఖలీద్ కోసం అనువదించాడు. 820లో అప్పటి అబ్బాసిద్ ఖలీఫా మామన్ కోసం, అజ్జాజ్ తన అనువాదాన్ని సవరించాడు మరియు, కొత్త అనువాదం అతని అసలు అనువాదం కంటే అధునాతనమైనదిగా వర్ణించబడింది. 829 లో అతను టోలెమి యొక్క అల్మాగెస్ట్ ను అనువదించాడు, ఆల్మాజెస్ట్ ఎప్పుడు, ఎవరికి అనువదించాడో తెలియదు.
అల్-అజ్జాజ్ ఇబ్న్ యూసుఫ్ ఇబ్న్ మాసర్ అనువదించిన యూక్లిడ్ పుస్తకాల ప్రభావం అరబిక్, పెర్షియన్, హిబ్రూ మరియు లాటిన్ పండితులపై చాలా కాలం పాటు ప్రభావం ఉంది. అజ్జాజ్ అనువదించిన టోలెమి యొక్క ప్రధాన రచన ఆల్మాజెస్ట్ యొక్క రెండు అనువాద మాన్యుస్క్రిప్ట్స్ నేడు ఉన్నాయి, వాటిలో ఒకటి పూర్తిగా, రెండవది పుస్తకాలు I-IV మాత్రమే ఉన్నాయి ఆ సమయంలో హునాయిన్ ఇబ్న్ ఇషాక్ మరియు సహల్ అల్-తబరా Sahl al-Ṭabarī కూడా అల్మాగెస్ట్ ను అరబిక్ లో అనువదించారు మరియు వాటిని థాబిట్ ఇబ్న్ ఖుర్రా సవరించాడు.
ప్రస్తుతం అరబిక్ అల్మాగెస్ట్ యొక్క పది మాన్యుస్క్రిప్ట్ల లబిస్తున్నాయి. అల్-అజ్జాజ్ అనువాదం యొక్క కొన్ని భాగాలు ముఖ్యంగా స్టార్ కేటలాగ్ ఉత్తర ఆఫ్రికాలోని అండలూసియా (స్పెయిన్), మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా మరియు భారతదేశం యొక్క కేంద్ర భూములలో అధ్యయనం చేయబడ్డాయి.
అబూ-అల్-ఇబ్న్ సినా అబా-అల్-ఇబ్న్ సినా జాబీర్ ఇబ్న్ అఫ్లాస్ మరియు నాసిర్ అల్-దిన్ అల్ –తూసి Abū ʿAlī ibn Sīnā (in Central Asia and
Iran;), Jābir ibn Aflaḥ (in al‐Andalus), and Naṣīr al‐Dīn al‐Ṭūsīవంటి పండితులు వాటిని చదివి వ్యాఖ్యానించారు.
12 వ శతాబ్దంలో, జెరార్డ్ ఆఫ్ క్రెమోనా రెండు అరబిక్ సంప్రదాయాలను సూచించే మాన్యుస్క్రిప్ట్లను ఉపయోగించి అల్మాగెస్ట్ను అరబిక్ నుండి లాటిన్లోకి అనువదించాడు.
క్రీ.శ 12 వ శతాబ్దం ప్రారంభంలో, అడిలార్డ్ ఆఫ్ బాత్ అల్-అజ్జాజ్ యొక్క యూక్లిడ్ ఎలిమెంట్స్ వెర్షన్ను లాటిన్లోకి అనువదించాడు
No comments:
Post a Comment