5 January 2021

అబూ మాషర్ 787-886



పడమట అల్బుమాసర్ Albumasar గా పిలవబడే అబూ మాషర్ జాఫర్ ఇబ్న్ ముహమ్మద్ ఇబ్న్ ఉమర్ అల్ బాల్కి Abū Maʿshar Jaʿfar ibn Muḥammad ibn ʿUmar alBalkhi أبو معشر جعفر بن محمد بن عمر البلخي  యొక్క జననo బహుశా 787లో బాల్ఖ్, ఖురాసన్ (నేటి ఆఫ్ఘనిస్తాన్) లో జరిగింది.

అబూ మాషర్, ప్రారంభ పెర్షియన్ ముస్లిం జ్యోతిష్కుడుఖురాసన్ లోని బాల్ఖ్ నివాసి అబూ మాషర్ అల్-మామాన్ యొక్క కాలిఫేట్ యొక్క ప్రారంభ సంవత్సరాల్లో బాగ్దాద్కు వచ్చాడు (r. 813-833). బాగ్దాద్‌లోని అబ్బాసిడ్ ఖలీఫా అల్ మామున్ ఆస్థానం లో ప్రముఖ జ్యోతిష్కుడిగా పరిగణించబడినాడు. అతని పుట్టిన మరియు మరణించిన తేదీల గురించి కొంత ప్రశ్న/సందేహం  ఉంది,

అబూ మాషర్ తన జ్యోతిషశాస్త్ర రచనలకు ప్రసిద్ధి చెందాడు. జ్యోతిష్కశాస్త్రం లో అతని రచనలు జ్యోతిష్కులకు శిక్షణ ఇవ్వడానికి,  ముస్లిం మేధో చరిత్రను మరియు పశ్చిమ ఐరోపా మరియు బైజాంటియమ్లను బాగా ప్రభావితం చేశాయి

అబూ మాషర్ "అత్యంత ఆశ్చర్యకరమైన మరియు అస్థిరమైన" పరిశీలనాత్మకత"most astonishing and inconsistent" eclecticism విధానాన్ని సమర్థించాడు. అతను మొదట్లో హదీసు పండితుడు, మరియు నలభై ఏడు సంవత్సరాల వయస్సులో (832/3) మాత్రమే జ్యోతిషశాస్త్రం వైపు మొగ్గు చూపాడు.

అరిస్టోటెలిజం మరియు నియోప్లాటోనిజంలో ప్రావీణ్యం ఉన్న అరబ్ తత్వవేత్త అల్-కిండి ( 796–873) తో అతను వివాదంలో చిక్కుకున్నాడు. అల్-కిండితో ఘర్షణ వలన  తాత్విక వాదనలను అర్థం చేసుకోవడానికి అబూ మాషర్‌ అంకగణితం మరియు జ్యామితి అధ్యయనం పట్ల   ఆసక్తి చూపించాడు.

అబూ మాషర్ బెనారస్ (వారణాసి) వద్దకు వచ్చి అక్కడ పదేళ్లపాటు ఖగోళ శాస్త్రాన్ని అభ్యసించాడని అమీర్ ఖుస్రవ్ పేర్కొన్నాడు.అబూ మాషర్ ఖగోళ పట్టికలతో సహా నక్షత్రాల శాస్త్రంలోని ఇతర శాఖలపై కూడా వ్రాసాడు. ఖగోళశాస్త్రంపై ఆయన చేసిన రచనలు విస్తృతంగా లేవు. ప్రస్తుతం అబూ మషార్ ఖగోళశాస్త్రం యొక్క అన్ని రచనలు లబించుటలేదు మరియు అరబిక్‌లో అతని జ్యోతిషశాస్త్ర రచనలు మాత్రమే మనకు తెలుసు.

అబూ మాషర్ యొక్క ప్రధాన జ్యోతిషశాస్త్ర రచనలు:

·       106 అధ్యాయాలు కల కితాబ్ అల్-ముద్ఖల్ అల్ కబీర్ Kitāb almudkhal alkabīr ఇది జ్యోతిషశాస్త్రానికి పరిచయ గ్రంధం an introduction to astrology . ఇది 11 వ శతాబ్దం నుండి లాటిన్ మరియు గ్రీకు భాషలలో  అనేక అనువాదాలను పొందింది. ఆల్బర్ట్ ది గ్రేట్ వంటి పాశ్చాత్య తత్వవేత్తలపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది.

·       అబూ మషార్ తన పరిచయ రచన (కితాబ్ ముఖ్తాసర్ అల్-ముద్ఖల్ Kitāb mukhtaṣar almudkhal) యొక్క సంక్షిప్త సంస్కరణను కూడా వ్రాసాడు, దీనిని లాటిన్లోకి అడిలార్డ్ ఆఫ్ బాత్Adelard of Bath అనువదించాడు.

·       కితాబ్ అల్ మిలాల్ వా-ల్-దువాల్ (మతాలు మరియు రాజవంశాలపై పుస్తకం) Kitāb almilal waʾlduwal (Book on religions and dynasties) ఇది 63 అధ్యాయాలలో ఎనిమిది భాగాలుగా ఉంది.ఈ రచన లాటిన్లోకి అనువదించబడింది మరియు దీనిని రోజర్ బేకన్, పియరీ డి'అల్లి మరియు పికో డెల్లా మిరాండోలా (1463-1494) తమ ప్రధాన రచనలలో చర్చించారు.

·       ఫీ ధిక్ర్ మా తదుల్లు   అలైహి అల్-అష్ఖ్ అల్-ఉల్వియా (ఖగోళ వస్తువుల సూచనలపై [భూసంబంధమైన విషయాల కోసం) Fī dhikr ma tadullu ʿalayhi alashkhāṣ alʿulwiyya (On the indications of the celestial objects [for terrestrial things]),

 

·       కితాబ్ అల్-దలాలత్ ʿ అల్-ఇట్టిలాట్ వా-కిరోనాక్ అల్-కవాకిబ్ గ్రహ సంయోగాల సూచనలు ...) Kitāb aldalālāt ʿalā alittiṣālāt waqirānāt alkawākib (Book of the indications of the planetary conjunctions...),, మరియు కితాబ్ అల్ ఉల్ఫ్ (వేల పుస్తకాలు) Kitāb alulūf (Book of thousands),, ఇవి లబించుట లేదు.

·       కితాబ్ తౌవాల్ సినా అల్-అలాం (అబూ మాషర్ పువ్వులు Kitāb taḥāwīl sinī al-'ālam (Flowers of Abu Ma'shar), సంవత్సరంలో నెలలు మరియు రోజులను పరిశీలించడానికి జాతకచక్రాలను ఉపయోగిస్తుంది. ఇది జ్యోతిష్కులకు ఒక మాన్యువల్. దీనిని 12వ శతాబ్దంలో జాన్ ఆఫ్ సెవిల్లె అనువదించారు.

·       కిటాబ్ తౌవిల్ సినా అల్ మావాలాడ్ (నేటివిటీల సంవత్సరాల విప్లవాల పుస్తకం)  Kitāb taḥāwil sinī almawālīd (Book of the revolutions of the years of nativities). -57 అధ్యాయాలలో మొదటి ఐదు భాగాలు (96 అధ్యాయాలలో తొమ్మిది భాగాలలో) .1000AD లో గ్రీకు లోకి అనువదించబడ్డాయిమరియు 13 వ శతాబ్దంలో గ్రీకు లోంచి లాటిన్లోకి అనువదించబడింది.

·       మరొకటి కితాబ్ మావాలాద్ అల్ రిజాల్ వా-ల్-నిశా (పురుషులు మరియు మహిళల నేటివిటీల పుస్తకం Kitāb mawālīd alrijāl waʾlnisāʾ (Book of nativities of men and women).). ఇస్లామిక్ ప్రపంచంలో దాని అధిక ప్రజాదరణను పొందినది..

అబూ మషార్ వాసిట్ Wasit, (ఇరాక్)లో బహుశా 886 లో 98 సంవత్సరాల వయస్సులో మరణించారు అబూ మాషర్ ఒక పెర్షియన్ జాతీయవాది.

 

  

No comments:

Post a Comment