22 January 2021

డిల్లి లోని మొఘల్ పూర్వ కాలం నాటి మసీదులు (pre-Mughal Mosques) నిర్లక్ష్యంలో ఉన్నాయి Delhi’s pre-Mughal Mosques wallow in neglect



చారిత్రాత్మక మసీదులు ఉన్ననగరాలలో డిల్లి ప్రధానమైనది. మొఘలులకు ముందునుంచే చాలా మంది పాలకులు ఇక్కడ తమ రాజధానులను నిర్మించి, నిర్మాణ కళాఖండాలతో డిల్లి నగరాన్ని అందంగా తీర్చిదిద్దారు.

ఇతర నిర్మాణాల మాదిరిగానే, మొఘల్ ముందు కాలంనాటి మసీదులు నిరాడంబరంగా మరియు నిర్లక్షo లో ఉన్నాయి. నిర్లక్షం చేయబడిన మొఘల్ కాలంకు ముందు (pre-Mughal) నాటి మసీదులలో  కొన్ని ప్రముఖ ఉదాహరణలు.

 

 

1. కలు సరాయ్ మసీదు Kalu Sarai Mosque:


ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క వజీర్, జునా షా మక్బూల్ తెలంగాని నిర్మించిన ఈ 600 సంవత్సరాలకు పైగా  పురాతన నిర్మాణం ఇప్పుడు చట్టవిరుద్ధంగా కొంతమంది స్క్వాటర్స్ చేత ఆక్రమించబడింది. దాని గోపురాలు కొన్ని కూలిపోయాయి మరియు దానిలో నివసిస్తున్న కుటుంబాలు  వారసత్వ నిర్మాణానికి తమకు నచ్చిన విధంగా మార్పులు చేసారు.

కోఆర్డినేట్స్: 28.54206618021871, 77.20296988312094

 

2. ఖిర్కి మసీదుKhirki Mosque:


మక్బూల్ తెలంగాని నిర్మించిన మొత్తం ఏడు మసీదులలో గొప్పది ఖిర్కి మసీదు. ఇది 14 వ శతాబ్దంలో నిర్మించినప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పైకప్పు గల మసీదు అని చెబుతారు. ఇది ఆ ప్రాంతంలోని ఒక ప్రముఖ స్మారక చిహ్నం, మసీదుకు ఆనుకొని ఉన్న ప్రాంతo ఖిర్కి విలేజ్ అని పిలవబడుతుంది, సమీపంలో నివసిస్తున్న వారు మసీదు యొక్క భూమిని ఆక్రమిస్తున్నారు. ఖిర్కి  మసీదు వెలుపల సైన్ బోర్డు ధ్వంసం చేయబడింది.

 కోఆర్డినేట్స్: 28.531473013355, 77.21959412585349

 

3. తుగ్లకాబాద్ ఫోర్ట్ మసీదుTughlaqabad Fort Mosque:

 క్రీస్తుశకం 1321-23లో తుగ్లక్ రాజవంశం స్థాపకుడు గియాసుద్దీన్ తుగ్లక్ నిర్మించిన తుగ్లకాబాద్ యొక్క శిధిలమైన కోట లోపల తుగ్లకాబాద్ ఫోర్ట్ మసీదు కలదు. దేశంలో దీనిలాగా ఇంకో మస్జిద్ లేదు. మసీదుకు గోపురాలు లేవు-వాటికి బదులుగా వాలుగా ఉన్న పైకప్పు ఉంది. ఆశ్చర్యకరంగా, కోట యొక్క అసలు నిర్మాణాలు చాలా పోయినప్పటికీ ఇది ఇప్పటికీ ఇంకా మనుగడలో ఉంది.

 కోఆర్డినేట్స్: 28.511897475476182, 77.26318898959298

 

 4.చౌబర్జీ మసీదు Chauburji mosque:


 

చౌబుర్జీ మసీదు ఫిరోజ్ షా తుగ్లక్ కాలం నాటిది. చౌబుర్జీ అంటే నాలుగు టవర్లు అని అర్ధం-ఇది మసీదు యొక్క అసలు నాలుగు గోపురాలకు సూచన కావచ్చు. విభజన సమయంలో మసీదు విధ్వంసానికి గురై చట్టవిరుద్ధంగా ఆక్రమించబడింది. మసీదు నిర్జీవంగా ఉంది.

 కోఆర్డినేట్స్: 28.681534332426722, 77.21524666513318

 

5.దర్వేష్ షా మసీదు Darwesh Shah Mosque:


గుల్మోహర్ పార్క్ పరిధిలో ఉన్న ఈ లోడీ యుగం మసీదు ప్రకృతి యొక్క మార్పులకు లోనయి క్షిణ దశలో ఉంది.

కోఆర్డినేట్స్: 28.554755240067838, 77.21141685798423

 

6. బేగంపూర్ మసీదు Begumpur Mosque:

జహన్‌పనా నగరంలోని ఈ మసీదు ను ముహమ్మద్ బిన్ తుగ్లక్ స్థాపించారు. బేగంపూర్ మసీదు యొక్క నిర్మాణం టామెర్లేన్ (తైమూర్) ను ఎంతగానో ఆకట్టుకుందని, సమర్కాండ్‌లో నిర్మించిన బీబీ-ఖనిమ్ మసీదు దీనిని పోలి ఉందని  చెబుతారు. అతను దానిని నిర్మించడానికి నగరం నుండి కళాకారులను తీసుకువెళ్లిన్నట్లు చెబుతారు.

బేగంపూర్ మసీదు గోపురాలు చాలా కూలిపోయాయి మరియు దాని భూమిలో గణనీయమైన భాగం ఆక్రమించబడింది. ఇది 1928 నుండి ASI పరిధిలో ఉన్నప్పటికీ ఇది దమనీయమైన స్థితిలో ఉంది.

కోఆర్డినేట్స్: 28.539183657172043, 77.20603881183953

 

7. మాధి మసీదు Madhi Masjid:

 

లోడి యుగం నాటి  మసీదు యొక్క ధృడనిర్మాణంగల రాతి గోడలను కప్పే ప్లాస్టర్లు రాలి పోతున్నాయి, దాని అందమైన కిబ్లా గోడ శిదిలమైనది.

కోఆర్డినేట్స్: 28.514843672265442, 77.18460464040885

 

8.ముబారక్ షా మసీదు Mubarak Shah Mosque:


ముబారక్ షా సమాధి సమీపంలోని ఈ మసీదు నివాస భవనాలు మరియు దుకాణాల మధ్య ఉంది. సయ్యిద్‌లు నిర్మించిన అరుదైన మసీదులలో ఇది ఒకటి. అది భౌతికoగా చాలా శిదిలమైనది.

 

కోఆర్డినేట్స్: 28.57242762610085, 77.22222691140468

 

 


No comments:

Post a Comment