13 February 2022

ప్రపంచ రేడియో దినోత్సవం-భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో రేడియో పాత్ర भारत की जंग ए आज़ादी में रेडियो का रोल

 

 


 




 

ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులలో ఒకరైన కల్నల్ ఎహ్సాన్ ఖాదిర్ ఆజాద్ హింద్ రేడియోకు డైరెక్టర్. కల్నల్ ఇనాయతుల్లా హసన్ ఆజాద్ హింద్ రేడియో కోసం దేశభక్తి నాటకాలు రాసేవాడు, అతను రాసిన నాటకాలు చాలా అద్భుతంగా ఉండేవి. ఆల్ ఇండియా రేడియో దానికి సమాంతరంగా తన స్వంత కార్యక్రమాన్ని నిర్వహించవలసి వచ్చేది.

ఈ రోజు  ప్రపంచ రేడియో దినోత్సవం మరియు మనం ఆజాది కి అమృత్ మహోత్సవ్ కూడా జరుపుకుంటున్నాము. ఈ సందర్భం లో  జంగ్-ఎ-ఆజాదీలో రేడియో పాత్ర కూడా చర్చించబడాలి.

1942 జూన్ 17, 27 జూలై మరియు 17 ఆగస్టు 17 తేదీల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రేడియో ద్వారా భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు మరియు  బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా భారతదేశ ప్రజలు పోరాడాలి అని  చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ సమయంలో జర్మనీ రాజధాని బెర్లిన్‌లో భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం సైనిక సహాయం కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఆజాద్ హింద్ రేడియో ద్వారా భారత దేశంతో అతని అనుబంధం కొనసాగింది.

ఆ సమయం లో యూసుఫ్ జాఫర్ మెహెర్ అలీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత, బ్రిటీష్ ప్రభుత్వం 9 ఆగస్టు 1942 వరకు గాంధీతో సహా చాలా మంది కాంగ్రెస్ సభ్యులను అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆగష్టు 27, 1942, బొంబాయిలోని చౌపటీ ప్రాంతంలోని ఒక భవనంలో ట్రాన్స్‌మిటర్‌ను అమర్చడం ద్వారా కాంగ్రెస్ రహస్య రేడియో ప్రసారాన్ని ఉషా మెహతా ప్రారంభించారు.

బ్రిటీష్ వారి నుండి తప్పించుకుంటూ ఉషా మెహతా కాంగ్రెస్ రహస్య రేడియో ను  మొత్తం 88 రోజులు మాత్రమే నడపగలిగింది. ఉషా మెహతా ఈ రేడియో స్టేషన్ యొక్క మొదటి ప్రసారాన్ని ఈ పదాలతో ప్రారంభించారు: "ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రేడియో, 42.34 మీటర్ల బ్యాండ్‌లలో మీరు భారతదేశంలోని ఏదో ఒక ప్రదేశం నుండి మమ్మలను వింటున్నారు." ఆ చీకటి క్షణాలలో, కాంగ్రెస్ సీక్రెట్ రేడియో భారతీయులలో లౌకికవాదం, అంతర్జాతీయవాదం, సౌభ్రాతృత్వం మరియు స్వేచ్ఛ యొక్క స్ఫూర్తిని వ్యాప్తి చేసింది.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసంగాలు  బెర్లిన్ నుండి ప్రసారం చేయబడి వాటిని భారత ప్రజలు శ్రద్ధగా వినేవారు. 1942 ఆగస్టు 31న ప్రసారమైన తన ప్రసంగంలో, క్విట్ ఇండియా ఉద్యమంతో బ్రిటిష్ పాలన పునాది కదిలిందని బోస్ అన్నారు. బోస్ ఈ ఉద్యమాన్ని అహింసా గెరిల్లా యుద్ధం అని పిలిచారు. అదే ప్రసంగంలో బోస్ తన గత రేడియో ప్రసారాన్ని ఉటంకిస్తూ, ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో దేశప్రజలకు కీలకంగా చెప్పారు. బోస్ ప్రకారం, గాంధీ మరియు ఇతర నాయకులు జైలుకు వెళ్లడం స్ఫూర్తికి మూలం. మరియు దేశప్రజలు వారి సిద్ధాంతాలను అనుసరించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.

బ్రిటిష్ ప్రభుత్వానికి పన్నులు కట్టకూడదని, ప్రభుత్వ ఉద్యోగులు నెమ్మదిగా పనిచేయాలని, కాలేజీ చదువులు ఆగిపోవాలని, మహిళలు దూతలుగా పనిచేయాలని, ప్రభుత్వ ఉద్యోగాలను వదిలిపెట్టకుండా ఆ ఉద్యోగాన్ని దేశానికి ముఖ్యమైన గూఢచర్యానికి ఉపయోగించుకోవాలని బోస్ విజ్ఞప్తి చేశారు.  ఇంట్లో/సమాజం లో  ప్రభుత్వ ఉద్యోగం పనిచేసే వారికి ఆదరణ ఇవ్వవద్దు.. సొంత రేడియో స్టేషన్ యొక్క ఆలోచన కూడా ఈ ప్రసంగంలో ఇవ్వబడింది. పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ స్థలాల్లో ప్రజలు ప్రదర్శన చేయాలని విజ్ఞప్తి చేశారు. నిశితంగా పరిశీలిస్తే భారతీయ ప్రజలు ఈ మార్గాన్ని అవలంబించి ఉద్యమానికి బలాన్నిచ్చారని తెలుస్తుంది. అందుకే గాంధీజీ ఉద్యమాన్ని ప్రారంభించినా సుభాష్ బోస్ దానిని చివరి వరకు తీసుకొచ్చారు.

1941లో, ముహమ్మద్ ఇక్బాల్ షైదాయ్ ఇటలీలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా హిమాలయా రేడియో ను ప్రారంభించాడు. దీని నిర్వహణ బాధ్యత మొత్తం భగత్ సింగ్ మామ అయిన సర్దార్ అజిత్ సింగ్ పై ఉంది. వీరందరూ బ్రిటిష్ వారి కోసం పోరాడుతున్న భారతీయ సైనికులను తమ వైపు తిప్పుకోవడానికి రేడియో హిమాలయాను ఉపయోగించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ BBCని "ది బ్లఫ్ అండ్ బ్లస్టర్ కార్పొరేషన్, ఆఫ్ లండన్" అని పిలిచేవారు

 

 

 

 

 

.

No comments:

Post a Comment