దివ్య ఖురాన్‌లోని జోసెఫ్/యూసుఫ్
కథలో తలుపు తాళాల ప్రస్తావన కలదు. కాని
దివ్య ఖురాన్ లో వివరించిన ఈ ప్రస్తావన తప్పు అని కొంతమంది సంశయవాదులు పేర్కొoటున్నారు. వారి
ప్రకారం జోసెఫ్/యూసుఫ్ తర్వాత 1వ
మిలీనియ BC
సమయంలోనే
గ్రీకులు మరియు రోమన్లు తాళాలు కనుగొన్నారు.
కాని నేడు ఈజిప్టోలోజిస్ట్లు Egyptologists
గ్రీకులు మరియు రోమన్ల కంటే 3000
సంవత్సరాల ముందు తలుపు తాళాలను కనుగొన్నారు అని అంటున్నారు..
తాళాల చరిత్ర:
యాంత్రిక తాళాల
చరిత్ర పురాతన ఈజిప్టులో 6వేల సంవత్సరాల క్రితం
ప్రారంభమైంది, ఇక్కడ తాళాలు తయారు చేసేవాళ్ళు మొదట
పూర్తిగా చెక్కతో తయారు చేయబడిన సరళమైన, ప్రభావవంతమైన పిన్ టంబ్లర్ లాక్‌ని తయారు
చేసారు.. ఇది తలుపుకు అతికించిన చెక్క పోస్ట్ ను కలిగి ఉంది మరియు పోస్ట్ లోకి
జారిపోయే క్షితిజ సమాంతర horizontal
బోల్ట్ కలిగి ఉంది.
ఈ బోల్ట్ లో పిన్నులతో
నిండిన ఓపెనింగ్‌ల సెట్ ఉంది. ప్రత్యేకంగా రూపొందించిన పెద్ద మరియు బరువైన చెక్క
కీ లాక్‌లోని రంధ్రాలు మరియు పిన్‌లకు అనుగుణంగా ఉండే మేకులతో కూడిన ఆధునిక టూత్ బ్రష్ ఆకారంలో ఉంది. ఈ కీని
ఓపెనింగ్‌లోకి చొప్పించవచ్చు మరియు ఎత్తవచ్చు, ఇది
పిన్‌లను కదిలిస్తుంది మరియు సెక్యూరిటీ బోల్ట్‌ను కదిలించడానికి అనుకూలంగా
ఉంటుంది..
1వ
మిలీనియం BC సమయంలో, గ్రీకులు
మరియు రోమన్లు ప్రవేశపెట్టిన సాంకేతికతలు మరియు డిజైన్‌లతో చివరకు తాళాల తయారీ
అభివృద్ధి చెందడం ప్రారంభమైనది.
డోర్ లాక్స్ 6000 సంవత్సరాల క్రితం
ఈజిప్షియన్లు కనిపెట్టారు. ఇది ఇటీవలే తెలిసింది; అయితే దీనిని కనుగొనబడటానికి 1400 సంవత్సరాల ముందు దివ్య
ఖురాన్‌లో వ్రాయబడినది.
అతను ఉంటున్న ఇంటిలోని స్త్రీ అతని
కోసం వల పన్నసాగింది. ఒకరోజు తలుపులు మూసి “వచ్చేయి!” అని అన్నది. యూసుఫ్ ఇలా
అన్నాడు: “నేను అల్లాహ్ శరణు వేడుకొంటున్నాను. నా ప్రభువు నాకు మంచి స్థానం ప్రసాదించాడు. (నేను ఈ పని ఎలా
చేయను?) అటువంటి దుర్మార్గులు ఎన్నటికి సాఫల్యం పొందలేరు.” దివ్య ఖురాన్ 12:23
ఎవరూ లోపలికి రాకుండా
ఆమె తలుపులు మూసేసింది. ఎవరూ లోపలికి రాకుండా ఉండాలంటే తలుపులకు తాళం వేయాలి? జోసెఫ్/యూసుఫ్ కంటే చాలా కాలం ముందే ఈజిప్షియన్లు తలుపు తాళాలు
కనుగొన్నారని ఈ రోజు మనకు తెలుసు.
దివ్య ఖురాన్‌లో
తప్పులు లేవు.
1400
సంవత్సరాల క్రితం జీవించిన నిరక్షరాస్యుడు అయిన ప్రవక్త (స) డోర్ లాక్‌లను ఎవరు
కనుగొన్నారో ఎలా తెలుసుకోగలడు?
No comments:
Post a Comment