24 May 2022

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 భారతదేశంలోని ముస్లింల గురించి కొన్ని అపోహలను తొలగించినది. National Family Health Survey-5 busts some myths about Muslims in India

 

అధిక జనాభా, మహిళల విద్య మరియు బాల్య వివాహాల పట్ల నిర్లక్ష్యం-ఈ అంశాలపై  తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ముస్లిం సమాజo పట్ల ఇతరులకు ఉన్న  అపోహలను తొలగించినది.

 

భారతదేశంలో 20 కోట్ల జనాభాతో, ముస్లింలు అతిపెద్ద మైనారిటీగా ఉన్నారు. ముస్లిం సమాజం పై అపోహలు, తప్పుడు సమాచారం తరచుగా వినిపిస్తూ  ఉంటుంది.

 

వివాహం మరియు సంతానోత్పత్తి, ఇస్లాం లో స్త్రీ హోదా, ఇస్లామిక్ మతం మరియు ముస్లిం ప్రజల పట్ల భారతీయులకున్న  అవగాహన ‘లో వాస్తవం ఎంత, కల్పన ఎంత?

 

ఈ నెల ప్రారంభంలో విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (NFHS-5) అందించిన తాజా డేటాను ఉపయోగించి, ముస్లిం సమాజo పట్ల ఉన్న ఐదు అపోహలను తొలగించుదాము.

 

1.మొదటి అపోహ - అధిక జనాభా:

 

భారతదేశంలోని ముస్లింలపై చేసిన అతిపెద్ద ఆరోపణ వారికి చాలా మంది పిల్లలు ఉన్నారు. ఇది భారతదేశ జనాభా విస్ఫోటనం మరియు జనాభా సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఎంపీ సాక్షి మహరాజ్ ముస్లిం జనాభా ను అధిగమించాలంటే ప్రతి హిందువులు కనీసం నలుగురు పిల్లలను కనాలని అన్నారు.

మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR, స్త్రీ తన జీవితకాలంలో జన్మనిచ్చే సగటు పిల్లల సంఖ్య)ను పరిశీలిస్తే, ముస్లిం సమాజం సంతానోత్పత్తి రేటు ఇతర మత సంఘాల  TFR కన్నా చాలా ఎక్కువ కాదు..

 



జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5)

 

NFHS-5 ప్రకారం, 2019-21లో ముస్లింల TFR 2.36. టైమ్ సిరీస్ డేటా ప్రకారం, గత 25 ఏళ్లలో, ముస్లింలలో TFR 1998-99లో 3.6 నుండి 2019-21లో 2.36కి పడిపోయింది. హిందువులలో TFR 1.94గా నమోదైంది,.

 

2. అపోహ -రక్తసంబంధమైన వివాహానికి అనుకూలంFavouring consanguineous marriage:

 

ముస్లిం ప్రజలు తమ కుటుంబాల్లోనే వివాహం చేసుకోవడం సాధారణమైనదని నమ్ముతారు. అయితే, డేటా వేరే చిత్రాన్ని చూపుతుంది

15.8% ముస్లిం స్త్రీలు మాత్రమే రక్త సంబంధీకులను (తండ్రి లేదా తల్లి వైపు నుండి మొదటి లేదా రెండవ బంధువు, మామ లేదా ఇతర రక్త సంబంధీకులు) వివాహం చేసుకున్నారని సర్వే కనుగొంది, అయితే 80% కేసులలో, భార్యాభర్తలకు బంధుత్వం లేదు.

 

బౌద్ధ/నియో బౌద్ధ సమాజం 14.5% రక్తసంబంధిత వివాహాలతో, క్రైస్తవులు 11.9% మరియు హిందువులు 10.1% తో ఉన్నారు.

 



National Family Health Survey (NFHS-5) జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (NFHS-5)

 

మొత్తంమీద, జాతీయ స్థాయిలో, 11% మంది భారతీయ మహిళలు తమ రక్తసంబంధీకులను వివాహం చేసుకున్నారని నివేదించబడింది, ఇది ముస్లింలు జాతీయ సగటు కంటే గణనీయంగా ఎక్కువ కాదని నిర్ధారించింది.

NFHS బహుభార్యత్వంపై-(ఒక పురుషుడు బహుళ స్త్రీలను వివాహం చేసుకోవడం) డేటాను కూడా నమోదు చేస్తుంది-కానీ తుది నివేదికలో అది అందుబాటులో లేదు.

అందుబాటులో ఉన్న గత డేటా ప్రకారం, 2005-06 నాటికి, కేవలం 2.5% ముస్లిం మహిళలు మాత్రమే తమ భర్తలకు ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నారని నివేదించారు, అదే హిందూ మహిళలకు 1.77%.

 

3. అపోహ-ప్రారంభ వివాహాలు Early marriages:

 

ముస్లింలలో, ముఖ్యంగా యుక్తవయస్సులో ఉన్న స్త్రీలలో బాల్య వివాహాలు జనాదరణ పొందిన పద్ధతిగా నమ్ముతారు. ముస్లిం పర్సనల్ లా 15 ఏళ్ల తర్వాత పురుషులు మరియు మహిళలకు వివాహాన్ని కూడా అనుమతిస్తుంది. అయితే, NFHS-5 చూపినట్లుగా, ముస్లింలు కూడా ఈ విషయంలో బయటివారు కాదు.

 



 

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5)

 

ఒక ముస్లిం మహిళ వివాహం చేసుకునే సగటు వయస్సు 18.7 సంవత్సరాలు. అంటే సమాజంలోని సగం కంటే ఎక్కువ మంది మహిళలు 18-19 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకుంటారు. మొదటి వివాహంలో మధ్యస్థ వయస్సు (median age) హిందూ స్త్రీలలో కూడా ఒకటే-18.7 సంవత్సరాలు.

 

ఇతర మైనారిటీలలో, స్త్రీల వివాహానికి సగటు వయస్సు 21 కంటే ఎక్కువ-సిక్కులు, 21.2 సంవత్సరాలు; క్రైస్తవులు, 21.7 సంవత్సరాలు; మరియు జైనులు, 22.7 సంవత్సరాలు.

 

4. అపోహ-విద్య లేకపోవడం  lack of education:

 

ముస్లిం సమాజాన్ని ఎదుర్కొంటున్న ఒక అపోహ ఏమిటంటే వారు స్త్రీ విద్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ముస్లిం మహిళలు పాఠశాలలకు వెళ్లకుండా నిషేధించబడుతుంటే, డేటా ఈ లింగ అసమానతను ప్రతిబింబిస్తుంది. అయితే, సంఖ్యలు వేరే కథను చెబుతాయి.

 



జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5)

NFHS-5 డేటా ప్రకారం ఒక మహిళా ముస్లిం విద్యార్థి పాఠశాలలో గడిపిన సగటు సంవత్సరాల సంఖ్య 4.3 సంవత్సరాలు. మరో మాటలో చెప్పాలంటే, సర్వేలో పాల్గొన్న దాదాపు సగం మంది ముస్లిం మహిళలు NFHS-5 ప్రకారం  పాఠశాలలో కనీసం 4.3 సంవత్సరాలు పూర్తి చేశారు. పురుషులకు అదే 5.4 సంవత్సరాలు. కాబట్టి, సగటున, ముస్లిం బాలికల కంటే ముస్లిం అబ్బాయిలు పాఠశాలలో 1.1 సంవత్సరాలు ఎక్కువగా గడిపారు. వాస్తవానికి, ఇతర కమ్యూనిటీలలో విద్యాభ్యాసం సంవత్సరాల్లో లింగ అంతరం ఎక్కువగా ఉంది, కనీసం 2 సంవత్సరాల కంటే ఎక్కువ, మరియు హిందువులలో అత్యధికంగా ఉంది, ఇక్కడ మగ విద్యార్థులు సగటున 7.5 సంవత్సరాలు మరియు స్త్రీలు 4.9 సంవత్సరాలు పాఠశాలలో గడిపారు.

5, అపోహ-ఆల్కహాల్ వినియోగం Alcohol Consumption:

ఇస్లాం మద్యం సేవించడాన్ని నిషేధిస్తుంది. భారతదేశంలో, మద్యం సేవించే ముస్లిం పురుషుల శాతం (6.3%) జాతీయ సగటు కంటే గణనీయంగా తక్కువగా ఉంది.



జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5)

2011 జనాభా లెక్కల ప్రకారం 15-54 సంవత్సరాల వయస్సు గల పురుషుల ముస్లిం జనాభా సుమారుగా 6.2, కోట్లలో ఉంది.మద్యం సేవించే వారిలో దాదాపు 40 లక్షల మంది ముస్లిం పురుషులు మాత్రమే ఉన్నారు.


వాస్తవాలు ఎలా ఉన్నప్పుడు భారతీయులు ముస్లింల గురించి ఎందుకు అపోహలో ఉన్నారు

సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (CSDS)లో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన హిలాల్ అహ్మద్ NFHS-5 గణాంకాలు "ఆశ్చర్యకరమైనవి కావు" అని చెప్పారు. మా స్వంత సర్వేలు దశాబ్దాలుగా భారతీయ ముస్లింల గురించి చెబుతున్న వాస్తవాలను NFHS-5 యొక్క ఫలితాలు ధృవీకరిస్తున్నాయి. CSDS Lokniti సర్వేలు భారతీయ ముస్లింలు  బయటివారు కాదని చాలా సంవత్సరాలుగా చూపిస్తున్నాయి. కాని వారి చుట్టూ ఉన్న అపోహలు వాస్తవాల కంటే వేగంగా ప్రయాణించాయి."

నిజానికి UK ఆధారిత పత్రిక న్యూ స్టేట్స్‌మన్ చేసిన విశ్లేషణలో ముస్లింలు వార్తల్లో ఉన్నప్పుడల్లా, వారి చుట్టూ తప్పుడు సమాచారం కూడా విస్తృతంగా వ్యాపిస్తుంది. ఇటువంటి దురభిప్రాయాలకు ప్రత్యేకించి సెక్యులరిజం మరియు భారతీయ సమాజంలోని సమ్మిళిత స్వభావాన్ని విశ్వసించే వారు ఈ వాస్తవాలను విస్తరించాలి మరియు ఈ అపోహలను దూరం చేయ వలసి ఉంటుంది, ”అని అహ్మద్ చెప్పారు.

 

No comments:

Post a Comment