కొత్తగా విడుదల
చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5 2019-21) అధిక సంఖ్యలో
భారతీయులు కుమారులకు ప్రాధాన్యతనిచ్చారని నిర్ధారిస్తుంది.
మేఘాలయలో మాత్రం కొడుకుల కంటే
ఎక్కువ మంది కుమార్తెలకు ప్రాధాన్యత ఉంది.
* 15-49 వయస్సు వివాహితులలో
ఎక్కువ మంది
కుమారులు కావాలనుకునే సంఖ్య, ఎక్కువ మంది
కుమార్తెలను కోరుకునే వారి సంఖ్యకన్నా అనేక రెట్లు ఎక్కువగా ఉంది.;
* కనీసం ఒక కొడుకు
ఉన్న వివాహితుడు, ఇప్పటికే కొడుకులు లేని మరో
వివాహిత వ్యక్తి కంటే ఎక్కువ మంది పిల్లలను కోరుకునే అవకాశం తక్కువ;
* ఈ ప్రాధాన్యతలు
ఉన్నప్పటికీ, చాలా మంది భారతీయులు ఇప్పటికీ ఆదర్శవంతమైన కుటుంబంలో కనీసం ఒక కుమార్తె
అయినా ఉండాలని విశ్వసిస్తున్నారు.
ఆదర్శ కుటుంబం
Ø ఎక్కువ మంది
కుమారులు కావాలనుకునే వివాహిత పురుషుల సంఖ్య (16%) ఎక్కువ కుమార్తెలను
కోరుకునే వారి సంఖ్య (4%) కంటే నాలుగు రెట్లు ఎక్కువ.
Ø ఎక్కువ మంది
కుమారులు కావాలనుకునే వివాహిత మహిళల సంఖ్య (15%) ఎక్కువ కుమార్తెలను
కోరుకునే వారి సంఖ్య (3%) కంటే ఐదు రెట్లు ఎక్కువ
చాలా మందికి కనీసం ఒక కొడుకు మరియు కనీసం ఒక కుమార్తె
కావాలి. ఐదింట నాలుగు వంతులు మంది పురుషులు మరియు స్త్రీలకు (81%) కనీసం ఒక కొడుకు కావాలి,
Ø ఐదింట, నాలుగు
వంతులు మంది స్త్రీలకు (79%) ఒక కుమార్తె కావలి అదే నాలుగు ఇంట మూడు వంతుల పురుషులకు
(76%) కనీసం ఒక కుమార్తె
కావాలి.
Ø పురుషులు మరియు
మహిళలు ఇద్దరూ సగటున 2.1 మంది పిల్లలను కలిగి ఉండాలని కోరుకుంటారు. ఇది, NFHS-5 ప్రస్తుత మొత్తం
సంతానోత్పత్తి రేటుకు దాదాపు సమానంగా ఉంటుంది.
Ø NFHS-4 (2015-16)లో, ఆదర్శ కుటుంబ
పరిమాణం 2.2 వద్ద కొంచెం పెద్దదిగా ఉంది.
రాష్ట్రాల వారీగా
ట్రెండ్‌లు
Ø రాష్ట్రాలు మరియు
కేంద్ర పాలిత ప్రాంతాలలో, మిజోరం (37%), లక్షద్వీప్ (34%) మరియు మణిపూర్ (33%), మరియు బీహార్‌లోని మహిళలు (31%) కుమార్తెల కంటే
ఎక్కువ మంది కుమారులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.
Ø బీహార్ స్త్రీలలో కుమార్తెల
కంటే కుమారులను కోరుకొనే వారు 16శాతం ఎక్కువ
మంది ఉన్నారు.
Ø మేఘాలయ మహిళలు కొడుకుల
కంటే ఎక్కువ మంది కుమార్తెలను ఇష్టపడతారు.
Ø మేఘాలయ రాష్ట్రంలో, 21% మంది మహిళలు ఎక్కువ
కుమార్తెలను కోరుకుంటున్నారు,
Ø ఇప్పటికే పిల్లలు
ఉన్న వారి లో ఒక కొడుకు ఉన్నవారు మరొక బిడ్డను కోరుకునే అవకాశం తక్కువ. (మూలం: NFHS)
Ø మేఘాలయలో కుమారుల
కంటే ఎక్కువ మంది కుమార్తెలను కోరుకునే పురుషులు(11%) అత్యధికంగా ఉన్నారు.
Ø కానీ ఇతర
రాష్ట్రాలలో వలె, మేఘాలయలో కూడా పురుషులకు అధిక సంఖ్యలో (18%) కుమార్తెల కంటే
ఎక్కువ మంది కొడుకులు కావాలి.
.
Ø మేఘాలయ స్త్రీలు కూతుళ్లకు ప్రాధాన్యత ఇవ్వడానికి గల వివరణ “మాతృస్వామ్య సమాజం," అని షిల్లాంగ్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఏంజెలా రంగద్ అన్నారు NFHS-5 మేఘాలయను "మాతృస్వామ్య సమాజం"గా సూచిస్తుందని ఆమె పేర్కొంది. "
ఇద్దరు పిల్లలు కలిగి
వారిలో కనీసం ఒక కొడుకును కలిగి ఉన్నవారిలో, 10 మందిలో 9 మంది తమకు మూడవవాడు
వద్దు అని చెప్పారు.
మూడో బిడ్డ కావాలా లేదా వద్దా:
Ø పెళ్లయి పిల్లలున్న వారిలో ఇప్పటికే కొడుకు ఉన్నవారు, కొడుకులు లేని వారి కంటే, మరో బిడ్డను కోరుకునే అవకాశం తక్కువ. ఉదాహరణకు, ఇద్దరు పిల్లలు కలిగి వారిలో కనీసం ఒక కొడుకును కలిగి ఉన్న, 10 మందిలో 9 మంది తమకు మూడవవాడు వద్దు అని
చెప్పారు.
Ø దీనికి విరుద్ధంగా, ఇద్దరు పిల్లలుకలిగి వారిలో కొడుకులు
లేనివారు కేవలం మూడింట రెండు వంతుల మంది
మాత్రమే తమకు ఇక పిల్లలు వద్దు అని చెప్పారు.
Ø ఒకటి, ముగ్గురు లేదా నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న
వివాహిత పురుషులు మరియు స్త్రీలలో కూడా ఇదే ధోరణి కన్పిస్తుంది.
No comments:
Post a Comment