11 May 2022

NFHS-5 డేటా: టోటల్ ఫెర్టిలిటీ రేట్ (మొత్తం సంతానోత్పత్తి రేటు)లో ముస్లింలు అత్యధిక క్షీణతను చూపిస్తున్నారు NFHS-5 data: Total fertility rate dips, sharpest decline among Muslims

 

ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS5) డేటా ప్రకారం ముస్లింల సంతానోత్పత్తి రేటు గత రెండు దశాబ్దాలుగా అన్ని మత వర్గాలలో కన్నా తీవ్ర క్షీణతను చూసింది,.

Ø ముస్లింలలో TFR టోటల్ ఫెర్టిలిటీ రేట్ (మొత్తం సంతానోత్పత్తి రేటు)46.5 శాతం తగ్గి 2.3కి చేరుకుంది. ముస్లింల సంతానోత్పత్తి రేటులో వేగవంతమైన క్షీణత జరిగింది

Ø ముస్లింలలో మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్) 46.5 శాతం తగ్గిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5) ఐదో రౌండ్ నివేదిక వెల్లడించింది.

Ø 1992-92లో ఒక్కో ముస్లిం మహిళకు 4.4 మంది పిల్లలుండగా 2019-20లో ఇది 2.3 పిల్లలకు తగ్గింది.

Ø NFHS యొక్క ఐదు రౌండ్లలో ఇప్పటివరకు, హిందువులలో TFR మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్) 41.2 శాతం క్షీణించింది.

Ø క్రైస్తవులు మరియు సిక్కులలో  TFR మూడవ వంతుకు తగ్గింది..

Ø ప్రస్తుతం, హిందువులలో మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్)TFR 1.94 కాగా,

Ø క్రైస్తవులు మరియు సిక్కులలో, TFR రేటు వరుసగా 1.88 మరియు 1.61గా ఉంది.

మత సమూహాలు NFHS-1 NFHS-2 NFHS-3 NFHS-4 NFHS-5 NFHS-1 నుండి NFHS-5కి మార్పు (శాతం)

హిందూ 3.3 2.78 2.59 2.13 1.94 -41.2

ముస్లిం 4.41 3.59 3.4 2.62 2.36 -46.5

క్రిస్టియన్ 2.87 2.44 2.34 1.99 1.88 -34.5

సిక్కు 2.43 2.26 1.95 1.58 1.61 -33.7

బౌద్ధ – 2.13 2.25 1.74 1.39 –

జైన్ – 1.9 1.54 1.2 1.6 –


Ø NFHS 5లో భారతదేశం యొక్క మొత్తం సంతానోత్పత్తి రేటు 2.2 నుండి 2.0కి క్షీణించింది, NFHS 4లో 2.2గా ఉంది ఇది జనాభా నియంత్రణ చర్యల యొక్క గణనీయమైన పురోగతిని సూచిస్తుంది

Ø భారతదేశంలో కేవలం ఐదు రాష్ట్రాలలో  మాత్రమే సంతానోత్పత్తి స్థాయి 2.1 కంటే ఎక్కువగా ఉన్నాయి.

Ø ఈ ఐదు రాష్ట్రాలు బీహార్ (2.98), మేఘాలయ (2.91), ఉత్తరప్రదేశ్ (2.35), జార్ఖండ్ (2.26) మణిపూర్ (2.17).

Ø సర్వే ప్రకారం, 25-49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో మొదటి కాన్పు  మధ్యస్థ వయస్సు/మీడియన్ ఏజ్  median age 21.2 సంవత్సరాలు.

Ø 15-19 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో ఏడు శాతం మంది పిల్లలు కనడం ప్రారంభించారని సర్వే వెల్లడించింది.

సంస్థాగత జననాలు Institutional births:

Ø భారతదేశంలో సంస్థాగత జననాలు 79 శాతం నుండి 89 శాతానికి గణనీయంగా పెరిగాయని NHFS-5 పేర్కొంది.

Ø గ్రామీణ ప్రాంతాల్లో కూడా దాదాపు 87 శాతం జననాలు సంస్థలలో జరిగాయి  మరియు అదే పట్టణ ప్రాంతాల్లో 94 శాతంగా ఉంది..

Ø సంస్థాగత జననాలు అరుణాచల్ ప్రదేశ్‌లో గరిష్టంగా 27 శాతం పాయింట్లు పెరిగాయి, ఆ తర్వాత అస్సాం, బీహార్, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్, నాగాలాండ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్‌లలో 10 శాతానికి పైగా పాయింట్లు పెరిగాయి.

Ø 91 శాతం జిల్లాల్లో గత 5 సంవత్సరాల్లో 70 శాతం కంటే ఎక్కువ జననాలు ఆరోగ్య సౌకర్యాల health facilities లో జరిగాయి.

Ø హిందువులు మరియు ముస్లింల మధ్య సంతానోత్పత్తి అంతరం తగ్గుతోంది.. గత కొన్ని దశాబ్దాలుగా, వర్ధమాన ముస్లిం మధ్యతరగతి బాలికల విద్య మరియు కుటుంబ నియంత్రణ విలువను గుర్తిస్తోంది’’

Ø పాఠశాల విద్య లేని ముస్లిం మహిళల శాతం NFHS 4 (2015-16)లో 32 శాతం ఉండగా NFHS-5 (2019-21)లో అది 21.9 శాతానికి తగ్గింది.

 

Ø NFHS 5 నివేదిక ప్రకారం, మహిళల పాఠశాల స్థాయితో ప్రతి స్త్రీకి పిల్లల సంఖ్య తగ్గింది. పాఠశాల విద్య లేని స్త్రీలు సగటున 2.8 మంది పిల్లలను కలిగి ఉన్నారు, 12 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు చదువుకున్న మహిళలకు 1.8 మంది పిల్లలు ఉన్నారు.

 

Ø అత్యల్ప సంపద క్వింటైల్‌లో ఉన్న మహిళలు, అత్యధిక సంపద కలిగిన మహిళల కంటే సగటున 1.0 మంది పిల్లలనుఎక్కువ  కలిగి ఉన్నారు మరియు ఆర్థిక మెరుగుదల తక్కువ సంతానోత్పత్తి రేటుకు దారితీస్తుందని నివేదిక కనుగొంది

 

Ø ముస్లింలు కుటుంబ నియంత్రణ గురించి ఎక్కువగా అవగాహన లో ఉన్నారని డేటా చూపిస్తుంది.

Ø ముస్లింలలో ఆధునిక గర్భనిరోధక వినియోగం NFHS 4లో 37.9 శాతం నుండి NFHS 5లో 47.4 శాతానికి పెరిగింది. హిందువుల కంటే పెరుగుదల మార్జిన్ ఎక్కువగా ఉంది’’.

Ø ముస్లింలు ఆధునిక గర్భనిరోధక పద్ధతులను అవలంబించారు-ఇది NFHS 4లో 17 శాతం ఉండగా  NFHS 5లో 25.5 వరకుపెరిగింది.ఇది సిక్కులు (27.3 శాతం) మరియు జైనులు (26.3 శాతం) తర్వాత మూడవ అత్యధికం.

Ø అధిక శాతం ముస్లిం పురుషులు కుటుంబ నియంత్రణ పట్ల మెరుగైన వైఖరిని కనబరిచారు.

Ø NFHS 5 ప్రకారం, ముస్లింలలో గర్భనిరోధక మాత్రల వాడకం అత్యధికం కాగా, సిక్కులు మరియు జైనుల తర్వాత ముస్లింలలో కండోమ్‌ల వాడకం మూడవ స్థానంలో ఉంది.

Ø ఇస్లాం ఏ విధంగానూ కుటుంబ నియంత్రణకు ఆటంకం కాదని గుర్తించడం చాలా ముఖ్యం.

Ø అన్ని NFHS సర్వేలలో , నివాస స్థలంతో సంబంధం లేకుండా, 20-24 సంవత్సరాల వయస్సులో సంతానోత్పత్తి రేటు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది, ఆ తర్వాత అది క్రమంగా క్షీణిస్తుంది.

Ø దక్షిణ, పశ్చిమ మరియు ఉత్తర ప్రాంతాలలోని అన్ని రాష్ట్రాలతో సహా ముప్పై-ఒక్క రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతి స్త్రీకి 2.1 పిల్లల స్థాయి కంటే తక్కువ సంతానోత్పత్తిని కలిగి ఉన్నాయి.

Ø బీహార్ మరియు మేఘాలయ దేశంలోనే అత్యధిక సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నాయి

Ø సిక్కిం, అండమాన్  నికోబార్ ప్రాంతాలు అత్యల్ప సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నాయి

 

 

 

 

 

 

 

.

 

.

 

 

No comments:

Post a Comment