అబ్బాస్ తయ్యబ్ జీ 1ఫిబ్రవరి, 1854న ప్రసిద్ధ తయ్యబ్ జీ కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు షంషుద్దీన్ తయ్యబ్ జీ. చిన్నతనంలోనే, ఇంగ్లండ్‌కు వెళ్లి అక్కడ 1875లో న్యాయశాస్త్ర విద్యను పూర్తి చేసి, అదే సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చి, 1893లో బరోడా రాజ్య ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు, ఆపై పదవీ విరమణ చేసిన తర్వాత కాంగ్రెస్‌లో చేరాడు. 1915లో మహాత్మా గాంధీని కలిశాడు మరియు గాంధీజీ తో కలిసి అనేక సామాజిక సమావేశాల్లో పాల్గొన్నాడు. అబ్బాస్ తయ్యబ్ జీ జలియన్‌వాలాబాగ్ మారణ కాండ తర్వాత, కాల్పులపై దర్యాప్తు చేయడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నియమించిన కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు వందలాది మంది సాక్షులను, బాధితులను స్వయంగా కలిశాడు. ఈ అనుభవం తర్వాత, అబ్బాస్ తయ్యబ్ జీ గాంధీకి సన్నిహితుడై కాంగ్రెస్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వడం ప్రారంభించాడు.
గాంధీజీ తో సానిహిత్యం తరువాత అబ్బాస్ తయ్యబ్ జీ ఖాది బట్టలు ధరించి సాధారణ జీవితాన్ని గడపడం ప్రారంభించాడు మరియు మూడవ తరగతి రైలు పెట్టెలో భారతదేశo అంతా పర్యటించారు. ఎద్దుల బండిపై గుజరాత్ అంతా వెళ్లి ఖాదీ బట్టలు అమ్మారు. 1928లో సర్దార్ పటేల్ యొక్క బర్దౌలీ సత్యాగ్రహానికి బహిరంగంగా మద్దతు ఇచ్చారు మరియు విదేశి బట్టలు మరియు వస్తువులను బహిష్కరించారు. విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం లో అబ్బాస్ తయ్యబ్ జీ, కుటుంబ సబ్యులు-అతని భార్య మరియు పిల్లలు తమ విలువైన విదేశి వస్తువులను తగులబెట్టారు.. 1930 ఏప్రిల్‌లో గాంధీజీ చేసిన ప్రసిద్ధ దండి మార్చ్ లో అబ్బాస్ తయ్యబ్ జీ కూడా గాంధీజీ తో కలసి ఉన్నారు మరియు ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు మరియు గాంధీజీ అరెస్టు తర్వాత అబ్బాస్ తయ్యబ్ జీ కాంగ్రెస్ పగ్గాలను చేపట్టాలని నిర్ణయించారు.
దండి యాత్ర ప్రారంభానికి ఒకటి రెండు రోజుల
ముందు బరోడా రాజ్య మాజీ ప్రధాన న్యాయమూర్తి అబ్బాస్ త్యాబ్జీ తన కుమార్తెలతో సహా గాంధీ
ఆశ్రమంలోకి ప్రవేశించారు. గాంధీజీ, అబ్బాస్ త్యాబ్ జీని చూసి లేచి స్వాగతం
పలికారు. స్నేహితులిద్దరూ కౌగిలించుకున్నారు. దండి యాత్రలో పాల్గొనడానికి అబ్బాస్
త్యాబ్ జీ స్వయంగా వచ్చారు. ఒకటి రెండు రోజుల క్రితం 79 మంది దండి యాత్రికుల పేర్లు
పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అబ్బాస్ త్యాబ్ జీ అందులోతన పేరు చూసారు - అబ్బాస్ భాయ్. గాంధీజీ తనను
ఎంతగానో విశ్వసించారని, తనను సంప్రదించకుండా తన దండి యాత్ర
బృందం లో చేర్చుకున్నారని తెలిసి సంతసించారు.
దండి యాత్ర సమయంలో, గాంధీజీ, ఒక వేళ తను అరెస్టు అయితే తన తర్వాత. అబ్బాస్ త్యాబ్జీని ప్రధాన నేతగా ప్రకటించారు. దండి యాత్రలో అబ్బాస్ త్యాబ్జీ ప్రతి స్టాప్ వద్ద రైలు లేదా మోటారు కారులో గాంధీజీని సందర్శించేవారు. గాంధీజీ అరెస్ట్ తరువాత అబ్బాస్ త్యాబ్ జీ కెప్టెన్సీని స్వీకరించారు. బ్రిటీష్ వారు అబ్బాస్ త్యాబ్ జీ అరెస్టు చేసి జైలు పాలు చేసారు, ఆ సమయంలో అబ్బాస్ త్యాబ్జీకి 76 ఏళ్లు నిండాయి, అబ్బాస్ త్యాబ్జీ గౌరవార్థం గాంధీ మరియు డిగర్ ప్రజలు అతన్ని "గుజరాత్ యొక్క గ్రాండ్ ఓల్డ్ మ్యాన్" అని పిలిచేవారు.
జస్టిస్ అబ్బాస్ తయ్యబ్ జీ ఆధ్వర్యంలో, మహాత్మా గాంధీ గుజరాత్‌లో సహాయ నిరాకరణ ఉద్యమం లేదా శాసనోల్లంఘన ఉద్యమం, విదేశీ వస్తువుల బహిష్కరణ లేదా మద్యపాన నిషేధ ఉద్యమం వంటి అనేక విజయవంతమైన ఉద్యమాలు నిర్వహించారు. అబ్బాస్ తయ్యబ్ జీని చాలాసార్లు బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపినది. జస్టిస్ అబ్బాస్ తయ్యబ్ జీ 9 జూన్ 1936న 82 ఏళ్ల వయసులో ముస్సోరీలో మరణించారు.
మహాత్మా గాంధీ అబ్బాస్ తయ్యబ్ జీ జ్ఞాపకార్థం "హరిజన్" వార్తాపత్రికలో "గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ గుజరాత్" అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు, అందులో తయ్యబ్ జీని మానవత్వం నిండిన అరుదైన సేవకుడిగా అభివర్ణించారు. అబ్బాస్ భాయి జీవితం మనకు స్ఫూర్తిదాయకం అన్నారు.
అబ్బాస్ తయ్యబ్ జీ కుటుంబం భారతదేశంలోని జాతీయ
ముస్లిం కుటుంబాలలో అగ్రగామిగా ఉంది. అబ్బాస్ తయ్యబ్ జీ బాబాయి బద్రుద్దీన్
త్యాబ్జీ కాంగ్రెస్ వ్యవస్థాపకులలో ఒకరు మరియు దాని మూడవ అధ్యక్షుడయ్యారు. జస్టిస్
అబ్బాస్ తయ్యబ్ కుమార్తె షరీఫా
హమీద్ అలీ 1935లో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ సెక్రటరీ
మరియు అంతర్జాతీయ మహిళా సంఘంలో బాల్య వివాహాల నిర్మూలన కోసం గళం విప్పిన
నాయకురాలు. మహిళల స్థితిగతులను
తెలుసుకోవడానికి ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన 15 మంది సభ్యుల కమిషన్‌లో షరీఫా హమీద్ అలీ సబ్యురాలు.
No comments:
Post a Comment