28 September 2022

లక్నో చరిత్ర History of Lucknow

 

లక్నోనగరం, దాని చరిత్ర, సంస్కృతి, ప్రజలు, వంటకాలు మరియు అనేక ఇతరాలకు ప్రసిద్ధి చెందిన పేరు. లక్నో నగరం చరిత్ర చరిత్రకారులకే కాదు, సామాన్యులను  కూడా ఆకట్టుకుంటుంది. లక్నో నగరం నోరూరించే మొఘల్ వంటకాలకు అలాగే పురాతన ప్రసిద్ధ వారసత్వ ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. లక్నో నగరం ఏడాది పొడవునా పర్యాటకులను పుష్కలంగా ఆకర్షిస్తుంది. అన్నింటికంటే మించి, లక్నో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పవిత్ర దేవాలయాలు పవిత్రమైన రోజులలో మరియు పండుగల సమయంలో పెద్దఎత్తున ప్రజలను ఆకర్షించును. లక్నో నిజంగా అందమైన నగరం మరియు సందర్శించదగినది.

 లక్నో చరిత్ర - ఒక అవలోకనం:

శ్రీరామచంద్రుని ప్రియమైన సోదరుడు లక్ష్మణ్ పేరు నుండి లక్నో పేరు వచ్చింది. శ్రీ రామచంద్రుడు శ్రీలంకను జయించి విజయవంతంగా తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మణ్‌కు లక్నో భూమిని బహుమతిగా ఇచ్చాడు. లక్నో యొక్క మొదటి పేరు లక్ష్మణపూర్. ఎత్తైన ప్రదేశంలో ఉన్న లక్నో గోమతి నదికి సమీపంలో ఉంది. అయితే, 18వ శతాబ్దంలో లక్ష్మణపూర్ నగరం లక్నోగా గుర్తించబడింది.


అవధ్ ప్రాచీన హిందూ రాజ్యాలలో ఒకటి. లక్నోనగరం  అవధ్ ప్రావిన్స్లో కలదు. లక్నో మరియు అవధ్‌లోని ఇతర ప్రాంతాలు ఢిల్లీ సుల్తానేట్, మొఘల్ పాలకులు, అవధ్ నవాబులు, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో మరియు చివరకు బ్రిటిష్ రాజ్  లో  ఉన్నాయి. లక్నో నగరం మొదటి స్వాతంత్ర్య సంగ్రామం యొక్క ప్రముఖ కేంద్రాలలో ఒకటి మరియు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. భారత స్వాతంత్ర్యం తరువాత, లక్నో ఉత్తర భారతదేశంలోని ముఖ్యమైన నగరాలలో ఒకటిగా ఉద్భవించింది.

లక్నోలో మొఘల్ పాలన Mughal Rule in Lucknow:

1394 నుండి 1478 వరకు అంటే 84 సంవత్సరాలు అవధ్ జౌన్‌పూర్‌లోని షర్కీ సుల్తానేట్‌లో ఒక విభాగంగా ఉంది.

1555లో హుమాయున్ అవధ్‌ను మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా మార్చాడు.

1719 వరకు, అవధ్ మొఘల్ సామ్రాజ్యం క్రింద ఒక ప్రావిన్స్ మరియు చక్రవర్తి నియమిత గవర్నర్ చే పాలన నిర్వహించబడుతుంది.

సాదత్ అలీ ఖాన్ 1732లో అవధ్‌కు గవర్నర్‌గా నియమించబడ్డాడు. సాదత్ ఖాన్‌కు నవాబ్ బిరుదు ఇవ్వబడింది మరియు కాలక్రమేణా ఢిల్లీ నుండి స్వాతంత్ర్యం పొందడం ప్రారంభించాడు. 1750లలో మొఘల్ సామ్రాజ్యం పతనంతో అవధ్ ప్రాముఖ్యంలోకి వచ్చింది. 1755లో, రాజధాని ఫైజాబాద్ నుండి లక్నోకు మార్చబడింది. లక్నో నగరం స్వర్ణ యుగానికి వేదికగా నిలిచింది. లక్నో వేగంగా విస్తరించింది మరియు నవాబులు తమ శక్తి మరియు సంపదను ప్రదర్శించడానికి నిర్మించిన అనేక స్మారక చిహ్నాలతో నిండి ఉంది.

అవధ్ భారతదేశంలోని వ్యవసాయ స్టోర్‌హౌస్‌గా ప్రసిద్ధి చెందింది. లక్నో బ్రిటీష్, ఆఫ్ఘన్లు మరియు మరాఠాల విదేశీ బెదిరింపుల నుండి తనను తాను రక్షించుకున్న సంపన్న రాజ్యం. షుజా-ఉద్-దౌలా, మూడవ నవాబు, బక్సర్ యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయాడు. బ్రిటిష్ వారు భారీ మొత్తంలో జరిమానాలు చెల్లించాలని మరియు తన భూభాగంలోని కొన్ని భాగాలను వదులుకోవాలని ఒత్తిడి తెచ్చారు.

లక్నో 1755 తర్వాత నాల్గవ నవాబు అసఫ్-ఉద్-దౌలా కాలం లో అభివృద్ధి చెందడం ప్రారంభించింది. కవిత్వం, సంగీతం, నృత్యం మరియు జీవనశైలి మొదలగు అంశాలతో సహా వివిధ రంగాలలో లక్నో తనకంటూ ఒక పేరును సృష్టించుకుంది. అవధ్ నవాబులు బారా ఇమాంబరా, రూమి దర్వాజా, చోటా ఇమాంబరా మరియు ఇతర ముఖ్యమైన స్మారక కట్టడాలను నిర్మిoచారు.

 లక్నోలో బ్రిటిష్ పాలన British Rule in Lucknow:

1773లో బ్రిటిష్ వారు ఒక రెసిడెంట్ ను నియమించారు మరియు క్రమంగా రాజ్యం లో మరింత అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ, మిగిలిన మొఘల్ సామ్రాజ్యం మరియు మరాఠాల నుండి వచ్చే ముప్పును నివారించడానికి బ్రిటిష్ వారు అవధ్‌ను వెంటనే స్వాధీనం చేసుకోవడానికి ఇష్టపడలేదు.

బ్రిటీష్ వారు నాల్గవ నవాబును  సింహాసనంపై కూర్చుండటానికి సహాయం చేసి, అతనిని తోలుబొమ్మ రాజుగా చేశారు. లక్నో ఐదవ నవాబ్, వజీర్ అలీ ఖాన్, 1798లో బ్రిటీష్ వారికి పూర్తిగా లొంగిపోవాల్సి వచ్చింది.

1801 ఒప్పందంలో, సాదత్ అలీ ఖాన్ అవధ్ ప్రావిన్స్‌లో సగం భాగాన్ని బ్రిటిష్ వారికి అప్పగించవలసి వచ్చింది మరియు విలువైన బ్రిటిష్ ఆర్మీకి అనుకూలంగా తన దళాలను పంపడానికి  అంగీకరించాడు. బ్రిటిష్ రాజ్ ప్రావిన్స్ యొక్క విస్తారమైన ఖజానాలను తక్కువ రేటుకు రుణాలను ఇచ్చి  దోపిడీ చేయడం ద్వారా ఉపయోగించుకున్నారు. నవాబులు అన్ని వైభవాలతో ఉత్సవ రాజులుగా మాత్రమే చేయబడ్డారు, కానీ రాజ్య పరిపాలనపై వారికి తక్కువ లేదా ఎటువంటి ప్రభావం లేకుండా చేశారు. 19వ శతాబ్దం మధ్య నాటికి బ్రిటిష్ వారు అవధ్‌పై ప్రత్యక్ష నియంత్రణను ప్రకటించారు. అవధ్ 1819 వరకు మొఘల్ సామ్రాజ్యం యొక్క విభాగంగా కొనసాగింది.

1856లో బ్రిటిష్ వారు తమ సైన్యాన్ని తరలించి అప్పటి నవాబ్ వాజిద్ అలీ షాను జైలులో పెట్టారు. 1857 తిరుగుబాటులో, అతని 14 ఏళ్ల కుమారుడు బిర్జిస్ ఖాదర్ పాలకుడిగా పట్టాభిషేకం పొందాడు.ఈ ఘర్షణలో సర్ హెన్రీ లారెన్స్ చనిపోయాడు.

1857లో సిపాయుల తిరుగుబాటు లేదా భారత స్వాతంత్ర్య మొదటి యుద్ధంలో, తిరుగుబాటుదారులు అవధ్‌పై ప్రత్యక్ష నియంత్రణలోనికి  తీసుకున్నారు. అవధ్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి బ్రిటిష్ వారికి దాదాపు 18 నెలలు పట్టింది. లక్నో రెసిడెన్సీలో ఉన్న రెజిమెంట్‌ను ముట్టడించడంలో తిరుగుబాటు దళాలు విజయం సాధించాయి. సర్ జేమ్స్ అవుట్‌రామ్ మరియు సర్ హెన్రీ హేవ్‌లాక్‌ల ఆద్వర్యం లో  దిగ్బంధనం నుండి ఉపశమనం లభించింది. ఆకట్టుకునే షాహీద్ స్మారక్ మరియు రెసిడెన్సీ యొక్క అవశేషాల ద్వారా 1857 సంఘటనలలో లక్నో పాత్రను గుర్తు చేసుకోవచ్చు.

లక్నో లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఖిలాఫత్ ఉద్యమం చురుకుగా సాగింది. ఈ ఉద్యమం లో ఫిరంగి మహల్ యొక్క మౌలానా అబ్దుల్ బారీ చురుగ్గా పాల్గొని, మౌలానా మొహమ్మద్ అలీ మరియు మహాత్మా గాంధీకి సహకరించి ఐక్య వేదికను సృష్టించినాడు.. లక్నో 1775 నుండి అవధ్‌కు రాజధానిగా ఉంది మరియు 1901లో మాత్రమే 264,049 మంది జనాభా కలిగిన లక్నో నగరం కొత్తగా స్థాపించబడిన యునైటెడ్ ప్రావిన్సెస్ ఆఫ్ ఆగ్రా మరియు ఔద్‌లతో విలీనం చేయబడింది. 1920లో అలహాబాద్ నుండి పరిపాలనా అధిపతిని తరలించినప్పుడు, లక్నో ప్రాంతీయ రాజధానిగా రూపాంతరం చెందింది. 1947వ సంవత్సరంలో భారత స్వాతంత్ర్యం సందర్భంగా లక్నో, మాజీ యునైటెడ్ ప్రావిన్సెస్ ఉత్తర ప్రదేశ్ రాజధానిగా ప్రకటించబడింది.

బ్రిటిష్ పాలనలో లక్నో అనేక దుర్భర దశలను ఎదుర్కొన్న మాట నిజం. వివిధ పాలకుల తిరుగుబాట్లు మరియు చాలా భయంకరమైన సంఘటనలు నగర జ్ఞాపకాలను  శిధిలమైన స్థితిలో ఉంచాయి. అయితే, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి లక్నో  నగరo ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులను ఆకర్షించినది. లక్నో నగరం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందింది.

No comments:

Post a Comment