29 September 2022

లేడీ అనీస్ ఫాతిమా ఇమామ్(-1979

 

జాతీయ ఉద్యమం, దేశ నిర్మాణం మరియు చరిత్ర జ్ఞాపకాల నుండి  ముస్లింల పాత్ర  క్రమపద్ధతిలో మరియు ఉద్దేశపూర్వకంగా తొలగించబడుతోంది. అనీస్ ఫాతిమా లేదా లేడీ అనీస్ ఇమామ్ యొక్క ధైర్యం, శౌర్యం, త్యాగం మరియు రాజకీయ చాతుర్యం యొక్క కథను గుర్తుంచుకోవడం ముఖ్యం. లేడీ అనీస్ ఇమామ్ వలసవాద వ్యతిరేక ఉద్యమంలో విలక్షణమైన పాత్రను పోషించింది మరియు తన భర్త సర్ సయ్యద్ అలీ ఇమామ్ (1869-1932)తో కలిసి ఆధునిక బీహార్ వ్యవస్థాపకులలో ఒకరుగా చరిత్రలో నిలిచినది.

20వ శతాబ్దం ప్రారంభంలో బీహార్ సమాజంలో సామాజిక దురాచారాలు మరియు అన్యాయాలకు వ్యతిరేకంగా గళం విప్పిన ప్రముఖ ముస్లిం మహిళల సమూహంలో లేడీ అనీస్ ఒకరు. లేడీ అనీస్ తన ప్రారంభ విద్యను పూర్వం మదరసా ఇస్లామియా గా పిలువబడే బాద్షా నవాజ్ రిజ్వీ (B.N.R.) స్కూల్ నుండి పొందినది.

లేడీ అనీస్ ఇమామ్, జుబైదా బేగం దౌడీ (1886-1972), జహ్రా కలీమ్ మరియు హమిదా నయీమ్ మొదలగు ఉన్నత వర్గ ముస్లిం మహిళలు ఆనాటి సమాజం లోని మరియు హిందూ మరియు ముస్లిం స్త్రీలలో వ్యాప్తిగా ఉన్న పర్దా ఆచారాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. బీహార్‌లోని ఉన్నత వర్గ ముస్లిం మహిళలు దేశ స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు.

భారత స్వాతంత్ర్య ఉద్యమo లో లేడీ అనీస్ సహాయ నిరాకరణ ఉద్యమం (1920-22) లో భాగంగా తన కుమార్తె మెహముదా సమీతో కలిసి పాట్నాలో మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించింది.

1919 నాటి మాంటెక్-చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలకు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆల్ ఇండియా కాంగ్రెస్, ఇంగ్లండ్‌కు పంపిన కమిటీకి లేడీ అనీస్ నాయకురాలుగా ఉన్నారు. రాజకీయ విషయాల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లిన బీహార్‌కు చెందిన మొదటి మహిళ లేడీ అనీస్.

లేడీ అనీస్ శాసనోల్లంఘన ఉద్యమం (1930-34)లో కూడా చాలా చురుకుగా పాల్గొన్నారు.15 జూలై 1930, లేడీ అనీస్ ఇమామ్ మరియు గౌరీ దాస్ పాట్నాలో గొప్ప ఊరేగింపు నిర్వహించారు మరియు విదేశీ వస్తువులను బహిష్కరించడానికి ఒక కమిటీని కూడా ప్రతిపాదించారు. జూలై 25, 1938, లేడీ అనీస్ ఇమామ్ నాయకత్వంలో దాదాపు 3000 మంది స్త్రీలతో కూడిన పెద్ద ఊరేగింపు పాట్నాలో జరిగింది. ఫలితంగా, బ్రిటిష్ వారు లేడీ అనీస్ ఇమామ్ పై వారెంట్లు జారీ చేశారు. ఇది పాట్నా అంతటా మరిన్ని నిరసనలకు దారితీసింది. తరువాత, ఆల్ ఇండియా కాంగ్రెస్ అభినందనల సందేశాన్ని పంపడం ద్వారా లేడీ అనీస్ ఇమామ్ ప్రయత్నాలను గుర్తించింది.

అనీస్ ఫాతిమాకు సామాజిక కార్యకర్త సుష్మా సేన్‌తో పరిచయం ఏర్పడింది. సుష్మా సేన్ మరియు లేడీ వీలర్ (అప్పటి గవర్నర్ ఎ. హెచ్. వీలర్ భార్య), సహకారం తో అనీస్ ఫాతిమా బెంగాలీ మరియు బీహారీ మహిళల సాదికరణ కార్యక్రమం  చేపట్టారు. అనీస్ ఫాతిమా “అఘోర కామినీ శిల్పాలయాన్ని” స్థాపించింది.

లేడీ అనీస్ ఫాతిమా తన హైదరాబాద్ పర్యటనలో హైదరాబాద్‌లో మహిళల అభ్యున్నతిలో చురుకుగా ఉన్న మిస్ అమ్నా ఐతాల్ పోప్‌ను కలుసుకుంది మరియు షోగారా బేగం, హుమాయున్ బేగం మరియు బేగం మీర్జా సహాయంతో మహిళల అభ్యున్నతి కృషి లో తన  మద్దతు ఇచ్చారు. 1938లో లేడీ అనీస్ ఫాతిమా P. K. సేన్‌తో కలిసి మహిళలకు పారిశ్రామిక విద్యను అందించడానికి  పాట్నాలో “అఘోర్ నారీ ప్రతిస్టాన్” ప్రారంభించారు.

లేడీ అనీస్ ఇమామ్ 1937 ఎన్నికలలో బీహార్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. లేడీ అనీస్ ఇమామ్ బీహార్‌లో ఉర్దూను రెండవ భాషగా పరిగణించాలని అవిశ్రాంతంగా పోరాడిన  “అంజుమన్ తర్రాకీ-ఎ-ఉర్దూ” లో క్రియాశీల సభ్యురాలు.

స్వాతంత్ర్యం తరువాత, లేడీ అనీస్ ఇమామ్ సాంఘిక సంక్షేమ బోర్డు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు మరియు బోర్డు మద్దతుతో, అనీస్ ఇమామ్ సాంఘిక సంక్షేమం మరియు మహిళా సాధికారతకు ఎంతో కృషి చేసింది. అనీస్ ఇమామ్ తన సామాజిక కార్యక్రమాలన్నింటినీ “మరియం మంజిల్” (అనిసాబాద్, పాట్నా) నుండి నిర్వహించింది. లేడీ ఇమామ్ బీహార్‌లోని ఇతర ప్రాంతాలైన బార్హ్, ముజఫర్‌పూర్ మరియు ఇతర నగరాలకు వెళ్లి సంక్షేమ కార్యక్రమాల ప్రచారం కోసం అనేక కమిటీలను ఏర్పాటు చేశారు.

లేడీ అనీస్ ఇమామ్ కుమార్తె మెహముదా సమీ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు. బీహార్ విద్యార్థులలో సామి చాలా ప్రజాదరణ పొందింది. అనీస్ ఫాతిమా ఇమాం బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు మరియు బీహార్‌లో విద్యారంగ అభివృద్దికి తోడ్పడ్డారు. అనీస్ ఇమాం పాట్నాలోని ఖుదా బక్ష్ లైబ్రరీలో చురుకైన సభ్యురాలు మరియు బీహార్ ప్రభుత్వ ఉర్దూ లైబ్రరీని ప్రారంభించడంలో తన వంతు సహాయాన్ని అందించింది. అనీస్ ఇమాం మంచి వక్త మరియు బాలికలను ప్రేరేపించి వారికి జీవితంలో విద్య యొక్క విలువను నేర్పింది.

పాట్నాలో అనిసాబాద్ అని పిలవబడే ప్రాంతం లేడీ అనీస్ ఇమామ్‌ పేరు మీద కలదు. లేడీ అనీస్ ఫాతిమా ఇమాం భర్త సర్ అలీ ఇమామ్ “అనీస్ మహల్” అనే భవనాన్ని కూడా నిర్మించారు. ఈ విశాలమైన ప్రాంతం లేడీ అనీస్ తర్వాత అనిసాబాద్ అని పిలువబడింది.

సర్ సయ్యద్ అలీ ఇమామ్ తన భార్య అనీస్ ఇమాం కోసం రాంచి, బీహార్‌లో కూడా  'అనీస్ కాజిల్' నిర్మించారు. 'అనీస్ కాజిల్' లో అనీస్ దంపతులకు అంతిమ విశ్రాంతి స్థలంగా ఒక సమాధిని కూడా నిర్మించారు.1932 లేడీ అనీస్ భర్త ఇమామ్ మరణం జరిగింది మరియు అతని  ఖననం'అనీస్ కాజిల్' లోని సమాధి స్థలం లో జరిగింది. 1979లో లేడీ అనీస్ పాట్నాలో మరణించినప్పుడు, లేడీ అనీస్ ఖననం కూడా అక్కడే జరిగింది.

 

No comments:

Post a Comment