15 September 2022

ఢిల్లీ లోని అజ్మేరీ గేట్‌ వద్దగల పురాతన పాఠశాల: ఆంగ్లో అరబిక్ స్కూల్

 

ఢిల్లీలోని అజ్మేరీ గేట్ వద్దగల ఆంగ్లో అరబిక్ స్కూల్ అనేది డిల్లి లో నడుస్తున్న అతి పురాతన పాఠశాల మరియు ప్రపంచంలోని అత్యంత పురాతనమైన విద్యా సంస్థలలో ఒకటి.

ఆంగ్లో అరబిక్ స్కూల్  లేదా  మదర్సా ఘజియుద్దీన్ ఖాన్, 1692లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు యొక్క జనరల్, డెక్కన్ కమాండర్ ఘజియుద్దీన్ ఖాన్ స్థాపించబడినది. ఈ మదర్సా ఆసియాలోని పురాతన విద్యాసంస్థలలో ఒకటి.

మదర్సా ఘజియుద్దీన్ ఖాన్,ఆంగ్లో అరబిక్ కాలేజి, ఆంగ్లో అరబిక్ స్కూల్, డిల్లి కాలేజి/ఆంగ్లో అరబిక్ సీనియర్ సెకండరీ పాఠశాల, చివరకు జాకీర్ హుస్సేన్ డిల్లి కాలేజ్ గా రూపాంతరం చెందినది  మరియు ప్రసిద్ధ కుటుంబాల నుండి విద్యార్థులు ఇక్కడ చదువుకున్నారు.

 ఆంగ్లో అరబిక్ స్కూల్  - ఒక చారిత్రక ప్రయాణం

1827లో, బ్రిటీష్ అడ్మినిస్ట్రేటర్ అయిన సర్ చార్లెస్ మెట్‌కాల్ఫ్ ఘజియుద్దీన్ మదర్సా పాఠ్యాంశాల్లో ఇంగ్లీష్, గణితం మరియు సహజ శాస్త్రాలను చేర్చారు.1828లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంగ్లో అరబిక్ స్కూల్ దాని అసలు లక్ష్యాలకు అదనంగా, ఆంగ్ల భాష మరియు సాహిత్యంలో విద్యను అందించడానికి. చుట్టుపక్కల నివసించే సమాజం యొక్క విద్యా స్థితిని "ఉద్ధరించే లక్ష్యంతో దీనిని 'ఆంగ్లో అరబిక్ కళాశాల'గా పునర్వ్యవస్థీకరించింది. ఈ స్కూల్ ప్రిన్సిపాల్స్  గా ఆనాటి ఆంగ్ల ప్రముఖ విద్య వేత్తలు మిస్టర్ ఫెడ్రిక్ టైలర్- 1836 to 1840,” తర్వాత మిస్టర్ బోత్రుస్ – 1841 to 1845,” పనిచేసారు. ఇది 1830లు మరియు 40ల మద్య నాటి ఢిల్లీ పునరుజ్జీవనోద్యమానికి కేంద్రంగా ఉంది’’

ఆంగ్లో అరబిక్ స్కూల్  లైబ్రరీ   రోజు వరకు, పాతకాలపు పాత సైన్స్ పుస్తకాలలో కొన్నింటిని కలిగి ఉంది, ప్రత్యేకించి వైద్యశాస్త్రానికి సంభంధించినవి. స్కూల్  లైబ్రరీలో రక్త ప్రసరణ మరియు శరీర నిర్మాణ శాస్త్రంపై చేతితో తయారు చేసిన రేఖాచిత్రాలతో కూడిన పుస్తకాన్ని కలిగి ఉంది. ఉర్దూ బోధనా మాధ్యమం కావడంతో విద్యార్థులు ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్, ఆల్జీబ్రా, సామాజిక మరియు సహజ శాస్త్రాలు మొదలైన శాస్త్రాలు అబ్యాసించడానికి  ఆంగ్లో అరబిక్ స్కూల్ లో 1832లో వెర్నాక్యులర్ ట్రాన్స్లేషన్ సొసైటీని ఏర్పాటు చేయడం.వెర్నాక్యులర్ ట్రాన్స్‌లేషన్ సొసైటీ, జర్మన్, ఫ్రెంచ్ మరియు ఇంగ్లీషులోని ఉత్తమ రచనలను ఉర్దూలోకి అనువదిస్తుంది.

1840లో, ఆంగ్లో అరబిక్ స్కూల్  దారా షికో (షాజహాన్ కుమారుడు) లైబ్రరీకి మార్చబడింది. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు కారణంగా దాదాపు ఏడేళ్లపాటు మూసివేయబడిన ఈ సంస్థ 1867లో ఆంగ్లో అరబిక్ కళాశాలగా పునఃప్రారంభించబడింది.

1947లో విభజన సమయంలో "ఆంగ్లో అరబిక్ కాలేజి” దాడికి గురి కాబడినది  మరియు డాక్టర్ జాకీర్ హుస్సేన్ మరియు ఇతర ఢిల్లీ ప్రముఖుల మద్దతుతో పునరుజ్జీవింపబడినది. 1949లో ఆంగ్లో అరబిక్ సీనియర్ సెకండరీ పాఠశాల గా మారింది. చాలా సంవత్సరాలుగా స్కూల్ క్యాంపస్‌లో ఆంగ్లో అరబిక్ సీనియర్ సెకండరీ పాఠశాల మరియు ఢిల్లీ కళాశాల (ప్రస్తుతం, జాకీర్ హుస్సేన్ కళాశాల) రెండు షిఫ్టులు నడుస్తున్నాయి.

 1975లో, దివంగత ప్రెసిడెంట్ డాక్టర్ జాకీర్ హుస్సేన్ స్మారకార్ధం  డిల్లి కాలేజి ” పేరు “జాకీర్ హుస్సేన్ ఢిల్లీ కాలేజీ”గా మార్చారు. ఉర్దూ బోధనా మాధ్యమం. విద్యార్థులు అదనపు భాషలుగా అరబిక్ మరియు పర్షియన్లను ఎంచుకోవచ్చు.

ఆంగ్లో అరబిక్ కాలేజి ప్రసిద్ది చెందిన పూర్వ విద్యార్ధులు :

ఆంగ్లో అరబిక్ కాలేజి పూర్వ విద్యార్ధులలో  సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ (ప్రముఖ విద్యావేత్త మరియు అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ స్థాపకుడు) లియాఖత్ అలీ ఖాన్ (పాకిస్థాన్ మొదటి ప్రధానమంత్రి), మౌలానా అల్తాఫ్ హుస్సేన్ హలీ (ప్రముఖ కవి), మౌలానా మహమ్మద్ హుస్సేన్ ఆజాద్ (ఉర్దూ గద్య పితామహుడు), డిప్యూటీ నజీర్ అహ్మద్, (ఉర్దూ వ్యాసకర్త మరియు ICS), అక్తర్-ఉల్-ఇమాన్, (గొప్ప కవి) , హబీబ్ జలీబ్ (ప్రముఖ కవి), షమీమ్ కర్హానీ (ప్రసిద్ధ కవి), మీర్జా MN మసూద్ (భారతీయ హాకీ ఒలింపియన్), ప్రేమ్ నారాయణ్ మరియు ధరమ్ నారాయణ్ (ప్రముఖ అరబిక్ పండితులు మరియు Qiran-us-Saadain సంపాదకులు, మాస్టర్ రామ్ చందర్ (ప్రముఖ ఉర్దూ, పర్షియన్ మరియు అరబిక్ విద్యావేత్త) మరియు ఖ్వాజా అహ్మద్ ఫరూఖీ (సాహిత్యవేత్త) ఢిల్లీ యూనివర్శిటీ ప్రో-వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎఎన్ కౌల్, డిఫెన్స్ అనలిస్ట్ జెఎన్ దీక్షిత్, ప్రఖ్యాత ఉర్దూ పండితుడు ప్రొఫెసర్ గోపీ చంద్ నారంగ్ మరియు కాంగ్రెస్ నాయకుడు జగదీష్ టైట్లర్‌, సీనియర్ జర్నలిస్ట్ పంకజ్ వోహ్రా ఇంకా చాలా మంది ఉన్నారు.

ఆంగ్లో అరబిక్ కాలేజి ఫుట్బాల్ నర్సరీ అనవచ్చు. ఆంగ్లో అరబిక్ కాలేజి పూర్వ విద్యార్ధులు మంజూర్ అహ్మద్ ఖాన్, షుజాత్ అష్రఫ్, సురీందర్ కుమార్, సర్దార్ ఖాన్ వంటి ఆటగాళ్లు, కోల్కతాలోని మోహన్ బగాన్, మహమ్మదన్ స్పోర్టేయింగ్, ఈస్ట్ బెంగాల్ వంటి పెద్ద క్లబ్లతో సహా ఆర్యన్స్, టైటానియం కేరళ, సిమ్లా యంగ్స్ మొదలైన క్లబ్లకు ప్రాతినిద్యం వహించారు.. ఫుట్‌బాల్ సంప్రదాయం ఉన్న అతికొద్ది కళాశాలల్లో ఢిల్లీ కళాశాల ఒకటి. నగరంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్ళలో కొందరు ఇక్కడి విద్యార్థులు."

ఆంగ్లో అరబిక్ కాలేజి విద్యార్ధులు డిల్లి లో జరిగే  ఫుట్ బాల్ పోటిలలో మొహమ్మదీయ స్పోర్టింగ్ మరియు ఆంధ్రప్రదేశ్ పోలీస్ మరియు తాజ్ క్లబ్, ఇరాన్ వంటి జట్లను ఉత్సాహపరిచేవారు. ఆంగ్లో అరబిక్ స్కూల్ లో ఫుట్ బాల్  టోర్నమెంట్స్ కూడా నిర్వహించేవారు. ఆంగ్లో అరబిక్ స్కూల్ కి చెందిన క్రికెట్ మరియు సాకర్ జట్లు అనేక ట్రోఫీలను గెలిచాయి.

 

 

 

No comments:

Post a Comment