24 September 2022

భారతీయ స్వాతంత్ర్య పోరాటం లో పాల్గొన్న 10 మంది క్రైస్తవ మహిళా మణులు 10 Indian-Christian Women Freedom Fighters

 

భారతీయ క్రైస్తవ సమాజం  భారతీయ స్వాతంత్ర్య పోరాట౦ లో అసమానమైన కృషి చేసింది. అయితే స్వాతంత్ర్య పోరాటo లో పాల్గొన్న భారతీయ స్త్రీల సహకారం తరచుగా విస్మరించబడుతుంది లేదా మరచిపోబడుతుంది. భారత స్వాతంత్ర్య  పోరాటంలో  జీవితాలను అంకితం చేసిన 10 మంది ప్రముఖ  భారతీయ క్రైస్తవ మహిళల జీవిత పరిచయాలను ఇక్కడ వివరించడానికి కృషి చేద్దాము.


1.    పండిత రమాబాయి సరస్వతి (1858–1922):

మరాఠీ మాట్లాడే హిందూ బ్రాహ్మణ కుటుంబంలో రామ డోంగ్రేగా జన్మించిన రమాబాయి, 1878లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి సంస్కృతం లో  'పండిత' మరియు 'సరస్వతి' బిరుదులను అందుకుంది. 1882లో భర్త మరణించిన తర్వాత, కేవలం 23 సంవత్సరాల వయస్సులో  రమాబాయి తన జీవితాన్ని మహిళల హక్కుల కోసం అంకితం చేయడం ప్రారంభించింది.

తన భర్త మరణం తరువాత పండిత రమాబాయి సరస్వతి “ఆర్య మహిళా సమాజ్‌”ను స్థాపించింది, ఇది మహిళల విద్యను ప్రోత్సహించడానికి మరియు బాల్య వివాహం వంటి సామాజిక రుగ్మతలను తొలగించడానికి ప్రయత్నించింది. భారతీయ మహిళలకు, మహిళా ఉపాధ్యాయులుగా  శిక్షణ ఇవ్వాలని రమాబాయి కోరిక.

1883లో, రమాబాయి యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లి అక్కడ క్రైస్తవ మతంలోకి మారారు. రమాబాయి ముఖ్యంగా కొత్త నిబంధనలోని  జాన్ సువార్త యొక్క నాల్గవ అధ్యాయం నుండి ప్రేరణ పొందింది. రమాబాయి యునైటెడ్ స్టేట్స్‌కు కూడా ప్రయాణించింది, అక్కడ రమాబాయి ఉమెన్స్ క్రిస్టియన్ టెంపరెన్స్ యూనియన్ మద్దతును పొందింది. రమాబాయి భారతీయ తొలి మహిళా వైద్యుల్లో ఒకరైన ఆనందీబాయి జోషికి బంధువు మరియు 1886లో ఆనందీబాయి జోషి గ్రాడ్యుయేషన్‌కు కూడా హాజరయ్యారు.

1896లో తీవ్రమైన కరువు సమయంలో, రమాబాయి సహాయక చర్య కోసం గ్రామీణ మహారాష్ట్ర గుండా ప్రయాణించి, వేలాది మంది మహిళలు మరియు పిల్లలను కరవు నుండి రక్షించారు. ఇది చివరికి ముక్తి మిషన్ స్థాపనకు దారితీసింది. ముక్తి మిషన్ నిరాశ్రయులైన మహిళలు, పిల్లలు మరియు వికలాంగులకు ఇల్లు మరియు ఆశ్రయం కల్పించినది. 1900 నాటికి, ముక్తి మిషన్ దాదాపు 1,500 మంది నివాసితులకు నిలయంగా ఉంది మరియు నేటికీ పనిచేస్తుంది.

రమాబాయి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా పాల్గొంది మరియు 1889లో భారత జాతీయ కాంగ్రెస్‌కు హాజరైన 10 మంది మహిళా ప్రతినిధులలో ఒకరు. రమాబాయి గొప్ప రచయిత్రి మరియు సాహిత్య పండితురాలు. రమాబాయి అనేక పుస్తకాలను రచించింది, అందులో ప్రసిద్ది చెందినది 'ది హై-కాస్ట్ హిందూ వుమన్' అందులో  రమాబాయి దక్షిణాసియాలోని బాల వధువులు మరియు వితంతువుల (శాపగ్రస్తులుగా లేదా దురదృష్టవంతులుగా చూడబడుతున్నారు) సామాజిక దమనీయ స్థితిని  వివరించింది. రమాబాయి బైబిల్‌ను ఒరిజినల్ హీబ్రూ మరియు గ్రీకు నుండి మరాఠీలోకి అనువదించింది.

దేశ నిర్మాతగా, క్రైస్తవ భక్తురాలిగా మరియు మహిళా హక్కుల కార్యకర్తగా రమాబాయి అనేక గౌరవాలను పొందినది. రామాభాయి సమాజ సేవ కోసం 1919లో కైసరి-ఇ-హిందీ పతకాన్ని అందుకుంది, ఎపిస్కోపల్ చర్చి వారి ప్రార్ధనా క్యాలెండర్‌లో ఏప్రిల్ 5న విందు రోజుగా గుర్తించబడింది మరియు భారతదేశంలో రామాభాయి పేరు మీద స్మారక స్టాంపులు మరియు రోడ్లు ఉన్నాయి.

 2. అక్కమ్మ చెరియన్ (1909–1982):

అచ్చమ్మ చెరియన్ కేరళకు చెందిన మలయాళీ స్వాతంత్ర్య సమరయోధురాలు. 1931లో యూనివర్శిటీ విద్యను పూర్తి చేసిన తర్వాత, అచ్చమ్మ చెరియన్ టీచర్‌గా పనిచేసింది, చివరికి ప్రధానోపాధ్యాయురాలు (ప్రిన్సిపల్)గా మారింది, 1938లో స్టేట్ కాంగ్రెస్‌లో చేరి పూర్తి సమయం భారత స్వాతంత్ర్య పోరాటానికి అంకితం చేసింది.

ట్రావెంకూర్ స్టేట్ కాంగ్రెస్‌పై నిషేధం విధించాలని, ఆ పార్టీ నేతలపై ఉన్న అభియోగాలను ఎత్తివేయాలని కోరుతూ అచ్చమ్మ చెరియన్  ఆధ్వర్యంలో కొవ్డియార్ ప్యాలెస్‌కు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇది చివరికి ఒక ఉద్రేక పరిస్థితికి  దారితీసింది, ఈ సమయంలో ఒక బ్రిటీష్ పోలీసు చీఫ్ సమావేశమైన 20,000 మంది ఉద్యమకారులపై  కాల్పులు జరిపేందుకు సిద్ధం కావాలని తన సిబ్బందిని ఆదేశించాడు. అచ్చమ్మ చెరియన్ ధైర్యం తో ముందుకు వచ్చి  “నేను  నాయకురాలిని. ఇతరులను చంపే ముందు నన్ను కాల్చండి”.అని అన్నారు.  అచ్చమ్మ చెరియన్ ధైర్యసాహసాలు దేశమంతటా మారుమ్రోగాయి వ్యాపించాయి మరియు గాంధీజీ ఆమెకు 'ఝాన్సీ రాణి ఆఫ్ ట్రావెన్‌కోర్' అని పేరు పెట్టారు.

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు ఉద్దేశించిన “దేశ సేవికా సంఘ్” అనే మహిళా స్వచ్ఛంద సమూహాన్ని అచ్చమ్మ చెర్రియన్ స్థాపించారు. అచ్చమ్మ చెరియన్ రెండుసార్లు జైలుకెళ్లారు. అచ్చమ్మ చెరియన్ చివరికి 1942లో ట్రావెంకూర్ స్టేట్ కాంగ్రెస్‌కు తాత్కాలిక అధ్యక్షురాలిగా అయింది.

స్వాతంత్ర్యం తరువాత, అచ్చమ్మ చెరియన్ ట్రావెన్‌కోర్ శాసనసభకు ఎన్నికైనారు . అచ్చమ్మ చెరియన్ 1982లో మరణించింది మరియు కేరళలోని త్రివేండ్రం లో ఆమె విగ్రహం మరియు ఉద్యానవనంతో స్మారక స్థలం నిర్మించబడినది.

 3. కార్నెలియా సొరాబ్జీ (1866–1954):

కొర్నేలియా సొరాబ్జీ,  రెవ. సొరాబ్జీ కర్సెడ్జీ కుమార్తె, కొర్నేలియా బొంబాయి విశ్వవిద్యాలయంలో మహిళల ప్రవేశాన్ని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించింది. కొర్నేలియా బాంబే యూనివర్శిటీలో మొదటి మహిళా గ్రాడ్యుయేట్ మరియు ఆక్స్‌ ఫర్డ్ యూనివర్శిటీలో లా చదివిన మొదటి మహిళ.

1894లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, కొర్నేలియా భారతదేశపు మొదటి మహిళా న్యాయవాదిగా కీలక పాత్ర పోషించింది. పర్దా వ్యవస్థ కారణంగా చాలా మంది భారతీయ స్త్రీలు తమ ఇళ్లను విడిచి బయటకు వెళ్లలేకపోతున్నారని  మరియు  చాలా మంది స్త్రీలకు  అవకాశవాద మగ బంధువులు వారసత్వ ఆస్తిని ఇవ్వటానికి నిరాకరిస్తున్నారని, వారు తమ వాదన వినిపించడానికి   మగ న్యాయవాదితో మాట్లాడలేరని సోరాబ్జీ పేర్కొన్నారు. సోరాబ్జీకి వారి తరుపున వాదించడానికి అనుమతి ఇవ్వబడింది కానీ ఆమె బారిస్టర్ కానందున కోర్టులో వారి తరుపున  వాదించలేకపోయింది. సొరాబ్జీ ఎల్‌ఎల్‌బి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 1923లో మహిళలకు  కూడా బారిస్టర్ గా గుర్తింపు ఇచ్చారు.

ప్రావిన్షియల్ కోర్టులో మహిళలకు ప్రాతినిధ్యం వహించేందుకు మహిళా న్యాయ సలహాదారులను ఏర్పాటు చేయాలని 1902లోనే సొరాబ్జీ పిటిషన్ వేయడం ప్రారంభించారు. సొరాబ్జీ 1904లో బెంగాల్ కోర్ట్ ఆఫ్ వార్డ్స్‌ లో మహిళా న్యాయ సలహాదారు పదవికి నియమించబడింది. సొరాబ్జీ 100ల మంది మహిళలు మరియు అనాథలు, తక్కువ-ఆదాయ క్లయింట్‌లకు ఎటువంటి రుసుము వసూలు చేయకుండా న్యాయ పోరాటాలలో పోరాడటానికి సహాయం చేసారు.

సొరాబ్జీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా మరియు ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీ ఉమెన్ వంటి అనేక స్త్రీవాద సంస్థలలో కూడా పాల్గొన్నారు. సొరాబ్జీ బాల్య వివాహాలు మరియు వితంతువులు వంటి సామాజిక రుగ్మతలు తొలగించడానికి సామాజిక సంస్కరణలు  అవసరమని గట్టిగా విశ్వసించింది.

భారతదేశంలో మతపరమైన ఛాందసవాదం నుండి  మహిళలు  విముక్తి పొందనంత వరకు భారత దేశానికి  స్వాతంత్ర్యo వచ్చినా   పలితం ఉండదని  సోరాబ్జీ గట్టిగా నమ్మింది. సోరాబ్జీ యొక్క ఈ భావన  అనేక సంస్థలనుండి ఆమె బహిష్కరణకు దారితీసింది మరియు స్వాతంత్ర్యానికి అనుకూలమైన అనేక ఇతర ప్రముఖ భారతీయ క్రైస్తవ మహిళలతో సోరాబ్జీ సంబంధాన్ని దెబ్బతీసింది.

4. రాజకుమారి అమృత్ కౌర్ (1887–1964):

రాజకుమారి అమృత్ కౌర్ పంజాబీ రాజవంశంలో జన్మించింది, అమృత్ కౌర్ తండ్రి కపుర్తలా రాజు యొక్క చిన్న కుమారుడు.  అమృత్ కౌర్ తండ్రి క్రైస్తవ మతంలోకి మారాడు మరియు బెంగాలీ మిషనరీ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వారికి గల  10 మంది పిల్లలలో అమృత్ కౌర్ చిన్నది.

ఒక ప్రొటెస్టంట్ క్రిస్టియన్‌గా పెరిగిన రాజకుమారి అమృత్ కౌర్ జలియన్‌వాలాబాగ్ ఊచకోత జరిగిన అనంతరం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా ప్రవేశించింది. అమృత్ కౌర్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా మరియు మహాత్మా గాంధీ సన్నిహితురాలుగా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పనిచేయడం ప్రారంభించింది. బాల్య వివాహాలు, పర్దా (ఇంటి లోపల స్త్రీలను వేరుచేయడం మరియు నిర్బంధించడం),  దేవదాసీ వ్యవస్థ వంటి పద్ధతులను రద్దు చేయాలని  మరియు మహిళల హక్కుల కోసం అమృత్ కౌర్ బలంగా పోరాడింది.

1927లో, రాజకుమారి అమృత్ కౌర్  ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్‌ను స్థాపించారు మరియు మహాత్మా గాంధీ ద్వారా దండి మార్చ్‌ లో పాల్గొన్నందుకు బ్రిటిష్ అధికారులు అమృత్ కౌర్ ను జైలులో పెట్టారు. 1934లో అమృత్ కౌర్ గాంధీ ఆశ్రమంలో నివసించడం ప్రారంభించింది మరియు కఠినమైన సాధారణ జీవనశైలిని అవలంబించింది. ఇద్దరు భారతీయ-క్రైస్తవులు- రాజకుమారి అమృత్ కౌర్ మరియు తమిళ ఆర్థికవేత్త మరియు స్వాతంత్ర్య సమరయోధుడు J.C. కుమారప్ప, గాంధీజీ  యొక్క అంతరంగీయులుగా పరిగణిoచ బడేవారు.

రాజకుమారి అమృత్ కౌర్ 1937లో పాకిస్తాన్‌లోని ఖైబర్-పఖ్తున్‌ఖ్వాకు గుడ్‌విల్ మిషన్ వెళ్ళిన సమయంలో జైలు పాలైంది మరియు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు 1942లో మరోసారి జైలు పాలైంది. 1940లలో రాజకుమారి అమృత్ కౌర్ సార్వత్రిక ఓటు హక్కు కోసం వాదించడం ప్రారంభించింది మరియు ఆల్ ఇండియా ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఫండ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది. ఈ ప్రయత్నాలకు, టైమ్ మ్యాగజైన్ ఆమెను 1947లో 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్'గా ప్రకటించింది.

స్వాతంత్ర్యం తర్వాత, రాజకుమారి అమృత్ కౌర్ 10 సంవత్సరాల పాటు కేంద్ర ఆరోగ్య మంత్రిగా పనిచేసింది.  ఈ సమయంలో అమృత్ కౌర్ మలేరియా మరియు క్షయవ్యాధిని నిర్మూలించడానికి మరియు నియంత్రణ  చేయడానికి అనేక ప్రధాన ప్రజారోగ్య ప్రచారాలకు నాయకత్వం వహించింది. అమృత్ కౌర్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను స్థాపించింది.

వృద్ధాప్యం ఉన్నప్పటికీ, అమృత్ కౌర్ మహిళల హక్కులు, పిల్లల సంక్షేమం మరియు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం కోసం అవిశ్రాంతంగా కృషి చేసింది. అమృత్ కౌర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్‌కు వ్యవస్థాపక సభ్యురాలు మరియు ఇండియన్ రెడ్‌క్రాస్ చైర్‌పర్సన్. అమృత్ కౌర్ రాజ్యసభ సభ్యురాలు మరియు అనేక ప్రజారోగ్య సంస్థలలో నాయకత్వ పాత్రలు నిర్వహించారు. 1964లో అమృత్ కౌర్ మరణించినారు.

 5. డాక్టర్ హిల్డా మేరీ లాజరస్ (1890–1978):

 డా. హిల్డా మేరీ లాజరస్ 1890లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించారు. హిల్డా మద్రాసు మెడికల్ కాలేజీ నుండి మెడికల్ డిగ్రీని అందుకుంది మరియు మిడ్‌వైఫరీలో చేసిన అత్యుత్తమ కృషికి బంగారు పతకాన్ని గెలుచుకుంది. డా. హిల్డా మేరీ లాజరస్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రసూతి శాస్త్రం మరియు గైనకాలజీలో స్పెషలైజేషన్ పొందింది. డా. హిల్డా మేరీ లాజరస్ న్యూ ఢిల్లీలోని లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో చేరారు. ,.

మహిళలు మరియు మాతృ సంరక్షణ కోసం డా. హిల్డా మేరీ లాజరస్ తనను తాను అంకితం చేసుకుంది. ఎక్కువ మంది మహిళలకు నర్సులు మరియు మంత్రసానులుగా శిక్షణ ఇవ్వడానికి డా. హిల్డా మేరీ లాజరస్ తన మాతృభాష అయిన తెలుగును పక్కనపెట్టి అనేక కొత్త భారతీయ భాషలను నేర్చుకోవడం ప్రారంభించింది. డా. హిల్డా మేరీ లాజరస్ చివరికి వెల్లూరు మెడికల్ కాలేజీకి డైరెక్టర్‌గా పనిచేసింది, డాక్టర్‌గా తన అనుభవాలపై ఒక పుస్తకాన్ని రచించింది.

1961లో డా. హిల్డా మేరీ లాజరస్ కు ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్ నుండి కైసర్-ఇ-హిందీ గోల్డ్ మెడల్‌తో పాటు భారతదేశంలో మహిళలు మరియు మాతృ సంరక్షణకు చేసిన కృషికి పద్మశ్రీ అవార్డును అందుకుంది.

 6. వైలెట్ హరి అల్వా (1908–1969):

వైలెట్ హరి అల్వా ఒక గుజరాతీ క్రైస్తవ స్వాతంత్ర్య సమరయోదురాలు  మరియు న్యాయవాది. ఆంగ్లికన్ రెవెరెండ్ కుమార్తె అయిన వైలెట్ హరి అల్వా 16 సంవత్సరాల వయస్సులో అనాథగా మారింది మరియు పెద్ద తోబుట్టువుల సంరక్షణలో పెరిగింది. వైలెట్ హరి అల్వా బొంబాయిలోని భారతీయ మహిళా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల భాషా ప్రొఫెసర్‌గా చేరింది.

1944లో వైలెట్ హరి అల్వా పూర్తి హైకోర్టు బెంచ్‌ ముందు  కేసును వాదించిన భారతదేశంలో మొదటి మహిళా న్యాయవాది. వైలెట్ హరి అల్వా 'ఇండియన్ వుమెన్' పేరుతో పత్రికను కూడా ప్రారంభించింది. వైలెట్ హరి అల్వా బాంబే మునిసిపల్ కార్పొరేషన్‌కు డిప్యూటీ చైర్మన్‌గా మరియు జువైనల్ కోర్టు అధ్యక్షురాలిగా పనిచేసినది. వైలెట్ హరి అల్వా యంగ్ ఉమెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ మరియు బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ ఉమెన్స్ అసోసియేషన్ వంటి అనేక సంస్థల్లో పాల్గొంది.

అల్వా భారత స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతుదారుగా మరియు కాంగ్రెస్ సభ్యురాలు అయినది  మరియు తోటి భారతీయ-క్రిస్టియన్ స్వాతంత్ర్య సమరయోధుడు జోచిమ్ అల్వాను వివాహం చేసుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధురాలిగా వైలెట్ హరి అల్వా కార్యకలాపాలు అరెస్ట్ కు దారితీశాయి. ఈ సమయంలో, అల్వా తన 5 నెలల పసికందును తనతో పాటు జైలుకు తీసుకువచ్చింది. స్వాతంత్ర్య ఉద్యమానికి మరింత మద్దతు ఇవ్వడానికి వైలెట్ హరి అల్వా 1943లో 'ఫోరమ్' పత్రికను రూపొందించింది, ఇది ప్రచురణ మరియు వ్యాప్తికి అంకితం చేయబడింది. స్వాతంత్ర్య అనుకూల రచనలు ప్రచురించడం మరియు తోటి స్వాతంత్ర్య సమరయోధులకు వారి ఆలోచనలను వినిపించడానికి ఒక వేదికను అందించడం 'ఫోరమ్' ప్రధాన ఉద్దేశం.

స్వాతంత్ర్యం తరువాత, అల్వా పార్లమెంటు సభ్యురాలు గా పనిచేశారు. కుటుంబ నియంత్రణ విద్య మరియు సాధనాలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని మరియు భారత నౌకాదళానికి విస్తరించాలని సూచించింది. అల్వా హోం వ్యవహారాల సహాయ మంత్రి మరియు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా పనిచేసింది. 1969లో మరణించింది మరియు భారతదేశ చరిత్రలో మొట్టమొదటి పార్లమెంటేరియన్ జంటగా 2007లో ఆల్వా మరియు ఆల్వా భర్త జోచిమ్ ఆల్వాను  పార్లమెంటులో చిత్రపటంతో సత్కరించారు.

7. కాన్స్టాన్స్ ప్రేమ్ నాథ్ దాస్ (1886–1971)

 కాన్స్టాన్స్ ప్రేమ్ నాథ్ దాస్ పంజాబీ-ప్రొటెస్టంట్ కుటుంబంలో జన్మించారు మరియు అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొందారు.  కాన్స్టాన్స్ ప్రేమ్ నాథ్ దాస్ భారతదేశంలో క్రిస్టియన్ కాలేజి  ప్రిన్సిపాల్ పదవిని చేపట్టిన మొదటి భారతీయ మహిళా. ఇసాబెల్లా థోబర్న్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా వ్యవరించారు.

కాన్స్టాన్స్ ప్రేమ్ నాథ్ దాస్ పేద మరియు నిరుపేద ప్రజలు అడ్మిషన్లు  ఫీజులను పొందడం కోసం  విరాళాల సేకరించడం మరియు స్కాలర్‌షిప్‌లపై సమాచారాన్ని అందించడం చేసేవారు.  విద్యా బడ్జెట్‌లో కోతలు గణనీయం గా ఉన్న రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కూడా కాన్స్టాన్స్ ప్రేమ్ నాథ్ దాస్ తన  పనిని కొనసాగించింది.. కాన్స్టాన్స్ ప్రేమ్ నాథ్ దాస్ భారతదేశంలో విశ్వవిద్యాలయ విద్య విస్తరణ మరియు ఆధునీకరణను ప్రోత్సహించడానికి కృషి చేసింది.

కాన్స్టాన్స్ ప్రేమ్ నాథ్ దాస్ భారత స్వాతంత్ర్య ఉద్యమానికి బలమైన మద్దతుగా నిలిచింది. కాన్స్టాన్స్ ప్రేమ్ నాథ్ దాస్ విద్యపై అత్యంత ప్రగతిశీల దృక్కోణాలకు ప్రసిద్ధి చెందింది, భారతీయ గ్రాడ్యుయేట్లు తమ దేశాన్ని నిర్మించడానికి పని చేసే బాధ్యతలు మరియు విధులను గట్టిగా నొక్కిచెప్పే సంపూర్ణమైన అభ్యాస నమూనాను కాన్స్టాన్స్ విశ్వసించారు.

8.డా. గురుబాయి కర్మాకర్ (?-1932)

డాక్టర్ గురుబాయి కర్మాకర్ ఎప్పుడు జన్మించారో తెలియదు, అయితే ఆమెది  మరాఠీ నేపథ్యం. 1886లో ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి పట్టభద్రులైన రెండవ భారతీయ మహిళగా డాక్టర్ గురుబాయి కర్మాకర్ 1893లో భారతదేశానికి తిరిగి వచ్చారు.

డాక్టర్ గురుబాయి కర్మాకర్ భారతీయ సమాజంలో అత్యంత పేద మరియు అత్యంత అట్టడుగున ఉన్న ప్రజలకు ("క్రిమినల్ కులాలు" అని పిలవబడే దిగువ కులాల ప్రజలు, బాల వధువులు, వితంతువులు (శాపగ్రస్తులుగా చూడబడ్డారు) మరియు కుష్టురోగులు) వైద్య సంరక్షణ అందించడానికి అంకితం చేయబడింది.  కరువు సమయంలో మరియు 1916 ప్లేగు వ్యాప్తి సమయంలో వైద్య సంరక్షణ అందించడంలో డాక్టర్ గురుబాయి కర్మాకర్ కీలక పాత్ర పోషించింది.

బాల్య వివాహాలు, వితంతువులపై వివక్ష, కులతత్వం వంటి సామాజిక దురాచారాల గురించి కూడా డాక్టర్ గురుబాయి కర్మాకర్ బహిరంగంగా మాట్లాడారు. డాక్టర్ గురుబాయి కర్మాకర్ పదవీ విరమణ తరువాత, తన వ్యక్తిగత సంపదను  బొంబాయిలోని లింకన్ హౌస్‌లోని  గురుబాయి కర్మాకర్ వింగ్ కు దానం చేసింది.


9. నీడోనువో అంగామి (1950-)

నీడోనువో అంగామి ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌కు చెందిన భారతీయ సామాజిక కార్యకర్త. నాగాలాండ్‌ క్రైస్తవ గిరిజన నాగా ప్రజలకు నివాసం. 1984లో, నాగా ప్రజలు ఎదుర్కొంటున్న మద్యపానం మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగం వలన పెరుగుతున్న ప్రజారోగ్య సవాళ్లను పరిష్కరించడానికి నీడోనువో అంగామి నాగా మదర్స్ అసోసియేషన్‌ను స్థాపించారు.

వ్యసనాలు,గృహ హింస, నేరాలు, కుటుంబ విచ్ఛిన్నం మరియు HIV/AIDS వ్యాప్తి వంటి వాటి వల్ల కలిగే సామాజిక రుగ్మతల సమస్యలను పరిష్కరించే ఉమ్మడి లక్ష్యంతో నీడోనువో అంగామి నాగాలాండ్ అంతటా నాగ తెగల మహిళలను సమీకరించడం ప్రారంభించింది. HIV/AIDS ఉన్నవారి కోసం క్లినిక్, షెల్టర్లు మరియు పునరావాస కేంద్రాలు స్థాపించినది.

నీడోనువో అంగామి 'షెడ్ నో మోర్ బ్లడ్' ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ఇది జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి మరియు రాష్ట్రంలో వేర్పాటువాద హింసను అంతం చేయడానికి తిరుగుబాటుదారులను వారి ఆయుధాలను వదిలివేసి ప్రధాన స్రవంతి రాజకీయాల్లో చేరమని ప్రోత్సహించడానికి తోడ్పడింది. నాగా తిరుగుబాటుదారులు మరియు ప్రభుత్వానికి మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించడంలో నీడోనువో అంగామి కీలక పాత్ర పోషించింది. నీడోనువో అంగామి సామాజిక క్రియాశీలత,శాంతి మరియు జాతీయ ఐక్యతకు చేసిన కృషికి గాను  నీడోనువో అంగామి 2000లో పద్మశ్రీని గ్రహించినది. 

  

10. లీలావతి సింగ్ (1868–1909)

లీలావతి సింగ్ ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో భారతీయ క్రైస్తవ తల్లిదండ్రులకు జన్మించారు. 1895లో లీలావతి సింగ్ అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో పట్టా పొందారు మరియు పట్టా పొందిన మొదటి ఇద్దరు మహిళల్లో ఒకరు.

లీలావతి సింగ్ ఇసాబెల్లా థోబర్న్ కాలేజీలో సాహిత్యం మరియు తత్వశాస్త్రం యొక్క ప్రొఫెసర్‌గా అయినది. ప్రొఫెసర్‌ అయిన మొదటి భారతీయ మహిళల్లో లీలావతి సింగ్ ఒకరు. ఆధునిక విద్యను పొందేందుకు మహిళా విద్యార్థులను ప్రేరేపించడానికి తన శక్తిని అంకితం చేసింది. లీలావతి సింగ్ వరల్డ్ స్టూడెంట్స్ క్రిస్టియన్ ఫెడరేషన్ యొక్క మహిళా కమిటీ అధ్యక్షురాలిగా కొనసాగుతుంది. లీలావతి సింగ్ రఫిక్-ఇ-నిస్వాన్ పేరుతో మహిళా వార్తాపత్రికకు కూడా సంపాదకత్వం వహించారు.

భారతీయ క్రైస్తవులు తమ స్వంత దేశీయ సాహిత్యాన్ని అభివృద్ధి చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను సింగ్ గ్రహించారు. లీలావతి సింగ్ క్రైస్తవ రచనలను భారతీయ భాషల్లోకి అనువదించడానికి తనను తాను అంకితం చేసుకుంది మరియు ఆఫ్రికన్-అమెరికన్ మేధావి బుకర్ T. వాషింగ్టన్‌కి జీవిత చరిత్రను భారతీయ క్రైస్తవ వార్తాపత్రిక కంకబ్-ఐ-హింద్‌లో ప్రచురించడానికి అనువదించింది. 

యునైటెడ్ స్టేట్స్ పర్యటనలో ఉన్నప్పుడు లీలావతి సింగ్ 40 సంవత్సరాల వయస్సులో మరణించింది. ఇసాబెల్లా థోబర్న్ కళాశాలలో లీలావతి సింగ్ వసతి గృహం, లీలావతి సింగ్ గౌరవార్థం నిర్మించబడింది.

 

 

No comments:

Post a Comment