13 June 2024

ఖాతున్, 20వ శతాబ్దపు ఉర్దూ పత్రిక Khatun, a 20th century Urdu magazine

 


ఖాతున్ ఉర్దూ మ్యాగజైన్ 1904-1914 వరకు ప్రచురణలో ఉంది మరియు ఆ సమయంలో ఖాతున్ పత్రిక ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం మేధావులకు, మహిళలకు ఆధునిక విద్య యొక్క ఆవశ్యకత పట్ల ఆలోచన మరియు  అవగాహన ఉండేలా కృషి చేసింది. ఖాతున్ పత్రిక తరువాత 1914లో అంజుమన్-ఇ-ఖవాతిన్-ఇ-ఇస్లాం అనే సంస్థ ఏర్పాటుకు కారణమైనది..

ఒక దశాబ్దం పాటు అలీఘర్ నుండి విడుదలైన ఉర్దూ పత్రిక ఖాతున్ ముస్లిం మహిళల ఆలోచనా విధానాన్ని, చైతన్యాన్ని మరియు అవగాహనను వెల్లడిస్తుంది. ఖాతున్ పత్రిక యొక్క ప్రాథమిక లక్ష్యం ముస్లిం మహిళలకు ఆధునిక విద్యను పరిచయం చేయడం. 20వ శతాబ్దపు ముస్లిం సంస్కర్తలు ముస్లిం మహిళలకు ఆధునిక విద్యను అందించాలని కోరుకున్నారు.

అలీఘర్‌లో వహీద్ జహాన్ మరియు ఆమె భర్త షేక్ అబ్దుల్లా 20వ శతాబ్దం మొదటి దశాబ్దంలో అలీఘర్‌లో మహిళా పాఠశాల మరియు కళాశాల స్థాపన కోసం ప్రయత్నాలు చేసారు. స్త్రీ విద్య యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి వహీద్ జహాన్ దంపతులు ఒక పత్రికను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఉర్దూ భాషా పత్రిక ఖాతున్ (స్త్రీ),  1904 నుండి 1914 వరకు ప్రచురించబడింది. ఖాతున్ మాసపత్రిక లో ప్రత్యేకంగా. స్త్రీలకు. ఆధునిక విద్యపై అవగాహన కల్పించే  వ్యాసాలు ఉంటాయి.

 ఖాతున్‌ పత్రికను షేక్ అబ్దుల్లా ఎడిట్ చేసారు మరియు వివిధ ఉన్నత వర్గ మహిళల నుండి విద్యావంతులైన పురుషుల వరకు (ప్రధానంగా MAO కళాశాల విద్యార్థులు) పత్రిక లో వ్యాసాలు రాసేవారు.ఖాతున్‌ పత్రిక ప్రచురణ 1906లో దాదాపు 200 కాపీలతో ప్రారంభమైంది మరియు తరువాతి సంవత్సరాలలో చెలామణిలో ఉన్న కాపీల సంఖ్య 500కి చేరుకుంది.

ఖాతూన్ పత్రిక లో ఇతివృత్తాలు భారతదేశంలోని చారిత్రక మహిళలకు సంబంధించినవిగా  ఉన్నాయి. 1907 సంచికలో, శ్రీమతి నసీరుద్దీన్ హైదర్ మాలికా జోధా బాయి గురించి రాసారు. మొఘల్ సామ్రాజ్యం యొక్క రాజ్‌పుత్ రాణిపై కథనంతో పాటు, ఒక సంచికలో ఔరంగజేబు కుమార్తె జెబ్-ఉన్-నిసా బేగంకు అంకితం చేసిన వ్యాసం ఉంది. వీరితో పాటు నూర్జహాన్, ముంతాజ్ మహల్, జహనారా మరియు రోషన్ అరా వంటి ప్రముఖ చారిత్రక మహిళలు గురించి కూడా వ్యాసాలు  కలవు.

ఖాతూన్ పత్రికలో ప్రచురింపబడిన వ్యాసాల స్వభావం పరిశీలించిన చారిత్రక స్త్రీల రూపంలో తన పాఠకులకు బలమైన రోల్ మోడల్‌లను అందించడం ఎడిటర్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సూచిస్తుంది.

ఖాతూన్,పత్రిక యొక్క సంపాదకులు సంస్కరణ ఆలోచనలను పరిచయం చేయడం లక్ష్యం గా పెట్టుకొన్నారు. ఖాతూన్,పత్రికలో  సమాజం లోని  అజ్ఞాన పద్ధతులను తొలగించే అనేక వ్యాసాలు ఉన్నాయి. 'ముసల్మాన్ హిందుస్థాన్' (భారతీయ ముస్లింలు) ను చైతన్యపరిచేందుకు    ఖాతూన్పత్రిక కృషిచేస్తుంది.

అంతేకాకుండా, సమాజం లోని అంధ విశ్వాసాలను తొలగించే౦దుకు ఖాతూన్,పత్రిక  కృషి చేస్తుంది. స్త్రీలు మూఢనమ్మకాలకి బదులు హేతుబద్ధంగా మరియు సహేతుకంగా ఉండాలని ఆశించబడినది..

ఖాతూన్ మ్యాగజైన్ లో స్త్రీ విద్య యొక్క ప్రాముఖ్యత, విజయవంతమైన మహిళా విద్యాసంస్థల గురించి  ప్రస్తావించారు. ఖాతూన్ పత్రిక లోని అనేక వ్యాసాలు  స్త్రీ విద్య ఎంత ప్రయోజనకరమైనదో నొక్కిచెప్పాయి. 1907లో ప్రచురించబడిన ఒక వ్యాసం లో, స్త్రీకి విద్యను అందించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.  విద్యావంతులైన స్త్రీలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించగలరని నొక్కి చెప్పబడింది; వారు తమ పిల్లలను బాగా పెంచగలరు మరియు విద్యావంతులైన స్త్రీ యువత కు సరైన మార్గనిర్దేశం చేయగలదు మరియు విద్యావంతులను చేయగలదు.

ఖాతున్ 1904-1914 వరకు ప్రచురణలో ఉంది.. 


No comments:

Post a Comment