11 June 2024

కోల్‌కతాలోని చారిత్రక యూదుల ప్రార్థనా మందిరం ముస్లింల సంరక్షణలో ఉంది Kolkata's historic Jews Synagogue is in the care of Muslims

 


భారత దేశం లోని కోల్‌కతా నగరం మత సామరస్యం కు నెలవు.  కోల్‌కతా లో శతాబ్దాల నాటి యూదుల సినర్జీ/ప్రార్దనాలయాలు  నేడు ముస్లిం సంరక్షకుల క్రింద సురక్షితంగా మరియు అభివృద్ధి చెందుతున్నాయి.

ప్రపంచ చరిత్రలో ముస్లింలు మరియు యూదుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, కోల్‌కతా నగరంలో, రెండు వర్గాల మధ్య శాంతి మరియు గౌరవం ప్రవహిస్తుంది.

1884లో నిర్మించిన ఆసియాలోని అతిపెద్ద యూదుల సినర్జీ/ ప్రార్ధనాలయం మాగిన్ డేవిడ్ కోల్‌కతాలో ఉంది. దీని సంరక్షణ ఒక ముస్లిం కుటుంబం చేతిలో ఉంది. అదేవిధంగా, మూడు యూదు పాఠశాలలు, శ్మశానవాటికలు మరియు అనేక సంస్థలు కూడా ముస్లింల సంరక్షణలో ఉన్నాయి మరియు  ఈ పాఠశాలల్లో ముస్లిం విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువ.

1940లలో కోల్‌కతా నగరం గణనీయమైన సంఖ్యలో యూదు సమాజాన్ని కలిగి ఉంది మరియు అక్కడి యూదు సమాజా౦ ముస్లిం సమాజంతో సహా ప్రజలందరితో సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించింది. యూదు-ముస్లిం మత సమూహాలు దశాబ్దాలుగా పక్కపక్కనే నివసించాయి.

ఇజ్రాయెల్ దేశం స్థాపన తర్వాత, కోల్‌కతాలోని యూదు ప్రజలు తమ కొత్త స్వదేశానికి వలస వెళ్లడం ప్రారంభించారు. కోల్‌కతానగరంలో ఒకప్పుడు దాదాపు 6,000 మంది యూదులు నివసించేవారు  కానీ ఇప్పుడు వారి జనాభా 15కి తగ్గింది. వారిలో ఎక్కువ మంది వృద్ధులు.

యూదు-ముస్లిం మతాలు దైవ గ్రంధాలను కలిగి ఉన్నాయి. ఇద్దరి ప్రవక్తలు  కూడా ఒకటే, ఆహారం మరియు పానీయాలు విషయం లో ఇద్దరు హలాల్‌ను పాటిస్తారు..

కోల్‌కతాలో ఉన్న  యూదుల మూడు ప్రార్థనా మందిరాలలో  మాగ్నా డేవిడ్ సినాగోగ్ అతిపెద్దది. మాగ్నా డేవిడ్ సినాగోగ్ భవనం సెంట్రల్ యూరోపియన్ చర్చిల లక్షణాలను కలిగి ఉంటుంది.  

మాగ్నా డేవిడ్ సినాగోగ్ ను 19వ శతాబ్దపు వ్యాపార దిగ్గజం ఎలియాస్ డేవిడ్ నిర్మించారు. మాగ్నా డేవిడ్ సినాగోగ్ కు లాల్ గుర్జా (రెడ్ చర్చి) అని మరొక పేరు కలదు.

కోల్‌కతాలో యూదుల రెండు ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. మాగ్నా డేవిడ్ సినాగోగ్ ను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించింది."

యూదులు స్థాపించిన పాఠశాలలు ఎక్కువగా కోల్‌కతానగరంలోని ముస్లిం మెజారిటీ ప్రాంతాలలో ఉన్నాయి మరియు ముస్లిం పిల్లలు వీటి నుండి ప్రయోజనం పొందుతున్నారు.

కోల్‌కతానగరంలోఅపూర్వమైన మత సామరస్యం ఉంది.కోల్‌కతాలోని బాగ్దాదీ యూదు సమాజానికి చెందిన షాలోమ్ హరున్ కలకత్తా స్థాపకుడు ఒబాదియా కోహెన్ యూదుల స్మశానవాటిక భూమి కోసం బెంగాలీ ముస్లిం స్నేహితుడిని సంప్రదించినట్లు చారిత్రక రికార్డులు చూపిస్తున్నాయి.

ముస్లిం స్నేహితుడు ఒబాదియా కోహెన్ కి తన భూమిని ఉచితంగా ఇచ్చాడు, కోహెన్ తన స్నేహితుడికి రెండు వర్గాల మధ్య సంఘీభావానికి చిహ్నంగా బంగారు ఉంగరాన్ని ఇచ్చాడు. అక్కడ కోహెన్‌తో సహా 8,625 సమాధులు ఉన్నాయి.

యూదులు ఇజ్రాయెల్ మరియు ఇతర దేశాలకు వలస వెళ్ళిన తర్వాత కోల్‌కతా లో వారి జనాభా తగ్గడం ప్రారంభమైంది మరియు నేడు కోల్‌కతా నగరంలో వారి ఉనికి చాలా తక్కువగా ఉంది, యూదుల ప్రార్థనా మందిరాలు ఖాళీగా ఉన్నాయి.

2008 నుండి  మాగ్నా డేవిడ్ సినాగోగ్ ను బాధ్యతలు తీసుకున్న రబుల్ ఖాన్ నిర్వహిస్తున్నారు. అంతకు ముందు రబుల్ ఖాన్ తండ్రి సుమారు 50 నుండి 60 సంవత్సరాల పాటు  మాగ్నా డేవిడ్ సినాగోగ్ భవనాన్ని నిర్వహించాడు.

.

No comments:

Post a Comment