ఒక వ్యక్తి
నాలుగు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్గా పనిచేస్యడం చాలా అరుదు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మదర్సాలో ప్రాధమిక విద్యాభ్యాసం చేసిన ప్రొఫెసర్ ఖమర్ అహ్సన్ అలాంటి వారిలో ఒకరు.
ప్రొఫెసర్ ఖమర్ అహ్సన్, మగద్ విశ్వవిద్యాలయం బోధ గయా, S.K.M. విశ్వవిద్యాలయం, దుమ్కా జార్ఖండ్, B.N.మండల్ విశ్వవిద్యాలయం మాధేపురా, Ml మజరుల్ హక్ విశ్వవిద్యాలయం పాట్నా కు వైస్ ఛాన్సలర్ గా పనిచేసారు.
ప్రొఫెసర్ ఖమర్
అహ్సాన్ విద్యావేత్త మరియు ఆర్థికవేత్త, కమర్ అహ్సాన్ నాలుగు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్గా పనిచేసిన ఘనత సాధించారు. ప్రొఫెసర్ కమర్ అహ్సాన్ తను వైస్-చాన్సలర్ గా పనిచేసిన నాలుగు విశ్వవిద్యాలయాలలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడమే కాకుండా,విద్యార్థుల ప్రయోజనాల కోసం కొత్త కోర్సులు ముఖ్యంగా ఉద్యోగ ఆధారిత కోర్సులను ప్రారంభించారు.
ఖమర్ అహ్సన్
పాట్నాలోని మౌలానా మజరుల్ హక్ విశ్వవిద్యాలయం ప్రారంభ దశలో వైస్-ఛాన్సలర్ అయ్యారు. యూనివర్శిటీ క్యాంపస్, పాఠ్యాంశాలు మరియు నైతికతలను రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.
ప్రొఫెసర్. ఖమర్
అహ్సన్ చాలా మంది గవర్నర్లతో కలిసి పనిచేశారు మరియు మదర్సా, పాఠశాల మరియు కళాశాల విద్యావ్యవస్థ ను మెరుగుపరచడంలో కృషి చేసారు.
మౌలానా మజరుల్
హక్ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్గా ప్రొఫెసర్. ఖమర్ అహ్సన్ వందలాది మదర్సాలను విశ్వవిద్యాలయంతో అనుసంధానించారు మరియు విద్యాపరంగా మదరసా విద్యా
ప్రణాళికలో ఆధునిక విజ్ఞాన విషయాలను పొందుపరిచి మదరసా విద్యా ప్రమాణాలను, మదరసా
రూపురేఖలను మెరుగుపరచడం లో విజయం సాధించారు.
ప్రొఫెసర్ ఖమర్
అహ్సాన్ ఏప్రిల్ 1952లో పాట్నాలో జన్మించారు. ఏడుగురు సోదరులు మరియు సోదరీమణులలో ఖమర్ అహ్సాన్ నాల్గవవాడు. ప్రొఫెసర్ ఖమర్ అహ్సాన్ తండ్రి సయ్యద్ ముజఫర్ అహ్సాన్ అదనపు ఎస్పీగా పదవీ విరమణ చేశారు.కమర్ అహ్సాన్ తాత చాప్రా జిల్లా పాఠశాలలో హెడ్ మౌల్వీ
ఖమర్ అహ్సాన్
ప్రాధమిక విద్య
మదరసా/సెమినరీ నుండి ప్రారంభమైంది. తరువాత, ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో, తర్వాత ప్రసిద్ధ మిల్లర్
పాఠశాలలో చివరకు, ఉన్నత విద్య కోసం పాట్నా కళాశాలలో చేరారు..
ప్రొఫెసర్ ఖమర్
అహ్సన్ ఎకనామిక్స్లో BA మరియు MA చేసారు. పాట్నా విశ్వవిద్యాలయంలో విద్యనబ్యసిస్తునప్పుడు జేపీ (జయ్ ప్రకాష్ నారాయణ్) మూమెంట్ లో
పనిచేసారు. రాంచీ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు..
1977లో ఖమర్ అహ్సాన్ మగద్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉద్యోగం చేసారు.
ప్రొఫెసర్ ఖమర్ అహ్సాన్ మొదట నలంద ఓపెన్ యూనివర్శిటీ, తర్వాత వీర్ కౌర్ సింగ్ యూనివర్శిటీ మరియు బీహార్లోని మౌలానా మజరుల్ హక్ యూనివర్శిటీకి రిజిస్ట్రార్గా నియమించబడ్డాడు
ప్రొఫెసర్ ఖమర్ అహ్సాన్ మాదాపురాలోని బిఎన్ మండల్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా నియమింపబడి
2006 నుంచి 2008 వరకు ఆ పదవిలో కొనసాగారు.
ప్రొఫెసర్ ఖమర్
అహ్సన్ ఇలా అంటారు, "నాకు వివిధ విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్గా అవకాశం లభించింది. 2008లో, పాట్నాలోని మౌలానా మజరుల్ హక్ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ ఖమర్ అహ్సన్ వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు..
మౌలానా మజరుల్
హక్ అరబిక్ మరియు పెర్షియన్ విశ్వవిద్యాలయం 1998లో స్థాపించబడింది మరియు నేడు, ఈ విశ్వవిద్యాలయంలో 20,000 మందికి పైగా విద్యార్థులు వివిధ విభాగాలలో చదువుతున్నారు" అని కమర్ అహ్సన్ చెప్పారు.
మౌలానా మజరుల్
హక్ యూనివర్సిటీకి బీహార్ అంతటా నాలుగు డజన్లకు పైగా నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్లు ఉన్నాయి. ప్రొఫెసర్ ఖమర్ అహ్సన్ 2011 వరకు మౌలానా మజరుల్ హక్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్గా ఉన్నారు.
ప్రొఫెసర్ ఖమర్
అహ్సన్ హయం లో మజరుల్ హక్ విశ్వవిద్యాలయం వివిధ కోర్సులను-BBA,
BCA, BJMC, MBA, B.Ed, ప్రారంబించినది..
ప్రొఫెసర్ ఖమర్
అహ్సన్ అభిప్రాయం లో మదర్సాలలో మతపరమైన విద్య తో పాటు అన్ని సబ్జెక్టులను బోధించాలి. విద్యార్థుల ఉద్యోగానికి తగిన విధంగా పాఠ్యాంశాలను ఆధునీకరించాలి.పాఠ్యాంశాలు, బోధనా విధానంలో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకురావాలి. విద్యార్థులకు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా సబ్జెక్టును బోధించాలి."
మౌలానా మజరుల్
హక్ విశ్వవిద్యాలయం తర్వాత, ప్రొఫెసర్ ఖమర్ అహ్సన్ సిద్ధూ కన్హు ముర్ము విశ్వవిద్యాలయం, దుమ్కా, జార్ఖండ్ మరియు మగద్ విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్ అయ్యారు.
ప్రొఫెసర్ ఖమర్ అహ్సన్ సుమారు
9 పుస్తకాల రచయిత మరియు 30 కంటే ఎక్కువ పత్రాలు దేశంలోని ప్రధాన పత్రికలలో ప్రచురించబడ్డాయి. ప్రొఫెసర్ ఖమర్ అహ్సన్ NCERT, IGNOU మరియు వివిధ పత్రికల సంపాదకీయ మండలిలో సభ్యుడు.
ప్రొఫెసర్ ఖమర్
అహ్సన్ విద్యావేత్తగా, విద్యా నిర్వాహకుడిగా మరియు విద్యా ఆవిష్కర్తగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు.
ప్రొఫెసర్
ఖమర్
అహ్సాన్
1980లో
వివాహం
చేసుకున్నారు,
ప్రొఫెసర్
కమర్
అహ్సాన్
కి
ఇద్దరు
పిల్లలు
ఉన్నారు
మరియు
భార్య
కూడా
పాఠశాల
ఉపాధ్యాయురాలు.
No comments:
Post a Comment