21 June 2024

భారత పార్లమెంట్ (లోక్ సభ) లో స్త్రీల ప్రాతినిధ్య క్షీణత: భారతదేశం 2024లో 74 మంది మహిళా ఎంపీలను ఎన్నుకుంది Gender Representation Declines: India Elects 74 Women MPs in 202

 


న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికలలో, 74 మంది మహిళా ఎంపీలు (13.63%) ఎన్నికైనారు.  ఇది మహిళా ప్రాతినిధ్యంలో తగ్గుదలని సూచిస్తుంది. ఈ శాతం మహిళలకు రిజర్వ్ చేయబడిన 33% కంటే చాలా తక్కువ.

2019 ఎన్నికలలో 78 మంది మహిళా ఎంపీలు ఎన్నికైనారు.

1952లో భారతదేశ తొలి ఎన్నికలలో  మహిళా ఎంపీల సంఖ్య కేవలం 22 మంది మాత్రమే ఉంది.

దిగువ సభ(లోక్ సభ )లో మహిళల శాతం 2019లో 14.4% నుండి 2024లో 13.6%కి తగ్గింది.

భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన హేమమాలిని, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)కి చెందిన మహువా మొయిత్రా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి)కి చెందిన డింపుల్ యాదవ్‌తో సహా పలువురు ప్రముఖ మహిళా ఎంపీలు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

కంగనా రనౌత్ మరియు మిషా భారతి కొత్తగా ఎన్నికైనారు. SP యొక్క 25 ఏళ్ల ప్రియా సరోజ్, మచ్లిషహర్‌లో విజయం సాధించగా, 29 ఏళ్ల ఇక్రా హసన్ కైరానా సీటును గెలుచుకున్నారు. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 25 ఏళ్ల శాంభవి చౌదరి మరియు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల సంజనా జాతవ్ (దళిత యువతులు ) ఎన్నికైనారు

 


మహిళా రిజర్వేషన్ బిల్లు Women’s Reservation Bill

మహిళా రిజర్వేషన్ బిల్లుగా పిలవబడే రాజ్యాంగ (128వ సవరణ) బిల్లు, 2023, సెప్టెంబర్ 19, 2023న లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది. ఇది లోక్‌సభ మరియు రాష్ట్ర శాసనసభలలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాలని ప్రతిపాదించింది. బిల్లు అమలులోకి వచ్చిన తర్వాత మొదటి జనాభా గణన(census) తర్వాత మహిళా రిజర్వేషన్ అమలు చేయబడుతుంది

2021 జనాభా గణనలో జాప్యం కారణంగా, తదుపరి జనాభా గణన మహిళలకు సీట్లను కేటాయించడానికి డీలిమిటేషన్‌ని ప్రేరేపిస్తుంది trigger మరియు ఈ సీట్లు 15 సంవత్సరాల పాటు రిజర్వ్‌ లో ఉంటాయి.

2026 నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రతి డీలిమిటేషన్ తర్వాత రిజర్వ్‌డ్ సీట్లను తప్పనిసరిగా రొటేట్ చేయాలని  కూడా బిల్లు నిర్దేశిస్తుంది. అదనంగా, రిజర్వ్‌డ్ సీట్లలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతులకు రోటేషనల్ రిజర్వేషన్లు ఉండేలా రాష్ట్రాలు ఆదేశించింది. . ఇంకా, మున్సిపాలిటీలు, పంచాయతీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్లలో చైర్‌పర్సన్‌ల కార్యాలయాలను మహిళలకు రిజర్వ్ చేసే నిబంధనలను మహిళా రిజర్వేషణ్  బిల్లులో పొందుపరిచారు.

మహిళా రిజర్వేషణ్  బిల్లు యొక్క ప్రాథమిక లక్ష్యం మహిళలకు రాజకీయంగా తక్కువ ప్రాతినిధ్యాన్ని సరి చేయడం  మరియు అత్యున్నత శాసన స్థాయిల్లో నిర్ణయాధికార ప్రక్రియలలో మహిళల చేరికను ప్రోత్సహించడం

లోక్‌సభలో మహిళల ప్రాతినిద్యం:

1952లో లోక్‌సభ సభ్యులలో మహిళలు 4.41% మాత్రమే ఉన్నారు. తరువాతి దశాబ్దంలో వారి ప్రాతినిధ్యం 6%కి పెరిగింది కానీ 1971 నాటికి 4% కంటే తక్కువకు పడిపోయింది. 2009లో 10%కి చేరుకుంది మరియు 2019లో 14.36%కి చేరుకుంది.

18వ లోక్‌సభలో 14% మంది మహిళలు ఉన్నారు, ఇది 2019 నాటి 78 మంది మహిళా ఎంపీల సంఖ్య కంటే కొంచెం(నాలుగు) తక్కువ.

2024 లోక్‌సభ ఎన్నికలలో ఎన్నికైన మహిళా ఎంపీలలో 16% మంది 40 ఏళ్లలోపు వారు మరియు 41% (30 మంది ఎంపీలు) లోక్‌సభ సభ్యులుగా మునుపటి అనుభవం కలిగి ఉండగా ఒక ఎంపీ రాజ్యసభలో పనిచేశారు.

కాలక్రమేణా లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం క్రమంగా పెరిగినప్పటికీ, పార్లమెంట్ లో స్త్రీల ప్రాతినిద్యం విషయం లో భారతదేశం అనేక ఇతర దేశాల కంటే వెనుకబడి ఉంది. ఉదాహరణకు, దక్షిణాఫ్రికాలో 46% మంది ఎంపీలు, UKలో 35% మరియు USAలో 29% మంది మహిళలు ఉన్నారు.

 



Decline in Women MPs in 2024 

 



ఎన్నికైన మొత్తం 543 మంది ఎంపీలలో 74 మంది మాత్రమే మహిళలు ఉన్నారు, 2019లో 78 మంది మహిళా ఎంపీలు (14.4%) ఎన్నిక కాగా ప్రస్తుత పార్లమెంట్‌2024 లో మహిళలు 13.6%కి తగ్గారు.

. 2024 లో మహిళా ఎం.పి. ల ఎన్నికలో వివిధ రాష్ట్రాల శాతం:

ఎన్నికల సంఘం (ECI) డేటా యొక్క విశ్లేషణ లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యంలో గణనీయమైన ప్రాంతీయ అసమానతలను వెల్లడిస్తుంది. ఉదాహరణకు, లోక సభ కు ఎన్నికైన మహిళా ఎం.పి. లలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి  27% మంది ఎన్నిక కాగా, పశ్చిమ బెంగాల్ మరియు హిమాచల్ ప్రదేశ్‌ నుంచి 25% మంది, ఉత్తరాఖండ్ మరియు మధ్యప్రదేశ్ నుంచి 20% మంది  ఎన్నికైనారు. కేరళ నుంచి ఒక్క మహిళా ఎంపీ కూడా ఎన్నిక కాలేదు, ఉత్తరప్రదేశ్ కేవలం ఏడుగురు మహిళా ఎంపీలను ఎన్నుకోంది.పంజాబ్ మరియు అస్సాం కూడా సాపేక్షంగా తక్కువ మహిళా ప్రాతినిధ్యం కలదు,.

రాష్ట్రాల వారీగా మహిళా ఎంపీల ఎన్నికలలో  ఒడిదుడుకులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఒడిశాలో 17వ లోక్‌సభలో 33% ఉన్న మహిళా ఎంపీలు ప్రస్తుత కాలంలో 2024 లో  19%కి తగ్గారు. పశ్చిమ బెంగాల్ 16వ లోక్‌సభ నుండి 25% మహిళా ఎంపీలను ఎన్నుకోంది.. బీహార్ అనేక ఎన్నికలలో మహిళా ఎంపీలలో అధిక వాటాను కలిగి ఉంది, తమిళనాడు గరిష్ట ప్రాతినిధ్యం 12.8%కి చేరుకుంది. 17వ లోక్‌సభ వరకు మహిళా ఎంపీల పెరుగుదల ధోరణిని ప్రదర్శించిన మహారాష్ట్ర మరియు గుజరాత్‌లు 18వ లోక్‌సభలో క్షీణతను చవిచూశాయి.

 

పార్టీల వారీగా మహిళా ఎంపీల ప్రాతినిద్యం:

పార్టీల వారీగా మహిళా ఎంపీల ప్రాతినిద్యం పరిశీలిస్తే, 2024 లో మొత్తం 74 మంది మహిళా ఎంపీలలో 31 మంది (42%) భాజపా నుంచి ఎన్నికైనారు. 17వ లోక్‌సభలో భాజపా నుండి 41 మంది మహిళా ఎంపీలు ఎన్నికైనారు.

భారత జాతీయ కాంగ్రెస్ (INC) 15వ లోక్‌సభలో 20 మందితో పోలిస్తే 16, 17వ మరియు 18వ లోక్‌సభలో వరుసగా నలుగురు, ఆరు మరియు 13 మంది మహిళా ఎంపీలతో క్షీణతను నమోదు చేసింది

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 18వ లోక్‌సభ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులను నిలబెట్టలేదు.

 18వ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం మహిళా స్వతంత్ర అభ్యర్థులు 250 నుండి 300 మంది పోటిలో ఉండగా వారిలో ఏ ఒక్కరు కూడా విజయవంతం కాలేదు. చారిత్రాత్మకంగా, స్వతంత్ర మహిళా ఎంపీలు అరుదు, అంతకుముందు లోక్‌సభలలో అప్పుడప్పుడు ప్రాతినిధ్యం వహించారు.

TMC 16, 17 మరియు 18వ లోక్‌సభలలో  మహిళా ఎంపీల 30% ప్రాతినిధ్యాన్ని స్థిరంగా కొనసాగించింది. BJP మరియు కాంగ్రెస్‌ల హెచ్చుతగ్గుల శాతాలు వరుసగా 10% నుండి 13% వరకు ఉన్నాయి.

గతంలో మహిళా ఎంపీలను కలిగి ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ (CPIM) వంటి పార్టీల నుండి  2024 సాధారణ ఎన్నికల్లో ఎవరు  ఎన్నిక కాలేదు.


ముగింపు:

ఎన్నికైన మహిళా ఎంపీల సంఖ్య లో తగ్గుదల మరియు పరిమిత సంఖ్యలో మహిళలు ఎన్నికలలో పోటీ చేయడం వంటి కారణాల వల్ల పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది.

18వ లోక్‌సభ ఎన్నికలలో, దాదాపు 8,360 మంది అభ్యర్థుల్లో 10% కంటే తక్కువ మంది మహిళలు ఉన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ఒక వేదికగా తోడ్పడుతుంది. మహిళలకు మూడింట ఒక వంతు సీట్లను రిజర్వ్ చేయడం ద్వారా, చట్టసభలలో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంపొందించడమే రిజర్వేషన్ బిల్లు లక్ష్యం

No comments:

Post a Comment