19 June 2024

షా-ఎ-హమదాన్ ఉర్స్ Urs of Shah-e-Hamadan in Anantnag

 

 

అనంతనాగ్ పట్టణంలోని రెష్ మౌల్ సూఫీ మందిరానికి/దర్గా  30 మీటర్ల దూరంలో శతాబ్దాల నాటి షేక్ బాబా దావూద్ ఖాకీ మసీదు కలదు. రెష్ మౌల్ ఉర్స్ ను  ఇటీవల అనంతనాగ్ పట్టణంలోని మొత్తం ముస్లిం జనాభా శాఖాహారులుగా మారి  ఐదుగురు రోజులు జరుపుకున్నారు.

అనంతనాగ్‌ లోని షేక్ బాబా దావూద్ ఖాకీ మసీదును షా-ఎ-హమదా 14వ శతాబ్దంలో హిజ్రీ క్యాలెండర్ ప్రకారం 990వ సంవత్సర౦ లో  అనంతనాగ్‌ పట్టణాన్ని సందర్శించినప్పుడు స్థాపించారు. అనంతనాగ్‌లో షేక్ బాబా దావూద్ ఖాకీ మసీదు మొదటి మసీదు.

14 వ శతాబ్దంలో కాశ్మీర్ లో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడానికి ఇరాన్ నుండి వచ్చిన షా-ఎ-హమదాన్ అని కూడా పిలువబడే మీర్ సయ్యద్ అలీ హమదానీ షేక్ బాబా దావూద్ ఖాకీ మసీదుకు పునాది వేసినట్లు ప్రచారం లో కలదు.

షా-ఎ-హమదాన్ ఉర్స్ కోసం సమ్మేళనం శ్రీనగర్ డౌన్‌టౌన్‌లోని ఖాన్‌కా-ఎ-మొఅల్లా పుణ్యక్షేత్రంలో జరగినది. ఖాన్‌ఖా-ఎ-మొల్లాలో వార్షిక ఉర్స్ వేడుకలు అర్థరాత్రి ప్రత్యేక రాత్రిపూట ప్రార్థనలతో ప్రారంభమయ్యాయి. ఐదుపూటల ప్రార్థనలు చేస్తూ రోజంతా పెద్ద సంఖ్యలో భక్తులు ఖాన్‌ఖాకు తరలివచ్చారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, కాశ్మీర్‌లో ఇస్లాం స్థాపకుడు అయిన  షా-ఎ-హమదాన్ ఉర్స్ 6వ జిల్-హజ్ రోజున జరుపుకుంటారు.

షా-ఎ-హమదాన్ లేదా మీర్ సయ్యద్ అలీ హమదానీ జ్ఞాపకార్థం 1395లో సుల్తాన్ సికందర్ నిర్మించిన మసీదు, కాశ్మీర్‌లో స్థాపించబడిన మొదటి మసీదు. గత ఆరు శతాబ్దాలుగా ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది.

అనంత్‌నాగ్‌లో, షా హమదాన్ స్థాపించిన షేక్ బాబా దావూద్ ఖాకీ మసీదు రెండవ అంతస్తును 16వ శతాబ్దంలో కాశ్మీర్ యొక్క గొప్ప సూఫీ సన్యాసి షేక్ హంజా మఖ్దూమ్ శిష్యుడైన బాబా దావూద్ ఖాకీ నిర్మించారు

హజ్రత్ షేక్ బాబా దావూద్-ఎ-ఖాకీ యొక్క మసీదుగా పిలువబడే మసీదు యొక్క ప్రస్తుత అప్‌గ్రేడ్ నిర్మాణం 1358 (హిజ్రీ)లో అభివృద్ధి చేయబడింది.

 షేక్ బాబా దావూద్-ఎ-ఖాకీ మసీదులో  ప్రార్థనలు (నమాజ్) క్రమం తప్పకుండా జరుగుతాయి. అన్ని మతపరమైన సందర్భాలలో మరియు రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు, ఖత్మత్-ఉల్-మొఅజ్జమత్ కూడా జరుగుతాయి

 

No comments:

Post a Comment