హీర్ రంఝా అనేది ఒక పంజాబీ
జానపద విషాద గాథ; ఇది పంజాబ్‌లోని నాలుగు ప్రసిద్ధ విషాద ప్రేమకథలలో ఒకటి. మిగిలిన మూడు
మీర్జా సాహిబాన్, సోహ్ని మహివాల్ మరియు సస్సీ పున్నున్. హీర్ రంఝా కథకు సంబంధించి అనేక కవితాత్మక వర్ణనలు ఉన్నాయి; వాటిలో 1766 లో వారిస్ షా రచించిన హీర్ అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇది హీర్ సియాల్, ధీడో రంఝా మధ్య ప్రేమ కథను చెబుతుంది.
హీర్ రంఝా కథ ను పలువురు కవులు రచించారు. మొదట హీర్ రంఝా కథ అక్బర్ కాలానికి
చెందిన దామోదర్ గులాటి వివరించాడు. దామోదర్ గులాటి కథ హీర్ రంఝా పంజాబీ సాహిత్యంలో అత్యంత పురాతనమైన హీర్ గా పరిగణించబడుతుంది.
16 వ శతాబ్దపు కవి షా హుస్సేన్ , భై గురుదాస్ ఆ తరువాత మన్సారామ్
మున్షీ 1744లో హీర్ రంఝా కథను చిత్రాలతో కూడిన వ్రాతప్రతి రూపంలో రూపొందించారు.వారిస్ షా 1766 లో తన నవలలో హీర్ రంఝా కథను వివరించాడు, వారిస్ షా హీర్ రంఝా కథకు లోతైన అర్థం ఉందని పేర్కొన్నాడు, ఇది భగవంతుడి పట్ల మనిషికి ఉన్న అలుపెరగని అన్వేషణను సూచిస్తుంది అని అన్నాడు
హీర్ యొక్క మొట్టమొదటి పర్షియన్ వర్షన్ 1575 మరియు 1579 మధ్య తాజిక్ కవి హయత్ జాన్ బాకీ కొలాబీ రచించారు. వారిస్ షా కాలం నాటికి, పర్షియన్ భాషలో హీర్ యొక్క తొమ్మిది కూర్పులుEditions వాడుకలో ఉన్నాయి, వాటిలో మితా
చెనాబి (1698) మరియు అఫరీన్ లాహోరీ (1730) రచనలు కూడా ఉన్నాయి
పర్షియన్ భాషలో హీర్ యొక్క సుమారు ఇరవై
అనువాదాలు తెలిసినవి ఉన్నవి. హిందీ (బ్రజ్) భాషలోని తొలి కూర్పులను సిక్కు పంత్
సమాజానికి చెందిన హరి దాస్ హరియా (సుమారు 1520లు–50లు) మరియు అక్బర్ ఆస్థానంతో సంబంధం ఉన్న గంగ్
భట్ (సుమారు 1580లు–90లు) వివరించారు; గంగ్ భట్ 1565లో ఒక పద్య సంవాదాన్ని రాశారు. దామోదర్ మరియు వారిస్ షా రచనలతో పాటు, హాఫిజ్ బర్ఖుర్దార్ రంఝా,
ఫజల్ షా సయ్యద్
మరియు అహ్మద్ యార్ వంటి వారి రచనలతో కలిపి పంజాబీ భాషలోనే హీర్ గురించి యాభైకి
పైగా అనువాదాలు ఉన్నాయి.
హీర్ (ఇజ్జత్ బీబీ) చాలా అందమైన మహిళ, సియాల్ తెగకు చెందిన సంపన్న కుటుంబంలో
జన్మించింది,
జాట్ వంశానికి
చెందిన ధీడో రంఝా నలుగురు సోదరులలో చిన్నవాడు, పంజాబ్ లోని చీనాబ్ నది ఒడ్డున ఉన్న తఖ్త్
హజారా గ్రామంలో నివసిస్తున్నాడు.. తన తండ్రికి ఇష్టమైన కుమారుడు కావడంతో, రంఝా తన సోదరుల మాదిరిగా కస్టపడి వ్యవసాయం చేయకుండా
వేణువు ('వాంజ్లీ'/ 'బన్సూరి') వాయిస్తూ హాయిగా జీవితాన్ని గడుపుతాడు. రంఝా తండ్రి మౌజు చౌదరి మరణించిన తరువాత, తన సోదరులతో భూమి విషయంలో గొడవపడి, తన ఇంటిని విడిచి రంఝా వెళ్లిపోతాడు.
వారిస్ షా ఇతిహాసం వెర్షన్ లో, రంఝా సోదరుల భార్యలు అతనికి ఆహారాన్ని
వడ్డించడానికి నిరాకరించినందున ఇంటిని విడిచిపెడతాడు. చివరికి రంఝా, హీర్
గ్రామానికి చేరుకుని హీర్ తో ప్రేమలో పడతాడు. హీర్ తండ్రి రంఝాకు తన
పశువులను మేపే పనిని ఇస్తాడు. రంఝా రోజూ పని తర్వాత పొలాల్లో తన పిల్లనగ్రోవి
వాయిస్తాడు, హీర్ ఆ సంగీతానికి
ముగ్ధురాలై చివరికి రంఝా తో ప్రేమలో పడుతుంది. వారు చాలా సంవత్సరాలు రహస్యంగా
కలుసుకుంటారు, హీర్ యొక్క అసూయపడే మామ
కైదో, మరియు ఆమె తల్లిదండ్రులు
చుచక్, మల్కీలకు హీర-రంఝా దొరికిపోతారు. హీర్,
కుటుంబం మరియు స్థానిక మత గురువు (మౌల్వి) బలవంతం మీద, ఖేరా వంశానికి చెందిన సైదా ఖేరా అనే మరో వ్యక్తిని పెళ్లి
చేసుకోవలసి వస్తుంది.
హీర్ పెళ్లి తో రంఝా గుండె పగిలిపోయింది. రంఝా ఒంటరిగా పల్లెటూళ్ళలో తిరుగుతూ, చివరికి ఒక జోగి (సన్యాసి)ని కలుస్తాడు. తిల్లా జోగియన్ ("సన్యాసుల కొండ") వద్ద జోగిల కంఫాత (గుచ్చిన చెవి pierced ear)
శాఖ స్థాపకుడు గోరఖ్ నాథ్ ను కలిసిన తరువాత, రంఝా స్వయంగా జోగి అవుతాడు, తన చెవులను కుట్టిoచుకొని భౌతిక ప్రపంచాన్ని త్యజిస్తాడు. భగవంతుని నామాన్ని జపిస్తూ, రంఝా పంజాబ్ అంతటా తిరుగుతాడు, చివరికి హీర్ ఇప్పుడు నివసిస్తున్న
గ్రామాన్ని కనుగొంటాడు.
ఇద్దరూ హీర్ గ్రామానికి తిరిగి వస్తారు, అక్కడ హీర్ తల్లిదండ్రులు వారి వివాహానికి
అంగీకరిస్తారు -
అయినప్పటికీ కథ యొక్క
కొన్ని వెర్షన్లు తల్లిదండ్రుల అంగీకారం కేవలం మోసం మాత్రమే అని పేర్కొన్నాయి. పెళ్లి రోజున, మామ కైడో, హీర్ ను శిక్షించడానికి, హీర్, రంఝాల వివాహం
జరగకుండా ఉండటానికి హీర్ ఆహారంలో విషం కలుపుతాడు. ఈ వార్త విన్న రంఝా, హీర్
కు సహాయం చేయడానికి పరుగు పరుగున వస్తాడు, కానీ అప్పటికే చాలా ఆలస్యం అవుతుంది, హీర్ విషం
తిని మరణించింది దీంతో మరోసారి గుండె పగిలిన రంఝా మిగిలిన విషపూరితమైన ఆహారాన్ని తిని హీర్ పక్కనే
మరణిస్తాడు.
హీర్, రంఝా లను హీర్ స్వస్థలం ఝాంగ్ లో ఖననం చేశారు. ప్రేమించిన జంటలు, ఇతరులు తరచుగా వారి సమాధిని సందర్శిస్తారు
వారసత్వం, ప్రభావంLegacy and Influence
లైలా మజ్ను, ససుయి పున్హున్Sassui Punnhun వంటి కథలతో పాటు విషాద ప్రేమకథల కిస్సా
శైలిలో హీర్ రంఝా కూడా ఉంది.
హీర్ రంఝా ప్రేమ కథాంశం కుటుంబ సభ్యులచే వ్యతిరేకించబడి ఇద్దరు ప్రేమికులు మరణించడంతో ముగుస్తుంది కాబట్టి, ఈ కథను తరచుగా షేక్స్పియర్ నాటకం రోమియో అండ్ జూలియట్ తో పోలుస్తారు
చలన చిత్రములు, టీవీ సీరియల్స్ :
·
హీర్ రంఝా ప్రేమ కథాంశం తో 1928 నుంచి నేటి వరకు అనేక చలన చిత్రములు రుపొందిoచబడినవి.
· 2013లో, 'హీర్ రంఝా' అనే టెలివిజన్ సీరియల్ PTV
హోమ్‌లో
ప్రసారమైంది.
· హీర్ రంఝా అనేది 2020 నాటి ఒక భారతీయ పంజాబీ భాషా చారిత్రక నాటక టెలివిజన్ ధారావాహిక, ఇది జీ పంజాబీలో ప్రసారమైంది మరియు హీర్, రంఝా జానపద కథ ఆధారంగా రూపొందించబడింది
సంగీతంలో In Music
·
బాలీ జగ్‌పాల్ అనే బ్రిటిష్ సంగీతకారుడు హీర్ రంఝా కథకు అంకితం చేస్తూ "రంఝా" అనే
పాటను రచించారు.
· బ్రిటిష్ సంగీతకారుడు పంజాబీ MC తన 2003 పాట జోగిలో హీర్ మరియు రంఝా కథను
ప్రస్తావించారు. దీనిని శాస్త్రీయ/సాంప్రదాయ కళాకారుడు గులాం అలీతో సహా వివిధ గాయకులు
పాడారు.
· ఉస్తాద్ నుస్రత్ ఫతే అలీ ఖాన్ తన ఖవ్వాలీ
ఖూనీ అఖియాన్‌లో సస్సూయి(-పున్హున్) మరియు సోహ్ని (-మహివాల్) లతో పాటు హీర్‌ను
ప్రస్తావించారు; ఈ జానపద
ప్రేమికుల కథలు దేవునితో భక్తుడి సంబంధానికి ఉపమానాలుగా మారాయి — నిజమైన ప్రేమ సంపూర్ణమైనది, ప్రమాదకరమైనది మరియు తరచుగా ప్రాణాంతకమైనది, కానీ అది ఐక్యతకు ఏకైక మార్గం అని
చూపిస్తుంది.
· క్వీన్ సినిమాలోని "రంఝా", రావణ్ సినిమాలోని "రంఝా రంఝా"
మరియు బార్ బార్ దేఖో సినిమాలోని "దరియా" వంటి ప్రసిద్ధ బాలీవుడ్ పాటలలో
హీర్, రంఝా కథ ప్రస్తావించబడింది.
·
తమాషా సినిమాలో (2015) హీర్, రంఝా ప్రేమకథను ప్రస్తావిస్తుంది మరియు హీర్
పేరుతో ప్రారంభమయ్యే ఒక పాటను కలిగి ఉంది.
· కుల్దీప్ మానక్ తన 2007 పాట రంఝా జోగి హోయాలో
హీర్, రంఝా కథ గురించి పాడారు.
· షఫ్కత్ అమానత్ అలీ యొక్క తొలి సోలో ఆల్బమ్, తబీర్ (2008)లోని ఖైరేయాన్ దే నాల్ పాట హీర్
రంఝా కథను చెబుతుంది.
· 2012 హిందీ చిత్రం జబ్ తక్ హై జాన్ లోని ఒక
పాటకు "హీర్" అని పేరు పెట్టారు.
· 2018 హిందీ చిత్రం రేస్ 3లో
"హీరియే" అనే పాట ఉంది, ఇది హీర్ మరియు రంఝాలను సూచిస్తుంది.
· 2020లో, ప్రముఖ భారతీయ యూట్యూబర్ భువన్ బామ్
"హీర్ రంఝా" పాటను రాసి పాడారు. ఈ పాట 10 మిలియన్లకు పైగా వీక్షణలను
పొందింది.
· రాఫ్ సపెర్రా యొక్క 2023 సింగిల్
"రంఝా"లో, హీర్‌కు వివాహం
జరిగిన తర్వాత మరియు రంఝా జోగిగా మారిన తర్వాత, అతని తిరిగి రాక కోసం హీర్ పడే విరహ వేదన పాదబడింది..
No comments:
Post a Comment