7 April 2016

పనామా పేపర్స్



విదేశీ కంపెనీలు  స్థాపించి తద్వారా పన్నులు ఎగ్గొట్టి లక్షల కోట్ల రూపాయలను అక్రమంగా దాచుకుంటున్న ప్రపంచ ప్రముఖుల వివరాలతో కూడిన రహస్య పత్రాలు పనామా పేపర్స్ పేరుతో వేలుబడినవి. ప్రపంచంలో వందలాది నల్లధనం అక్రమార్కుల బాగోతాలు పనామా పేపర్స్‌ తో బయట పడ్డాయి. అధికార దుర్వినియోగం, అక్రమ లావాదేవీలు, పన్ను ఎగవేతకు పాల్పడి కోట్లకొద్ది ప్రజాధనాన్ని పరాయి దేశాల్లో దాచిపెట్టిన నల్ల కుబేరుల తతంగాన్ని బట్టబయలు చేశాయి. పలువురు ప్రపంచ రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖుల గుట్టు   రట్టైనది.
    
నల్లడబ్బుకు స్వర్గధామమైన పనామాలోని మొసాక్‌ ఫొన్సెకాకు చెందిన కోటి 15 లక్షల పత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. జర్మనీకి చెందిన 'సుడియుషె జీతంగ్‌'పత్రిక, ఇంటర్నేషనల్‌ జర్నలిస్ట్స్‌ కన్సార్టియం (ఐసీఐజే)లు గత 40 ఏళ్ల వ్యవధిలో జరిగిన ఆర్థిక నేరాలకు సంబంధించి దాదాపు కోటి 15 లక్షల రహస్య పత్రాలను వెలికితీసి ప్రపంచానికి తెలియజేసినవి. ఇప్పుడు వెలువరించిన పత్రాల పరిమాణం 2.6టీబీ (టెరాబైట్స్‌). పరిమాణం పరంగా పనామా పేపర్స్-11.5 మిలియన్ పత్రాలు చరిత్రలో అతిపెద్ద అంతర్గత  సమాచారం లీక్  మరియు  వాటి వెల్లడి అత్యంత భారి పేలుడు తో సమానమని కన్సార్టియం వెల్లడించినది. 

గతంలో వెల్లడించిన రహస్య పత్రాలకంటే ఇది ఎన్నో రెట్లు అధికం. వెలికితీసిన  పత్రాల సైజు విషయంలోనూ ఈ కుంభకోణం సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో విడుదలైన ప్రముక లీకుల పరిమాణం చూస్తే
* 2010లో వికీలీక్స్‌ బహిర్గతం చేసిన రహస్య పత్రాల సైజు 1.7 జీబీ
* 2013లో బోగస్‌ సంస్థల గురించి విడుదల చేసిన నివేదిక సైజు 260 జీబీ
* 2014లో లక్సెంబర్గ్‌ పత్రాల లీక్‌ సైజు 4 జీబీ
* 2015లో వెలువరించిన పత్రాల పరిమాణం 3.3జీబీ

భారీ మొత్తంలో లభించిన రహస్య పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే బయటికి విడుదల చేశారట. అందుకు వివిధ దేశాలకు చెందిన 100 మీడియా సంస్థల నుంచి 370 మంది ప్రత్యేక రిపోర్టర్లు పనిచేశారు.
పనామా పేపర్స్ వెల్లడి పై  పలు దేశాల్లో ప్రకంపనలు పుడుతున్నాయి. ICIJ ప్రకారం పనామా పేపర్స్ లీక్ 12 ప్రస్తుత మరియు మాజీ ప్రపంచ నాయకుల - పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కుటుంబ సభ్యుల తో సహా  మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క సహచరుల, ఐస్-లాండ్ ప్రధాని -ఆఫ్ షోర్ హోల్డింగ్స్ బహిర్గతం చేసినవి.

'పనామా పేపర్స్' ప్రచురించిన ఆఫ్షోర్ (off shore) ఒప్పందాల్లో అనేక మంది ప్రపంచ రాజకీయ నాయకులు ఉన్నారు. పనామా పేపర్స్ ఐస్లాండ్ మరియు పాకిస్తాన్, సౌదీ అరేబియా రాజు మరియు అజర్బైజాన్ అధ్యక్షుడి  పిల్లలు  నియంత్రణలో ఉన్న  విదేశీ కంపెనీలను అవి  బహిర్గతం చేసినవి. అందులో అమెరికా ప్రభుత్వం బ్లాక్ లిస్టు చేసిన కనీసం 33 మంది వ్యక్తుల మరియు సంస్థలు పేర్లు  కుడా ఉన్నాయి. వారు మెక్సికన్ డ్రగ్  లార్డ్స్, హిజ్బుల్లాహ్ లేదా ఉత్తర కొరియా మరియు ఇరాన్ వంటి  రోగ్ దేశాలు మరియు  తీవ్రవాద సంస్థలతో వ్యాపారo చేసిన సాక్ష్యం వెల్లడైంది అని డేటా ప్రచురించిన  ICIJ కనసార్టియం అన్నది.

పనామా పేపర్స్ లో చైనా ప్రెసిడెంట్, పాలిట్ బ్యూరో లోని ఎనిమిది మంది ప్రస్తుత లేదా పూర్వ సబ్యుల కుటుంభ సబ్యుల పేర్లు కుడా చోటు చేసుకొన్నవి. అర్జెంటైనా అద్యక్షుడు అతని తండ్రి సోదరుని పేర్లు ప్రముఖ ఫుట్-బాల్ క్రీడాకారుడు మెస్సి, జాకి చాన్ మరియు  ఉక్రేరియాన్ అధ్యక్షుని పేర్లు ఇందులో కలవు. బ్రిటిష్ ప్రధాని కామరూన్ తండ్రి పేరు కుడా ఈ జాబితా లో చోటు చేసుకోంది.

పనామా పేపర్స్ లో   ఇంగ్లాండ్ యొక్క అత్యంత ప్రసిద్ధి చెందన బంగారు దోపిడీ, బ్రెజిల్ లో నడుస్తున్న రాజకీయ నగదు బదిలీ వ్యవహారం మరియు అంతర్జాతీయ సాకర్ ను  పాలించే FIFA ప్రధాన కుంభకోణాలను  గురించిన వివరాలు ఉన్నాయి.

అంతేకాదు పనామా పేపర్స్  ప్రపంచంలోని 140 ఇతర రాజకీయ నాయుకులు, ప్రజా అధికారులు  దాచిన ఆర్ధిక లావాదేవీల యొక్క వివరాలు  మరియు న్యాయ సంస్థలు  మరియు పెద్ద బ్యాంకులు ఒక గ్లోబల్ పరిశ్రమగా ఆర్ధిక అవకతవకలకు పాల్పడే వారికి ఏవిధంగా సహాయం చేస్తున్నాయి అనేది మరియు మాదక ద్రవ్యాలవిక్రేతలు  అలాగే బిలియనీర్లు మరియు ప్రముఖు క్రీడకారులు , సెలబ్రటిల  రహస్యంగా ఆర్ధిక లావాదేవిల వివరాలు అందిస్తున్నవి.  

మొసాక్ ఫోన్సెకా అనే కంపెనీను రామన్‌పోన్సెకా, జర్మన్ జాతీయుడైన జూర్గెన్ మొసాక్ దీనిని ఉమ్మడిగా ప్రారంభించారు. ఈ తరహా సేవలందించే కంపెనీలు చాలానే ఉన్నప్పటికీ పెద్ద కంపెనీగా దీనికి గుర్తింపు ఉంది. ఫోన్సెకా వ్యవహారాలన్నీ అత్యంత రహస్యం. పనామాలోని వాణిజ్య ప్రాంతంలో ఓ సాదాసీదా భవనం దీని కేంద్ర కార్యాలయం. రహస్య ఖాతాలకు నెలవైన దేశాల్లో దీని కార్యకలాపాలు సాగుతాయి. అన్నిటిపైనా ముసుగు వేయడం ఈ కంపెనీ ప్రత్యేకత.
విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న బడాబాబులకు సంబంధించిన సమాచారం పనామా కేంద్రంగా పనిచేసే న్యాయసేవల సంస్థ మొసాక్ ఫోన్సెకా నుంచి బయటకు పొక్కింది. దీంతో వీటిని పనామా పేపర్స్ అని పిలుస్తున్నారు. 500కు పైగా బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలు ఈ కంపెనీ సేవలను వినియోగించుకున్నాయి. పన్ను ఎగవేయడం, నల్లధనాన్ని నకిలీ కంపెనీల ద్వారా తెల్లధనంగా మార్చుకోవడం, భద్రంగా దాచుకోవడం వంటి విషయాల్లో ఈ న్యాయసంస్థ సేవలు అందిస్తుంది. మౌలికంగా ఇది పనామా కంపెనీ అయినప్పటికీ 42 దేశాల్లో దీనికి శాఖలున్నాయి. ముఖ్యంగా పన్ను ఎగవేతదారులను ఆకర్షించే స్విట్జర్లాండ్, సైప్రస్, బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్ వంటి దేశాల్లో ఇది తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
మొసాక్ ఫోన్సెకా కంపెనీ డాటాబేస్ నుంచి ఈ సమాచారాన్ని ఆగంతకుడు బయటకు లాగాడు.ఎవరో ఓ లోపలిమనిషి ఈ పత్రాల చెదల పుట్టను పగులగొట్టి ఉంటాడని భావిస్తున్నారు. ఫోన్సెకా సంస్థ సర్వర్‌లో మూలుగుతున్న ఈ పత్రాల గుట్టను ఓ అజ్ఞాతవ్యక్తి జూడాయిచ్ జైటుంగ్ అనే జర్మనీ పత్రికకు అందజేస్తే అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల కన్సార్షియం (ఐసీఐజే) ప్రపంచ వ్యాప్తంగా మీడియాకు వీటిని పంపిణీ చేసింది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విదేశీ ఖాతాల్లో డబ్బులు దాచుకున్న పెద్దల పేర్లు వీటిద్వారా బయటకు వచ్చాయి.
 పనామా పేపర్స్  లో అనేక మంది భారతీయులు ఉన్నారు. 2004 లో భారతదేశం  సరళీకృత బదలాయింపు పథకం (Liberalised Remittance Scheme) క్రింద చట్టబద్ధంగా విదేశాలలో ఉన్న సంస్థలలో పెట్టుబడులును పెట్టడానికి మొదట కంపేననీలను ఆ తరువాత వ్యక్తులను అనుమతిoచినది.
భారత్ లో 500 మంది పేర్లను పనామా పేపర్స్ బట్టబయలు చేయగా అందులో అమితాబ్, ఐశ్వర్యారాయ్ పేర్లు ఉన్నాయి. ఇంకా  ఇందులో ఇండియా బుల్స్ అధినేత   సమీర్ గెహ్లాట్, బహామాస్, న్యూజెర్సీ మరియు యునైటెడ్ కింగ్డమ్ లో ఆస్తులు కలిగి ఉన్న౦దుకు మరియు డిఎల్ఎఫ్ కు చెందిన కే.పీ. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లో నమోదు అయిన కంపనిల గురించి, వినోద్ అదానీ పారిశ్రామికవేత్త గౌతం అదానీ యొక్క అన్నయ్య, లోక్  సత్తా పార్టీ అనురాగ్ కేజ్రీవాల్,  పశ్చిమబెంగాల్, రాజకీయ వేత్త శిశిర్ బజోరియా కూడా పన్నురహిత స్వర్గాలైన(tax heavens) ప్రాంతాలలో   కంపెనీలు ఏర్పాటు చేసారని ఈ పేపర్స్ ద్వారా వెల్లడైనది. గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఇక్బాల్ మిర్చి కుటుంభ సబ్యులు సైప్రస్,టర్కీ,మొరాకో, స్పెయిన్ లో ఆఫ్-షోర్ రూట్ ద్వార ఆస్తులు కొన్నారని వెల్లడైనది.

ఇండియన్ ఎక్ష్ప్రెస్స్(express) పత్రిక మరియు అనేక ప్రపంచ వార్తాపత్రికలు  దాదాపు ఎనిమిది నెలల పాటు పరిశోధనలు జరిపినారు.  ఇండియన్  ఎక్స్ప్రెస్ పత్రిక సంప్రదించిన అనేక మంది  వ్యక్తులు ఈ నివేదికను కొట్టివెయగా  ఇతరులు   దేశంలోని చట్టాలకు లోబడి   పని చేసినట్టు  చెప్పారు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ పనామా కంపెనీల్లో డైరెక్టర్లని పనామా పేపర్స్ పేర్కొనగా దానిపై స్పందించిన అమితాబ్ తన పేరు తప్పుగా ఉదహరింప బడినది(misused) అని పేర్కొనగా, ఐశ్వర్య రాయ్ మీడియా సలహాదారు సమాచారాన్ని అసత్యమని చెప్పారు.
తొలి జాబితాలో పలువురు దేశాధినేతలు, మాజీ ప్రధానులు, సెలబ్రిటీల పేర్లు వెల్లడి కాగా, వారిలో అత్యధికులు తమకు నల్లధనంతో సంబంధం లేదని వ్యాఖ్యానించినారు.
ప్రపంచ దేశాల్లో కలకలం రేపిన 'పనామా పేపర్స్' మలి జాబితా కుడా విడుదలైంది. 'పనామా పేపర్స్' మలి జాబితా లో ఉన్న భారతీయుల్లో మాజీ క్రికెటర్ అశోక్ మల్హోత్రా, క్రాంప్టన్ గ్రీవ్స్ చైర్మన్ గౌతమ్ థాపర్, కరణ్ థాపర్ మొహ్రాసన్స్ జ్యూయెలర్స్ అధినేత అశ్వనీ కుమార్ గౌతమ్ సీంగల్, మధ్యప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి ప్రకాశ్ సంఖ్లా, పుణెలోని సవా హెల్త్‌కేర్‌ సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న వినోద్‌ రామచంద్ర జాదవ్, రంజీవ్‌ దహుజా, కపిల్‌ సైన్‌ గోయల్‌‌, వివేక్ జైన్‌, సతీష్ గోవింద్ సంతని, విశాల బహదూర్, హరీష్ మొహనాని తదితరుల పేర్లున్నాయి.

నల్లధన కుబేరుల 3వ జాబితాలో గతం లో రాడియా టేప్స్ తో ప్రసిద్ది చెందిన నీరా రాడియా  హైదరాబాద్ కు మోటూరి శ్రీనివాస ప్రసాద్‌, వోలం భాస్కరరావు, భావనాశి జయకుమార్‌ పేర్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి.

పనామా పేపర్స్ జాబితాలో తాజాగా బాలీవుడ్ జంట హీరో సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ పేర్లు దర్సనం ఇవ్వడం మరో సంచలనానికి దారితీసింది. వీరితోపాటు, కరీనా సోదరి కరిష్మా కపూర్,  పారిశ్రామికవేత్త, వీడియో కాన్ వేణుగోపాల్ ధూత్‌కు చెందిన సంస్థలు, పుణే కు చెందిన రియల్లర్ చోర్దియా కుటుంబం ఓ విదేశీ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడైంది. ఈ జాబితాలో మరో పది పేర్లు దర్శనమిచ్చాయి. ఢిల్లీకి చెందిన టైర్ డీలర్, ఒక దుకాణం యజమాని, ఒక ఆస్ట్రేలియన్ గని బిలియనీర్ కుమార్తె, ఒక వస్త్రాల ఎగుమతిదారుడు, ఇంజనీరింగ్ కంపెనీ యజమాని, లోహాలు సంస్థ డైరెక్టర్లు,  ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నారు.
పనామా పత్రాలపై ప్రముఖుల స్పందన:
ఫ్రాంస్ అద్యక్షుడు హోలండే:
ప్రపంచంలోనే అతిపెద్ద స్కాంగా వెలుగులోకి వచ్చిన పనామా పేపర్స్ ఘటనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే స్పందించారు. పనామా పేపర్స్ ఘటనపై తమ ప్రభుత్వం తప్పక దర్యాప్తును ముమ్మరం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కేసులో చట్టపరమైన విచారణను చేపడతామని వెల్లడించారు. ఇంత పెద్ద కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన వారికి ఈ సందర్భంగా హోలాండే కృతజ్ఞతలు తెలిపారు. పన్ను ఎగవేతదారులకు రక్షణ కల్పించే దేశాల జాబితాలో పనామాను మళ్లీ చేర్చక తప్పదని ఫ్రాన్స్ ప్రకటించింది. 
పనామా పేపర్స్' పై స్పందించిన అరుణ్ జైట్లీ
నల్లధనం కుబేరుల వివరాలను వెల్లడిచేసిన పనామా పేపర్స్ పై   ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  ఈ వ్యవహారంపై దర్యాప్తు  జరిపించాల్సింది  కోరారని తెలిపారు.  
అక్రమ ఖాతాదారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదని , కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  ఈ కేసులను  పర్యవేక్షించేందుకు మల్టీ ఏజెన్సీ గ్రూప్ ను    రూపిందించనట్టు ఆర్ధిక  మంత్రి తెలిపారు. ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ), ఫైనాన్షియల్ ఇటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ) వంటి విభాగాలు ఇందులో ఉంటాయని వివరించారు. ఆర్బీఐకి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో ఇది పనిచేస్తుందన్నారు.
RBI గవర్నర్ రఘురామ్ రాజన్:  ప్రతి భారతీయుడు చట్టబద్ధంగా ఒక సంవత్సరం కాల వ్యవధిలో సుమారు రూ.1.60 కోట్లు విదేశాలకు పంపించవచ్చని రఘురామ్ రాజన్ చెప్పారు. పనామా పేపర్స్ నేపథ్యంలోఅది వెల్లడించిన 500 మందిలో ఎందరు చట్టవిరుద్ధంగా నియమిత మొత్తాలకు మించిన పెట్టుబడులు పెట్టానే విషయమై విచారణలే తేలుతుందన్నారు. పనామా జాబితాపై తొందరపాటు తగదని రిజర్వ్‌ బ్యాంక్ అధికారులు హెచ్చరించారు
'పనామా పేపర్స్' పైన లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ స్పందించారు. విదేశీ రహస్య ఖాతాల్లో భారతీయులకు 700 బిలియన్‌ డాలర్ల పై చిలుకు డబ్బు ఉందని, పనామాలోని మొసాక్‌ ఫొన్సెకా నుంచి ఇప్పుడు బయటపడ్డ బ్లాక్ మనీ కేవలం కొద్దిగా మాత్రమేనని అన్నారు. ఇక మీద దేశం నుంచి డబ్బు చట్ట విరుద్ధంగా బయటికి పోకుండా ఉండాలన్నారు. విదేశాలలో మూలుగుతున్న 700 బిలియన్‌ డాలర్ల బ్లాక్ మనీతో పాటు మన దేశంలో 20 వేల టన్నుల బంగారం రూపంలో ధనం వృథాగా పడి ఉందని చెప్పారు. 
పాకిస్తాన్ లో అయితే, నవాజ్ షరీఫ్ కుమారుడు హుస్సేన్ దేశం యొక్క అతిపెద్ద ప్రైవేటు ప్రసారకులు జియో టి.వి. తో మాట్లాడుతూ తన కుటుంబం తప్పూ చేయలేదని చెప్పారు. ప్రధాని నవాజ్ షరీఫ్ పనామా పేపర్స్ వెల్లడించిన విషయాలపై విచారించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసారు.
కాని ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ షరిఫ్ విదేశాలలో దాచుకొన్న దానం బహిర్గతం అయినది అతని పై చర్య తీసుకోవాలన్నారు.
రష్యా అద్యక్షుడు పుతిన్‌లాంటి కొందరి పేర్లన్లు ఈ జాబితాలో నేరుగా ప్రస్తావించలేదు. ఆయన అనుచరులు రహస్యంగా 200 కోట్ల అమెరికా డాలర్లను విదేశీ ఖాతాలకు తరలించారని పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు బూటకపు కంపెనీలను వినియోగించారని తెలుస్తున్నది. రష్యాలో ప్రభుత్వ రంగ మీడియా సంస్థలు ఈ అంశంపై మౌనంగా ఉన్నాయి. పుతిన్ పరిపాలనను, రష్యా ను అస్థిరం చేయడానికి పన్నిన పన్నాగం గా పుతిన్ సమర్ధకులు దీనిని పేర్కొన్నారు.

చైనా పేపర్స్ దీనిపై స్పందించ లేదు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కుటుంబ సభ్యులకు కూడా విదేశీ ఖాతాలతో సంబంధం ఉన్నట్టు బయటపడింది.సోషల్ మీడియా పై సెన్సార్ విధించారు. ప్రబుత్వ వార్త సాధనాలు పనామా పేపర్స్  లీక్ నాన్-వెస్ట్ దేశాల నాయకుల పై వెస్ట్ దేశాల పేపర్స్ సాగిస్తున్న విచక్షణ తో కూడిన అసత్య ప్రచారం  అని పేర్కొన్నాయి.

సిరియా అధ్యక్షుడు అసాద్ యొక్క  ఇద్దరు కజిన్స్, ఈజిప్ట్ మాజీ అద్యక్షుడు హోశ్ని ముబారక్ కుమారుని పేరు మరియు లిబియా కల్నల్ గడాఫీ పేరు ఇందులో ఉంది.

ఉక్రెయిన్ అద్యక్షుడు చట్టపరంగా తానూ ఎలాంటి తప్పు చేయలేదని అన్నాడు.

వైట్ హౌస్ పనామా పేపర్స్ పై స్పందిస్తూ  అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలలో పారదర్సకత (ransparency) ఉండాలని పేర్కొన్నది.అంతకు మించి వ్యాఖ్యానించడానికి నిరాకరించినది. అద్యక్షుడు ఒబామా ట్యాక్స్ ఎగవేత ప్రధాన సమస్య అని కాంగ్రెస్స్ అమెరికన్ కంపెనీలు ట్యాక్స్ ఎగవేయకుండా చర్యలు గైకోనాలని కోరినాడు. 

ఐస్-లాండ్ ప్రధాని రాజీనామా చేసినాడు.

బ్రిటన్ లో ప్రధాని కామెరూన్ పై వత్తిడి అధికమైనది,ప్రతిపక్ష లేబరు  పార్టీ టాక్స్ హేవెంస్ (tax heavns) ను నియంత్రిచమని అధిక ధనవంతులు  పాల్పడుతున్న టాక్స్ఎగవేతను అరికట్టమని కోరినది.

మోస్సాక్ ఫోన్సెకా సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన క్లైంట్స్ కోసం 240000 ఆఫ్-షోర్ కంపనీస్ ఏర్పాటు చేసింది. తన 40 ఏళ్ల చరిత్ర లో ఎప్పుడు దాని ఆర్ధిక లావాదేవిల మీద విచారణ జరగలేదని పేర్కొన్నది. మోస్సాక్ ఫోన్సెకా సంస్థ తానూ ఎలాంటి  తప్పుచేయలేదు అని పేర్కొన్నది.

న్యాయవాద సంస్థ ఫోన్సెకా ప్రతినిధులు మాత్రం ఈ లీకులపై మండిపడుతున్నారు. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన రామన్ ఫోన్సెకా ఇలా పత్రాలను లీకు చేయడం నేరమని, ఇది చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు. కంపెనీలను ఆకర్షించడంలో పనామాకు గల పెద్దపేరును చూసి కొన్నిదేశాలు ఓర్వలేకపోతున్నాయని ఫోన్సెకా అన్నారు. సంస్థ అద్యక్షుడు రామన్ ఫోన్సెకా  తమ డేటా బేస్ హాకింగ్ కు గురి అయినదని పేర్కొన్నాడు. దీనికి సంబంధించి పనామా  దేశ అటార్నీ జనరల్ దగ్గర ఫిర్యాదు నమోదు చేశారు. పనామా పేపర్స్ లీక్ ప్రైవసీ మీదా దాడి గా, పనామా ప్రభుత్వం పై జరిపిన దాడిగా  పేర్కొన్నారు.

పనామా దేశ ప్రబుత్వం తమ భూభాగంపై లోపాయికారీ ఒప్పందాలను ఎంతమాత్రం సమర్థించమని, చట్టపరమైన దర్యాప్తుల్లో పూర్తి సహకారం అందిస్తామని పనామా ప్రభుత్వం ప్రకటించింది. ఆఫ్‌షోర్ కంపెనీల పారదర్శకతను పెంచేందుకు పనామా ప్రభుత్వం అంతర్జాతీయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనుంది. ఆర్థిక నేరాలపై విచారణ చేపట్టేందుకు ఆయా దేశాలతో పనామా పనిచేస్తుందని ఆ దేశాధ్యక్షుడు జువాన్ కార్లోస్ వరేలా స్పష్టం చేశారు. పనామా పత్రాల అంశాన్ని పరిశీలించేందుకు వ్యక్తిగత కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కార్లోస్ స్పష్టం చేశారు. ఆ దేశ విదేశాంగ శాఖ ఆ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. అందులో స్వదేశీ, విదేశీ నిపుణులు సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఆఫ్‌షోర్ కంపెనీల పనితీరును కమిటీ పరిశీలిస్తుందన్నారు. ఆర్థిక, న్యాయ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు కమిటీ నియమావళిని సూచిస్తుందన్నారు. సంపన్న దేశాల మీడియా సంస్థలు తమ దేశంపై దాడి చేస్తున్నాయని కార్లోస్ అభిప్రాయపడ్డారు.

గుట్టుగా సాగే నకిలీ వ్యాపారాలకు పనామా పట్టుగొమ్మగా మారిందంటూ 34 దేశాల ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) చేసిన తీవ్ర ఆరోపణలను పనామా ఖండించింది. తనమీద అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారంటూ పనామా నిరసన తెలిపింది

మరోవైపు పలు దేశాలు ఫ్రాన్స్, న్యుజిలాండ్, ఆస్ట్రియా, స్వీడన్, నేదర్లండ్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా,   అమెరికా దేశాలు  ఈ ఆరోపణలపై స్వీయ విచారణలకు ఆదేశాలు జారీ చేశాయి.,.  





. 




4 April 2016

యంగర్ మ్యానేజ్మెంట్( Anger Management)లేదా కోపాన్ని నిగ్రహించడం- నిర్వహణ పద్దతులు.


కోప నిర్వహణ లేదా యంగర్ మ్యానేజ్మెంట్(Anger Management) అనగా  కోపాన్ని నియంత్రిచుటకు అవసరమైన  నిగ్రహాన్ని పాటించడం లో శిక్షణ మరియు ప్రశాంతత సాధన లో  నైపుణ్య౦ పొందుట  గా చెప్పవచ్చును. కోపం సాధారణంగా  చిరాకు వలన మరియు  ముఖ్యమైనది పొందటం లో వైఫల్యం వలన  ఏర్పడును. కోపం అంతర్లీన భయం లేదా చేతకానితనం వంటి  భావాలకు  ఒక నిరోధ(defencise)   స్పందనగా  ఉంటుంది. కోపం నిర్వహణ కార్యక్రమాలను  తార్కికంగా విశ్లేషించ వచ్చును. గుర్తించదగిన కారణం వలన పొందిన ఒక ప్రేరణ గా  కోపం ను భావిoచ వచ్చును.

 కోప నిర్వహణ సిద్ధాంతం ప్రాథమికంగా మనిషి కోపానికి మూలకారణాలు గుర్తించడానికి మరియు వాటిని అతని జీవితం నుండి తొలగించడానికి ప్రయత్నిస్తుంది.  కోపం పొందినప్పుడు మానవుడు  తన కోపం అధిగమించడానికి వివిధ చర్యలు తీసుకోoటాడు  మరియు అందులో  అతను విఫలమైతే అప్పుడు అతను  అనేక ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇస్లాం గట్టిగా తమ కోపం నియంత్రించుకోమని  ప్రజలను ప్రోత్సహిస్తుంది.  అల్లాహ్ దివ్య ఖురాన్ లో అంటాడు: “ కలిమిలో, లేమిలో, ఏ స్థితి లో ఉన్నా తమ సంపదను ఖర్చుచేసే వారు, కోపాన్ని దిగ మ్రింగుకొనే వారు,ఇతరుల తప్పులను క్షమించే వారు – ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్ కు ఎంతో ఇష్టం.” 3: 134. 

ఒక మనిషి ప్రవక్త (స) వద్దకు వచ్చి  "నాకు సలహా ఇవ్వండి." అని అడిగాడు. ప్రవక్త(స) అతనితో” కోపo పొందవద్దు” అన్నారు.  ఆ మనిషి పదేపదే అడిగిన ఆ ప్రశ్న కు సమాధానంగా ప్రవక్త(స) ప్రతిసారీ అదే జవాబి చ్చారు. (బుఖారి)

కోప నిర్వహణ లేదా యంగర్ మ్యానేజ్మెంట్
మొదటి దశ -కోపానికి కారణాలు:
ఇస్లాం అట్టడుగు స్థాయి నుండి ప్రతి సమస్యను  పరిష్కరించడానికి కృషిచేస్తుంది. కోపం పట్ల  కూడా ఇస్లాం అలాగే ప్రవర్తిస్తుంది. ఒక వ్యక్తి యొక్క కోపానికి ఉన్న కొన్ని   సాధారణ కారణాలు ఈ విధంగా వివరించ వచ్చు:
I. ఆహoకారం:
అల్లాహ్ దివ్య ఖురాన్ లో చెప్పారు "భూమి పై విర్రవీగుతూ నడవ కండి. మీరు భూమిని చిల్చను లేరు, పర్వతాల ఎత్తుకు చేరలేరు.” 17:37. ఇస్లాం మతం అహంకారం మరియు దురహంకారం నుండి నుండి ప్రజలను  నిషేధిస్తుంది. ఏదో ఒక దానిపై  అహంకారం కలిగి ఉన్నప్పుడు, మానవుడు చాలా వేగంగా కోపం పొందుటకు అవకాశం ఉంది అది అతని  పరిపూర్ణ అజ్ఞానం నకు కారణం అవుతుంది.

II. దురాశ
అల్లాహ్ దివ్య ఖురాన్ లో చెప్పారు "అల్లాహ్ తన అనుగ్రహాన్ని విరివిగా  ప్రసాదించినప్పటికి పిసినారితనం చూపే వారు, ఈ పిసినారితనం తమకు మేలైనదని భావించరాదు. కాదు, ఇది వారికొరకు ఎంతో హానికరమైనది. వారు తమ లోభత్వంతో కుడబెడుతూ ఉన్నదే ప్రళయం నాడు వారి పాలిట కంఠపాశం అవుతుంది. భూమ్యాకాశాల వారసత్వం అల్లాహ్ కే చెందుతుంది. మీరు ఏదైతే చేస్తారో అది అల్లాహ్ కు తెలుసు.” - 3: 180.
పై వాక్యాలు అత్యాశ నుండి ప్రజలను విముఖులను చేస్తుంది.   అత్యాస వ్యక్తి   కోరికలు పెంచుతుంది మరియు వ్యక్తుల అత్యాశ కు అంతం ఉండాలి. తాను కోరుకున్నది పొందలేన్నప్పుడు, అది కోపం కు దారితీస్తుంది.

III. అసూయ
ప్రవక్త ముహమ్మద్ (స)అన్నారు: "ప్రతి వ్యక్తి ఇతరుల పట్ల కోపం  తో ఉండరాదు మరియు అసూయా తో ఉండరాదు, ఇతరుల పట్ల మొఖం తిప్పుకోరాదు మరియు అల్లాహ్ యొక్క బానిసలు గా ఉండాలి అని  అన్నారు. మూడు రాత్రులు కంటేఎక్కువ  తన సోదరుడిని  త్వజించుట ఒక ముస్లిం వ్యక్తి కి హలాల్ కాదు. "-మాలిక్.
 ఇస్లాం మతం సామరస్యం మరియు బంధం మీద గొప్ప ప్రాముఖ్యత ఉంచుతుంది. చేదు భావాలు కోపం మరియు చివరికి సంబంధాల విచ్చిన్నానికి   దారితీయును.కాబట్టి మనస్సు లో అట్టి  ఘోరమైన భావాలు ఉoడకుండా  వాటిని నివారించుట  అవసరం.

IV. గూఢచర్యం మరియు అనుమానం:
“విశ్వాసులారా! అతిగా అనుమానించడం మాని వేయండి. కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయి. గుడాచారులుగా వ్యవరించకండి. మీలో ఎవరూ ఎవరిని పరోక్షంగా నిందించరాదు. మీలో ఎవరైనా మీ మృత సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతారా? చూడండి, మీరే స్వయంగా దీనిని అసహ్యించుకోంటారు. అల్లాహ్ కు బయపదండి. అల్లాహ్ అత్యధికంగా పశ్చాతాపాన్నిస్వికరించేవాడు, కరుణిoచేవాడు.”-దివ్య ఖురాన్ 49:12.
ఇతరులపై  గూఢచర్యం చేయుటవలన అతనికి వ్యక్తులను గురించిన చాలా నిజాలు తెలుస్తాయి దానితో అతడు వారి పట్ల వ్యతిరేక దృక్పదం ఏర్పరచు కొంటాడు అది చివరకు  కోపానికి  దారితీస్తుంది.

రెండోవ దశ -కోపాన్ని అధిగమించుట:
ప్రవక్త ముహమ్మద్ (స) ప్రకారం “కుస్తీ పోటిలో గెల్చిన వాడు బలవంతుడు కాదు, కోపాన్ని జయించినవాడు బలవంతుడు”. -బుఖారి మరియు ముస్లిం. ఈ  హదీసుద్వారా తనలోని ఆహాన్ని(కోపంను) జయించినవాడు బలవంతుడు అని తెలస్తుంది. ఇస్లాం కోపం నుండి  ప్రజలను  నిషేధిస్తుంది దానితో పాటు కోపం అధిగమించడానికి చర్యలు అందిస్తుంది. క్రింది  వివిధ పద్ధతుల ద్వారా కోపాన్ని జయించ వచ్చు:

I. క్షమించడం
సాత్వికత  మరియు ఓర్పు కోపంనకు  వ్యతిరేకం మరియు మానవుని  పరిపూర్ణ లక్షణాలు గా  భావించ వచ్చు. ప్రతీకారం తీర్చుకోనే  శక్తిని కలిగి ఉన్నాఒక వ్యక్తి ని మన్నించటం  మరియు అతని పట్ల దయ చూపటం మానవుని  పరిపూర్ణ లక్షణాలు గా చెప్పబడినవి. అల్లాహ్ ఖురాన్ లో చెప్పారు "ప్రవక్తా! మృదత్వం, మన్నింపుల వైఖరిని అవలంబించు. మంచిని ప్రబోదించు. మూర్ఖులతో వాదానికి దిగకు.” –దివ్య ఖురాన్ 7: 199.
ప్రవక్త ముహమ్మద్ (స) కూడా చెప్పారు "క్షమ ఒక వ్యక్తి యొక్క స్థితి ని లేవనెత్తుతుంది; మన్నించటం ద్వారా అల్లాహ్ మీమ్మలను గౌరవిస్తాడు. "
అల్లాహ్ దివ్య ఖురాన్ లో చెప్పారు " కోపాన్ని దిగ మ్రింగుకొనే వారు,ఇతరుల తప్పులను క్షమించే వారు – ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్ కు ఎంతో ఇష్టం.” 3:134.
ఒకసారి హజ్రత్  హసన్ పరిచారిక ఆయన మీద ఒక    వేడి గిన్నె సూప్ పోసింది. హజ్రత్ హసన్ కోపంతో ఆమెను  శిక్షించునని భావించి  ఆమె చాలా భయపడ్డది. ఆమె వెంటనే క్రింది  ఆయత్ చదివ సాగింది. "కోపం ను దిగమింగ్రిన వారు " హసన్ నవ్వి నేను కోపంతో లేను  అన్నారు. అప్పుడు ఆమె ఆయత్  యొక్క తదుపరి భాగం వల్లించసాగింది  " మరియు ప్రజలు పట్ల  క్షమాపణ భావం ." హసన్ ఆమెను  క్షమించినట్లు  చెప్పారు. అప్పుడు ఆమె ఆయత్ ను " ప్రదర్శించే వారి పట్ల అల్లాహ్  ఇష్టపడతారు." అని చెప్పి ముగించినది.  హసన్ ఆమెను క్షమించి బానిసత్వం నుండి ఆమెను విముక్తి చేసేను.
అందువలన, దివ్య ఖురాన్ తన కోపం నియంత్రించమని,   వ్యక్తిని  క్షమించమని తన భావోద్వేగాలను నియంత్రణలో  ఉంచాలని మనకు బోధిస్తోంది.

II.బహుమతి  గుర్తు పెట్టుకొని ఉండటం
అల్లాహ్ ఖురాన్ లో చెప్పారు " కోపాన్ని దిగ మ్రింగుకొనే వారు,ఇతరుల తప్పులను క్షమించే వారు – ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్ కు ఎంతో ఇష్టం.” 3:134.
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ (స) అన్నారు , "ఎవరైతే కోపాన్ని దిగమింగుతారో అతనిని అల్లాహ్ పునరుత్థాన దినమున సమస్త మానవజాతి  ముందు అతనిని పిలుస్తారు  మరియు అతను కోరుకుంటున్న హోర్-అల్-అయన్ (Hoor Al-Ayn) అతనికి ప్రసాదిస్తారు." - అబూ దావూద్.

కోపం సైతాను ప్రభావం నుండి వస్తుంది దానిని అణుచుట వలన  అల్లాహ్ నుండి అధిక ప్రతిఫలాలను స్వికరించ వచ్చు. ద్వేషం యొక్క నిరాశావాద మనోభావాలను నియంత్రించినవారు అల్లాహ్ కు   చాలా ప్రియమైన వారు. వారికి  స్వర్గం లో స్థానం దొరుకును అని అర్థం. అందువల్ల ఎవరికైనా బహుమతులుగా  సహనము, దయ మరియు క్షమాపణ మొదలగు సద్గుణాలు  వస్తే వాటిని గుర్తుంచుకోవాలి.
III. విన్నపం

అల్లాహ్ దివ్య ఖురాన్ లో చెప్పారు "ఒక వేళ ఎప్పుడైనా షైతాన్ నిన్ను ఉసిగోలిపితే అల్లాహ్ శరణు  వేడు. అయన అన్ని వినేవాడు. అన్ని తేలిసినవాడు.” 7:200.
ఒకసారి ప్రవక్త(స) కూర్చొని ఉండగా  ఇరువురు  పురుషులు ఒకరితో ఒకరు వాదన చేస్తున్నారు.  వారిలో ఒకరి  ముఖం ఎర్రబడి  మరియు అతని మెడ మీద సిరలను ఉబ్బినవి.  ప్రవక్త(స) నాకు అతను  చెప్పబోయే  పదం తెలుసు అన్నారు. అతను సైతాన్ నుండి అల్లాహ్ ను  శరణు కోరుకోవాలి  అనగా తన కోపం దూరంగా పెట్టాలి అన్నారు.

ఇస్లాం  శాంతి మరియు సామరస్యాన్ని ప్రబోదించే ధర్మం. దాని అనుచరులు దాని నిజమైన సారాంశం బోధించాలి.  ప్రకృతి ద్వారా  మానవ శాంతిని ప్రేమను కోరుకొంటాడు కాని  ఇప్పటికీ మనo ఇతరులు పట్ల  ద్వేషం మరియు కోపం కలిగి ఉన్నాము.ఇది షైతాన్ పని.  వ్యక్తి యొక్క ప్రత్యక్ష మరియు ప్రధాన  శత్రువు  సైతాన్ ఒకరి ఇష్టానికి వ్యతిరేకంగా వివిధ పరిస్థితులలో వివిధ రకాల సర్దుబాట్లు, నటించడం ప్రోత్సహిస్తుంది.

IV. వజూ
వజూ కోపానికి  వ్యతిరేకంగా ఒక కవచం లాగా ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ (స) “కోపం దెయ్యం నుండి వస్తుంది, దెయ్యం అగ్ని నుండి సృష్టించబడింది మరియు అగ్ని మాత్రమే నీరు ను ఆర్ప గలగదు.” అని అన్నారు. కాబట్టి  మీరు  కోపం రాగానే వజూ చేయాలి.

V. స్థానం మార్చడం
ప్రవక్త ముహమ్మద్ (స) "కోపం ఎవరికైనా కలుగుతే అతను ముందు  కూర్చుని ఉండాలి మరియు అది సహాయపడక పోతే అతను నేలపై పడుకుని ఉండాలి."అని  చెప్పారు –తిర్మిజి.

VI. నిశ్శబ్దoగా ఉండుట:
ప్రవక్త ముహమ్మద్ (స) మీలో ఎవరైనా కోపంతో ఉన్నప్పుడు  అతను నిశ్శబ్దంగా ఉండాలని” అని అన్నారు. ఇది చాలా ముఖ్యమైన  చర్య మరియు సూచన ఎందుకంటే కోపం లో మన చర్యలు, మన మాట న్యాయం గా ఉండక పోవచ్చు.
మూడోవ దశ పలితాల దశ
కోప నిర్వహణ సిద్ధాంతంలో తదుపరి స్థాయి 'ప్రతికూల ప్రభావాల స్థాయి' అని అంటారు.
అల్లాహ్ దివ్య ఖురాన్ లో చెప్పారు "ముసా ఆగ్రహం తో,విచారం తో తన జాతి ప్రజల వద్దకు మరలి వచ్చాడు. వచ్చిన వెంటనే ఇలా అన్నాడు: నేను లేనప్పుడు నా స్థానం లో మీరు చాలా చేడ్డగా ప్రవర్తించారు. మీ ప్రభువు ఆజ్ఞ కొరకు నిరిక్షించే ఓపిక కుడా మీలో లేకుండా పోయిoదా?  అతను శిలా పలకాలను విసిరి వేసాడు. తన సోదరుడు (హరూన్)తల వెంట్రుకలను పట్టుకొని అతన్ని లాగాడు.” 7:150.
ముసా ఇలా  అన్నాడు, " ప్రభూ! నా సోదరున్ని  క్షమించు. మమ్మల్లి నీ కారుణ్యం లోకి ప్రవేశింపజెయ్యి."- దివ్య ఖురాన్ 7: 151
ఈ ఆయతుల ద్వారా  ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు, అతను సాధారణంగా మూడు తప్పుడు పనులు చేయును. మొదటిది వ్యక్తి తన ఆలోచన  సామర్థ్యాన్ని కోల్పోయి  తప్పుడు నిర్ణయం తీసుకుంటాడు  మరియు ప్రవక్త ముసా అలాగే   అల్లాహ్ అతనికి ఇవ్వబడిన  మాత్రలు(tablets) విసిరే వేసినాడు. రెండవది  వ్యక్తి పట్ల అమర్యాదగా ప్రవర్తించి తన కోపం ఇతరుల పై వ్యక్తం చేయును అలాగే  ప్రవక్త ముసా,  ప్రవక్త హరూన్ యొక్క  జుట్టు పట్టుకొని లాగినాడు. మూడవది వ్యక్తి తన తప్పు తెలుసుకుంటాడు మరియు క్షమాపణ అడుగుతాడు అలాగే  ప్రవక్త ముసా   తన తప్పు గ్రహించి అతనిని  మరియు అతని సోదరుడుని  క్షమించమని  అల్లాహ్ ను శరణ కోరారు.

వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు దాని పలితం ఆ  వ్యక్తి పై పడుతుంది కాబట్టి  ఒక వ్యక్తి ఎల్లప్పుడూ కోపం నివారించేందుకు ప్రయత్నించాలి. కోపం లో  అతను తప్పుడు నిర్ణయాలు తీసుకొంటాడు, తన కోపాన్ని వ్యక్తం ఎవరిపైనో వ్యక్తం చేయును   మరియు అతను తరువాత దశలో తన కోపం పట్ల  విచారిoచును. కాబట్టి ఒక క్షణం  సహనo వహించుట  తరువాత దశలో విచారం నుండి మనలను నిరోధిస్తుంది.

 కోపం ఒక మానసిక పరిస్థితి, మరియు ఇది చెడు మరియు దూకుడు చర్యల పలితం. దిని ద్వారా నష్టాలు మాత్రమే ఉందును లాభాలు ఉండవు. కోపం నియంత్రించ లేని అతను అతని మనస్సు మీద నియంత్రణ కోల్పోతాడు. వ్యక్తి తన చర్యలు వలన తనను  మరియు  ఇతరులను  బాధిoచును.  అతను అన్నిచోట్ల కోపంతో ప్రదర్శించ రాదు కానీ అతను చెడు పనులు లేదా అవినీతి చూసినపుడు మాత్రo వాటి  సంస్కరణ కొరకు ప్రయత్నించాలి. ఇది ఈ ప్రపంచంలో మరియు పరలోకం లో విజయవంతం అగుటకు తోడ్పడును. అందువలన కోపం రాకుండా ఉండుట అత్యంత తెలివైన  ఉత్తమమైన మార్గం.