పురుషాధిక్య భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, స్త్రీ పాత్రలను కూడా పురుషులు పోషించే కాలం లో ఒక మహిళా దర్శకురాలిగా ఎదిగి, 16 సంవత్సరాలకు పైగా తన కెరీర్లో అద్భుతమైన చిత్రాలు అందించిన మహిళా దర్శకురాలు ఫాత్మా బేగం గురించి తెలుసుకొందాము.
భారతీయ చలనచిత్ర నిర్మాణ రంగం లో మార్గదర్శకురాలిగా, రచన, దర్శకత్వం,నటన మరియు నిర్మాణం వరకు సినిమా యొక్క అన్ని అంశాలను కవర్ చేసే పాత్రలలో నటించిన ట్రైల్బ్లేజర్గా ఫాత్మా బేగం గౌరవించబడుతోంది.
1892లో సచిన్ (ప్రస్తుత గుజరాత్‌లోని సూరత్‌లో భాగం)లో ఉర్దూ మాట్లాడే గుజరాతీ ముస్లిం కుటుంబంలో జన్మించిన ఫాత్మా బేగం 1906లో నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్, సచిన్ యువరాజు నవాబ్ సిద్ధి ఇబ్రహీం ముహమ్మద్ యాకుత్ ఖాన్ III బహదూర్‌ను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాని కొంతకాలం లోనే ఫాత్మా వైవాహిక జీవితం ఒడుదుడుకులకు లోను అయ్యింది.
1913లో - భారతీయ చలన చిత్ర
పితామహుడు గా గౌరవించబడే ప్రఖ్యాత
దాదాసాహెబ్ ఫాల్కేతో కలిసి ఫాత్మా తన చలన చిత్ర ప్రయాణాన్ని ప్రారంభించింది.
1922లో అర్ధదేశీర్ ఇరానీ
నిర్మించిన మణిలాల్ జోషి 'వీర్ అభిమన్యు'లో తన కుమార్తె
సుల్తానాతో పాటు సుభద్ర పాత్రను పోషించి ఫాత్మా నటి గా అరంగేట్రం చేసింది.
1924లో విడుదలైన “సతి సర్దాబా, పృథి వల్లభ్, కాలా నాగ్, గుల్-ఎ-బకావలి” మరియు 1925లో “ముంబై ని మోహిని చిట్టా”లలో ఫాత్మా నటించినది.
నానుభాయ్ బి వకీల్ యొక్క “సేవా సదన్ (1934)” మరియు హోమీ మాస్టర్ యొక్క “పంజాబ్ లాన్సర్స్ (1937)” వంటి టాకీ చిత్రాలలో కూడా ఫాత్మా నటించింది.
ఫాత్మా చివరిగా 1937లో జి. పి. పవార్ నిర్మించిన చిత్రం “దునియా క్యా హై” లో నటించినది.
ఫాత్మా ముగ్గురు కుమార్తెలు జుబేదా, సుల్తానా మరియు షెహజాది ప్రసిద్ధ నటిమణులుగా పేరు పొందారు. షెహజాది ఒక నృత్యకారిణి మరియు ప్రదర్శకురాలిగా ప్రసిద్ధి చెండినది మరియు సుల్తానా మరియు జుబేదా ఇద్దరూ కూడా 1920ల నిశ్శబ్ద చిత్రాల యుగంలో ప్రముఖ నటీమణులు..
జుబేదా కంజీభాయ్ రాథోడ్
యొక్క “గుల్-ఎ-బకావలి”లో ప్రధాన
దేవకన్య-యువరాణి బకావలిగా నటించారు, ఇందులో సుల్తానా కూడా నటించింది.
జుబేదా తరువాత 1931లో భారతదేశపు మొట్టమొదటి
టాకీ చిత్రం “ఆలం ఆరా”లో కూడా నటించింది మరియు 1930లలో బాగా ప్రాచుర్యం
పొందింది,
ఇద్దరు సోదరీమణులు జుబేదా
మరియు సుల్తానా ఆ కాలంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో కొందరు.
హైదరాబాద్ నిజాం ఆస్థానం లో లో ప్రముఖ బ్యాంకర్ల కుటుంబానికి చెందిన రాజా ధనరాజ్ గిరి నర్సింగ్‌జీ జ్ఞాన్ బహదూర్‌ను జుబేదా వివాహం చేసుకుంది,
ఫాత్మా ఫిల్మ్ కార్పొరేషన్
1926లో, ఫాత్మా బేగం ఫాత్మా ఫిల్మ్ కార్పొరేషన్‌ను స్థాపించింది, తరువాత దానిని 1928లో విక్టోరియా ఫాత్మా ఫిల్మ్ కార్పొరేషన్‌గా మార్చింది. ఫాత్మా ఫిల్మ్ కార్పొరేషన్ క్రింద నిర్మించబడిన మొదటి చిత్రం “బుల్బుల్-ఎ-పరాస్తాన్ (బర్డ్ ఆఫ్ ఫెయిరీల్యాండ్, 1926)” కు ఫాత్మా దర్శకత్వం వహించి నిర్మించింది.
ఫాంటసీ శైలిలో నిర్మించబడిన మొట్టమొదటి చిత్రాలలో ఒకటిగా "బుల్బుల్-ఎ-పరాస్తాన్" నిలిచినది. “బుల్బుల్-ఎ-పరాస్తాన్ (బర్డ్ ఆఫ్ ఫెయిరీల్యాండ్, 1926)” చిత్రంలో ఫత్మా కుమార్తెలు జుబేదా మరియు షెహాజాది కూడా నటించారు “బుల్బుల్-ఎ-పరాస్తాన్” చిత్రం లో స్పెషల్ ఎఫెక్ట్‌లతో కలిపి ట్రిక్ ఫోటోగ్రఫీని ఉపయోగించారు.
ఫత్మా నిర్మించిన “బుల్బుల్-ఎ-పరాస్తాన్” చిత్రం 1931లో నిర్మించిన “అల్లాదీన్ అండ్ ది వండర్ఫుల్ లాంప్, ఆఫ్ఘన్ అబ్లా మరియు ఆలం అరా” వంటి తరువాతి ఫాంటసీ చిత్రాల నిర్మాణానికి కూడా ప్రేరణనిచ్చింది.
ఫత్మా తరువాతి చిత్రాలలో “ది గాడెస్ ఆఫ్ లవ్ (1927), హీర్ రంజా (1928), చంద్రవళి (1928), కనక్తరా (1929), మిలన్ దినార్ (మీటింగ్ డే/టెస్ట్ ఆఫ్ లవ్, 1929), నసీబ్ ని దేవి (లేడీ ఆఫ్ ఫార్చ్యూన్, 1929), మరియు శకుంతల (1929)” ఉన్నాయి, ఇవన్నీ స్త్రీ-కేంద్రీకృత పాత్రలతో ఉన్నాయి.
మూడు సంవత్సరాల వ్యవధిలో మొత్తం తొమ్మిది చిత్రాలకు ఫాత్మా నిర్మించారు,వాటిలో చాలా వాటికి ఫత్మా రచన, దర్శకత్వం, వహించి నటించారు మరియు స్పెషల్ ఎఫెక్ట్స్ మరియు ఫోటోగ్రఫీపై కూడా పనిచేశారు.
1929 తరువాత ఫాత్మా అనేక చట్టపరమైన కేసులలో చిక్కుకుంది, చివరికి ఫత్మా స్టూడియో మూసివేయబడింది.భారతీయ సినిమా నిశ్శబ్ద చిత్రాల నుండి టాకీ చిత్రాలకు మారుతున్న దశలో ఫాత్మా వ్యక్తిగత వివాదాలు,పనులు, కోర్ట్ కేసులలో ఇరుక్కొని సినీ నిర్మాణ పనులు ఆపివేసింది.
ముగింపు:
ఫాత్మా బేగం 1983లో 91 సంవత్సరాల వయస్సులో
మరణించారు, ఫాత్మా భారతీయ సినిమాలో
స్త్రీ-కేంద్రీకృత కథనాల యొక్క సుదీర్ఘ వారసత్వాన్ని మిగిల్చారు. ఆ కాలంలో సినిమా
రికార్డులను భద్రపరిచే అభ్యాసం లేకపోవడం వల్ల నేడు మన దగ్గర ఫాత్మా యొక్క అద్భుతమైన
చిత్రాల ప్రింట్లు ఏవీ లేవు. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (NFAI) వద్ద దక్షిణాసియా మొత్తంలో మొట్టమొదటి మహిళా దర్శకురాలి
యొక్క ఒక్క స్లిమ్ మోనోగ్రాఫ్ కూడా లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం.