6 August 2025

స్వాతంత్య్రానంతర భారతదేశంలోని 10 మంది అగ్ర ముస్లిం అధికారులు 10 top Muslim bureaucrats of post-Independence India

 

 

 

స్వాతంత్య్రానంతరం, దేశ పురోగతిలో అధికారులు అమూల్యమైన పాత్ర పోషించారు. ప్రతి సంవత్సరం UPSC పోటీ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులలో దాదాపు మూడు నుండి ఐదు శాతం మంది ముస్లింలు. భారతదేశంలోని 10 మంది ప్రముఖ ముస్లిం అధికారుల జాబితా:

 

సయ్యద్ అక్బరుద్దీన్Syed Akbaruddin

 

సయ్యద్ అక్బరుద్దీన్ 1985 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్. అక్బరుద్దీన్ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత ప్రతినిధిగా జనవరి 2016 నుండి ఏప్రిల్ 2020 వరకు పనిచేసినారు. పాకిస్తాన్ ఉగ్రవాది జైష్-ఎ-మహమ్మద్ మసూద్ అజార్‌ను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించడంలో అక్బరుద్దీన్ కీలక పాత్ర పోషించారు.'గాంధీ సోలార్ పార్క్' ఏర్పాటు వంటి వాతావరణ మార్పుల అంశంపై భారతదేశం నాయకత్వ పాత్రను అక్బరుద్దీన్ బలోపేతం చేశారు.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధిగా (2012–2015) కూడా అక్బరుద్దీన్ పనిచేసారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధిగా అక్బరుద్దీన్ తన కమ్యూనికేషన్ నైపుణ్యాలకు విస్తృతంగా ప్రశంసలు అందుకున్నారు. వియన్నాలోని IAEAకి భారత ప్రతినిధిగా కూడా అక్బరుద్దీన్ ముఖ్యమైన పాత్ర పోషించారు. పదవీ విరమణ చేసినప్పటి నుండి, అక్బరుద్దీన్ హైదరాబాద్‌లోని కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో డీన్‌గా పనిచేస్తున్నారు.


డాక్టర్ ఎస్.వై. ఖురేషి Dr. S. Y. Qureshi

 

భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎస్.వై. ఖురేషి, పరిపాలనా సేవలో అనుభవజ్ఞుడు, భారత ప్రజాస్వామ్యాన్ని బలంగా మరియు పారదర్శకంగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. డాక్టర్ ఎస్.వై. ఖురేషి 1971 బ్యాచ్ హర్యానా కేడర్‌కు చెందిన IAS అధికారి మరియు 17వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా భారతదేశానికి జూలై 30, 2010 నుండి జూన్ 10, 2012 వరకు పనిచేశారు. ఈ పదవిని నిర్వహించిన భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం అధికారి డాక్టర్ ఎస్.వై. ఖురేషి.

డాక్టర్ ఖురేషి యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా మరియు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) డైరెక్టర్ జనరల్‌గా కూడా పనిచేశారు. డాక్టర్ ఎస్. వై. ఖురేషి నేతృత్వంలో జరిగిన "యూనివర్సిటీస్ టాక్ ఎయిడ్స్" ప్రచారం భారతదేశంలో అతిపెద్ద HIV/AIDS అవగాహన కార్యక్రమం.

డాక్టర్ ఎస్. వై. ఖురేషి 'యాన్ అన్‌డాక్యుమెంటెడ్ వండర్: ది మేకింగ్ ఆఫ్ ది గ్రేట్ ఇండియన్ ఎలక్షన్', మరియు ది పాపులేషన్ మిత్ మరియు ఓల్డ్ ఢిల్లీ - లివింగ్ ట్రెడిషన్స్ రచయిత. డాక్టర్ ఎస్. వై. ఖురేషి 'ది గ్రేట్ మార్చ్ ఆఫ్ డెమోక్రసీ'ని కూడా ఎడిట్ చేసారు..

డాక్టర్ ఖురేషి 2012 నుండి 2021 వరకు ఇంటర్నేషనల్ ఐడియా బోర్డు సభ్యుడిగా ఉన్నారు. డాక్టర్ ఎస్. వై. ఖురేషి ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని క్లస్టర్ ఇన్నోవేషన్ సెంటర్‌లో గౌరవ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. డాక్టర్ ఎస్. వై. ఖురేషి 2010-11లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది భారతీయుల 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' జాబితాలో ఉన్నారు.

నజీబ్ జంగ్ Najeeb Jung



1973 బ్యాచ్ మరియు మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన IAS అధికారి నజీబ్ జంగ్ ఇంధనం మరియు విద్య వంటి రంగాలలో విధాన రూపకల్పనకు దోహదపడ్డారు. నజీబ్ జంగ్ ఉక్కు మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ మరియు RBI వంటి అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. నజీబ్ జంగ్ 1999లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి, ఆసియా అభివృద్ధి బ్యాంకు మరియు ఆక్స్‌ఫర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ స్టడీస్‌లో ఇంధన నిపుణుడిగా పనిచేశారు.

నజీబ్ జంగ్ 2009 నుండి 2013 వరకు జామియా మిలియా ఇస్లామియా వైస్ ఛాన్సలర్‌గా మరియు 2013 నుండి 2016 వరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేశారు. నజీబ్ జంగ్ విద్యా సంస్కరణ, సామాజిక న్యాయం మరియు ఇంధన విధానంపై అనేక నివేదికలు రాశారు.

జావేద్ ఉస్మానీJaved Osmani


జావేద్ ఉస్మానీ ఉత్తరప్రదేశ్ కేడర్‌లోని 1978 బ్యాచ్ సివిల్ సర్వీసెస్ (IAS)కి చెందిన విజనరీ అధికారి. నాలుగు దశాబ్దాల తన కెరీర్‌లో, జావేద్ ఉస్మానీ  యు.పి.రాష్ట్రం మరియు కేంద్రంలో అనేక ఉన్నత పదవులను నిర్వహించారు. విధాన సంస్కరణలు మరియు ప్రజా ప్రయోజన పనులపై దృష్టి సారించిన నిజాయితీపరుడు, సమర్థవంతమైన మరియు సూత్రప్రాయమైన అధికారిగా జావేద్ ఉస్మానీ ప్రసిద్ధి చెందారు.

జావేద్ ఉస్మానీ హార్వర్డ్ పూర్వ విద్యార్థి, వాణిజ్య మంత్రిత్వ శాఖ, ప్రణాళికా సంఘం మరియు ప్రపంచ బ్యాంకులో పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌లో, జావేద్ ఉస్మానీ ముఖ్యమంత్రికి ప్రధాన కార్యదర్శి పదవికి ఎదిగారు. సీఎస్ గా తన పదవీకాలంలో, జావేద్ ఉస్మానీ ఈ-గవర్నెన్స్, పారదర్శకత మరియు పథకాల ప్రభావవంతమైన పర్యవేక్షణపై దృష్టి పెట్టారు. పదవీ విరమణ తర్వాత, విధాన చర్చలు మరియు రచనల ద్వారా జావేద్ ఉస్మానీ ప్రజా జీవితంతో అనుబంధం కలిగి ఉన్నారు.

డాక్టర్ సయ్యద్ జాఫర్ మహమూద్ Dr. Syed Zafar Mahmood

 

సయ్యద్ జాఫర్ మహమూద్ ఒక విశిష్ట మాజీ భారతీయ పౌర సేవా అధికారి మరియు సామాజిక సంస్కర్త. సయ్యద్ జాఫర్ మహమూద్ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ పట్టా పొందారు.

ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నప్పుడు, సయ్యద్ జాఫర్ మహమూద్ ముస్లింల కోసం ప్రధానమంత్రి ఉన్నత స్థాయి కమిటీ (తరువాత సచార్ కమిటీగా ప్రసిద్ధి చెందింది)లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేశారు. ఈ నివేదిక దేశంలోని ముస్లిం సమాజం యొక్క సామాజిక, ఆర్థిక మరియు విద్యా స్థితిగతులపై నివేదికను సమర్పించింది. సయ్యద్ జాఫర్ మహమూద్ ఆదాయపు పన్ను శాఖలో కూడా పనిచేశారు.

డాక్టర్ సయ్యద్ జాఫర్ మహమూద్1997లో జకాత్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (ZFI)ని స్థాపించాడు, ఇది అనాథలు, వితంతువులు మరియు అణగారిన వర్గాలకు విద్య, ఆరోగ్యం మరియు పునరావాసం రంగంలో ప్రశంసనీయమైన కృషి చేసింది. ఇంటర్‌ఫెయిత్ కోయలిషన్ ఫర్ పీస్ మరియు గాడ్స్ గ్రేస్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ వంటి వేదికల ద్వారా, డాక్టర్ సయ్యద్ జాఫర్ మహమూద్ ఇంటర్‌ఫెయిత్ సంభాషణ మరియు విద్యా సాధికారతకు మార్గదర్శకత్వం వహించాడు.

డాక్టర్ మహమూద్ హార్వర్డ్, లండన్ మరియు ఇతర ప్రపంచ వేదికలలో భారతదేశం మరియు మైనారిటీ హక్కుల కోసం శక్తివంతమైన వాదించారు.

 

సల్మాన్ హైదర్ Salman Haider



సల్మాన్ హైదర్ ప్రపంచ వేదికలలో భారతదేశ విదేశాంగ విధానాన్ని బలంగా వినిపించిన మాజీ భారతీయ దౌత్యవేత్త. సల్మాన్ హైదర్ ఆయన మార్చి 1, 1995 నుండి జూన్ 30, 1997 వరకు భారతదేశ విదేశాంగ కార్యదర్శిగా ఉన్నారు తరువాత, యునైటెడ్ కింగ్‌డమ్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేశారు.

సల్మాన్ హైదర్ తన దౌత్య పదవీకాలంలో, చైనాకు భారత రాయబారిగా మరియు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితికి భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా కూడా పనిచేశారు. న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖలో, సెక్రటరీ ఈస్ట్, ప్రతినిధి మరియు చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్ వంటి ముఖ్యమైన పదవులను సల్మాన్ హైదర్ నిర్వహించారు.

సల్మాన్ హైదర్  ప్రముఖ  థియేటర్ ఆర్టిస్ట్ మరియు సినీ నటిమణి కుసుమ్ హైదర్‌ను వివాహం చేసుకున్నారు.

 

డాక్టర్ ఔసాఫ్ సయీద్Dr. Ausaf Saeed


1989 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి డాక్టర్ ఔసాఫ్ సయీద్, మూడు దశాబ్దాలుగా తన దౌత్య జీవితంలో సాంస్కృతిక దౌత్యం మరియు ఇతర విదేశాంగ విధానానికి సంబంధించిన పదవులను నిర్వహించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (కాన్సులర్, పాస్‌పోర్ట్, వీసా మరియు ఓవర్సీస్ ఇండియన్ అఫైర్స్) రాయబారిగా, విధాన స్థాయిలో అనేక చారిత్రాత్మక చొరవలు తీసుకున్నారు.

సౌదీ అరేబియాలో డాక్టర్ ఔసాఫ్ సయీద్   పదవీకాలంలో, 'స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ కౌన్సిల్' 2019లో స్థాపించబడింది, ఇది భారతదేశం-సౌదీ సహకారానికి కొత్త దిశానిర్దేశం చేసింది. డాక్టర్ ఔసాఫ్ సయీద్  భారత రాయబారిగా ఉన్న కాలంలోనే యోగా అధికారికంగా గుర్తింపు పొందింది. డాక్టర్ ఔసాఫ్ సయీద్  ఇండో-సౌదీ బిజినెస్ నెట్‌వర్క్‌కు కూడా అధ్యక్షత వహించారు, మెడికల్ ఫోరం మరియు ఫ్రెండ్‌షిప్ సొసైటీ వంటి వేదికలను స్థాపించడం ద్వారా విదేశీ భారతీయులను ఏకం చేశారు. COVID-19 సమయంలో వలసదారులను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో డాక్టర్ ఔసాఫ్ సయీద్ ముఖ్యమైన పాత్ర పోషించారు.

డాక్టర్ సయీద్ ఒక గొప్ప రచయిత, ఉర్దూ సాహిత్య ప్రేమికుడు మరియు సాంస్కృతిక ఆలోచనాపరుడు.

తల్మీజ్ అహ్మద్ Talmeez Ahmed

 

 

1974 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి అయిన తల్మీజ్ అహ్మద్ పశ్చిమ ఆసియా నిపుణుడిగా పరిగణించబడ్డారు. తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ దౌత్య జీవితంలో, తల్మీజ్ అహ్మద్ భారతదేశ విదేశాంగ విధాన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడ్డారు. కువైట్, ఇరాక్ మరియు యెమెన్‌లలో ప్రారంభ పోస్టింగ్‌ల తర్వాత, తల్మీజ్ అహ్మద్ జెడ్డాలో కాన్సుల్ జనరల్‌గా (1987-90) పనిచేశారు. దీనితో పాటు, న్యూయార్క్, లండన్ మరియు ప్రిటోరియాలోని భారత మిషన్లలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు.

సౌదీ అరేబియా (రెండుసార్లు), ఒమన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లకు తల్మీజ్ అహ్మద్ భారత రాయబారిగా పనిచేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖలో గల్ఫ్ మరియు హజ్ విభాగ అధిపతిగా (1998–2000), పెట్రోలియం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా (2004–06) మరియు ICWA డైరెక్టర్ జనరల్ (2006–07)గా తల్మీజ్ అహ్మద్ దేశానికి గొప్ప సేవలందించారు.

సౌదీ ప్రభుత్వం 2011లో తల్మీజ్ అహ్మద్ కు 'కింగ్ అబ్దుల్ అజీజ్ మెడల్ ఫస్ట్ క్లాస్' అవార్డును ప్రదానం చేసింది. పదవీ విరమణ తర్వాత తల్మీజ్ అహ్మద్ బోధనా వృత్తిలోకి అడుగుపెట్టి, పూణేలోని సింబియోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో 'రామ్ సాథే చైర్'ను నిర్వహిస్తున్నారు.  తల్మీజ్ అహ్మద్ నాలుగు పుస్తకాలు రచించారు మరియు పశ్చిమాసియా వ్యవహారాల ప్రముఖ విశ్లేషకుడిగా ప్రసిద్ది కెక్కారు.

ఆమీర్ సుభానీ Aamir Subhani

 



1987 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి అమీర్ సుభానీ, బీహార్ పరిపాలనా వ్యవస్థకు ప్రముఖ స్తంభంగా పరిగణించబడ్డారు. అమీర్ సుభానీ 1987లో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచి బీహార్ కేడర్‌లో చేరారు. అమీర్ సుభానీ రాష్ట్రంలో అనేక పదవుల్లో పనిచేశారు మరియు 2002లో బీహార్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. బిహార్ రాష్ట్రంలో అత్యున్నత పరిపాలనా పదవికి చేరుకున్న మొదటి ముస్లిం అమీర్ సుభానీ.

అమీర్ సుభానీ బీహార్ విద్యుత్ నియంత్రణ కమిషన్ చైర్మన్. సివాన్‌లోని బహువారా గ్రామానికి చెందిన సుభానీ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించడం ద్వారా తన బాల్యంలోనే IAS కావాలని నిర్ణయించుకున్నారు.


వజాహత్ హబీబుల్లా Wajahat Habibullah

 


వజాహత్  హబీబుల్లా భారత మాజీ ప్రధాన సమాచార కమిషనర్ మరియు 1968 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి. భారత ప్రభుత్వ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, వస్త్ర మంత్రిత్వ శాఖ మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా వజాహత్  హబీబుల్లా పనిచేశారు. 1991-93 మధ్య, వజాహత్  హబీబుల్లా కాశ్మీర్ డివిజన్‌కు డివిజనల్ కమిషనర్‌గా ఉన్నారు, అక్కడ ఉగ్రవాదం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ధైర్యవంతమైన నాయకత్వం ప్రదర్శించారు.

వజాహత్  హబీబుల్లా జమ్మూ కాశ్మీర్ గవర్నర్ నుండి విశిష్ట సేవ కోసం బంగారు పతకం (1996) మరియు లౌకికవాదంలో అత్యుత్తమ ప్రతిభ కోసం రాజీవ్ గాంధీ అవార్డు (1994) గ్రహీత. జూలై 2010లో, వజాహత్  హబీబుల్లా ప్రపంచ బ్యాంకు యొక్క సమాచార అప్పీల్ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. వజాహత్ హబీబుల్లా జాతీయ మైనారిటీ కమిషన్‌కు కూడా ఛైర్మన్‌గా ఉన్నారు. వజాహత్  హబీబుల్లా 'కాశ్మీర్ 1947', 'సీజ్: హజ్రత్‌బాల్, కాశ్మీర్ 1993' మరియు 'మేరా కాశ్మీర్-స్ట్రగల్' అనే పుస్తకాలను రచించారు.

 

No comments:

Post a Comment