17 August 2025

ముస్లింలు స్వాతంత్ర్యం కోసం పోరాడి మరణించారు Muslims Fought and Died for Independence

 

 


న్యూఢిల్లీ –

 

భారతదేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో, దేశ స్వాతంత్ర్యాన్ని సాధించడంలో ముస్లింల త్యాగాలను ఒకసారి తిరిగి మననం చేసుకొందాము.

“ముస్లిం రక్తం లేకుండా, స్వేచ్ఛ ఉండేది కాదు” అని  ఒక చరిత్రకారుడు అన్నారు. “మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ నుండి ప్రాణాలను అర్పించిన సాధారణ గ్రామస్తుల వరకు, ముస్లింలు బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి హిందువులతో భుజం భుజం కలిపి పోరాడారు.”

హిందువులు మరియు ముస్లింల మధ్య ఐక్యతకు చిహ్నంగా ఉన్న గంగా-జముని సంస్కృతి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా లక్షలాది మందిని ఏకతాటిపైకి తెచ్చింది.

1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య యుద్ధం నుండి 1947లో చివరి పోరాటం వరకు, పోరాటంలోని ప్రతి దశలోనూ ముస్లింలు ఉన్నారు. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌ను 1857 తిరుగుబాటుకు ప్రతీకాత్మక నాయకుడిగా ఎన్నుకున్నారు. బహదూర్ షా జాఫర్‌ కుమారులను బ్రిటిష్ వారు శిరచ్ఛేదం చేశారు, బహదూర్ షా జాఫర్‌ ను రంగూన్‌కు బహిష్కరించే ముందు కుమారుల తలలను అతని ముందు సమర్పించారు.

బరేలీకి చెందిన బఖ్త్ ఖాన్ ఢిల్లీలో తిరుగుబాటు దళాలకు నాయకత్వం వహించాడు మరియు హిందూ-ముస్లిం ఐక్యతకు పిలుపునిచ్చాడు. అవధ్‌కు చెందిన మౌల్వీ అహ్మదుల్లా షా 1858లో అమరవీరుడయ్యే ముందు బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేశాడు. లక్నోకు చెందిన బేగం హజ్రత్ మహల్ నెలల తరబడి బ్రిటిష్ వారిని ధిక్కరించి బహిష్కరించ బడింది..

18వ శతాబ్దపు మైసూర్ పాలకుడు "మైసూర్ పులి"గా పిలువబడే టిప్పు సుల్తాన్ బ్రిటిష్ విస్తరణను తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో ఒకరు. టిప్పు సుల్తాన్ బ్రిటిష్ సైనికులతో పోరాడుతూ యుద్ధభూమిలో మరణించారు. అయినప్పటికీ ఆయన కథను పాఠశాల పాఠ్యాంశాల నుండి తొలగిస్తున్నారు.

ముస్లింలు భారత జాతీయ కాంగ్రెస్‌ను దాని ప్రారంభ సంవత్సరాల్లో బలంగా సమర్థించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, హకీమ్ అజ్మల్ ఖాన్, డాక్టర్ ఎంఏ అన్సారీ మరియు బద్రుద్దీన్ త్యాబ్జీ వంటి నాయకులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాలను ఏకం చేయడానికి పనిచేశారు. 1857లో పోరాడిన దేవ్‌బంద్ ఉలేమా కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రచారాలకు మద్దతు ఇచ్చింది.

1906లో ముస్లిం లీగ్ ఏర్పడినప్పుడు కూడా, చాలా మంది ముస్లిం నాయకులు మత రాజకీయాలను తిరస్కరించారు. లియాఖత్ హుస్సేన్ మరియు అబ్దుల్ హకీమ్ ఘజ్నవి వంటి ప్రముఖులు సామరస్యాన్ని కాపాడుకోవడానికి పనిచేశారు.

భారత విభజనను ప్రతిపాదించినప్పుడు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, దేవ్‌బంద్ యొక్క సున్నీ ఉలేమా, మరియు ఆల్ ఇండియా ఆజాద్ ముస్లిం కాన్ఫరెన్స్ యొక్క ముస్లిం నాయకులు దేశాన్ని మతపరంగా విభజించడాన్ని వ్యతిరేకించారు.. "అన్ని మతాలు కలిసి జీవించే మిశ్రమ సంస్కృతిలో భారతదేశం యొక్క ఆత్మ ఉందని నమ్మారు."

భారత స్వాతంత్ర్య పోరాటంలో ముస్లిముల పాత్ర గుర్తుంచుకోదగినది.  

 

No comments:

Post a Comment