మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్
సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది, బేగంల కాలంలో బ్రిటిష్ రాజ్ కాలం
నాటి పాత భోపాల్‌లోని చారిత్రక కట్టడాలు- షౌకత్ మహల్, గౌహర్ మహల్ మరియు మోతీ
మహల్ సామాజిక,రాజకీయ ప్రాముఖ్యత చెందినవి.
స్వాతంత్ర్యం వచ్చినతరువాత భారతదేశం లో వీలినమైన
భోపాల్ బ్రిటిష్ సెంట్రల్ ఇండియా లోని అత్యంత ముఖ్యమైన రాచరిక రాష్ట్రాలలో ఒకటి.
సర్దార్ దోస్త్ ముహమ్మద్ ప్రస్తుత భోపాల్‌ను స్థాపించాడు, అది తరువాత
బ్రిటిష్ వారి క్రింద రాచరిక రాజ్యం గా మారింది. నలుగురు
బేగంలు: కుద్సియా బేగం, సికందర్ బేగం, షాజహాన్ బేగం మరియు సుల్తాన్ జహాన్ బేగం భోపాల్‌ను పాలించారు
భోఫల్ లోని చారిత్రక ప్రదేశాలలో తాజ్
మహల్ ప్యాలెస్ ఒకటి. షాజహాన్ బేగం తాజ్ మహల్ ప్యాలెస్‌ను నిర్మించింది.
గోహర్ మహల్ అప్పర్ సరస్సు (బడా
తలాబ్) ఒడ్డున ఉంది మరియు దీనిని భోపాల్ మొదటి బేగం, గోహర్ బేగం అని కూడా పిలువబడే
కుద్సియా బేగం 19వ శతాబ్దంలో నిర్మించింది. దీని నిర్మాణం రాజ్‌పుత్ మరియు మొఘల్ నిర్మాణ
శైలులకు ఒక అద్భుతమైన ఉదాహరణ.
19వ శతాబ్దంలో ఫ్రెంచ్ వాస్తుశిల్పి
నిర్మించిన షౌకత్ మహల్; సికందర్ జహాన్ బేగం వివాహం కోసం ఆమెకు
బహుమతిగా ఇచ్చిన మహల్. భోపాల్‌లో, ఇది హిందూస్థానీ మరియు యూరోపియన్
నిర్మాణ శైలుల సమ్మేళనానికి అత్యంత ప్రముఖ ఉదాహరణ.
షౌకత్ మహల్‌లోని ఒక భాగాన్ని ఇండో-టర్కిష్
రెస్టారెంట్, ది గుంబాద్ రెస్టారెంట్‌గా మార్చడం
జరిగిది.
భోపాల్ లో ఒక చారిత్రక లైబ్రరీ కూడా ఉంది మరియు
1939 నుండి పనిచేస్తోంది. ఇది ది గుంబాద్
రెస్టారెంట్ ఎదురుగా ఉన్న ఇక్బాల్ లైబ్రరీ. ఇది ఉర్దూ అదాబ్ లేదా సాహిత్యం యొక్క
ఐకానిక్ సంస్థ అని చెబుతారు; ఇది ఇప్పటికీ పెద్ద పుస్తకాల సేకరణను
కలిగి ఉంది.
No comments:
Post a Comment