మాలేగావ్, మహారాష్ట్ర:
మన్సూరా, అని కూడా పిలవబడే జామియా మొహమ్మదియా విద్యా
కేంద్ర కాంప్లెక్స్, ఒక విద్యా
కేంద్రం మాత్రమే కాదు, ఇస్లామిక్
మరియు ఆధునిక భారతీయ సంస్కృతి యొక్క అత్యాధునిక కలయికను వర్ణించే చిహ్నం కూడా.
పచ్చిక
బయళ్ళు, , ఆధునిక
సౌకర్యాలతో కూడిన తరగతి గదులు, మోడల్ కంప్యూటర్ గదులు - బాలురు మరియు బాలికలకు విడిగా ఏర్పాటు చేయబడిన ప్రయోగశాలలు, అరుదైన విలువైన పుస్తకాల సేకరణతో కూడిన లైబ్రరీ, తగిన వసతితో కూడిన హాస్టల్, ఆట స్థలం, 5000 మందికి పైగా సామర్థ్యం కలిగి మహిళలకు ప్రత్యేక ఏర్పాటుతో కూడిన పెద్ద మసీదు, మరెన్నోసౌకర్యాలను
కలిగి 56 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నది మన్సూరా, అని పిలబడే జామియా మొహమ్మదియా విద్యా కేంద్ర కాంప్లెక్స్
జామియా
మొహమ్మదియా, మౌలానా ముక్తార్ అహ్మద్ నద్వి ఆలోచనకు మూలం, మొదట్లో మాలేగావ్‌కు చెందిన తన స్నేహితుడు సైత్
మొహమ్మద్ ఖలీల్ సహాయంతో, తరువాత
ఒంటరిగా, మన్సూరాను
ఒక నమూనాగా మార్చారు.
ఇస్లామిక్
సంస్థలు అనుసరిస్తున్న మదర్సా సిలబస్‌ను సవరించడానికి మరియు వాటిని ఆధునిక
అవసరాలకు అనుగుణంగా తీసుకురావడానికి ఉన్న అవకాశాలపై చర్చించడం పై సౌదీ అరేబియాలోని
కింగ్ అబ్దుల్ అజీజ్ విశ్వవిద్యాలయం 1975లో ఒక అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించింది. మౌలానా ముక్తార్ అహ్మద్ నద్వి
మరియు ప్రముఖ ముస్లిం పండితుడు మౌలానా అబుల్ హసన్ అలీ మియా నద్వి కూడా ఈ
సమావేశానికి ఆహ్వానించబడ్డారు. సమావేశం అనంతరం మౌలానా ముక్తార్ అహ్మద్ నద్వి, మౌలానా
అలీ మియా నద్వితో సంప్రదింపులు జరిపి, భారతదేశంలో ఒక మోడల్ మదర్సాను స్థాపించడానికి నిర్ణయించుకొన్నారు.
మోడల్ మదరసా
స్థాపనకు గాను మౌలానా ముక్తార్ నద్వి ముంబైలోని మాలేగావ్‌కు చెందిన తన స్నేహితుడు
సాయిత్ మొహమ్మద్ ఖలీల్ సహాయం పొందారు. 1979లో మాలేగావ్‌లో జామియా మొహమ్మదియా మదరసా స్థాపన జరిగింది.
ఇస్లామిక్
మరియు ఆధునిక విద్యా విధానం ఆధారంగా ఒక ప్రత్యేకమైన సిలబస్‌పై నడుస్తూ, జామియా మొహమ్మదియా మదరసా విద్యాకేంద్ర క్యాంపస్
కు మన్సూరా అని పేరుగా ఎంచుకున్నారు.
9వ శతాబ్దంలో మన్సూరా బాగ్దాద్‌లోని ఒక చారిత్రాత్మక ప్రాంతం. ఆ సమయంలో
ఇరాక్ రాజధాని బాగ్దాద్, జ్ఞానం
మరియు పాండిత్యానికి మూలంగా మరియు పండితులు మరియు విద్యావేత్తల గమ్యస్థానంగా
ఉండేది. ప్రపంచవ్యాప్తంగా జ్ఞానాన్ని కోరుకునే ప్రజలు బాగ్దాద్‌లో
సమావేశమయ్యేవారు. నగరం మధ్యలో మరియు బాగ్దాద్‌లోని అన్ని విద్యా కార్యకలాపాల
కేంద్రంలో మన్సూరా ఉంది.
భారతదేశంలో
సాధారణంగా మదరీలు (మదర్సా యొక్క బహువచనం) అనుసరిస్తున్న ప్రస్తుత దర్స్-ఎ-నిజామి -
ఇస్లామిక్ అధ్యయనాల యొక్క ఉద్భవిస్తున్న సవాళ్లు మరియు అవసరాలను తీర్చడానికి
సరిపోదని గ్రహించి, జామియా మొహమ్మదియా మదరసా
విద్యార్థుల కోసం(బాల-బాలికలు ఇద్దరి కోసం),
సైన్స్ మరియు గణితం వంటి ఆధునిక
విషయాలను, ఇంగ్లీష్,
హిందీ మరియు మరాఠీ వంటి భాషలను కూడా
ప్రవేశపెట్టారు. పాఠ్యాంశాలు ఇస్లామిక్ మరియు ఆధునిక విద్యా విధానం యొక్క సంపూర్ణ
కలయిక.
జామియా మొహమ్మదియా మదరసా రాష్ట్ర విద్యా బోర్డు నుండి మరియు భారతీయ మరియు విదేశీ
విశ్వవిద్యాలయాల నుండి కూడా అత్యంత ముఖ్యమైన అనుబంధం మరియు గుర్తింపు పొందినది. మహారాష్ట్ర స్టేట్ సెకండరీ బోర్డు మరియు జామియా
ఇస్లామియా, మదీనా మునవ్వరా, సౌదీ అరేబియా మరియు జామియా మిలియా
ఇస్లామియా, న్యూఢిల్లీలు త్వరలోనే గుర్తించాయి.
జామియా మొహమ్మదియా విద్యార్థులు
- బాలురు మరియు బాలికలు ఇద్దరూ త్వరలోనే ఇస్లామిక్ అధ్యయనాలలో అద్భుతంగా స్కోర్
చేయడమే కాకుండా, రాష్ట్ర బోర్డు పరీక్షలలో కూడా
అద్భుతమైన పలితాలు పొందారు.
2008-09లో జామియా మొహమ్మదియా విద్యా
కేంద్రం మన్సూరా
విద్యార్థులలో ఒకరైన అబ్దుర్ రెహ్మాన్ మరియు మరో పదహారు మంది సౌదీ అరేబియాలోని
జామియా ఇస్లామియా మదీనా మునవ్వరాలో చరిత్ర సృష్టించారు. అబ్దుర్ రెహ్మాన్ తన
ఫ్యాకల్టీలో అగ్రస్థానంలో నిలిచి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందగా, మన్సూరా నుండి మరో పదహారు మంది
యూనివర్సిటీ పరీక్షలను డిస్టింక్షన్‌తో ఉత్తీర్ణులయ్యారు.
త్వరలోనే జామియా మొహమ్మదియా విద్యా కేంద్రం దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది
మరియు మౌనాథ్ భంజన్, ఆకోట్, ధూలే, బెంగళూరు, మహేస్లా మరియు మేవాత్‌లలో శాఖలను
స్థాపించింది - అన్నీ మన్సూరా నమూనాలో నడుస్తున్నాయి మరియు సంబంధిత రాష్ట్ర
బోర్డులకు అనుబంధంగా ఉన్నాయి.
జామియా మొహమ్మదియా విద్యా కేంద్రం మన్సూరాను ఒక పెద్ద విశ్వవిద్యాలయంగా మార్చాలనేది భవిష్యత్ కల.
No comments:
Post a Comment