8 July 2016

కోహినూర్(కాంతి పర్వతం)



దక్కను(ఇండియా)లోని వజ్రపు గనులలో దొరికిన కోహినూర్ వజ్రం ప్రస్తుతo లండన్ టవర్లోఉన్నది. కోహినూర్ వజ్రం ఆది నుంచి వివాదాలకు కేంద్రంగా ఉంది.భారత స్వాతంత్ర్య అనంతరం కోహినూర్ వజ్రం పలు దేశాల దౌత్య వివాదాల కేంద్రంగా మారింది.

1850 లో కోహినూర్ భారతదేశం తీరం వదిలి వెళ్ళినతరువాత ఇది బ్రిటిష్ క్రౌన్ ఆభరణాలలో భాగంగా బ్రిటిష్ మహారాణి కిరీటం లో అమర్చబడినది.  ఈ వెల కట్టలేని వజ్రం ఇప్పుడు ప్రజలు వీక్షించడానికి లండన్   టవర్లో సురక్షితంగా ప్రదర్శించబడుతుంది.

ఇంగ్లీష్ రాజుల పురాతన కోట కమ్ ప్యాలెస్ “లండన్ టవర్”థేమ్స్ నది ఒడ్డున 1066 లో 1వ విలియం చే నిర్మించ బడినది. ఏటా కొన్ని మిలియన్ల మంది పర్యాటకులను దానిని సందర్శిస్తారు. గట్టి భద్రత మద్య జువెల్ హౌస్ లో ఉంచబడిన భద్రంగా ఉంచబడిన  కోహినూర్ వజ్రం  సందర్సన కొరకు లోనికి ప్రవేశకులు లోనికి ప్రవేశించగానే గతంలో బ్రిటిష్ రాజులు /రాణులు ధరించిన అనేక మిరుమిట్లు గొలిపే కిరీటాలు ప్రేక్షకులను కనువిందు చేస్తాయి. నెమ్మదిగా కదిలే బెల్ట్ మీద ఉన్న కిరీటం లో పొదగ బడిన చారిత్రక కోహినూర్ వజ్రం మనలను సంబ్రమ ఆశ్చర్యం కు లోను చేస్తుంది. ప్రసిద్ధ కోహినూర్ వజ్రం వివిధ దేశాలలో వివిధ వ్యక్తుల  చేతులు మారిన వైనం గుర్తుకు చేస్తుంది.

కోహినూర్ వజ్రం 13వ శతాబ్దం లో కాకతీయ రాజ్యంలో ఉన్న కృష్ణా బేసిన్ లోని  కొల్లూర్ గనుల లో దొరికింది. కొన్ని శతాబ్దాలుగా ఇది వివిధ చేతులు మారింది. 1310 లో అల్లాఉద్దీన్ ఖిల్జీ సేనలు మాలిక్ కపూర్ నాయకత్వం లో కాకతీయ సామ్రాజ్యం పై దాడి చేసినప్పుడు, ఇతర ధనరాసుల తో పాటు కోహినూర్ వజ్రం కూడా ఢిల్లీకి చేరింది.  ఇది తర్వాత ఢిల్లీ సుల్తానులు మరియు మొఘల్ రాజుల వద్ద  ఉండిపోయింది. బాబర్ మరియు హుమాయున్ ఇద్దరు తమ  ఆత్మ కధలలో కోహినూర్ వజ్రం గురించి పేర్కొన్నారు. షాజహాన్ దానిని తన ప్రసిద్ధమైన నెమలి సింహాసనం లో పొదిగినాడు.

పర్షియా రాజు నాదిర్ షా ఢిల్లీని  ముట్టడించి 1739 లో మొఘల్ ఖజానాను దోచుకున్నాడు. అతను మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా నుండి నెమలి సింహాసనాన్ని, కోహినూర్ వజ్రాన్ని స్వికరిoచాడు. మొదటి సారి వజ్రం చూడటంతోటే నాదిర్ షా ఆనందం తో "కోహినూర్” అని అరిచాడు.కోహినూర్  అనగా కాంతి పర్వతం అని అర్ధం. దానికి ఆ పేరు అలా వచ్చింది.
ఒక కథ ప్రకారం నాదిర్ షా ఢిల్లీ నగరాన్ని దోచుకోన్నప్పుడు అతనికి  కోహినూర్ వజ్రం కనిపించలేదు. మొఘల్  చక్రవర్తి దానిని తన తలపాగా లో దాచిపెట్టాడు. అది కనిపెట్టిన  నాదిర్ షా యుక్తిగా స్నేహానికి గుర్తుగా తలపాగాల మార్పిడి ప్రతిపాదిoచాడు. ఆవిధంగా కోహినూర్  వజ్రం నాదిర్ షా వశం  అయినది.

నాదిర్ షా 1747 లో హత్య చేయబడ్డాడు తరువాత, కొహినూర్ వజ్రం అతని సైనికాధికారుల చేతుల్లో పడింది. అహ్మద్ షా దురానీ అనే సేనాని  కోహినూర్ వజ్రం తో దేశం విడిచి పలాయనం చేసాడు.  దశాబ్దాల తరువాత అతని  వారసుడుషా షుజా దురానీ, సిక్కు పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ సహాయం తో ఆఫ్గనిస్తాన్ అమీర్ గా పదవి చేపట్టాడు.అతని  సహాయం మరియు ఆతిథ్యo కు  ప్రతిఫలంగా షా షుజా దురానీ 1813 లో రంజిత్ సింగ్ కు  కోహినూర్ వజ్రం ను బహుకకరించినాడు.

తదనంతరం 1849 లో రెండవ సిక్కు యుద్ధం లో రంజిత్ సింగ్ వారసుడు దిలీప్ సింగ్ ను ఓడించి సిక్కు సామ్రాజ్యాన్ని బ్రిటీష్ వారు   స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆతరువాత  జరిగిన ఒప్పందం లో భాగంగా  కోహినూర్ వజ్రాన్ని  ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున సర్ హెన్రీ లారెన్స్ గ్రహించారు. కోహినూర్ డైమండ్ ను గట్టి భద్రత మధ్య ఆ నాటి బ్రిటిష్ గవర్నర్-జనరల్ డల్హౌసీ ఇంగ్లాండ్ పంపించారు మరియు 3 జూలై 1850 న దానిని క్వీన్ ఎలిజిబెత్ కు సమర్పించారు
1851లో లండన్ హైడ్ పార్క్ లో జరిగిన గ్రేట్ లండన్ ఎగ్జిబిషన్ లో “కోహినూర్ వజ్రం” ప్రజలకు ప్రదర్శించ బడినది. టైమ్స్ పేపర్ ప్రకారం "కోహినూర్ వజ్రం ప్రదర్శనలో ముఖ్యమైనది”.  విక్టోరియా మహారాణి యొక్క భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ ఆ వజ్రం ను కోత కొయిoచి సానబట్టి దాని ప్రస్తుత బరువు 105.6 క్యారెట్ల కు తెచ్చినాడు.

విక్టోరియా మహారాణి రాణి కోహినూర్ ను కిరీటంలో కాకుండా  ఆమె దుస్తుల పిన్నుగా (brooch) గా ధరించారు. ఆమె మరణించిన తర్వాత, కోహినూర్ వజ్రం ను ఆమె కోడలు క్వీన్ అలెగ్జాండ్రా, ఎడ్వర్డ్ VII భార్య 1902లో వారి పట్టాభిషేక సమయాన కిరీటం లో దాల్చినది. 1911 లో జార్జ్ V పట్టాభిషేక సమయాన కోహినూర్ డైమండ్ క్వీన్ మేరీ కిరీటం లో తల దాల్చినది.1937 లో క్వీన్ తల్లి కిరీటం కు (ప్రస్తుతం క్వీన్ ఎలిజబెత్ II యొక్క తల్లి) అలంకరించినది.ఈ కిరీటాలు అన్ని ఇప్పుడు ఆభరణాల గృహాo లో ప్రదర్శించున్నారు. మహారాణి విక్టోరియాకు  కోహినూర్ తో పాటు కానుక గా వచ్చిన అసలు బ్రాస్లెట్ను ఇప్పుడు  ఇక్కడ చూడవచ్చు.

కోహినూర్ వజ్రం గురించి ఒక శాపం ప్రచారం లో ఉంది. "ఈ వజ్రం ధరించిన వ్యక్తి ప్రపంచాన్ని సొంతం చేసుకొంటాడు, కానీ అది కొన్ని దురదృష్టకర సంఘటనలు తెస్తుంది. దేవుడు లేదా స్త్రీ మాత్రమే దానిని  ధరించవచ్చు" ఇది కోహినూర్ వజ్రానికి ఉన్న శాపం. అందువలన విక్టోరియా మహారాణి  కోహినూర్ వజ్రం ను  క్వీన్ మాత్రమే  ధరించే విధంగా వీలునామా రాసింది. రాజ్యం అధిపతి రాజు అయితే అతని భార్య కోహినూర్ వజ్రాన్ని ధరిస్తుంది.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కిరీటపు ఆభరణాలు  ఒక రహస్య ప్రదేశానికి తరలించారు.  తరువాత లండన్ వెలుపల, విండ్సర్ కోట సమీపంలో ఒక సరస్సు లో జార్జ్ VI చే కోహినూర్ వజ్రం దాయబడినది అని బహిర్గతమైంది. దాచిన స్థలం తెలుసిన  వ్యక్తులు రాజు మరియు అతని లైబ్రేరియన్ ఓవెన్ మొర్శేడ్ మాత్రమే

ఈ దిగ్గజ వజ్రం విలువ ఎప్పుడు నిజంగా నిర్ధారించబడ లేదు ఎందుకనగా ఇది ఎల్లప్పుడూ దొంగతనం లేదా మోసం మరియు బహిరంగంగా అమ్మబడలేదు. ఎటువంటి అధికారిక విలువ నిర్ధారించ బడలేదు. నాదిర్ షా తన దండయాత్ర చేసినప్పుడు పర్షియాకు దానిని తీసుకెళ్ళాడు అతని అనుచరుడి మాటలలో "ఒక బలమైన మనిషి నాలుగు రాళ్ళు ఉత్తరన , దక్షిణాన తూర్పు మరియు పడమరవిసిరి ఐదవ రాయిని బలంగా  గాలిలోకి పైకి విసిరిన ఎంత దూరం పోవునో వాటి మద్య దూరం బంగారం తో నింపిన దాని విలువ కోహినూర్ విలువతో సమానం తో  ఉంటుందని అన్నాడు ".

కోహినూర్ వజ్రంను తమకు తిరిగి ఇవ్వాలని భారత్, ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ డిమాండ్ చేస్తున్నవి.  జూలై 2010 లో భారతదేశం సందర్శించినప్పుడు బ్రిటిష్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ యొక్క ప్రకటన ప్రకారం “పై దేశాల వాదన అంగీకరించిన  బ్రిటిష్ మ్యూజియం ఖాళీగా ఉంటుంది "

అంత ప్రాధాన్యత కలది మన కొల్లూరు వజ్రపు గనులలో దొరికిన కోహినూర్ వజ్రం.


No comments:

Post a Comment