చాల మంది
తల్లి-తండ్రులు తమ పిల్లలను ఖరీదైన కాన్వెంట్ లలో చేరుస్తున్నారు. సర్కార్ బడులపై
నమ్మకం పోయిoది. కూలి-నాలి చేసుకొని బ్రతికే వారు కూడా తమ పిల్లలను ప్రవేట్
స్కూల్స్ లో చేరుస్తున్నారు. అక్కడ ఫీజ్లు, డొనేషన్స్ ఎక్కువ అయిన తమ పిల్లలను
అక్కడే చదివిoచుతున్నారు.
చాలా పాఠశాలలో నోట్-బుక్, వర్క్-బుక్
మరియు హోంవర్క్ పుస్తకాలు ఎక్కువుగా ఉండును.
దానితో పిల్లల స్కూల్-బ్యాగ్స్ బరువు పెరుగును. పెరుగుతున్న స్కూల్ బ్యాగ్స్ బరువు పై పాఠశాల నిపుణులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.
స్కూల్స్ లో ముఖ్యంగా ప్రవేట్ స్కూల్స్ లో పాఠశాల సంచి (స్కూల్ బ్యాగ్) బరువు పెరిగినదని
అందువలన పిల్లలపై అధిక భారం పడుతుందని అది వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి
హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువైన స్కూల్ బ్యాగ్ వలన పిల్లల
లో అభివృద్ధి చెందే ఎముకలు దెబ్బతిని వెన్నెముక
రూపం లో మార్పులు రావటానికి ఎక్కువ అవకాశం ఉంది అని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు.
స్కూల్ బ్యాగ్ -దీర్ఘకాల ప్రభావం
బరువైన స్కూల్ బ్యాగ్స్ దీర్గకాలిక హానికర మరియు శాశ్వత ప్రభావాన్ని పిల్లల ఆరోగ్యం
పై కలిగించును. భారీ పాఠశాల
సంచులు మోస్తున్న పిల్లలలో వెన్నెముక
సమస్యలు అభివృద్ధి చెందును. శరీర నిర్మాణం దృష్ట్యా బలహీనమైన స్థానం భుజాలు కాని వీపు కాదు. సరి అయిన స్థానంలో తగిలించుకొని బ్యాగు గణనీయంగా భంగిమ మరియు నడక పై ప్రభావం
కల్పించును. వెన్నెముక స్థానం స్కూల్ బాగ్ బరువు తో మారును.
స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల
లో అభివృద్ధిచెందుతున్న ఎముకల పై, కొన్ని సార్లు వెన్నుముక నిర్మాణం పై ప్రభావం
చూపి దాని స్థానం(position) ను మార్చును.
వెన్నుముక వక్రత (deformation of the spine) ఏర్పడవచ్చు. కొన్నిసార్లు, దీర్ఘ కాలిక శాశ్వత, తగ్గని వెన్ను నొప్పికి దారి తీయవచ్చు
వెన్నెముక వైకల్పము
అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉంది.
వెన్నునొప్పి తో బాధపడుతున్న యువకులకు అది
బహుశా దీర్ఘకాలిక వెన్ను నొప్పి గా మారును
అని ప్రముఖ ఆర్తోపెడిక్ సర్జన్స్ చెబుతున్నారు.
చైనా వైద్య నిపుణులు ఒక అద్యయనం ద్వారా అసమాన
ఏక పట్టీ బ్యాగ్ అయితే శరీర బరువు లో 10%
కంటే తక్కువ బరువు కలిగి ఉండాలని లేదా రెండు పట్టిల బ్యాగ్ అయితే శరీర బరువు లో 20% కంటే తక్కువ బరువు కలిగి
ఉండాలని చెబుతున్నారు. స్కూల్ బ్యాగ్ బరువు వలన పిల్లలు సాదారణంగా పాఠశాల బస్సులు ఎక్కేటప్పుడు
లేదా దిగేటప్పుడు తమ వీపులపై గల పుస్తకాల బ్యాగ్స్
బరువు వలన వంగి దిగుతారు,
పెరిగిన సిలబస్
కొంతమంది ఉపాద్యాయులు స్కూల్ బ్యాగ్ బరువు పై
ఆందోళన వ్యక్త పరుస్తూనే ప్రస్తుత వ్యవస్థలో అది తప్పని సరి అంటున్నారు. అసలు
సమస్య పాఠ్య ప్రణాళిక (కరిక్యులుం) గా (సీబీఎస్ఈ (CBSE)లేదా ఐసిఎస్ఇ(ICSE) ఉంది. పాఠ్య
ప్రణాళిక (కరిక్యులుం) విస్తృతంగా ఉంది. అనేక సబ్జక్ట్స్ రెండు లేక మూడు టెక్స్ట్
పుస్తకాలు కలిగి ఉన్నవి. సోషల్ సైన్స్ మూడు పుస్తకాలు గా ఉంది. ఏది మిస్ కాకూడదని పిల్లలు పాఠశాలకు అన్ని పుస్తకాలు తీసుకుని వస్తారు. పిల్లలు మరియు ఉపాధ్యాయులు ఒక నిర్దిష్ట ప్రణాళిక అనుసరిస్తే
తప్ప పాఠశాల సంచుల బరువు తగ్గదు అని
అంటున్నారు ఒక ఉపాద్యాయురాలు.
"ప్రైవేట్ పాఠశాలలు వాణిజ్య కేంద్రాలుగా మారాయి.
ఎన్సిఇఆర్టి(NCERT) పుస్తకాలు ఉచితoగా ఆన్లైన్ (on-line) లో అందుబాటులో ఉన్నాయి కానీ
పాఠశాలలు తమ వద్ద నుండి లేదా ఒక నిర్దిష్ట పుస్తకాల దుకాణo నుంచి కొనుగోలు చేయాలనీ
సూచించుతారు. పుస్తక దుకాణo లో ఇచ్చే రాయితీలు పాఠశాలకు కమిషన్ గా వెళ్లిపోతాయి
"అని స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ సబ్యులు ఆరోపించుతున్నారు.
"అనేక ప్రవేట్ పాఠశాలలు నోట్ బుక్స్, వర్క్
బుక్స్ మరియు హోం వర్క్ బుక్స్ సూచించును. దానితో స్కూల్ బ్యాగ్ బరువు పెరుగును.
సర్కార్ బడులలో 6 నుండి 10వ తరగతుల కోసం, స్టేట్ సిలబస్ కొనసాగిస్తున్నారు వాటి విద్యార్థులు భారీ పాఠశాల సంచులు తీసుకు రావటం లేదు, అని ప్రభుత్వ జిల్లా ఎడ్యుకేషన్ అధికారి అంటున్నారు.
ఏది ఏమైనా పిల్లలపై స్కూల్ బ్యాగ్ బరువు
తగ్గించాలి లేనియెడల వారి పై శారీరకంగా ఆరోగ్య రిత్య ప్రభావం
కలుగును. వెన్నుముక వక్రత (deformity) ఏర్పడును. స్కూల్ కు వెళ్ళడం వారి పాలిట
శాపం గా మారకూడదు. అందుకు ప్రబుత్వం, విద్య నిపుణులు కలసి పరిష్కారం ఆలోచించాలి.
భావి భారత పౌరుల జీవితం అందకారమయం కాకూడదు.
హలో సార్ చాల మంచి విషయాలు చెప్తున్నారు.. మేము కూడా ఈ కంటెంట్ ఇతరులకు తెలియ చేస్తాం...
ReplyDelete