కాబా చరిత్ర
కాబా ఒక చిన్న, ఘనాకార భవనం. దీని ప్రభావం ముస్లింలు మరియు మానవ చరిత్ర మీద అపారం గా ఉంది. ముస్లింలు ప్రార్థనలు
చేసేటపుడు తమ ముఖాన్ని కాబా దిశవైపు ఉంచి ప్రార్థనలు
చేస్తారు. దీనినే ఖిబ్లా గా వ్యవహరిస్తారు. ఖురాన్
(2:143)లో దీని గురించి
దైవాజ్న కూడా కలదు. ఈ అలవాటు 1400 సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ (స) కాలం
నుంచి ఉంది
కాబా అనగా సాహిత్యపరంగా, అరబిక్ లో గౌరవం మరియు
అధిక ప్రతిష్ట గల స్థలం అని అర్థం. కాబా అనగా ఘనాకారపు గృహం. అరబ్బీ భాషలో
"కాబ్" లేదా "మకాబ్" అనగా ఘనాకారం అని అర్ధము.
అల్లాహ్ ను పూజించే మానవాళి కోసం నిర్మించిన తొలి అల్లాహ్ ఇల్లు కాబా అని దివ్య ఖురాన్ లో చెప్పారు. కాబా ను ప్రథమంగా ఆదమ్ ప్రవక్త నిర్మించారు. తరువాత అది కాలగర్భంలో కలసిపోయినది. అల్లాహ్ ఆజ్ఞతో ఇబ్రాహీం ప్రవక్త తన కుమారుడు ఇస్మాయీల్ తో కలసి దీనిని
పునర్నిర్మించారు. తరువాత ముహమ్మద్(స)
ప్రవక్త కాలం లో దీనిని పునర్నిర్మించారు.
చారిత్రికంగా కాబా 5 నుంచి 12
సార్లు పునర్నిర్మించ బడినది. ఇటివల దీనిని తిరిగి పునర్నిర్మించారు. కాని 'ఇబ్రాహీం' ప్రవక్త తొలిసారిగా 'కాబా' గృహాన్ని నిర్మించారని
ప్రచారంలోవున్నది. కాబా గతం లో ప్రకృతి వైపరీత్యాలకు అనగా వరదలకు, మానవ ఆక్రమణలకు
గురి అయినది.
“కాబా” కు కొన్ని ఇతర పేర్లు కుడా కలవు.
బూడిద నీలం రంగుగల రాళ్ళతో
చతురస్రాకారంలో, మక్కా పర్వతాల మధ్య నిర్మితమైన కట్టడమే కాబా. నలువైపులా నాలుగు
విశేషవస్తువులు గల గృహం. తూర్పువైపున హజ్ర్-ఎ-అస్వద్ ('హజ్ర్' అనగా రాయి, అస్వద్ అనగా నల్లనిరాయి) ఉత్తరం వైపున రుక్న్-అల్-ఇరాఖీ (ఇరాకీ మూల), పశ్చిమాన రుక్న్-అల్-షామి (సిరియన్ మూల), మరియు దక్షిణాన రుక్న్-అల్-యెమని (యెమనీ మూల) గలవు. నాలుగు గోడలూ 'కిస్వాహ్ ' (తెర ) చే కప్పబడిఉన్నవి.
కిస్వాహ్ సాధారణంగా నల్లని తెర, దీనిపై 'షహాద ' వ్రాయబడివుంటుంది.
బంగారపు ఎంబ్రాయిడరీచే ఖురాన్ ఆయత్ లు వ్రాయబడివుంటాయి.
గతం లో సాధారణ
ప్రజలను కాబా లోపలకి
అనుమతించేవారు కానీ ఇప్పుడు అది రాజులకు మరియు అత్యంత ఉన్నత ప్రభుత్వ
అధికారుల కు మాత్రమే అందుబాటులో ఉంది.
కాబా యొక్క కొలతలు:
• తూర్పు గోడ 48 అడుగుల మరియు 6 అంగుళాలు
• హాతీం వైపు గోడ 33 అడుగులు
• బ్లాక్ స్టోన్ మరియు యెమెన్ మూలలో మధ్య వైపు 30 అడుగులు
• పశ్చిమ వైపు 46.5 అడుగులు
కాబా యొక్క పరిమాణం:
1. కాబా ప్రస్తుత ఎత్తు 39 అడుగులు, 6 అంగుళాలు మరియు మొత్తం పరిమాణం 627 చదరపు అడుగులు.
2. కాబా లోపలి గది 13X9 మీటర్లు ఉంటుంది.
3. కాబా యొక్క గోడలు ఒక మీటరు వెడల్పు ఉన్నాయి. ఫ్లోర్ లోపల ప్రజలు తవాఫ్ నిర్వహించడానికి ఉన్న చోటు కంటే 2.2 మీటర్ల ఎత్తున ఉంది.
4. పైకప్పు మరియు సీలింగ్ చెక్క చే తయారుచేయబడి రెండు స్థాయిలు కలిగి ఉన్నాయి. ఇవి స్టెయిన్లెస్ స్టీల్ తో కప్పబడిన టేకు చెక్క తో చేయబడినవి.
5. గోడలు అన్ని రాయి చే తయారుచేయబడినవి . గోడలు బయట మెరుగుపెట్టబడి ఉన్నాయి అయితే లోపల రాళ్ళు, మెరుగు పెట్టకుండా ఉన్నాయి.

ఖాళీగా వదిలిన కాబా స్థలంను
హతీం అందురు. దీనిని కాబాలో కలిపేయాలని ముహమ్మద్ ప్రవక్త(స) అనుకున్నారు.(ముస్నద్
అహ్మద్). అబ్దుల్లా బిన్ అజ్ జుబైర్ కాలంలో
ప్రవక్త కోరుకోనట్లు ఆ ఖాళీ స్థలం కలిపి కాబాను పునర్నిర్మించారు.
అబ్దుల్లా బిన్ అజ్ జుబైర్ ప్రవక్త ముహమ్మద్(స) కోరిక ప్రకారo దానిని ప్రవక్త ఇబ్రహీం యొక్క పునాది మీద నిర్మించారు.
అబ్దుల్లా ఇబ్న్ అజ్ జుబైర్ కాబా కు క్రింది అదనపు సవరణలు
చేసిననాడు:
• కాబా యొక్క పైకప్పు దగ్గరగా ఒక చిన్న కిటికీ కాంతి కోసం ఏర్పటు చేసినాడు.
• నేల స్థాయికి కాబా యొక్క తలుపు జరిపి కాబాకు రెండవ తలుపు జోడించారు.
• కాబా ఎత్తు తొమ్మిది మూరలు అధికము గా చేర్చినాడు దీనితో మొత్తం ఎత్తు ఇరువది మూరలు అయినది.
• దీని గోడలు రెండు మూరల వెడల్పు ఉన్నాయి.
*ముందు ఖురైషుల ద్వారా నిర్మింపబడిన లోపల స్తంభాలు ఆరు బదులుగా మూడు ఏర్పాటు చేసినాడు.
*పునర్నిర్మాణం కోసం ఇబ్న్ అజ్ జుబైర్ కాబా చుట్టూ నాలుగు స్తంభాలు చేర్చినాడు వాటిపై వస్త్రం వేసినాడు.

§ కాబా యొక్క తవాఫ్ (హజ్ యాత్రికులు10-12
తేదీలలో కాబా చుట్టూ ఏడు
సార్లు ప్రదక్షిణాలు (తవాఫ్ ) చేస్తారు
§ ప్రజలు అన్ని సమయాల్లో ఈ
స్తంభాలు చుట్టూ తవాఫ్ చేయడo
ప్రారంభించారు
§ తవాఫ్ పునర్నిర్మాణం
సందర్భంలోను ఆగలేదు.
§ కాబాను సిరియాన్ సైన్యం విద్యంసం చేసిన తరువాత హాజీ అబ్దుల్లా బిన్
జుబైర్ దానిని తిరిగి పునర్నిర్మించారు –బుకారి.
ఖలీఫా అబ్దుల్ మాలిక్ బిన్ మార్వాన్ కాలంలో 74
హిజ్రీ (లేదా 693 గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం) , అల్ హజాజ్ బిన్ యూసుఫ్ అల్-తక్యఫీ,
ఉమయ్యద్ ఖలీఫా అబ్దుల్ మాలిక్ బిన్ మార్వాన్ ఆమోదం తో ఇబ్న్ అజ్-జుబైర్ నిర్మించిన దానిని నేలమట్టం చేసి
ప్రవక్త ఇబ్రహీం యొక్క పాత పునాదు లపై ఖురైష్ ల ప్రకారం పాత నిర్మాణం ఉన్నట్లు
పునరుద్ధరించాడు.
అతను చేసిన
కొన్ని మార్పులు
• నేడు కనిపించే చిన్న ఆకారంలో అది తిరిగి పునర్నిర్మించబడింది
• హతీం బయట పెట్టినాడు.
• పశ్చిమ తలుపు మూసివేసినాడు (దీని సంకేతాలు నేటికీ కనిపిస్తాయి).హతీం ప్రాంతంలో గోడ తీసివేసినాడు.
• ఇబ్న్ అజ్ జుబైర్ కాబా లోపల ఉంచిన చెక్క నిచ్చెన తొలగించబడింది.
• తలుపు యొక్క ఎత్తు ఐదు మూరలు తగ్గించబడినది.

ఖలీఫా అబ్దుల్
మాలిక్ బిన్ మార్వాన్ కాబా కు ఉమ్రా చేయుటకు వచ్చినప్పుడు హదీసుల ప్రకారం ఇబ్న్
అల్-జుబైర్ నిర్మించిన విధానం ప్రవక్త యొక్క కోరిక ప్రకారం ఉన్నాదని విని అతను తన
చర్యల పట్ల చింతించారు.
ఆ తరువాత ఖలీఫా
హరున్ అల్ రషీద్ కాబాను ప్రవక్త మొహమ్మద్(స) కోరినట్లు, అబ్డుల్లా ఇబ్న్
అజ్-జుబైర్ నిర్మించినట్లు తిరిగి
పునర్నిర్మించదలచి ఇమామ్ మాలిక్ ను సంప్రదించినాడు. కానీ ఇమామ్ మాలిక్ సలహాపై నిర్ణయం మార్చుకొనినాడు.
చిన్నచిన్న మరమ్మతు లతో క్రి.శ.966
సంవత్సరాల వరకు అదే నిర్మాణo ఉండిపోయింది.
షాబాన్ 1039
హిజ్రీ లో సుల్తాన్ మురాద్ ఖాన్ సమయంలో భారీ వర్షం, వరద మరియు వడగళ్ళతో కాబా యొక్క రెండు గోడలు పడిపోయినాయి.
ఈ సమయంలో వరద నీరు నేల మీదనుంచి 10 అడుగుల వరకు అనగా దాదాపు కాబా గోడల సగం దగ్గరగా వచ్చినవి.
గురువారం షాబాన్ 1039 హిజ్రీ 20 న, తూర్పు మరియు పశ్చిమ
గోడలు పడిపోయినవి. వరద శుక్రవారం షాబాన్ యొక్క 21 రోజు తగ్గుముఖం చేసినప్పుడు, పరిశుభ్రత ప్రారంభించారు.
మళ్ళీ ఒక తెర అబ్దుల్లా ఇబ్న్ అజ్-జుబైర్
4 స్తంభాలు మీద స్థాపించబడింది మరియు పునర్నిర్మాణం రంజాన్ 26 న
ప్రారంభించారు.
బ్లాక్ స్టోన్ సమీపంలో ఒక గోడ తప్ప మిగిలిన గోడలు
కూల్చివేశారు. 2 జుల్-హిజ్రా 1040 లో
ఒట్టోమన్ ఖలీఫా సుల్తాన్ మురాద్ ఖాన్, యొక్క మార్గదర్శకత్వంలో పునర్నిర్మాణం ప్రారంభం అయినది.
బ్లాక్ రాయి స్థానం నుండి క్రింద వరకు , ప్రస్తుత నిర్మాణం అంతా అబ్దుల్లా ఇబ్న్ అజ్-జుబైర్ లాగానే జరిగింది.
సుల్తాన్
మురాద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణం
సరిగ్గా అబ్దుల్ మాలిక్ ఇబ్న్ మార్వన్ సమయంలో ఖురైష్ ప్రజలు (ప్రవక్త
పదవి మొహమ్మద్ (స) లబించకు ముందు) చేసినట్లు చేసారు. రజబ్ 28-1377 ముందు ఒక
చరిత్రకారుడు మొత్తం కాబా రాళ్ళు లెక్కించారు అవి 1,614 ఉన్నాయి. ఈ రాళ్ళు వివిధ సైజుల వారిగా ఉన్నాయి. కానీ
కనిపించే బయటి గోడ లోపల రాళ్ళు లెక్కించలేదు.
1996 లో కాబా పునర్నిర్మాణo
(సుల్తాన్ మురాద్ ఖాన్ సమయం నుండి) 400 సంవత్సరాల కాలం తరువాత కాబా ప్రధాన పునర్నిర్మాణం మే 1996 మరియు అక్టోబర్ 1996 మధ్య జరిగింది ఈ పునఃనిర్మాణ సమయంలో కాబా నుండి రాళ్ళు మాత్రమే వాడారు. అన్ని ఇతర పదార్థంలు అనగా పైకప్పు, సీలింగ్ మరియు చెక్క మార్చబడినవి.

కాబా లోపల ఏమి
ఉన్నాయి?
• రెండు స్తంభాలు లోపల ఉన్నాయి (ఇతరులు 3 స్తంభాలు అంటారు.)
• పరిమళం వంటి వస్తువులను ఉంచటానికి ఒక టేబుల్ ఒక వైపు ఉంది
• పైకప్పు నుంచి వేలాడుతున్న రెండు లాంతరు-రకం దీపాలు ఉన్నాయి
• 50 మంది ప్రజలు పట్టే స్థలం ఉంది.
• విద్యుత్ లైట్లు లోపల లేవు.
• గోడలు మరియు నేల(ఫ్లోరింగ్) పాలరాయితో ఉన్నాయి
• కిటికీలు లోపల లేవు.
• ఒక్క తలుపు మాత్రమే ఉంది.
• కాబా యొక్క ఎగువ లోపల గోడలు కల్మా వ్రాసిన తెరలు తో కప్పబడి ఉన్నాయి.

సంగ్రహం
. కాబా
అనేక సార్లు పునర్నిర్మించబడింది.
•
కాబా అసలు (original) నిర్మాణం చెక్క తో
జరిగినది.
•
కాబా అసలు నిర్మాణం లో (original) మార్పు (నాలుగు రాతి గోడలు మరియు పాలరాయి
పైకప్పు నిర్మాణం) మక్కా ను పాలించిన
ఒట్టోమన్ పాలనలోజరిగినది.
•
హజ్ర్-ఎ-అస్వద్ (నల్లటి రాయి) మాత్రమే దాని అసలు రూపం లో ఉంది దానిని
కాబా యొక్క తూర్పు మూలలో ఉంచారు.
•
కాబా నిర్మించడానికి (శాంతి మరియు
దీవెనలు అలైహిస్సలాం) హజ్ర్-ఎ-అస్వద్ (నల్లటి రాయి) ప్రవక్త అబ్రహాం ద్వారా ఎంపిక
చేసిన రాయి
• హజ్ కారణంగా మక్కా కు
ప్రపంచ యాత్రికులు అదిక సంఖ్యలో వస్తారు.
• కాబా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.2 బిలియన్ ముస్లింల ఐక్యతకు గుర్తు ఎందుకంటే హజ్ ద్వారా మాత్రమే కాక కాబా ముస్లింలకు ప్రార్థన దిశలో కూడా ఉంది.
• కాబా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.2 బిలియన్ ముస్లింల ఐక్యతకు గుర్తు ఎందుకంటే హజ్ ద్వారా మాత్రమే కాక కాబా ముస్లింలకు ప్రార్థన దిశలో కూడా ఉంది.
No comments:
Post a Comment