30 July 2016

వ్యవస్థాపకత (entrepreneurship) గురించి 6 పాఠాలు


ఇటీవల ఒక పేరుమోసిన బి-పాఠశాల గ్రాడ్యుయేషన్ వేడుకలో మాట్లాడే అదృష్టం వచ్చింది. వేడుక థీమ్ వ్యవస్థాపకత (entrepreneurship) కు  సంభందించినది. ప్రసంగం తయారు చేయడం కోసం కూర్చున్నాను. నాకు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన  నా సొంత స్నాతకోత్సవం గుర్తుకు వచ్చింది.  నేను నా MBA ప్రోగ్రామ్ లో నేర్చుకొన్న ఆరు పాఠాలను మీ ముందు పెడతాను. అవి మీకు ఉపయోగకరం గా ఉండవచ్చు.
నాయకత్వం అంటే త్యాగం (Leadership is sacrifice):
నాయకత్వం అనగానే ముందు మనకు నాయకుడికి ఉoడవలసిన  లక్షణాలు గుర్తుకు వస్తాయి.  MBA  ప్రోగ్రాం ప్రారంభం లో మనం తరచూ ఇందులో నాకు ఏమిటి? అనే ప్రశ్న వేస్తుoడే వాళ్ళం. కాలక్రమేణా MBA ప్రోగ్రాo పూర్తి అయ్యేసరికి ఇతరులకు ఇందులో ఏమిటి అని అడగటo నేర్చుకోన్నాము. నాయుకుడి లక్షణాలు ఆలోచించే కొద్ది నిజమైన నాయకుడు తన వ్యక్తిగత అవసరాలను/ప్రయోజనాలను  త్యాగం చేసి లక్ష్యం కొరకు జీవిస్తాడు అని తెలుస్తుంది. అటువంటి నాయకులు తమ అనుచర గణానికి ఆదర్శం గా ఉండి ప్రేరణ కలిగిస్తారు.
ఓటమి మంచిదే కాని ప్రయత్నించకుండుట కాదు(Failure is Ok; Not trying is not):
మనం మనుషులం! మనలో కొన్ని లోపాలు ఉండవచ్చు. ఈ ప్రపంచంలో వాస్తవాలకు పలితాలకు మద్య అంతరం ఉంది. రోవియా (Rovio) ఆంగ్రి బర్డ్స్(AngryBirds) ఆట ను తయారుచేయడం లో 51సార్లు వైఫల్యాలను ఎదుర్కొన్నాడు, కొన్నిసారు విసుగుతో మానివేద్దాం  అనుకున్నాడు. అతని  పరాజయమే అతనిని  విజేతగా మార్చినది. అతని విజయ గాధ నేటి వ్యవస్థాపుకులకు ఒక ఆదర్శం. ఒక రోజు లో విజయం సాదించ లేము. నిరoతర  కృషి మరియు ప్రయోగాలు మనలను విజయ పథం వైపు నడిపిస్తాయి.
నిరాడంబరంగా ఉండటం (Staying humble)
MBA ప్రోగ్రాం కొన్నిసార్లు మనలో ఆత్మవిశ్వాసం పెంచును మరి కొన్నిసార్లు అధిక విశ్వాసం తో ఉండేటట్లు చేస్తుంది. తత్పలితముగా మనకు "అంతా తెలుసు" అనిపిస్తుంది.  కాని నిజమైన నాయకులకు  అన్ని సమాధానాలను తెలియదు మరియు వారు చాలా అసౌకర్యంగా ఉంటారు అని  గ్రహించడానికి నాకు కొంత సమయం పట్టింది. వారు "నాకు తెలీదు" అని చెప్పడం వారి వినయం ను తెల్పుతుంది. వారి సరిఅయిన ప్రశ్నలు వేసి  సరిఅయిన  సమాధానాలు పొందుతారు. ఎప్పటికప్పుడు మారిపోతున్న వ్యాపార ప్రపంచంలో వినయ ప్రదర్సన పారిశ్రామికవేత్తల తో సహా అందరికి  మంచి చేస్తుంది.
 నిజమైన పిలుపు (Finding your true calling)
వ్యవస్థాపకులకు ఇది చాలా ముఖ్యoగా తెలవవలసిన ప్రధాన అంశం. ఒక ఆలోచన వెనుక చోదక శక్తి(driving force) లేకుండా, అనేక వ్యవస్థాపకులు వారి మార్గం చేరుటలో అనేక చిన్న చిన్న అడ్డంకులను కూడా ఎదుర్కొంటారు.
ఈ గ్రాడ్యుయేషన్ స్పీచ్ లో నేను మీకు ఇచ్చే సలహా ఒకటి ఉంది: "మీ నిజమైన పిలుపు కోసం వెదకండి." “మీ వెనుక ఉండే చోదక శక్తిని(driving force)  తెలుసుకోండి”. మీరు ఎప్పుడైతే దానికోసం వెదకటం ప్రారంబిస్తారో అప్పుడు మీ భావాలు ధారాళం గా ప్రవహించును మరియు అత్యంత ఎక్కువ  ప్రభావం మీ పై పడును. సాధారణంగా చెప్పాలంటే, మీ నిజమైన పిలుపును కనుగొనడానికి మిమ్మల్లి మీరు అనుమతిoచండి.
మీ సంతులితను  కనుగొనండి (Finding your balance)
బిజినెస్ స్కూల్స్ 'పెట్టుబడి పై రాబడి' విషయం లో సమతుల్య స్కోరు కార్డు యొక్క ఉపయోగం బోధిస్తాయి. మన కోసం స్వీయ సమతుల్య స్కోరు కార్డు సృష్టించటం విషయానికి వస్తే మనలో చాలా కొద్దిమంది మాత్రమె  మన ఆరోగ్యం, సంపద, సంబంధాలు మరియు ఆర్థిక పరిస్థితి  గురించి తెలుసు కొంటారు. అంతుచిక్కని విజయ శోధన లో అనేక మంది ఆరోగ్యo పాడు చేసుకొని, చెదిరిన కుటుంబాలు  మరియు పాడైన సంబంధాలు తో ముగుస్తారు. ఆరోగ్యం రిత్యా వ్యవస్థాపకత ఒక ఓర్పు క్రీడ వంటిది.  బలమైన భౌతిక మరియు మానసిక గుణములు  లేకుండా  విజయం సాదించ లేరు. విజయానికి మార్గాలు ప్రత్యేక స్కూల్స్ ద్వారా నేర్చుకోలేము.
 అభివృద్ధి చెందే అభిప్రాయం ఏర్పరచుకోండి (Developing a growth mindset)
మన చుట్టుపక్కల వాటి పై మనకు నియంత్రణ లేదు మరియు విబిన్నపరిస్థితులలో  ఎలా స్పందించాలో  మనకు తెలియదు. పారిశ్రామిక వేత్త గా కొన్ని సవాళ్ళు మిమ్ములను  మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తోస్తాయి. అభివృద్ధి చెందే అభిప్రాయం/కోరిక   ఈ సవాళ్ళను ఎదుర్కొని మీ బలo విస్తరించేందుకు మరియు పుంజుకొనుటకు  అనుమతిస్తుంది. వెళుతున్నది కఠినమైన దారి అయినప్పుడు మానసికంగా శారీరకంగా బలమున్న వారే ముందుకు వెళ్ళగలరు.
అంతిమ ఆలోచనలు (Final thoughts)
ముందు కంటే ఎక్కువ ఇప్పుడు మనకు ఉద్వేగభరిత సమతుల్యత,విధేయత మరియు ఇతరులతో కలసి పనిచేసి విజయాలు మరియు వైఫల్యాలు ఎదుర్కొనే   ఆరోగ్యకరమైన దృక్పధంతో ఉన్న వ్యవస్థాపకుల/నాయకుల  అవసరం ఎంతైనా ఉంది. నేను అన్ని పాఠశాలలు ( బిజినెస్ స్కూల్స్) ఈ పాఠాలు పై  దృష్టి పెట్టాలని నమ్ముతాను. నాయకత్వ బాద్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న పారిశ్రామిక వేత్తలు, నాయకులకి ఇది  చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము.

వినయపూర్వకoగా ఉండండి  మరియు నిరంతరం  నేర్చుకోoడి.  విష్ యు బెస్ట్ అఫ్ లక్


No comments:

Post a Comment