25 July 2016

మక్కా యొక్క చరిత్ర




4,000 సంవత్సరాల క్రితం,   జనావాసాలు కల  పాలస్తీనాభూమిని విడిచి ప్రవక్త అబ్రహాం (అలైహి) ను ఒక బంజరు భూమికి వెళ్ళవలసినదిగా అల్లాహ్ ఆజ్ఞాపించినాడు ఆ బoజరు భూమి ఆ తరువాత మక్కా గా పిలువబడినది. ప్రవక్త అబ్రహాం (అలైహి) తన భార్య హగర్ మరియు కుమారుడు ప్రవక్త ఇష్మాయేలు (అలైహి)ను తన తో పాటు   తోడ్కొని వచ్చారు.ఆ తరువాత అల్లాహ్  ప్రవక్త అబ్రహాం (అలైహి ) ఒక్కడినే పాలస్తీనా కు తిరిగి వెళ్ళమని  ఆజ్ఞాపించారు.

హగర్ ఆమె బిడ్డ ఇస్మాయిల్  (అలైహి) దాహం తీర్చడం కోసం నీటి కొరకు  సఫా మరియు మర్వాల కొండల మద్య  ముందుకు వెనుకకు  ఏడు సార్లు పరిగెత్తేను. జమ్ జమ్ ఊట నీరు హటాత్తుగా అంతుబట్టని రీతి లో ఆమె బిడ్డ యొక్క అడుగుల వద్ద ఊరినది.                                                                                                                                                                                                    
అల్లాహ్ ప్రవక్త అబ్రహాం (అలైహి) మరియు ప్రవక్త ఇష్మాయేలు (అలైహి) కు మక్కా లో ఒక ప్రార్థనా గృహనిర్మాణంలో చేయమని  ఆజ్ఞాపించాడు, అప్పటినుంచి ఆ గృహం కాబా అని పిలువబడుతుంది. ప్రవక్త ముహమ్మద్ (స) ఇస్లాం యొక్క రెండు పవిత్రమైన నగరాలలో ఒకటిగా మక్కాను రుపొందించెను.

మక్కా లోని పవిత్ర మసీదు అల్ హరామ్ అనేక సార్లు విస్తరించ బడినది. ఇది 10.270 చదరపు మీటర్ల నుండి 1960 లో 1,60,000 చదరపు మీటర్ల వరకు ఉమయ్యద్ రాజవంశం కింద విస్తరించబడింది. హజ్ జరిపే   యాత్రికుల  సంఖ్య 1920 లో 1,00,000 నుండి 1950 లో 2,00,000 వరకు పెరిగింది.నేడు 40 లక్షలకు పెరిగింది.మసీదు 1960 లో అల్ హరామ్ మసీదు లో హజ్ జరిపే 4,00,000 యాత్రికులకు ప్రార్ధన సౌకర్యం కల్పించినది.ఉమయ్యద్ రాజవంశం ముందు  నుంచే కాబా కిస్వాః అనే ఒక నల్ల గుడ్డ తో కప్పబడి ఉండేది.ఉమయ్యద్ రాజవంశం యొక్క పాలనలో కాబా ను కప్పే నల్ల గుడ్డ (కిస్వాః) పై దివ్య ఖురాన్ ఆయతులు లిఖించడం ఆరంభమైనది.

కాబా రూపం అనేకసార్లు మార్చబడింది.
కాబా నిర్మాణ  శైలి మరియు కాబా ద్వార తాళాలు చరిత్రలో అనేకసార్లు మార్చబడినవి.
కాని హజ్ చేసే విధానం మాత్రం చరిత్ర లో ఎన్నడు మార్పు కాలేదు.
కాబా యొక్క తాళాలకు ఇస్లామిక్ చరిత్రలో ప్రత్యేక అర్థం ఉంది. మక్కా మరియు మదీనా వ్యవహారాల్లో చివరి మాట తాళాల బాద్యత కలిగిన వారిదే.
మర్ఖం అబ్రహం యొక్క గాజు కేసింగ్ చరిత్ర లో అనేకసార్లు మార్చబడింది.కాబా ముందు కుడి వైపు జమ్ జమ్ బావి ఉన్న  భవనం 1955 లో మరమత్తుల నిమిత్తం కూల్చివేశారు, మరియు మరమ్మత్తు మొదటి దశలో జమ్ జమ్ బావిని ఒక క్లిష్టమైన భూగర్భ నీటి పంపిణీ వ్యవస్థ తో అనుసందిoచ బడినది.

అందరు యాత్రికులకు జమ్ జమ్ నీరు అపరిమితoగా  సరఫరా చేయుట  కోసం రెండవ దశ నీటి పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పనులు  1976 లో పూర్తయినవి.
మూడవ దశ నీటి పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పనులలో  భాగంగా ఒక శక్తివంతమైన నీటి  పంప్ వ్యవస్థను  1980 లో ఏర్పాటు చేయడం అయినది.
శాస్త్రీయ అధ్యయనం ప్రకారం జమ్ జమ్ నీరు సాధారణ నీటి కంటే ఎక్కువ కాల్షియం మరియు మెగ్నీషియం కలిగి ఉందని కనుగొన్నారు.
జమ్ జమ్ నీటి రుచి దాని ఆరంభం నుండి ఎప్పుడూ మార్పు చెందలేదు.
యాత్రికులకు మక్కా మరియు మదీనా ప్రధాన ప్రవేశ ముఖ ద్వారం గా జెడ్డ  మారింది.
ఆధునిక మౌలిక వసతుల కల్పన మక్కా యాత్ర యాత్రికులకు చాలా వేగంగా మరియు సులభంగా అయ్యేటట్లు  చేసింది.

పవిత్ర ఖురాన్ కలిగిన రాయితో  చేసిన ఒక వంపు-వంటి(ఆర్చ్) భవనాన్ని మక్కా ప్రవేశానికి  గుర్తుగా 1986 లో ఒక రహదారి మీద నిర్మించారు.
మక్కా సముద్ర మట్టానికి 360 మీటర్ల ఎత్తన కొండలు మరియు పర్వతాలు చుట్టూ కలిగి ఉంది.కాబా మక్కా మద్య లో ఉన్నది.
అల్ హరామ్ మసీదు (గ్రాండ్ మసీదు) యొక్క భౌతిక రూపo చరిత్రలో అనేక సార్లు మార్చబడింది..అల్ హరామ్ మసీదు (గ్రాండ్ మసీదు) మధ్యలో క్యూబ్ ఆకారంలో కాబా నిర్మాణం ఉంది.

ఇస్లాం   ఆరంభ దశలో కాబా పై పట్టుతో తయారుచేయబడిన  ఒక సాదా నల్లని వస్త్రం కప్పి ఉండేది.ఉమయ్యద్ రాజవంశం కిస్వా పై పవిత్ర ఖురాన్ శ్లోకాలు వ్రాయడం మరియు కిస్వాః ను ప్రతి సంవత్సరం రెండు సార్లు మార్చే   ఒక కొత్త పద్దతి  ఆచరణలో పెట్టారు.

అబ్బాసిడ్ రాజవంశం కిస్వా ను కేవలం పాత దాని పై కొత్తది పెట్టడం కాకుండా కొత్త కిస్వాః ను పెట్టె పద్దతిని ప్రవేశ పెట్టారు.  ఫాత్తమిడ్(Fattamid)రాజవంశం వారు  పవిత్ర ఖురాన్ శ్లోకాలు ఉన్న  ఉన్నతమైన కిస్వాః (Kiswah) సృష్టించడానికి ఒక ప్రత్యేక కిస్వాః (Kiswah)ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం అదే పద్దతి కొనసాగు తుంది. ఒక కిస్వః (Kiswah) ఉత్పత్తి దాదాపు ఎనిమిది నెలల పాటు  యాభై నిపుణులైన పనివారు చే తయారు చేయ బడుతుంది.ఒక కిస్వాః (Kiswah) ఉత్పత్తి ఖర్చు 4.5 మిలియన్ల డాలర్లు కంటే ఎక్కువ.
హజ్ జరిపే  యాత్రికులు సంఖ్య  గత శతాబ్దం కాలం లో పెరిగింది.
సౌదీ ప్రభుత్వం కాబా పునరుద్దరణ పనులు విజయవంతంగా నిర్వహించినది మరియు హజ్ జరిపిన యాత్రికుల యొక్క సౌకర్యం మరియు భద్రతకు అనేక కార్యక్రమాలు చెప్పట్టినది.
కాబా నిర్మాణం అనేక సార్లు జరిగింది. ప్రారంభ సమయం లో కాబా నిర్మాణం చెక్కతో చేయబడినది. ఒరిజినల్ నిర్మాణం నాలుగు రాతి గోడలతో మరియు చలువ రాయి ఫ్లోరింగ్ తో ఆటోమన్ సుల్తాన్ల పాలనా కాలం లో జరిగింది.
హాజర్ అల్-అస్వద్ (బ్లాక్ స్టోన్) ఒక్కటే పూర్తిగా తన ఒరిజినల్ రూపం లో ఉంది మరియు అది కాబా యొక్క నాలుగు మూలల లో ఒక చోట పొదగబడినది. హాజర్ అల్-అస్వద్ (బ్లాక్ స్టోన్) స్వయముగా ప్రవక్త ఇబ్రహిం(అలైహి)  గారిచే కాబా నిర్మాణం కొరకు ఎన్నిక చేయబడినది. హజ్ యాత్ర సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల యాత్రికులు కాబా దర్శించుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 కోట్ల మంది ముస్లిం ల ఐక్యతకు చిహ్నం కాబా. అది ముస్లిములు ప్రార్ధించే దిశను తెలుపును. 

సూక్షంగా కాబా వివరాలు:

·        మక్కా ప్రభుత్వం=ప్రాంత గవర్నర్ మేయర్ ఖలీద్ అల్ ఫైసల్  
·        అమీర్ =ఒసామా అల్ బార్
·        జనాభా 2010 లో = 15,34.731 ప్రజలు
·        హజ్ చేసే ప్రజల సంఖ్య= 2012 లో 31,61,573 ప్రజలు
·        ప్రపంచంలో అత్యంత ఖరీదైన భూమి = చదరపు మీటరుకు భూమి ధర (మక్కా, సౌదీ అరేబియా: మస్జిద్ ఆల్-హారం కు  సమీపంలో భూమి ధర)
·        మక్కా (ఏరియా) యొక్క పరిమాణం=మెట్రో అర్బన్=500 చదరపు మైళ్ళు / 1294 చదరపు కిలోమీటర్ల
·        మక్కా మెట్రో = 330 చదరపు మైళ్ళు / 854 చదరపు కిలోమీటర్ల

·        సమీపంలోని నగరాలు =మక్కా నుండి దూరం
జెడ్డ 42 మైళ్ళ (68 km)
మదీనా 209 మైళ్ళు (337 కిలోమీటర్లు)
రియాద్ 493 miles (793 km)
·        మక్కా ఎయిర్-పోర్ట్ దూరం కు సమీపం లోని ఎయిర్-పోర్ట్ లు =
కింగ్ అబ్దుల్ అజిజ్ అంతర్జాతీయ విమానాశ్రయం జెడ్డ లో  46 మైళ్ళ (74 km)
తైఫ్ లో తైఫ్(Ta'if)ప్రాంతీయ విమానాశ్రయం 47 మైళ్ళ (75.6 km)
మదీనా లో ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజిజ్ విమానాశ్రయం 217 మైళ్ళ (349 km)
కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్  రియాడ్ 501 మైళ్ళు (805 కిలోమీటర్లు)
దమ్మం లో కింగ్ ఫాహ్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం 720 మైళ్ళ (1160 కిమీ)










No comments:

Post a Comment