నేడు మనం తినే కూరగాయాలు మరియు తృణ ధాన్యాలలో ఉదా: మెంతి కూర మరియు కినోవా (quinoa)
ను సాధారణం గా దిగుమతి చేసుకోబడినవి
అనుకొంటాము కానీ బంగాళాదుంప, ఉల్లిపాయ, టమోటా మరియు మిరప లాంటి సాధారణ ఆహార పదార్ధాలు కూడా ఇతర దేశాల
నుంచి వచ్చినవే.
గత వంద సంవత్సరాలకు పైగా శాస్త్రవేత్తలు
అందరు కలిసి పురావస్తు,
భాషా, వర్గీకరణ, జన్యు మరియు ఇతర సమాచారం ప్రకారం అన్ని రకాల పంటలు ఎక్కడ నుంచి వచ్చాయో గుర్తించడానికి
అధ్యయనం చేసారు. ఉష్ణ మండల అంతర్జాతీయ వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తలు( International Center
for Tropical Agriculture (CIAT).) 177 దేశాలలో 132 రకాల పండ్లు మరియు
కూరగాయల మీద జరిపిన ఒక అధ్యయనం ద్వారా భారతదేశం లోని మొక్కల ద్వారా ఉద్భవించే ఆహార వస్తువులలో మూడవ వంతు -తృణ ధాన్యాలు, కూరగాయలు,
పండ్లు, మసాలా దినుసులు, నూనెలు, చక్కెర తదితరమైనవి ఇంకో చోట పుట్టి భారత ఉపఖండానికి శతాబ్దాలుగా
వాణిజ్య౦ లేదా వలసల ద్వారా వచ్చినవి.
పోషక విలువలలో ఈ విదేశి ఆహార పదార్ధాలు జాతీయ ఆహార ఉత్పత్తిలో 45%దాకా ఉంటాయి. ఇది కేవలం భారతదేశం లోనే కాదు. ప్రపంచ
స్థాయిలో తినే ఆహార కేలరీలలో
66%విదేశీ మూలం గల ఆహార పదార్ధాల నుంచి వచ్చినవే. సగటున ఉత్పత్తి
అయ్యే ఆహార పదార్ధాలలో 71% ఉత్పత్తి విదేశి ఆహార పదార్ధలదే.
అట్టా మరియు ఆపిల్, ఆలూ నుండి, అనేక ఆహార పదార్ధాలు విదేశాల్లో పుట్టినవి అని ఒక అధ్యయనం కనుగొంది. భారత ఉపఖండంలో వరి, జొన్న మొదలగు
తృణ ధాన్యాల నుండి చెరకు, అరటి,
మామిడి, నిమ్మకాయలు, చేమ దుంపలు, పప్పులు, బియ్యం, వంటి ఆహార ధాన్యాల ఉత్పత్తికి మూలంగా ఉంది. .
కానీ కొన్ని అత్యంత ప్రాచుర్యం గల ఆహార పదార్ధాలు ఇక్కడ పండినవి కావు. మధ్య ఆసియా నుండి ఉల్లిపాయలు (పశ్చిమ ఆసియా నుండి), బంగాళదుంపలు, మొక్కజొన్న మరియు టమోటాలు (దక్షిణ అమెరికా ఆన్డియన్ ప్రాంతం నుండి), మిరపకాయలు (సెంట్రల్ అమెరికా నుండి), రేప్సీడ్, ఆవాలు మధ్యధరా ప్రాంతం నుండి వెల్లుల్లి మరియు ఆపిల్, గోధుమ నిజానికి పశ్చిమ ఆసియా లో పుట్టి కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశం వచ్చినవి.
కానీ కొన్ని అత్యంత ప్రాచుర్యం గల ఆహార పదార్ధాలు ఇక్కడ పండినవి కావు. మధ్య ఆసియా నుండి ఉల్లిపాయలు (పశ్చిమ ఆసియా నుండి), బంగాళదుంపలు, మొక్కజొన్న మరియు టమోటాలు (దక్షిణ అమెరికా ఆన్డియన్ ప్రాంతం నుండి), మిరపకాయలు (సెంట్రల్ అమెరికా నుండి), రేప్సీడ్, ఆవాలు మధ్యధరా ప్రాంతం నుండి వెల్లుల్లి మరియు ఆపిల్, గోధుమ నిజానికి పశ్చిమ ఆసియా లో పుట్టి కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశం వచ్చినవి.
ఎలా మరియు ఎప్పుడు ఇవి భారతదేశం చేరాయి? ప్రపంచం లోని 23 ప్రాంతాల్లో వేర్వేరు మొక్కలు ఉద్భవించాయి కాని అవి నేడు ప్రపంచ
వ్యాప్తంగా వ్యాప్తి చెంది ఉన్నాయి అని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.
ఆపిల్ (సెంట్రల్ ఆసియా) ప్రాంతం లో మొదట పండించబడినవి కాని జన్యుపరంగా నేటి ఆధునిక ఆపిల్ తూర్పు ఆసియా మరియు యూరప్
నుండి అభివృద్ధి చెందినది. ఆయిల్ పామ్
పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికా నుండి వచ్చింది అలాగే నవ్యఉష్ణమండల జన్యు భిన్నత్వం యొక్క
మిశ్రమం వలన పామ్ యొక్క రెండు కొత్త జాతులు ఉద్భవించినవి
కొన్ని పంటలు మరియు వైవిధ్యం మరియు వాటి ప్రాధమిక ప్రాంతం:
కొన్ని పంటలు మరియు వైవిధ్యం మరియు వాటి ప్రాధమిక ప్రాంతం:
* సెంట్రల్ అమెరికా: మిరప,మొక్కజొన్న,
బీన్స్, బొప్పాయి, పామ్ ఆయిల్
* పశ్చిమ ఆసియా: గోధుమ, ఉల్లి, బఠానీలు, క్యారెట్లు, బచ్చలికూర, ద్రాక్ష
* మధ్యధరా: రేప్ సీడ్, ఆవాలు
* దక్షిణ అమెరికా: పొటాటో, టమోటో, గుమ్మడికాయ
* మధ్య ఆసియా: వెల్లుల్లి, ఆపిల్
* ఈస్ట్ ఆసియా: క్యాబేజీ, నారింజ, సోయాబీన్
* ఆఫ్రికా: జొన్న, కాఫీ, Cowpeas(బొబ్బర్లు)
* దక్షిణ తూర్పు ఆసియా: అరటి, కొబ్బరి.
మనము ప్రపంచానికి ఏమి ఇచ్చింది: అరటి, చిక్పా, దాల్చిన, లవంగాలు, కొబ్బరి, దోసకాయ, తేదీ, వంకాయ, అల్లం, నిమ్మకాయ, కాయధాన్యాలు, మామిడి, పుచ్చకాయ, జొన్న, వరి, నువ్వులు, చెరకు,
టీ, పెండలం
No comments:
Post a Comment