.
.
ఉద్యోగం పొందటానికి ముందు మీరు మీ CV/రేజ్యుం ని మంచిగా తయారు చేయాలి. అది మీ యొక్క
అభిరుచిని, మీ వైఖరిని నిర్దేశించేదిగా ఉండి మీకు ఇంటర్వ్యూ పిలుపు సాదిoచేదిగా ఉండాలి.
నేను అధ్యాపక వృతి లో
ఉన్నాను మరియు నా శిష్యుడు ఒక బహుళ జాతి సంస్థ HR మేనేజర్ గా ఉన్నాడు. అతనిని నేను "మీరు వివిధ
స్థానాలకు అభ్యర్ధులను ఎంపిక చేసేటప్పుడు సాధారణం గా ఒక CV/రేజ్యుం పరిశిలనకు
ఎంత సమయం తిసుకొంటారని ప్రశ్నించాను?. "సాధారణం గా ఒకటి లేదా రెండు
నిమిషాల సమయం తీసుకొంటామని” అతను
బదులిచ్చినాడు.
ఎంపిక చేసేవారు (రిక్రూటర్లు)
ఒక CV/రేజ్యుం
చూడటానికి ఒక నిమిషం కన్నా తక్కువ సమయం ఖర్చు చేసినప్పుడు, ఉద్యోగం కోసం
దరఖాస్తు చేసేవాళ్ళకు మంచి ఉత్తమ
CV/రేజ్యుం తయారు చేయడం ఒక పరీక్ష లాoటిది. అబ్యర్ది ఎంపిక
చేసేవారిని (రిక్రూటర్లు) మెప్పించే
విధంగా CV/రేజ్యుం తయారు చేసి కాల్ లెటర్ పొందటం లో విజయం పొందాలి.
ఇటీవల నేను క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం డిగ్రీ విద్యార్థులు రాసిన వందల
కొద్ది CV/రేజ్యుం లు పరిశీలించాను. చాలా
మంది విద్యార్ధులకు ఒక CV/రేజ్యుo కు, ఒక బయో-డేటా కు మద్య ఉన్న వ్యతాసం మరియు మెప్పించే విధంగా
వాటిని తయారు చేసే విధానం తెలియదు అనిపించింది.
ఒక రేజ్యుం లేదా ఒక CV అబ్యర్ది యొక్క
వ్యక్తిగత విద్య అర్హతలు, పని అనుభవం, వృత్తిలో సాదించిన మరియు ఇతర విజయాలు తెల్పును.
ఒక బయో-డేటా పుట్టిన
తేది, మతం, లింగం, జాతీయత, వైవాహిక స్థితి, హాబీలు మొదలగు నవి తెల్పును.
ఒక రేజ్యుం లేదా ఒక CV ఉద్యోగం నకు
దరఖాస్తు చేయటానికి సంభందించినది మరియు ఒక బయో-డేటా అనేక ఇతర అవసరాలకు
ఉద్దేశించినది.
ఈ నాడు ఉన్న జాబ్ మార్కెట్ లో ఉద్యోగం
పొందాలంటే ప్రధాన అంశం మంచి CV/రేజ్యుం తయారు చేయడం. CV/రేజ్యుం ను సొంతంగా లేదా
కొన్ని నమూనా CV/రేజ్యుం లను చూసి తయారు చేయవచ్చు. ఒక వ్యక్తి యొక్క CV/రేజ్యుం పరిశీలన
ద్వారా ఆ వ్యక్తి లో సొంత సృజనాత్మకత ఉన్నదా లేదా అనేది అర్ధం అవుతుంది.
ఒక మంచి CV/రేజ్యుం లో క్రింది 10 విభాగాలు ఉంటాయి:
Ø పేరు మరియు సంప్రదింపు
వివరాలు (చిరునామా, ఇమెయిల్, ఫోన్):
Ø లక్ష్యం:
Ø విద్య మరియు
అర్హతలు:
Ø ఇంటర్న్షిప్పులు
/ పని అనుభవం:
Ø విజయాలు
(విద్యాపరమైన మరియు ఇతర):
Ø నైపుణ్యాలు
(ప్రధానంగా టెక్నికల్):
Ø ఆసక్తి ఉన్న
ఏరియా లు (ఉద్యోగం సంబంధించిన):
Ø బలాలు (strengths): (కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్, నాయకత్వం, కంప్యూటర్, మొదలైనవి)
Ø ఆసక్తులు మరియు
సూచన (interests and reference): (రెండు రిఫరీలు, వారి విశిష్టత
మరియు వారి సంప్రదింపు వివరాలు,వారి పేర్లు:. ఇమెయిల్ మరియు ఫోన్ నంబర్)
వివిధ స్థానాల కోసం
దరఖాస్తు CV లో ఏమి రాయాలి
అనేది అబ్యర్ధులకు తెలిసి ఉండాలి. వారి CV లో చెప్పిన వాటి ఆధారంగా ఇంటర్వ్యూ కోసం ఎంపిక
ఉంటుంది అని వారికి తెలుసి ఉండాలి. కొన్ని సమయాలలో ఒక CV ఆకట్టుకునేది గా
ఉండవచ్చు, కానీ అభ్యర్థి
వైఖరి, విజ్ఞానం మరియు
నైపుణ్యాల వారి CV తో మ్యాచ్ కాక పోవచ్చు. అభ్యర్థులు వాస్తవికo గా
తమను తాము ప్రోజెక్ట్ చేసుకోవాలి. ఒక అభ్యర్థి తన CV లో తనలో కొన్ని నైపుణ్యాలు ఉన్నాయని పేర్కొంటే
అతను/ఆమె వాటికి సంబంధించిన ప్రశ్నలు
ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.
కొంతమంది అబ్యర్ధులు ప్రతిదాంట్లో
తమని తాము అత్యుత్తమoగా అంచనా వేసుకొంటారు. వారి
CV అతిశయోక్తులతో నిండి అతిగా ఉంటుంది. వారి
వాణి దూకుడుగా సoదర్భానుసారంగా ఉండదు. వారి CV లు కొoతమంది రిక్రూటర్లు ఆకట్టుకొని వారు ఎంపిక అవవచ్చు కానీ వారు ఇంటర్వ్యూ లో బాగా చేయగలరు మరియు ఎంపిక కాగలుగుతారు అనేది సందేహాస్పదం.
కొంతమంది
అబ్యర్ధులకు తమను తాము ఎలా ప్రోజెక్ట్
చేసుకోవాలో తెలియదు. వారికి చాలా
పరిజ్ఞానం, నైపుణ్యాలు మరియు వారు కోరుకొన్న
ఉద్యోగం పొందడం కోసం కావాల్సిన వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ లక్షణాలు కలిగి
ఉన్నప్పటికీ, వారు CV ని యుక్తమైన
పాయింట్లుతో తయారు లేరు. వారు తమను తాము ఎలా ఉద్యోగ విపణిలో అమ్ముకోవలో తెలియదు. వారి CV లో తనిఖీ చేసే వ్యక్తి యొక్క దృష్టిని ఆకర్షించడానికి కావలసిన అన్ని ముఖ్య విషయాలను చేర్చరు. CV
యొక్క టోన్ తగిన విధంగా
యుక్తంగా ఉన్నప్పటికీ వారు తమ నిరాడంబరమైన మరియు స్వీయ మౌన విధానం పాటించడం వలన
రిక్రూట్ కారు.
కొతమంది అబ్యర్ధులు వ్యక్తులు
నాణ్యతలేని పద్ధతిలో వారి CV
సిద్ధం
చేసుకొంటారు. వారి "డోంట్ కెర్” వైనం ఆ CV లో తెలుస్తుంది. భాష తగనిదిగా ఉండి మరియు టోన్ అనైతికoగా వృతికి
తగ్గినట్లుగా ఉండదు. ఇటువంటి CV లు, వాస్తవికత
లోపించి అక్షరదోషాలు మరియు కాపీ డేటా తో నిండి ఉంటాయి.
కొంత మంది అబ్యర్దుల CV ఒక ప్రొఫెషనల్
పద్ధతిలో ఉంది వారు మర్యాద లాంగ్వేజ్ ను ఉపయోగిస్తారు.వారి అనుకూల వైఖరి వారి CV లో ప్రతిబింబిస్తుంది. టోన్ దృఢమైన మరియు సరైనదిగా
ఉంటుంది. వారి CV అన్ని విషయాలు
తెల్పుతూ ఉద్యోగ విపణిలో విజయవంతంగా తమ్ము తాము అమ్ముకొనే విధానం వారికి తెలుసు.
మీ CV మిమ్మల్లి ఇంటర్వ్యూ
ప్యానెల్ వద్దకు తీసుకు వెళ్ళాలి. మీరు ఎలా గెలిచే CV/రేజ్యుం తయారు చెయ్యాలి?
ఇక్కడ ఒక చెక్-లిస్టు
ఉంది గమనించండి:
Ø CV మీరు దరఖాస్తు చేసే ఉద్యోగానికి తగినట్లు గా రూపొందించబడినదా? మీరు ముఖ్యమైన
సమాచారం అంతా అందులో పొందుపరచారా?
Ø మీరు స్పష్టంగా మీ లక్ష్యం పేర్కొన్నారా? ఇక్కడ లక్ష్యం మీ
CV పంపే ప్రయోజనంను సూచిస్తుంది. మీ 'కెరీర్ లక్ష్యం' మీ అప్లికేషన్ లక్ష్యం' కు భిన్నంగాఉండవచ్చు.
Ø మీరు మీ సానుకూల దృక్పదాలను
(మీ సహకార మరియు సహకార ప్రకృతి) అభిరుచులను బహిర్గతం చేసారా?
Ø అది ఒక మృదువైన మరియు
ప్రొఫెషనల్ ప్రదర్శన చూపుతుందా? రిక్రూటర్లు ను ఆకర్షిస్తుందా? మీరు మీ CVని సరిచూసుకున్నారా?
Ø స్పెల్లింగ్
తప్పులు లేకుండా ఉన్నాదా?
Ø క్యాపిటల్స్
సరిగా ఉపయోగించారా? (పేర్లు మొదటి
అక్షరం తప్ప అనవసరమైన క్యాపిటలైజేషన్ మానుకోండి)
గ్రామర్
Ø మీరు మీ CV లో క్లిష్టమైన, పెద్ద పదాలను ఉపయోగించకండి. (కో-కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ వంటి
పదాలకు బదులు "ఆసక్తి ఉన్న ప్రాంతాలు
" "నైపుణ్యాలు", "బలాలు" లేదా
"వ్యక్తిగత లక్షణాలను" వంటి పదాలను ఉపయోగించండి.)
Ø మీ CV సరైన సబ్-హెడ్డింగ్స్ మరియు సరైన కంటెంట్ తో ఉన్నదా?
Ø మీరు శీర్షికలు, సబ్-హెడ్డింగ్స్
కు సరైన ఫాంట్ పరిమాణం మరియు సబ్-హెడ్డింగ్స్ క్రింద కంటెంట్ ఉపయోగించారా?
Ø మీరు మధ్యవర్తులగా(reference)
చెప్పిన వారి నుండి అనుమతి తీసుకున్నారా? వారి ఈ-మెయిల్ మరియు ఫోన్ నంబర్ వివరాలు ఉన్నాయా?
Ø మీ CV పరిమాణం రెండు A4 పేజిల కంటే
ఎక్కువ పేజీలు ఉండరాదు?మీరు మీ CV పై సంతకం చేశారా?
(మీరు ఒక డిక్లరేషన్ ఇచ్చి ఉంటే)
Ø మీ CV మీ వైఖరి ని తెల్పుతుంది. మీ CV మీమ్మల్లి
ప్రతిభిoచుతుంది. దాన్ని అవసరమైన సార్లు ఫైన్ ట్యూన్ (సరిచేయండి)
అభ్యర్థులు వాస్తవికoగా తమ్ము తాము ప్రొజెక్ట్ చేసుకోవడం తెలిసుండాలి
.
No comments:
Post a Comment