26 August 2016

ఒలింపిక్ గేమ్స్ యొక్క పరిణామ క్రమం (The Evolution of Olympic Games)



ఆధునిక యుగంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కు విద్యారంగంలోనే కాక  మన సాధారణ జీవితంలో కూడా చాలా ముఖ్యమైన మరియు ప్రత్యేకమైన  స్థానం ఉన్నది. మనము విద్యా సంస్థలు లేదా వివిధ రంగాల్లో పని చేస్తున్నా స్పోర్ట్స్ మరియు గేమ్స్ విషయాలకు సంభందించి మాత్రం  దూరంగా ఉండలేము. క్రీడల వలన శారిరక ఆరోగ్యం మెరుగు పడును అను వాడుక అందరికి తెలిసిందే. క్రీడలు మన  జీవితం యొక్క ఒక అంతర్గత భాగంగా ఉన్నవి. మొదటి నుండి మన పూర్వికులు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కు  చాలా విలువ మరియు ప్రాముఖ్యత ఇచ్చేవారు.
రియో ఒలంపిక్స్ ప్రారంభం అయినవి. దానికి సంభందించిన వార్తలు వస్తున్నవి. ఈ సందర్భం లో నేను ఒలింపిక్ గేమ్స్ కు సంభందించి కొంత  ఆసక్తికరమైన మరియు విలువైన సమాచారమును  మీ ముందు ఉంచుతాను.  ఇది పాఠకులకు  చాలా ఇన్ఫర్మేటివ్ గా మరియు పఠనం చాలా సులభకరం  గా, ఉపయోగకరమైనది గా ఉంటుందని బావిస్తూన్నాను.
పురాతన ఒలింపిక్ గేమ్స్ మొదట గ్రీకు దేవుడు జ్యూస్ కు సంబంధించిన ఒక  మతపరమైన పండుగ గా ఉన్నాయి. ఈ పద్ధతి 776 బీ.సీ. నుంచి వరకు 393 C.E. వరకు కొనసాగింది  ఆ తరువాత దీనిని పాగన్ ఉత్సవం అని  నిషేధించారు. 1894 లో ఒక ఫ్రెంచ్ విద్యావేత్త బారన్ పియర్ డే కోబెర్టిన్ ఈ పురాతన సంప్రదాయాన్ని పునరుద్ధరించి మరియు ఆధునిక వేసవి ఒలింపిక్ గేమ్స్ కు జన్మనిచ్చినాడు. మొదటి ఒలింపిక్స్ లో 190 మీటర్ల రేసు  మాత్రమే జరిగింది మరియు ఈ ఈవెంట్ కు  రేసు జరిగిన స్టేడియోన్ భవనం పేరు పెట్టారు.
ఒలింపిక్ గేమ్స్ లో మొదటి రికార్డు (ఒక రకంగా తొలి స్వర్ణ పతక విజేత) కోరోబుస్ (Coroebus) చెందిన విజేత ఎలీస్ పేరు మీద ఉంది.776 BC లో గెలుపొందిన ఇతను ఎలియా (Eleia) కు చెందిన ఒక కుక్. గెలుపు కు  చిహ్నంగా అతను ఒక ఆలివ్ కొమ్మను  పొందినాడు.  ఈ పట్టణం ఇప్పటికీ 150 మంది పౌరులతో ఉంది.
ఆరంభపు రోజులలో క్రీడలు  ఐదు రోజుల పాటు కొనసాగినవి. తొలి మూడు రోజులు  క్రీడా ఈవెంట్స్ జరిగేవి  మిగిలిన రెండు రోజులు ఆచారాలు మరియు వేడుక కొరకు కేటాయించ బడేవి. చివరి రోజున అందరు క్రీడాకారులు  విందులో పాల్గొనేవారు అందులో  100 ఎద్దుల (గ్రీక్ దేవత జ్యూస్ కు బలిగా మొదటి రోజు న ఇవ్వబడినవి) మాంసం తినడానికి వడ్డించ బడేది.
పురాతన ఒలింపిక్ గేమ్స్ లో  క్రీడాకారులు నగ్నoగా  పోటీ పడేవారు. నిజానికి జిమ్నాజియం అనే పదం Greem మరియు  "gymnos" అనే గ్రీక్ పదాల నుండి నుండి వచ్చిoది. Greem అనగా మూలం మరియు "gymnos అనగా నగ్నం అని అర్థం అనగా జిమ్నాజియం కు సాధారణ అనువాదం "నగ్న వ్యాయామం కోసం పాఠశాల" గా చెప్పవచ్చును.
ఒలింపిక్స్ చిహ్నం - ఆఫ్రికా, అమెరికాలు, ఆసియా, యూరప్ మరియు ఆస్ట్రేలియా - ఐదు పెనవేసుకొనిన వలయాలు-ప్రపంచంలోని ఐదు ప్రధాన ప్రాంతాలను సూచిస్తున్నవి. వాటిలో ఒక రంగు  కనీసం ప్రపంచంలోని  ప్రతి దేశం యొక్క జెండాలో  కనిపిస్తుంది  అందుకే ఒలింపియన్ జెండాలో  ఐదు రంగులను  ఎంపిక చేశారు.

1921
లో ఆధునిక ఒలింపిక్ గేమ్స్ యొక్క స్థాపకుడు పియరీ డి కోబెర్టిన్ ఒలింపిక్ మోట్టో ను–వేగంగా, ఎత్తుగా మరియు బలమైన (Citius, Altius, Fortius) –దిగా  సృష్టించినాడు.  ఇతను తన స్నేహితుడు ఫాదర్ హెన్రీ దిడోన్ నుండి ఈ లాటిన్ వాక్యాన్ని అరువు తెచ్చుకొన్నాడు.
 ఒలింపిక్ జ్వాల మొదటిసారిగా 1928న ఆమ్స్టర్డ్యామ్ (Amsterdam) లో జరిగిన ఆధునిక ఒలింపిక్స్ క్రీడలలో కనిపించింది. ఒలింపిక్ జ్వాల ను పురాతన స్థలం ఒలింపియా వద్ద ప్రాచిన  శైలిలో వస్త్రాలు ధరించి ఒక వక్ర అద్దం మరియు సూర్యుని  ఉపయోగించి స్త్రీలు వెలిగిస్తారు. ఆటలు ముగిసే వరకు  వెలుగు ఉంచబడుతుంది
మొదటి ఒలింపిక్ టార్చ్ రిలే 1936 ఒలింపిక్ గేమ్స్ లో జరిగింది. ఈ భావన అప్పటి నిర్వాహక కమిటీ చైర్మన్ కార్ల్ డిఎం యొక్క రూపకల్పనగా ఉంది. ఒలింపిక్ టార్చ్ పురాతన ఒలింపియా స్థలం  నుండి ఒలంపిక్స్ ఆతిద్యం ఇచ్చే నగరంలోని  ఒలింపిక్ స్టేడియం వరకు  రన్నర్  నుండి రన్నర్ ద్వారా తీసుకు వస్తారు. ఇది పురాతన ఒలింపిక్ గేమ్స్ నుండి ఆధునిక ఒలింపిక్స్ కు కొనసాగింపుగా భావించవచ్చు.
ఒలంపిక్ క్రీడల విశేషాలు:

Ø 1908 లండన్ ఒలింపిక్ క్రీడల సందర్భంగా మొదటి ప్రారంభ వేడుకలు జరిగాయి.
Ø ఆధునిక యుగంలో పిన్న ఒలింపియన్ గా 1896 ఏథెన్స్ ఒలింపిక్స్ లో 10 ఏళ్ళ వయసులో పోటీ చేసిన దిమిత్రియోస్ లౌన్ద్రాస్ ను పేర్కొన వచ్చును.  
Ø స్ప్రింగ్బోర్డ్ ఈత పోటిలో పాల్గొన్న  13ఏళ్ళ మార్జోరీ గేస్త్రింగ్ ను చరిత్రలో తోలి గోల్డ్ మెడల్ సాధించిన స్త్రీగా పేర్కొన వచ్చును.  
Ø 14 ఏళ్ళ కుసో కిటమురా ను వ్యక్తిగత గోల్డ్ మెడల్ సాధించిన అతి పిన్న వయస్సు గల పురుష క్రీడాకారుని గా పేర్కొనవచ్చును.
Ø 1896 ఒలింపిక్స్ లో తొలి ఫైనల్ ఈవెంట్ హాప్, స్టెప్ మరియు జంప్ యొక్క విజేత జేమ్స్ B. కొన్నోల్లీ (యునైటెడ్ స్టేట్స్) ను ఆధునిక ఒలింపిక్ క్రీడల్లో మొదటి ఒలింపిక్ ఛాంపియన్ గా పేర్కొనవచ్చును.
Ø మహిళలు మొదటిసారిగా  1900 లో జరిగిన రెండవ ఆధునిక ఒలింపిక్ గేమ్స్  లో పాల్గొనేందుకు అనుమతి లభించింది.
Ø టెన్నిస్ 1924 వరకూ ఒలింపిక్స్ లో ఆడారు తిరిగి దీనిని తిరిగి  1988 లొ ప్రారంబించారు.
Ø రష్యా 1908 మరియు 1912 ఒలింపిక్ గేమ్స్ లో  పోటీ చేయుటకు కొందరు  క్రీడాకారులను  పంపినది కాని అది 1952 గేమ్స్ వరకూ మళ్లీ పోటీ చేయలేదు.
Ø ఇప్పటివరకు కేవలం మూడు సార్లు ఆధునిక ఒలింపిక్ గేమ్స్ రద్దు చేశారు. మొదటి మరియు రెండోవ ప్రపంచ యుద్ధ (1916) (1940 & 1944) సమయం లో రద్దుచేశారు
Ø ఏథెన్స్ 2004 ఒలింపిక్ వేసవి గేమ్స్ లో 202 దేశాల వారు  పాల్గొన్నారు.ఇది ఒక  రికార్డు.
Ø వేసవి క్రీడల్లో అన్ని దేశాల కన్నా వ్యక్తిగతంగా యునైటెడ్ స్టేట్స్ ఎక్కువగా గెలుపొందిన పతకాలు సంఖ్య  2,189.
Ø నార్వే వింటర్ క్రీడలో అత్యధికంగా 263 పతకాలు గెలుచుకుంది.
Ø ఆతిధ్య దేశం గ్రీస్ 1896 లో మొట్టమొదటి వేసవి ఒలింపిక్ క్రీడలో అత్యధికంగా పతకాలు (47) గెలుచుకున్నది.
Ø సోవియట్ యూనియన్ జిమ్నాస్ట్ లారిసా లేనినా వ్యక్తిగతం గా తొమ్మిది స్వర్ణాల తో  సహా 18 ఒలింపిక్ పతకాలనుగెలుచుకోన్నది.
క్రిందీ డేటా మొదటి  నుండి 2016 వరకు ఒలంపిక్స్ కు అతిద్యమిచ్చిన దేశాలను సూచించును:
 మొదటి ఒలింపిక్స్: 1896 ఏథెన్స్ (గ్రీస్)
రెండవ ఒలింపిక్స్ 1900 పారిస్ (ఫ్రాన్స్)
మూడో ఒలింపిక్స్ 1904 సెయింట్ లూయిస్ (అమెరికా)
నాలుగో ఒలింపిక్స్ 1908 లండన్ (బ్రిటన్)
ఐదవ ఒలింపిక్స్ 1912 స్టాక్హోల్మ్ (స్వీడన్)
ఆరవ ఒలింపిక్స్ 1916 (ప్రతిపాదించబడింది) బెర్లిన్ (జర్మనీ)
(మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా రద్దు చేయబడింది)
ఏడోవ  ఒలింపిక్స్ 1920 ఆంట్వెర్ప్ (బెల్జియం)
ఎనిమిదవ ఒలింపిక్స్ 1924 పారిస్ (ఫ్రాన్స్)
తొమ్మిదోవ  ఒలింపిక్స్ 1928 ఆమ్స్టర్డ్యామ్ (హాలండ్)
పదోవ  ఒలింపిక్స్ 1932 లాస్ ఏంజిల్స్ (అమెరికా సంయుక్త)
పదకొండవ ఒలింపిక్స్ 1936 బెర్లిన్ (జర్మనీ)
పన్నేoడోవ ఒలింపిక్స్ 1940 టోక్యో (తరువాత హెల్సింకి లో)
(రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా తలెత్తిన రద్దు చేయబడింది)
పదమూడవ ఒలింపిక్స్ 1944 లండన్ (బ్రిటన్)
(రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా తలెత్తిన రద్దు చేయబడింది)
పధ్నాలుగవ ఒలింపిక్స్ 1948 లండన్ (బ్రిటన్)
పదిహేనవ ఒలింపిక్స్ 1952 హెల్సింకి (ఫిన్లాండ్) _
పదహారవ ఒలింపిక్స్ 1956 మెల్బోర్న్ (ఆస్ట్రేలియా)
పదిహేడవ ఒలింపిక్స్ 1960 రోమ్ (ఇటలీ)
పది ఎనిమిదొవ   ఒలింపిక్స్ 1964 టోక్యో (జపాన్)
పంతొమ్మిది  ఒలింపిక్స్ 1968 మెక్సికో సిటీ (మెక్సికో)
ఇరవయ్యోవ  ఒలింపిక్స్ 1072 మ్యూనిచ్ (డబ్ల్యూ జర్మనీ)
ఇరవై ఒకటి ఒలింపిక్స్ 1976 మాంట్రియల్ (కెనడా)
ఇరవై రెండవ ఒలింపిక్స్ 1980 మాస్కో (సోవియట్ రష్యా)
ఇరవై మూడవ ఒలింపిక్స్ 1984 లాస్ ఏంజిల్స్ (అమెరికా సంయుక్త)
ఇరవై నాల్గవ ఒలింపిక్స్ 1988 సియోల్ (ఎస్ కొరియా)
ఇరవై ఐదవ ఒలింపిక్స్ 1992 బార్సిలోనా (స్పెయిన్)
ఇరవై-ఆరో ఒలింపిక్స్ 1996 అట్లాంటా (అమెరికా)
ఇరవై ఏడవ ఒలింపిక్స్ 2000 సిడ్నీ (ఆస్ట్రేలియా)
ఇరవై ఎనిమిదవ ఒలింపిక్స్ 2004 ఏథెన్స్ (గ్రీస్)
ఇరవై తొమ్మిదవ ఒలింపిక్స్ 2008 బీజింగ్ (చైనా)
ముప్పది రెండవ ఒలింపిక్స్ 2012 లండన్ (బ్రిటన్)
ముప్పై ఒకటి  ఒలింపిక్స్ 2016 రియో ​​డి జినారో (బ్రెజిల్)

ముప్పై రెండోవ   ఒలింపిక్స్: టోక్య (జపాన్)

ముప్పై మూడోవ    ఒలింపిక్స్, పారిస్ (ఫ్రాన్స్)



25 August 2016

కేరళ లో వృద్దిచెందుతున్న ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థ


భారతదేశం లో ఇస్లామిక్ బ్యాంకింగ్ సుదీర్ఘంగా చర్చించబడినప్పటికి, దాని పెరుగుదల కు విస్తృత  అవకాసం    ఉన్ననప్పటికీ, దాని విస్తరణ  ఇంకా నవజాత దశలోనే ఉంది అనుట వాస్తవం.  అయితే కేరళ రాష్ట్రం ఈ పరిణామాలు నుండి లాభం పొందేందుకు ప్రయత్నిస్తుంది. రాష్ట్ర జనాభాలో దాదాపు ఒక వంతు భాగం ముస్లిం ప్రజలను కలిగి ఉండుట  రాష్ట్రం లో  ఇస్లామిక్ బ్యాంకింగ్ స్థాపన కు ఒక అనుకూల అంశం. ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థకు అనుకూలుడు అయిన డాక్టర్ థామస్ ఇసాక్ కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నియామకం మరియు ఇటీవల ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ కు  అనుకూలంగా ఆర్బిఐ కదలికలు, రాష్ట్రంలో ఇస్లామిక్ బ్యాంకింగ్ ఊపందుకోవటానికి  బలమైన సూచికలు గా ఉన్నాయి.

ఇటివల కోజికోడ్లో జరిగిన ఒక సెమినార్ లో ఇసాక్ మాట్లాడుతూ కేరళ  ప్రభుత్వం రాష్ట్రంలో ఇస్లామిక్ బ్యాంకింగ్ అమలుకు  చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఇసాక్ అభిప్రాయం లో "వడ్డీ తక్కువ గా ఉండటం ఈ బ్యాంకింగ్ వ్యవస్థ కు ఒక అనుకూల అంశం. మనము ఇస్లామిక్ ఫైనాన్స్ ను అందిపుచ్చు కోవటానికి ఇదే మంచి సమయం " అని  చెప్పారు.

మంత్రి ఈ విషయంలో మొదటి అడుగులు వేసారు.  తన మొదటి బడ్జెట్లో ఇసాక్ కొచీ ఆధారిత చేరమాన్ ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ (సిఎఫ్ఎస్ఎల్) కు  కేరళ రాష్ట్ర డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ (KSDP) ను 250 కోట్ల రూపాయలతో ఆధునీకరణ చేసే పనులు అప్పగించారు. భారతదేశం లో ఇస్లామిక్ ఫైనాన్స్ సూత్రాల ప్రకారం నడిచే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (NBFC) ఒక్క సిఎఫ్ఎస్ఎల్ మాత్రమే.  అది ఇస్లామిక్ ఫైనాన్స్ పద్దతుల ద్వారా నిధులు సేకరించి ఆతర్వాత  KSDP ఆధునీకరణ చేస్తుంది.

ఇస్లామిక్ ఫైనాన్స్ ఇస్లామిక్ చట్టం (షరియా) ప్రకారం  నిర్వహించ బడును. అది బ్యాంకులు, మూలధనం మార్కెట్, ఫండ్ నిర్వాహకులు మరియు పెట్టుబడి సంస్థలు కలిగిన  ఒక ఆర్థిక వ్యవస్థ అని అనవచ్చును.  ఇస్లామిక్ బ్యాంకు దాని  స్థితి, నియమాలు మరియు విధానాలు షరియా సూత్రాల ప్రకారం నడుచును మరియు తన కార్యకలాపాలపై  ఏ విధమైన రసీదు ఇవ్వని మరియు వడ్డీ చెల్లింపులపై నిషేధo చూపు  ఒక ఆర్ధిక సంస్థ అనవచ్చును.
"ఆచరణాత్మక సమస్యలు ప్రధానంగా పెట్టుబడిదారుల నుండి నిధుల పెంపు వంటివి   ఉన్నప్పటికీ  కేరళలో ఇస్లామిక్ బ్యాంకింగ్ కోసం ఒక అనుకూల వాతావరణం ఉంది," అని సిఎఫ్ఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ APM మహమ్మద్ హనిష్ చెప్పారు. సిఎఫ్ఎస్ఎల్ సంప్రదాయ బ్యాంకులు వద్ద నుండి కాక పెట్టుబడిదారులు నుంచి ఫండ్ తీసుకుంటోంది
"థామస్ ఇసాక్ యొక్క నియామకం ఇస్లామిక్ ఫైనాన్సింగ్ వాదులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది.  సిఎఫ్ఎస్ఎల్ మునుపటి ఎల్డిఎఫ్ ప్రభుత్వ హయాంలో 2011 లో థామస్ ఐజాక్ ద్వారా ఉద్భవించింది" అని సయ్యద్ రంజాన్ కొదంచేరి ప్రభుత్వ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు చెప్పారు.

ఈ సమయానికి వడ్డీ రహిత బ్యాంకులు భారతదేశం లో పని చేయడానికి అనుమతిoచబడ లేదు. 2013 లో ఆర్థిక మంత్రిత్వ శాఖ భారతదేశం లో ఇస్లామిక్ బ్యాంకింగ్ పరిచయం సాధ్యాసాధ్యాలపై తన అభిప్రాయం తెలియజేయాలని ఆర్బీఐ కు విజ్ఞప్తి చేసింది. దాని ప్రకారం ఇస్లామిక్ బ్యాంకింగ్ అంతర్ డిపార్టుమెంటల్ గ్రూప్ (IDG) ఆర్బిఐ లో స్థాపించబడినది మరియు IDG తయారుచేసిన నివేదిక ఫిబ్రవరి 2016 లో ప్రభుత్వానికి సమర్పించబడినది.  

ఈ మద్య జరిగిన ఒక ముఖ్యమైన అంతర్జాతీయ అభివృద్ధి పరిణామం  కూడా భారతదేశం లో ఇస్లామిక్ బ్యాంకింగ్ సమర్ధకులకు ఉల్లాసాన్ని తెచ్చిపెట్టింది. సౌదీ అరేబియా లో తన పర్యటన సమయంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ భారతదేశం లో ఇస్లామిక్ ఫైనాన్స్ ద్వారా వ్యాపారం మరియు పెట్టుబడిపై సౌదీ ప్రభుత్వం తో చర్చలు జరిపారు. ప్రైవేట్ సెక్టార్ అభివృద్ధి కోసం ఉన్న ఇస్లామిక్ కో-ఆపరేషన్ ఫర్  డెవలప్మెంట్ అఫ్ ప్రవేట్ సేక్టర్  (జెద్ద కు చెందిన ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ అనుబంధ సంస్థ)  ఆర్బిఐ తో చర్చలు జరిపి రూ 200 కోట్ల మూలధనము తో గుజరాత్లో చిన్న మరియు మధ్యస్థ రంగ సంస్థల సహాయం కోసం ఒక NBFC ప్రారంభించింది.

"ఈ పరిణామం కూడా సిఎఫ్ఎస్ఎల్ (దేశంలో ఎకైక షరియా ఆధారిత NBFC) కు  ఊతం ఇస్తుంది. ఇదికాకుండా ఆర్బిఐ లీజు ఫైనాన్స్ మరియు మురబః (Murabaha-దీనిలో ఒక మధ్యవర్తితో ఉచిత మరియు స్పష్టమైన టైటిల్ ఆస్తి కొనుగోలు) వంటి సంప్రదాయ బ్యాంకింగ్ ఉత్పత్తులను   పోలిన  కొన్ని ఉత్పత్తులు పరిచయం చేయుటకు  అవకాశాలు పరిశీలిస్తోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ మరియు వ్యాపార పెట్టుబడి (venture capital) వంటి ఉత్పత్తులు సంప్రదాయ బ్యాంకుల ఇస్లామిక్ ఫైనాన్సు వ్యవస్థ క్రింద ఆవిష్కరించరించ బడటం  జరుగుతుంది”. దేశంలో అతి పెద్ద బ్యాంకు భారతదేశం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఇప్పటికే వడ్డీ లేని షరియా మ్యూచువల్ ఫండ్ ప్రవేశపెట్టింది. సంప్రదాయ బ్యాంకులకు  అవసరమైన మద్దతు ప్రభుత్వం ఇస్లామిక్ కిటికీ (Islamic window) ద్వార  ఇవ్వబడుతుంది అని సయ్యద్ రంజాన్ అన్నారు. కొచీ ఆధారిత ప్రత్యామ్నాయ పెట్టుబడులు మరియు క్రెడిట్స్ లిమిటెడ్ (AICL), దాని లైసెన్స్ 2012 లో ఆర్బిఐ రద్దు  చేసిన  తరువాత ముంబై హైకోర్టులో న్యాయపోరాటం జరుపుంది,  అది (AICL) ఇస్లామిక్ ఫైనాన్స్ అనుకూలంగా ఆర్బిఐ నివేదిక ప్రయోజనాన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ పెంచడానికి అవసరమైన మద్దత్తు తేగలదు అని అయన అన్నారు.
నిపుణులు రాష్ట్రంలోని  ముస్లిం సంస్థలు సంప్రదాయ బ్యాంకింగ్ కాని ఇస్లామిక్ బ్యాంకింగ్ కొత్త సంస్కృతికి అనుకూలంగా ఉన్నారని అభిప్రాయపడుతున్నారు."సమాజానికి చెందిన కొందరు వ్యవస్థాపకులు మరియు వ్యాపారవేత్తలలో కొందరు  సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థ కు అనుకూలురు. మరి కొంతమంది సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థ కు కనీస ప్రాధాన్యత ఇస్తారు.  వారి కి ఈ మార్పు ఆనందం తెచ్చిపెడుతుందని " దారుల్ హుడా ఇస్లామిక్ యూనివర్సిటీ కు చెందిన హుదవి కొలతుర్ చెప్పారు.
అతని ప్రకారం, జమాతే ఇ ఇస్లామీ మరియు సమస్థ కేరళ సున్ని స్టూడెంట్స్ ఫెడరేషన్ (SKSSF) వంటి కొన్ని ముస్లిం సంస్థలు షరియా ఆధారిత ఆర్థిక సంస్థలు ప్రారంభించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారు నిపుణుల ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసారు మరియు కొన్ని ఆర్థిక సంస్థలతో   చర్చలు జరిపారు.