16 August 2016

కార్పోరేట్ అమెరికా లో ముస్లిం ఫ్రెండ్లీ పని ప్రదేశాల పెరుగుదల (The Rise of Muslim-Friendly Workplaces in Corporate America)




ప్రపంచ వ్యాప్తం గా  ఉగ్రవాద దాడులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రత్యేకంగా నైస్ మరియు ఓర్లాండో కాల్పుల అనంతరం, ముస్లిం వలసదారుల అమెరికా ఆగమనం పై   పూర్తిగా నిషేదo విధించాలని రిపబ్లికన్ పార్టి  అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఇంకా  అనేకమంది రిపబ్లికన్ పార్టి   రాజకీయ నాయకులు ప్రధానంగా మాజీ హౌస్ స్పీకర్ నేవ్ట్ గిన్గ్రిచ్  అమెరికాలోని  ముస్లిం వలసదారులపై ఆంక్షలు విధించాలని సూచించారు.

అమెరికా లోని ముస్లింల పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్న పరిస్థితిలలో నేడు  అనేక అమెరికన్ కోర్పోరేటే కంపనీలు తమ దగ్గిర పనిచేసే ముస్లిం ఉద్యోగుల బద్రత పట్ల మరియు పని ప్రదేశాలలో వారికీ సురక్షితమైన   వాతావరణం మరియు వారిని అమెరికన్ సమాజం ఆమోదించేటట్లు చేయడానికి అనేక స్నేహపూరితమైన చర్యలు తీసుకొంటున్నారు.

అనేక అమెరికన్ కార్పోరేట్  కంపెనీలు ఈనాడు పని ప్రదేశాలలో ప్రత్యేకంగా ప్రార్ధన మందిరాలు స్థాపించి ఇస్లాం అవగాహనా కొరకు అనేక సమూహ చర్చలు నిర్వహిస్తూ ఆల్కహాల్ రహిత పార్టీలను ఏర్పాటు చేస్తున్నవి. వారు అనుసరించే పద్దతులు సూచనలు కదలికలు ఆచరణాత్మకంగా  ఉన్నాయి. అనేక కంపెనిల నిర్వాహకులు ప్రతిభావంతులైన కార్మికులు ఉంచేందుకు మరియు సంఘర్షణ, కోర్ట్ వ్యాజ్యలు  నివారించేందుకు కావలసిన చర్యలు తీసుకొంటున్నారు.

గతం లో అమెరికా లో అనేక దశాబ్దాలుగా  ఆఫీసు నియమాలు మరియు కార్మికుల  రాజ్యాంగ హక్కులు పరస్పరం కలహించుకొంటూ ఉండేవి. కాని నేడు ఆ పరిస్థితి లో పూర్తిగా మార్పు వచ్చింది.  ఒక మాంసం ప్యాకింగ్ సంస్థ లో పనిచేసే ముస్లిం కార్మికులు తమకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రార్ధన కొరకు విరామ సమయo కల్పించుటలేదని వాక్-అవుట్ చేయగా వారిని కంపెని పని నుంచి తొలగించినది. దీనికి వ్యతిరేకంగా ముస్లిం కార్మికులు కోర్ట్ కు వెళ్ళగా వారి వాదన గెల్చినది మరియు కంపనీ వారిని తిరిగి పనిలోనికి తీసుకోంది అని ఇబ్రహీం హూపర్ కమ్యునికేషన్ డైరెక్టర్ ఫర్ ది కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ చెప్పారు

ఈక్వల్ ఎంప్లాయిమెంట్ అపర్త్యునితీస్ కమిషన్ (Equal Opportunity Employment Commission EEOC )అండ్ కోర్ట్స్

హారిజన్ బ్లూ క్రాస్ అండ్ న్యూజెర్సీ బ్లూ షీల్డ్ లాంటి కంపెనీలు పారిస్ దాడుల తరువాత  గత ఏడాది సిబ్బంది తో మతం గురించి ఒక “ప్రశ్న-సమాధానం” సదస్సు నిర్వహించినవి. అది చాల విజయవంతమైనది.   మిషెల్ ఫిలిప్స్ అనే ఉపాధి న్యాయవాది “పని ప్రదేశం లో తన  మతాచారాలను పాటించడం  కోసం సౌకర్యం లబించినప్పుడు ఒక ఉద్యోగి దానిని స్వాగతిస్తాడు మరియు యజమానుల పట్ల కృతజ్ఞత తో ఉంటాడు. యజమాని సరిఅయిన చర్యలు తీసుకోని ఉద్యోగులు వేధింపులు బడకుండా చూడాలి అప్పుడు ఆ చర్యలు మెరుగైన పలితాలను ఇస్తాయి” అని అంటాడు. 

ఇస్లాం ను పాటించే ప్రజలు అమెరికా  జనాభాలో కేవలం 1 శాతం మాత్రమె ఉన్నారు. కాని అమెరికా సమాన అవకాశల  ఉపాధి కమిషన్ కార్యాలయంలో (U.S. Equal Opportunity Employment Commission) దాఖలు అయిన మత-ఆధారిత వివక్షత ఫిర్యాదులలో 40 శాతం ముస్లింలకు సంబంధించినవి. అమెరికా సమాన అవకాశల  ఉపాధి కమిషన్ కార్యాలయంలో అందిన ఫిర్యాదులు ప్రకారం ముస్లింలు పని ప్రదేశం లో పంది మాంసం అమ్మడానికి లేదా మద్యం సర్వ్ చేయడానికి  నిరాకరించినందుకు తొలగించ బడినవే. అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు ముస్లిం ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు నిచ్చాయి.

మితిమీరిన కష్టాలు/వివక్షత
ఆటో జెన్ ఇన్కార్పొరేషన్ మరియు యునైటెడ్ పార్సెల్ సర్వీసులు వంటి  సంస్థల లోని మత ఆధారిత వివక్షత  కేసులను అనేక  సందర్భాలలో EEOC పరిష్కరించిన ఇంకా  అనేక మంది ముస్లిం కార్మికులు తమ సహోద్యోగులు తమను  తీవ్రవాదులు గా లేదా "బిన్ లాడెన్" అని పిలువుట లేదా మస్జిద్ లో  ప్రార్ధన కు అనుకూలంగా పని షెడ్యూల్ మార్పు అంగీకరించక పోవటం ద్వారా ద్వార రేచ్చగోడుతున్నారని పిర్యాదు చేస్తున్నారు.

గత నెల ఒక ముస్లిం పోలీస్ అధికారిని  క్లీన్-షేవ్ చేయటం లేదని న్యూ యార్క్ సిటీ పోలీసు శాఖ సస్పెండ్ చేసింది; దానిపై అతను దావా వేశాడు తర్వాత అతను తాత్కాలికంగా తిరిగి నియమించబడినాడు.

గత ఏడాది ఇసిస్ చే శాన్ బెర్నాదినో ఉగ్రవాద దాడి తరువాత EEOC దాని వెబ్ సైట్  ఒక పేజీ లో ఉపాధి విషయంలో ముస్లిం లేదా మధ్యప్రాశ్చ్య వ్యక్తుల కు సంభందించి కొన్ని జాగ్రతలు/సూచనలు  జోడించినది. పౌర హక్కుల చట్టం యొక్క టైటిల్ VII ప్రకారం ఉపాధి నిర్ణయాలు మరియు మత-ఆధారిత అభ్యర్థనల విషయం లో మితిమీరిన ఇబ్బందులు లేనంతవరకు వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. మత వేషధారణ మరియు  లేదా ముఖ జుట్టు విషయంలో కోర్టులు కార్మికులను బలపర్చును.

అనేక పరిశ్రమలు   దుస్తుల కోడ్ విషయం లో వివాదాస్పదం కాని సరళ నియమాలు పాటించు చున్నవి. ప్రైస్వాటర్హౌస్కూపర్స్ (PricewaterhouseCoopers) అనే సంస్థలో ఇటీవలే ఒక భాగస్వామి అయిన ఉమర్ లతీఫ్  ప్రార్థన క్యాప్ (kufi) ధరించు చున్నాడు. అది అతనికి  ముస్లిం గా గుర్తింపు ఇస్తుంది అంటాడు. సంస్థ పని నియమాలు సరళంగా ఉన్నాయని అతను అంటాడు.

డైవర్సిటీ(బిన్నత్వం) ఉత్తమ పద్థతులు ప్రచురించే వర్కింగ్ మదర్ మీడియా వైస్ ప్రెసిడెంట్, శుభ బారీ “నేడు అనేక ఉత్తమ కంపెనీలు ఉద్యోగుల విషయంలో చాలా సరళంగా ప్రవర్తిస్తున్నారు” అని చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం, ప్రార్థన టోపీలు లేదా తల మీద  స్కార్ఫ్ వేసుకుని లేదా ఒక రోజు లో అనేక సార్లు ప్రార్థన చేసే ముస్లిం ఉద్యోగులు తమకు ఉద్యోగ విషయం లో ఎటువంటి ప్రమోషన్ అవకాశం   ఉండదు అనే  ఆలోచన లో ఉండేవారు. ముస్లిం ఉద్యోగులు  వేధింపులను  నివారించేందుకు వారి నమ్మకాలు ఇంటి వాకిలి వద్దే వదిలి వచ్చేవారు. కాని నేడు ఆ పరిస్థితి మారింది.

JP మోర్గాన్ చేజ్ అండ్ కో ప్రార్థన కోసం మసీదులకు ఇతర ప్రార్ధనాస్థలాలకు వెళ్ళుటకు రవాణా కోసం బస్సులను ఏర్పాటు చేస్తుంది లేదా ఆఫీస్ లోనే ప్రార్ధనా గదులను ఏర్పాటు చేస్తుంది. ఒక కొత్త ఆర్కిటెక్చర్ కంపెని నూతన ఉద్యోగుల వెల్కం పార్టీలలో ముస్లిం ఉద్యోగులకు ఆల్కాహాల్ సరఫరా చేయటలేదు. ముస్లిం సెలవులు/ఇతర మత విశ్వాసాలకు విరుద్దమైన కార్పొరేట్ క్యాలెండర్ ను   యాక్సెంచర్ పిఎల్సి వంటి పెద్ద కంపెని రూపొందించలేదు. 
ఒక సమర్ధురాలు అయిన ఒక  ముస్లిం ఉద్యోగ అభ్యర్థిని  హిజాబ్ ధరించడానికి  స్త్రీలకు  మరింత స్నేహపూర్వక వాతావరణం కల్పించే ఆఫీస్ లో పనిచేయడం లో ఇష్టపడుతుందని తెలుసుకొన్న తరువాత ఒక ఆర్ధిక సేవల సంస్థ తన విధానాలు మార్చుకొని ఆ ఉద్యోగిని తన కార్యాలయం లో చేర్చుకొంది అని  విబిన్న మతాల  అవగాహన సంస్థ చీఫ్  ఎగ్జిక్యూటివ్ చెప్పారు

ఆహ్లాదకరమైన వాతావరణం –కల్పించుట (‘Divisive Climate’)
వాల్-మార్ట్ స్టోర్స్, వాల్ట్ డిస్నీ కో, మెర్క్ & కో మొదలగు 24 కార్పొరేట్ కంపెనీలు గత మూడు సంవత్సరాలుగా ఉద్యోగుల మత సమస్యలకు  ఎ విధంగా ఉత్తమ పరిష్కారం చూపాలి  అనే విషయం తెలుసుకోనుటలో  శ్రద్దవహిస్తున్నవి. హారిజన్ బ్లూ క్రాస్ అండ్ బ్లూ షీల్డ్ గత ఏడాది నెవార్క్ లో  “ఇస్లాం ఒక ప్రమాదకరమైన విశ్వాసం” అనే  భావన తొలగించడానికి ఒక ప్రశ్న-సమాధానం సెషన్ నిర్వహించినది.  అందులో పాల్గొన్న అందరికి అది ఉద్విగ్నభరితమైనది గా ఉంది."

హదియః ముహమ్మద్, ఆడిటర్ మరియు 41 సంవత్సరాల హారిజన్ ప్రముఖరాలు  ప్రకారం ఉన్నతాధికారులతో తన విశ్వాసాలు మరియు అలవాట్లను వివరించడo ద్వారా  పని పరిస్థితులలో మార్పువస్తుంది అన్నారు. ఇస్లాం ప్రకారం మహిళలు పురుషులకు బానిసలుగా ఉండాలా అని సహచరులు ఆడినప్పుడు ఆ తప్పుడు అభిప్రాయం తొలగించడానికి ఆమె ఒక భోజనం సభను(వర్కింగ్ లంచ్ సెషన్)  నిర్వహించారు మరియు వారిలో గల  ఆ "తప్పుడు భావనను తొలగించారు."

2035 నాటికి US లో రెండవ అతిపెద్ద క్రైస్తవేతర సమూహంగా పయనిస్తున్న ముస్లింలతో యజమానులు ఎలా ప్రవర్తించాలి అనేది రాబోయే సంవత్సరాలలో ఒక కీలకమైన విషయంగా ఉంటుంది. అయితే "ముస్లిం ఉద్యోగులు  మాత్రం అందరిలాగానే తమకు  గౌరవం కావాలి అని అనుకుంటున్నారు."



No comments:

Post a Comment