భారతదేశం ప్రపంచంలో రెండవ
అతిపెద్ద ఉన్నత విద్యా వ్యవస్థ కల దేశం. గత దశాబ్దంలో భారతదేశం లో ప్రాధమిక విద్య
యొక్క విస్తరణ అసాధారణంగా ఉంది. కానీ భారత విద్యా వ్యవస్థ విస్తరణ, విద్య నాణ్యత, క్షీణతకు దారి తీసింది. ఇటీవలి అధ్యయనాలు విద్యార్థులు
పాఠశాలల్లో ఉండి కూడా వారు వారు
నేర్చుకోవలసిన విషయాలు నేర్చుకొనుట లేదని నిరూపించాయి.
అనేక తాజా సర్వేలు జ్ఞానార్జన(learning)
విషయo లో భయానక నిజాలు వెల్లడించాయి. 6-14 సంవత్సరాల మధ్య
వయస్సున్న 20 కోట్ల పిల్లలలో
కేవలం 17 కోట్ల మంది
మాత్రమే స్కూల్ లో ఎన్రోల్ అయారు. మూడు కోట్లమంది స్కూల్ వ్యవస్థ కు బయట ఉండగా 17 కోట్ల మంది లో 8.5కోట్ల
మంది డ్రాప్-ఔట్స్. అనగా మొత్తం 20 కోట్ల
మంది 6-14 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలలో సగం మంది
స్కూల్ కు వెళ్ళటం లేదు.
ఉన్నత స్థాయి విద్యా (+2) దశకు చేరుకుంటున్న
2.2 కోట్ల మంది పిల్లలల లో సగం మంది మాత్రమే +2
పూర్తి చేస్తున్నారు. ఉచిత మరియు నిర్బంధ విద్య చట్టం (RTE) ప్రకారం ఆరు నుంచి
పద్నాలుగు సంవత్సరాల వయస్సు పిల్లలకు నిర్బంధ, ఉచిత నాణ్యమైన ప్రాథమిక విద్య అమలులో ఉన్నప్పుడు కూడా ఈ
పురోగతి రేటు ఉండటం దురదృష్టం.
గణాంకాల ప్రకారం 5వ తరగతి
విద్యార్ధులలో సగం మంది కూడా 2వ తరగతి పుస్తకాలు
చదవలేరు మరియు 5వ తరగతి విద్యార్ధులలో 2/3 రెండోవ తరగతి అంకగణితం(maths) పూర్తిగా
చేయలేరు. స్కూల్ విద్య పూర్తి చేసిన ప్రతి తొమ్మిది మంది పిల్లలలో ఒకరు మాత్రమే కళాశాలకు
వెళ్తున్నారు. ఉన్నత విద్య నమోదు నిష్పత్తి భారతదేశం లో 11 శాతం గా ఉంది మరియు USA లో 83% ఉంది.
ఉన్నత విద్యాసంస్థలు
అందించే విద్య నాణ్యత తీవ్ర ఆందోళన
కలిగించే విషయంగా ఉంది. నేషనల్ అసెస్మెంట్
అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (NAAC) 140 విశ్వవిద్యాలయాలకు అక్రిడేషన్ ఇచ్చింది మరియు వాటిలో కేవలం
A గ్రేడ్ కేవలం 32% విశ్వవిద్యాలయాలకు
దక్కింది. NAAC చేత అక్రిడేషన్ పొందిన
2,780 కళాశాలల్లో కేవలం 9%కు మాత్రమే A గ్రేడ్
లబించినది. అక్రిడేషణ్ పొందిన, విశ్వవిద్యాలయాలలో 68 శాతం విశ్వవిద్యాలయాలు మరియు 91 శాతం కళాశాలలు
NAAC పారమీటర్స్ ప్రకారం సగటు(Avarege) లేదా సగటు క్రింద(below Avarege) గ్రేడింగ్ పొందినవి.
భారతదేశం లో ప్రాధమిక
మరియు ఉన్నత విద్య యొక్క ప్రమాణాలు మొత్తం ప్రపంచ నాణ్యతా ప్రమాణాలకు సరిపోలడం లేదు. అషేర్ (ASER) 2011 నివేదిక ప్రకారం
అఖిల భారతదేశం స్థాయిలో 12.7% ప్రాధమిక
పాఠశాలలు ఒక ఉపాధ్యాయుడుని కలిగి ఉండగా మరో
39.1% మాత్రమే ఇద్దరు ఉపాధ్యాయులు
కలిగి ఉన్నారు.అనగా మన దేశంలో 51.8% లేదా అంతకన్నఎక్కువ
ప్రాధమిక పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులు లేదా అంతకంటే తక్కువ ఉపాద్యాయులు ఉన్నారని అర్థం. దీనితో దేశ విద్యా సంస్థల నాణ్యత తగినంతగా
పెంచవలసిన అవసరం ఉంది. ప్రాధమిక విద్య పునాది
బలహీనంగా ఉన్న అది కోట్ల కొలది పౌరుల జీవితాలను, వృత్తి మరియు ఉత్పాదకత నిరోధించును.
స్కూల్ వాతావరణం, సౌకర్యాల
అవకల్పన(infrastructure),
విద్యా ఉద్ఘాటన
(academic emphasis), పాఠశాల నాయకత్వం, ఉపాధ్యాయ
విద్యార్థులు నిష్పత్తి, హాజరుకానితనం (ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు), విద్యార్థుల
పనితీరును సమీక్షించడం, తనిఖీ మరియు
జవాబుదారీతనం విద్య నాణ్యత పై ప్రత్యక్ష ప్రభావం కలిగి ఉన్న ప్రధాన కారణాలు. విద్య నాణ్యత సంబంధించిన కొన్ని
సవాళ్లు మరియు వాటి పరిష్కారాలను చర్చించేందుకు ప్రయత్నించుదాము.
సవాళ్లు (CHALLENGES)
1. గుమాస్తాగా టీచర్: ప్రభుత్వం
నియమించిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ముఖ్యంగా గ్రామీణ భారతదేశం లో విద్యకు పూర్తిగా
సంబంధంలేని విధులు ఎక్కువుగా నిర్వహించుతున్నారు. ఉపాధ్యాయులు పరిపాలనా పని(administration
work) కోసం, జీతాల(salaries) కోసం లేదా అధికారులతో అధికారిక సమావేశాలు(to attend
official meetings) కోసం వెళ్ళినప్పుడు విద్యార్థులు భోదన లేక బాధపడుతున్నారు. ఉపాధ్యాయులు
మధ్యాహ్న భోజన పధకం లేదా జనాభా లెక్కల
సేఖరణకు లేదా తరచుగా ప్రభుత్వం పిలుపు
మేరకు ఎన్నికల విధులు నిర్వహించేందుకు వెళ్ళటం
ద్వార బోధనేతర కార్యకలాపాలపై అధిక సమయం ఖర్చు చేయవలసి వస్తుంది.
2. తప్పుడు టీచింగ్ మెథడాలజీ(Flawed Teaching
Methodology): గ్రామీణ భారతదేశం లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తరచుగా టెక్స్ట్-బుక్ లోని
పాఠాలు పునరావృతం(వల్లె) చేయడం ద్వారా విద్యార్థులకు విద్యాబోధన చేస్తారు. టెక్స్ట్
–బుక్ లోని పాఠం యొక్క అర్థం వివరించుట లేదు. దీనివల్ల బాలలలో తక్కువ రీడింగ్
కాంప్రహెన్షన్ స్కిల్స్ ఉండును. ఉదాహరణకు ఒక ప్రత్యేక పాఠశాలలో రెండు మరియు తరగతులు విద్యార్ధులు తమ
పాఠ్యపుస్తకాలలోని పాఠాలు చదవలేరు కాని
వారు
చక్కగా చిత్రo గీసినట్లు టెక్స్ట్-బుక్ లోని పాఠం మొత్తం పేరాలు కాపీ చేయగలరు.
3. విద్య నాణ్యత Quality of Education: పాఠశాల పిల్లల
చదవటం మరియు వ్రాయడం సామర్ధ్యాలు ఆందోళనకరమైన స్థాయికి దిగజారినట్లు సర్వేలో
తేలింది. OECD-పిసా అంతర్జాతీయ
సర్వే ప్రకారం 73 దేశాలలో భారతదేశం
విద్య నాణ్యత ర్యాంకు 72 గా ఉంది.
సర్వేలో భారతదేశం కు ప్రాతినిధ్యం వహించిన రెండు రాష్ట్రాలు తమిళనాడు మరియు హిమాచల్ ప్రదేశ్ పఠనం మరియు గణితo లో కేవలం
కిర్గిజ్స్తాన్ పైన స్థానాన్ని దక్కించుకున్నాయి. సైన్స్ లో తమిళనాడు 72 వ స్థానం
నిలుపుకుంది మరియు హిమాచల్ ప్రదేశ్ అట్టడుగున నిలిచింది.
4. పేద అవస్థాపన
సౌకర్యాలు (ఇన్ఫ్రాస్ట్రక్చర్): పాఠశాలలు ముఖ్యంగా
గ్రామీణ, మారుమూల గిరిజన
ప్రాంతాల్లో పేద (poor) తరగతి గదులు కలిగి ఉండి, కాంపౌండ్స్, ఆట స్థలం, మరుగుదొడ్డి
రహితం గా ఉన్నవి మరియు ఒక్కోసారి త్రాగునీటి సౌకర్యాలను కలిగి లేవు.
5. హాజరు (Attendance): ఒక విద్యార్ధి పాఠశాల
లో చేరిన అతను స్కూల్ కు హాజరు అవుతాడు అన్న గ్యారెంటీ లేదు. విద్యార్ధి గైరుహాజరు
విద్యా నాణ్యత కి ఒక ప్రధాన లోపం గా ఉంది.
స్కూల్ మరియు ఉపాధ్యాయులు తరగతులకు వైపు విద్యార్థులు ఆకర్షించడానికి కొత్త
టూల్స్ కనుగొనాలి. కొoదరు పిల్లలు ఇంట్లో
లేదా వ్యవసాయ, వ్యాపార, తదితర కుటుంబం
సంస్థల లో పని చేయాల్సి ఉంటుంది.
6. జ్ఞానం పొందుట (అటైన్మేంట్): ఇది చాలా
తీవ్రమైన అంశం. భారత విద్యా వ్యవస్థ ను 40 మిలియన్ ప్రజలున్న ఈ దేశంలో కొన్ని వేల మంది బ్రిటీష్
పాలకులకు సహాయం గా గుమాస్తాలుగా ఉండుటకు బ్రిటిష్ పాలకులు రూపొందించారు. ఇది ఆలోచన
ప్రోత్సహించడానికి మరియు ఆసక్తి యొక్క సంస్కృతిని ప్రోత్సహించడానికి
రూపొందించబడింది కాదు. ఫలితంగా అత్యధిక భారతీయ పాఠశాలల్లో, ప్రభుత్వ
పాఠశాలల్లో పిల్లలు నిజంగా జ్ఞానం పొందుట లేదు మరియు వారి వయస్సు తగ్గ నైపుణ్యాలు
సాధించచుట లేదు. అందుకే, మన దేశ విద్యా
విధానం లో పూర్తిగా మార్పులు రావాలి.
7. మార్కు లే ప్రధానం(Score is All That
Matters): మార్క్స్(Marks)
కు విద్యా వ్యవస్థలో ప్రధాన ప్రాముఖ్యత
ఇవ్వడం జరిగింది. మార్క్స్ ద్వారా వ్యక్తి
యొక్క జ్ఞానం నిర్ధారించడం ఉత్తమ ప్రమాణం అని భావిస్తారు. ప్రతి ఒక్కరూ మంచి
మార్కులు కావాలని వారు వాటిని పొందడానికి ఎ పని అయినా చేస్తారు. మార్కెట్ లో
పుస్తకాలు లేదా మార్గదర్శకాలు(గైడ్స్) మంచి మార్కులు సాదిoచడానికి అందుబాటులో
ఉన్నాయి. అవి విజ్ఞానం అందిచటం లేదు కేవలం పరీక్ష పాస్అగుటకు అవసరమైన కనీస సమాచారాన్ని అందిస్తున్నవి.
అందువల్ల నిపుణులు కాలం చెల్లిన పరీక్ష పద్ధతి మార్చమని డిమాండ్ చేస్తున్నారు.
8. విద్య ఒక బిజినెస్ Education is a Business: విద్య రంగం లో కార్పోరేట్ రంగ ప్రవేశం తో ఈ రోజుల్లో
విద్య చాలా ఖర్చు తో కూడినదిగా మారింది. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు విద్య
లో పోటీ ని అదిగమించేందుకు ప్రైవేటు ట్యూషన్లు మరియు శిక్షణను ఆశ్రయిస్తున్నారు
పాఠశాలలకు వచ్చే పిల్లలు చాలా పేద కుటుంబాలకు చెందినవారు. ఈ విద్యార్ధులు భారీ
ట్యూషన్ ఫీజుల భరించలేని వారు మరియు ఇంట్లో అభ్యాసం కు తగిన వాతావరణాన్ని అలాగే అవసరమైన మౌలిక సదుపాయాలను కలిగి లేరు. చాలా మంది విద్యార్ధులు సహేతుక అధిక
నాణ్యత గల విద్యాబ్యాసం కొనసాగించేందుకు తగిన ఆర్థిక బలం లేకపోవడం వంటి
సమస్యను ఎదుర్కొంటున్నారు.
9. రీసెర్చ్: అమెరికా ప్రస్తుతం సైన్స్ మరియు ఇంజనీరింగ్ వ్యాసాల మొత్తం ప్రపంచo యొక్క ప్రచురణ లో మూడో వంతు వాటాను కలిగి ఉంది. భారతదేశం, దీనికి విరుద్ధంగా 3% కన్నా తక్కువ ప్రచురితమైన పరిశోధన పత్రాలను మరియు 1% అనులేఖనాల (citations) వాటాను కలిగి ఉంది. భారతదేశం లో పరిశోధనా వాతావరణం మరియు సౌకర్యాలు, సంస్థలు మరియు కళాశాలల్లో అందుబాటులో లేవు.
10. అసమర్థ పర్యవేక్షణ (Ineffective Monitoring): ఉన్నత విద్య కు
క్రమం తప్పకుండ తనిఖీలు మరియు నియంత్రణ సంస్థల నుండి నిరంతర పర్యవేక్షణ అవసరం.
మన దేశం లో ఒకసారి ఉపాధ్యాయులకు ఉద్యోగం
వచ్చిన తరువాత వారిపై నాణ్యమైన విద్యను
అందించడంలో ఎటువంటి పర్యవేక్షణ మరియు వారి పనితీరు కొలిచేందుకు సూచికలు,అందుకు తగిన పారామిటరులు లేవు . దీనివలన ఉన్నత విద్యలో తీవ్రమైన
అస్థిరత/అసమర్ధత నెలకొని ఉంది.
11. అవినీతి (Corruption): విద్య నాణ్యత
తీవ్రంగా దెబ్బతినటానికి ప్రధాన కారణం అవినీతి అని చెప్పవచ్చు. దాని వలన పేలవమైన పని తీరు ప్రదర్శించే పాఠశాలలు మరియు కళాశాలలు బయట పడుచున్నవి. ఇటీవల
విడుదల అయిన విద్యలో అవినీతిపై అధ్యయనం చేసిన
UNESCO యొక్క
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశం లో 25% ఉపాధ్యాయుల గైరు హాజరు ప్రపంచంలో అత్యధికమని అని చెప్పింది.
12. మాస్ కాపీ పరీక్షా కేంద్రాలు (Mass Copy Exam Centers): భారత విద్యా
వ్యవస్థ ఎదుర్కొంటున్న మరొక ప్రధాన సమస్య పరీక్షలలో విద్యార్ధులు నకలు/కాపి కి
పాల్పడుట. స్టూడెంట్స్ వాదన ప్రకారం కాపీ మరియు పరీక్షల లో మోసం (చిటింగ్) వారి
సంప్రదాయ హక్కు. పలు సంస్థలు, కళాశాలలు మరియు పాఠశాలలలో నకలు లేదా చీటింగ్ బాగా ఉంది. గ్రామీణ
ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు, కళాశాలలు 10 వ మరియు 12 వ బోర్డ్ పరీక్షలలో మాస్ కాపీ కేంద్రాలుగా
అయారు అయినవి.
13. విద్య కాషాయికరణ: విద్య నాణ్యత
తీవ్రంగా తగ్గటానికి కారణంగా విద్యా కాషాయకరణగా పేర్కొన
వచ్చును. ప్రస్తుత ప్రభుత్వం తప్పుడు సమాచారం తో పాఠ్యపుస్తకాలలో మార్పులు/సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నది.
స్మృతి ఇరానీ (ఎక్స్-హెచ్ఆర్డి మంత్రి) బహిరంగంగా పురాతన హిందూ గ్రంధాలు పాఠశాల పాఠ్య ప్రణాళికలో చేరుస్తామని ప్రకటించారు. ఎన్సిఇఆర్టి(NCERT) పాఠ్యపుస్తకాలు
సంఘ్ లక్ష్యాల ప్రకారం తిరిగి రాయడం
జరుగుతున్నది.
పరిష్కారాలు (SOLUTIONS) :
1.అర్హులైన ఉపాధ్యాయులు Competent Teachers నియామకం : ఉపాధ్యాయులు పాఠశాల కు
జీవం కాబట్టి వారి నాణ్యత స్కూల్ మెరుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఉపాధ్యాయుల యోగ్యత మరియు వారి ప్రేరణ విద్యారంగంలో నాణ్యత పెంచడానికి కీలకం. ఉత్సాహభరితమైన మరియు శక్తివంతమైన ఉపాధ్యాయులను మెరిట్ ప్రాతిపదికన నియమించాలి. ఉపాధ్యాయులకు చైతన్యపరచటంలో జాతీయ మరియు
రాష్ట్ర స్థాయిలో గురువు వంటి అవార్డ్లు వలే ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి లో కూడా అవార్డులు ఇవ్వాలి. శిక్షణ మరియు ప్రొఫెషనల్
అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడం అoదరు ఉపాధ్యాయులకు
తప్పనిసరి చేయాలి. ఉత్తమ ప్రతిభ కలవారు ఉపాధ్యాయ వృత్తి లో చేరుటకు ప్రోత్సహించాలి.
వృత్తిపరమైన అభివృద్ధి తో పాటు స్వీయ మూల్యాంకనం, నైతిక విలువలు
మరియు నిరంతర అభ్యాసం ఎల్లప్పుడూ ఉపాధ్యాయులు నుండి ఆశించాలి.
2. డిటెన్షన్ రహిత విధానం No Detention Policy: ప్రస్తుత నిబంధనల ప్రకారం
నిర్బంధ (Detention)విధానం లేదు.
ఇది తీవ్రంగా విద్యార్థుల విద్యా ప్రదర్శను
ప్రభావితం చేసిదిగా ఉంది. కాబట్టి దీనికి సవరణ చేయవలసిన డిమాండ్ అదికంగా ఉంది
.3. కెరీర్ ఎంపిక (Career Selection): అనేక సార్లు విద్యార్థులు వారి సామర్థ్యం
మరియు ఆసక్తులు ఆధారంగా సరియైన విద్యా ఎంపికలు చేయటలేదు. పలితంగా నిరాశ మరియు ఒత్తిడి
లోనయి వారి నిజమైన సామర్థ్యాన్ని గుర్తించడం విఫలం అవుతున్నారు. పాఠశాల స్థాయిలో
విద్యా అభిరుచి పరీక్షలు వారి నిజమైన సామర్థ్యాన్ని మరియు ఆసక్తిని గుర్తించడం లో విద్యార్థులకు సహాయం చేయడానికి వివిధ దశలలో
నిర్వహించాలి
4. ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ (Information Technology): అంతర్జాల ఉపయోగం మరియు
డిజిటల్ కనెక్టివిటీ విస్తరిస్తున్న ఈ సమయం లో మనము లైబ్రరీలను సందర్శించవలసిన
అవసరం లేదు కావలసిన సమాచారం కేవలం బటన్ క్లిక్ తో అందుబాటులో ఉంది. ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ విద్యార్ధులు వివిధ భావనలు అర్థం చేసుకోవడానికి ఒక మంచి సాధనం.
5. భోధన మరియు పరీక్ష సంస్కరణలు Curricular and Examination Reforms: కరిక్యులం లో మార్పులు లెర్నింగ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి తో విద్య యొక్క అన్ని స్థాయిలలో రూపొందించాలి. సగటున అత్యధిక భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఎనిమిది నుంచి పది సంవత్సరాలలో ఒకసారి మాత్రమే వారి కరిక్యులం సవరించబడుతుంది. కానీ వారు కరిక్యులం మార్పు ప్రాధాన్యత తెలుసుకున్నప్పుడు అది చాలా ఆలస్యం అవుతుంది. పరీక్షలు విస్తృత అవగాహన, గ్రహణశక్తి మరియు పరిష్కరించే నైపుణ్యాలను అధిక స్థితి లో ప్రాబ్లం సాల్వింగ్ సామర్థ్యం పరీక్షించడానికి రూపొందించ బడును. క్లిష్టమైన ఆలోచనా విధానం కు ప్రోత్సాహం ఇవ్వాలి.
ఎడ్యుకేషన్ పిల్లల బహుముఖ
అభివృద్ధి (భౌతిక, సామాజిక-మానసిక) కి
తోడ్పడును కాబట్టి అందువలన అన్ని అంశాలను పరిగణలోనికి (కేవలం అకడెమిక్ అచీవ్మెంట్
కాకుండా) తీసుకోవాలి. పిల్లల సంపూర్ణ
అభివృద్ధి పై ద్రుష్టి పెట్టాలి. ఒక ఆరోగ్యవంతమైన
బిడ్డ మాత్రమె మెరుగైన అబ్యాసన చేయగలడు. పిల్లలు పెద్ద సంఖ్యలో పోషకాహార లోపం మరియు
రక్తహీనత కలిగి ఉండటం కూడా అబ్యాసన
దృష్ట్యా ఆందోళన కలిగించే విషయం.
6. జవాబుదారీ Accountability: జాతీయ, ప్రాంతీయ మరియు స్థానిక స్థాయిలో
విద్యా సంబంధ పాలన నిర్మాణాలు బలోపేతం చేయ్యాలి. విద్యా సంబంధ నిర్వహణ కోసం ఒక జవాబు దారి వ్యవస్థ
యొక్క నిర్మాణం చేయాలి.
7. ప్రిన్సిపాల్
ఎంపిక Selection of Principal: నేడు, దురదృష్టవశాత్తు
పాఠశాల వ్యవస్థ ప్రధానంగా సీనియారిటీ ఆధారంగా ప్రధానోపాధ్యాయులు నియమిస్తుంది.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెరిట్ ఆధారంగా నియమించే ప్రక్రియ అవసరం. పరిపాలనా
విధులు మరియు పెద్ద నాయకత్వ పాత్రలు చేపట్టడానికి అవసమైన నైపుణ్యాలు ప్రిన్సిపల్స్
లేదా సంస్థల నిర్వాహకులకు ఉండటం చాలా
ఆవసరం మరియు తప్పనిసరి.
8. డిస్టన్స్ లెర్నింగ్ Distance Learning: ఓపెన్ స్కూలింగ్ సౌకర్యాలు విస్తరిoచబడాలి. వీక్లీ తరగతులు, పరీక్ష మరియు టు-వే చర్చలు దూరవిద్య కార్యక్రమం యొక్క పెంచాలి
9. ఫ్రెండ్లీ శిక్షణ Friendly Learning: సెకండరి బోర్డ్
పరీక్షలలో బాగా ఒత్తిడితో ఆత్మహత్య చేసుకొనే విద్యార్థుల సంఖ్య భయంకరంగా
పెరుగుతోంది. ఆరోగ్యకరమైన వాతావరణం లో స్నేహపూర్వక జ్ఞానార్జన భావన విద్యార్థులలో
ఆత్మహత్య ధోరణి అధిగమించడానికి తోడ్పడు
తుంది. సమాచార-ఆధారిత విద్యా వ్యవస్థ నుండి మంచి నైతిక విలువ ఆధారిత విద్యా
వ్యవస్థకు మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. క్రీడలు, కళలు మరియు
సాంస్కృతిక కార్యక్రమాలు వంటి వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి.
No comments:
Post a Comment