10 August 2016

ముహమ్మద్ మార్మడుక్ పిక్తాల్1875-1936

దివ్య ఖురాన్  ఆంగ్ల ఆనువాదములలో ప్రముఖ ఇస్లామిక్ స్కాలర్ బొంబాయి లో జన్మించి ఇంగ్లాండ్ లో కన్నుమూసిన అబ్డులా యూసఫ్ అలీ(1872-1953) రచించిన ది హోలీ కురాన్: ట్రాన్స్లేషన్ అండ్ కామెంటరి (The Holy Qur'an: Text, Translation and Commentary)  మరియు ముహమ్మద్ మార్మడుక్  పిక్తాల్(1875-1936) అనువదించిన  The Meanings of the Glorious Quran- An Explanatory Translation (1930)సప్రమాణికమైన ఆంగ్ల అనువాదాలుగా పరిగణిచబడుతున్నవి.   “The Meanings of the Glorious Quran- An Explanatory Translation (1930) అనే దివ్య ఖురాన్ ఆంగ్ల అనువాద ప్రచురణ కు  నిజాం నవాబ్ ద్రవ్య సహాయం చేసెను.

మొహమ్మద్ మార్మడ్యూక్ పిక్తాల్ ఆంగ్ల పండితుడు మరియు  ఆంగ్లికన్ చర్చ్ విధానమును  అనుసరించే కుటుంభం లో   అతను జన్మించాడు. సున్ని ముస్లిం గా మారటానికి  ముందు ఇస్లాం అధ్యయనం కోసం భారతదేశం మరియు మధ్య తూర్పు ఆసియా ప్రాంతమంతటా విస్తృతంగా పర్యటించాడు.
అతను ఒక నవలా రచయిత.  అతని రచనలు D H లారెన్స్, హెచ్ జి వెల్స్ మరియు E M ఫోస్టర్ వంటి విజయవంతమైన ఆంగ్ల నవలా రచయితలచే కొనియాడబడినవి. అతను 1917 లో ఇస్లాం స్వీకరించి తరువాత దివ్య ఖురాన్ యొక్క ఆంగ్ల అనువాదం చేసినాడు. అది  ఒక ఆంగ్ల ఖురాన్ ప్రామాణిక అనువాదంగా ఈ రోజు వరకు ఉంది మరియు   కైరో లోని  ప్రసిద్ధ అజహర్ యూనివర్శిటీ ద్వారా మెప్పు పొందినది. అతడు తన ఆంగ్ల అనువాద ఖురాన్ ను ప్రచురించినప్పుడు దానిని   టైమ్స్ లిటరరీ సప్లిమెంట్ "ఒక గొప్ప సాహిత్య సంపద" గా ప్రశంసించినది.

ది గ్లోరియస్ ఖుర్ఆన్ మీనింగ్స్ పేరుతో అనువదించిన తన ఆంగ్ల అనువాదం కు రాసిన ముందు మాటలో పిక్తాల్: "ఖురాన్ ను అనువదించలేము. ఖురాన్ అనువాదం ఇక్కడ దాదాపు అక్షరాలా సార్వస్వతoగా ఆలాపించబడినది  మరియు యోగ్యమైన భాష ను ఎంచుకోనడానికి ప్రతి ప్రయత్నం చేయబడింది. కానీ ఫలితం అసమానమయిన సింఫనీ మరియు మానవులను  కదిలించే  శబ్దాల వలన కన్నీళ్లు మరియు పరవశం తెప్పించినవి.  ఇది ఖురాన్ యొక్క అర్థం ఇంగ్లీష్ లో సమర్పించడానికి చేసిన   ఒక ప్రయత్నం. ఇది అరబిక్  ఖుర్ఆన్ స్థానం ఎప్పటికి తీసుకోలేదు పైగా దీనికి ఆ ఉద్దేశం  లేదు.” అని అభిప్రాయ పడినాడు.

హరో పబ్లిక్ స్కూల్లో పిక్తాల్ బ్రిటన్ ప్రధాని సర్ విన్స్టన్ చర్చిల్ యొక్క సహవిద్యార్థిగా మరియు స్నేహితుడుగా ఉన్నాడు.  అతడు ఒక మేధావి అయిన భాషావేత్త. అతను అరబిక్ సహా అనేక భాషలు నేర్చుకొన్నాడు. అతడు తనను “ముస్లిం అఫ్ ది ఈస్ట్"గా భావించేవాడు.

1936 లో అతను కార్న్వాల్ లో మరణించారు మరియు అతని ఖననం సర్రే, ఇంగ్లాండ్ బ్రూక్వుడ్ వద్ద గల ముస్లిం స్మశానవాటికలో జరిగింది. అక్కడే తరువాత  మరొక ప్రసిద్ద దివ్య ఖురాన్ ఆంగ్ల అనువాదకుడు యూసుఫ్ అలీ ఖననం కుడా జరిగింది.

.


No comments:

Post a Comment