5 August 2016

ప్రవక్త ముహమ్మద్(స) -సామాజిక న్యాయం
మానవజాతి కి అంతిమ ప్రవక్త ముహమ్మద్(స) అరేబియా లోని బని  హషీం ఖురేషి కుటుంబానికి చెందిన వ్యక్తి. అతను ఒక నిరక్షరాస్యడు. మానవజాతి చరిత్రలో గొప్ప నైతిక విప్లవం సృష్టించిన చరిత్ర  అతనికి ఉంది. ప్రవక్త ముహమ్మద్(స) యొక్క యుగo నైతికత, మానవతావాదం మరియు సామాజిక న్యాయ పరంగా ప్రపంచ చరిత్రలోనే అత్యంత సంస్కారవంతమైన  మరియు నాగరిక యుగం.

ప్రవక్త ముహమ్మద్ (స) ను అందరు  ఆదరించారు; అన్ని సమావేశాలలో  ఆహ్వానించారు మరియు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించటానికి మధ్యవర్తి గా ఆహ్వానించారు. అతను అత్యంత విలాసంగా బతకటానికి అవకాశం  ఉన్నప్పటికీ పేదరికం మరియు కష్టాల మద్య  జీవితాన్ని గడిపారు. రెండు రోజుల పాటు నిరంతరంగా ఎన్నడు మంచి ఆహారం తినలేదు. పేదలు, వితంతువులు మరియు అనాధల యొక్క కష్టాలను మరియు బాధలను  పంచుకున్నారు. సంక్షిప్తంగా ఒక ఆచరణాత్మక మానవుడు వారిలో ఉన్నారు.

ప్రపంచం ఎన్నడు చూడని అత్యంత నాగరిక రాజ్యం స్థాపించడానికి 22 సంవత్సరాల పాటు  ప్రవక్త ముహమ్మద్ (స)శ్రమించారు. ప్రవక్త ముహమ్మద్ (స) గురించి గాంధీజీ అభిప్రాయం లో “తన తోటి మానవుల అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి, మహనీయుడు ముహమ్మద్ ప్రవక్త(స)”.

ప్రవక్త ముహమ్మద్(స) పరిపాలనా చర్యలు:
ప్రవక్త(స) యొక్క జీవితం నుండి మనము పరిపాలన యొక్క వివిధ స్థాయిలను  తెలుసుకోని  వాటిని ఎలా రాజకీయ, సామాజిక, విద్యా మరియు ఆర్థిక రంగాల్లో అమలు చేయవచ్చునో తెలుసుకోవచ్చు. వారి  పరిపాలన గొప్పతనాన్ని ఆ సమయంలోఉన్న  సామాజిక మరియు ఆర్థిక పరిస్థితుల నుండి  అంచనా వేయచ్చు. ఇస్లామిక్  పాలన యూరప్, మధ్య ఆసియా మరియు ఆఫ్రికా లోని  అరేబియన్ దేశాలలో మరియు ఇతర ఇస్లామిక్ రాజ్యాలలో మిగులు బడ్జెట్ చూసింది.

రెవరెండ్ బోస్వోర్త్ స్మిత్ అభిప్రాయంలో “దైవ శక్తీ సహాయం తో పాలించిన వ్యక్తి ప్రవక్త ముహమ్మద్(స). అతను తన ఆదికారాల కోసం తపించలేదు. అతని నిజ జీవితం మరియు పబ్లిక్ జీవితం లో  నిరాడoబరత ఉంది”. 

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అభిప్రాయం లో “అరేబియా లోని అనేక యుద్ద తెగల నుంచి ఒక సామ్రాజ్యాన్ని ఒక ఆశయం కోసం సృస్టించిన వ్యక్తి ప్రవక్త ముహమ్మద్(స).” -(గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ, పి 148)

సామాజిక న్యాయం:
ఒక్కడే దైవం అనే నమ్మకం నుంచి న్యాయము  మరియు సమానత్వ భావన వస్తుంది. ఆ విచక్షణారహిత భావనయే పరిపాలనకు  ఆధారం. పౌర మరియు నేర పరిపాలనలో ముస్లింలు మరియు ముస్లిమేతరుల మధ్య, పురుషుడు మరియు స్త్రీ మధ్య, ఒక జాతి మరియు ఇతర మధ్య జాతుల మద్య ఏ తేడా లేదు.

ముస్లింలు కానివారి పట్ల పరిపాలన లో సాంఘిక మరియు పరిపాలక న్యాయం:
ముస్లిం కానీ వారికీ వారి సొంత వ్యక్తిగత న్యాయం(పర్సనల్ లా) అమలులో ఉంటుంది. వారికి షరియా న్యాయ సూత్రాలు వర్తించవు. వారికి రాజ్యం లో పూర్తి రక్షణ ఇవ్వబడుతుంది. క్రిమినల్ లా విషయం లో మాత్రం అందరు సమానులే.   రాజ్యం లో నివసించే ప్రతివారికి వారి  హక్కులు –విధులను తెల్పుతూ నిభందనలు రూపొందించ బడినవి. రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం మరియు ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు. ఇది రాజ్యం లో నివసించే అన్ని  మతాలవారికి సమానంగా వర్తిస్తుంది. అందరికి సంపూర్ణ మత స్వేచ్చ ప్రసాదించబడినది. రాజ్యాంగ నిభందలను ఉల్లఘిoచినవారు తీవ్రంగా శిక్షించ బడతారు. ఈ నిభందనలు అమెరికా రాజ్యాంగం పై ప్రభావాన్ని కలుగ చేసినవి. 
ఆర్ధిక న్యాయం సాధించుటకు చర్యలు:
సమాజం లోని పేదలకు ధనికులకు మద్య ఉన్న ఆర్ధిక అంతరాలను తొలగించుటకు జకాత్, సదకా పద్ధతి ప్రవేశ పెట్టబడినవి. జకాత్ పద్ధతి పౌరులకు మేలైనది. దుబారాను అరికట్టును. వక్తి తన ఆస్తికి కేవలం ప్రతినిధి మాత్రమే. తన కుటుంభ అవసరాలకు పోను  మిగులు ఆస్తిని బీదలకు అనాధలకు పంచవలయును. తద్వారా వ్యక్తి మరియు రాజ్యం బలపడును.    
“ఈ జకాత్ నిధులు అసలు కేవలo నిరుపేదలకు, అక్కరలు తీరనివారికి, జకాత్ వ్యవహారాలకి నియుక్తులులైన వారికీ, ఇంకా ఎవరి హృదయాలను గెలుచుకోవటం అవసరమో వారికి, ఇంకా బానిసల విముక్తికి, రుణగ్రస్తుల సహాయానికి, దేవుని మార్గంలో బాటసారుల అతిద్యానికి వినియోగించటం కొరకు, ఇది అల్లాహ్:  తరపు నుండి నిర్ణయించచబడిన ఒక విధి. అల్లాహ్ అన్ని ఎరిగినవాడు వివేకవంతుడును.-దివ్య ఖురాన్ 9:60.
సామాజిక వర్గాలు:
స్త్రీలు, పిల్లలు, బానిసలూ, ముసలివారు, అనాధలు మరియు ఇతర సామాజిక వర్గాలు చట్టప్రకారమైన సమాన హక్కులు పొంది ప్రవక్త(స) రాజ్యం(ఇస్లామిక్ రాజ్యం) లో వారికీ పూర్తి రక్షణ లబించెను. ప్రవక్త(స) ఇస్లామిక్ రాజ్యo చుట్టుపక్కల ఉన్న  అరేబియా ప్రాంతం లో శాంతి సురక్షిత  వేల్లివిరేసెను.  ఆదర్శ కుటుంభం, ఆదర్శ సమాజం మరియు అదర్స పాలనకు పునాది వేసెను.  ఇస్లామిక్ రాజ్యాల నడుమ శాంతి మరియు సుస్థిరత ఏర్పడెను. విశ్వాసులలో మంచి పనులు ఎక్కువైయ్యేను. విశ్వాసులలో నీతి, మంచి నడవడిక,దైవ భీతి, ఆద్యాత్మిక పెరిగెను. కుటుంబ శాంతికి మొదటి స్థానం ఇవ్వబడినది. మంచి కుటుంబం మంచి సమాజనిర్మాణానికి, మంచి సమాజం మంచి ఆదర్శ  రాజ్య నిర్మాణానికి తోడ్పడును.   
స్త్రీల హక్కులు:
ఇస్లామిక్ రాజ్యం లో పురుషులతో బాటు స్త్రీలు సమాన హక్కులు పొందిరి. వివాహవిషయం లో స్త్రీ అభిస్టానికి విలువ ఇవ్వబడినది. చరిత్రలో మొదటి సారి స్త్రీకి ఆస్తి హక్కు ఇవ్వబడినది. మెహర్ తప్పని సరి చేయబడినది.  స్త్రీల హక్కుల కోసం చరిత్రలో పోరాడిన మొదటి వ్యక్తి ముహమ్మద్ ప్రవక్త (స).
 స్త్రీ విద్య:
ప్రవక్త(స) విద్య పట్ల చాల శ్రద వహించెను. ప్రతి విశ్వాసి స్త్రీ పురుష వివక్షత లేక విద్యనూ అబ్యసించమని అనెను. ముఖ్యంగా స్త్రీ విద్య పై ప్రవక్త (స) చాలా శ్రద్ద వహించెను. ఒక హదీసు ప్రకారం ఒక ఆడపిల్ల కు చదువు నేర్పిన మొత్తం కుటుంభం విద్యావంతులు అగుదురు అనెను. ముగ్గురు ఆడపిల్లనున్న తండ్రి వారికీ విద్య నేర్పించి వివాహం చేసిన అతనికి స్వర్గవాసం లబించును అనెను. ప్రవక్త(స) కాలంలో విద్య నేర్చిన అనేక విధూషిమణులు కలరు.వారు న్యాయశాస్త్రం, సైన్స్, మెడిసిన్, గణితం, సారస్వతం మరియు అనేక రంగాలలో ప్రసిద్ది గాంచిరి.  ప్రవక్త (స) భార్య అయేషా (ర) హదీసులలో గొప్ప పండితురాలు.  ప్రవక్త (స) అభిప్రాయం ప్రకారం ప్రార్ధనలు అన్నిటికన్నా గొప్పది దివ్య ఖురాన్ పఠనం. 
పిల్లల రాజ్యంగ హక్కులు:
మానవ చరిత్రలో మొదటి సారిగా పిల్లలకు ఆస్తి హక్కు మరియు వారసత్వ హక్కు  ఇవ్వబడినది. పిల్లల తల్లి పెంపకం పై నిభందనలు రూపొందించ బడినవి. పిల్లలను చదివించమని ప్రవక్త (స) కోరిరి. ఒకసారు సైన్యం లో చేరాలనే కోరిక ఉన్న బాలుని నివారించి ముందు పోయి తల్లి-తండ్రుల సేవ చేయమనిరి. పిల్లల పట్ల ప్రవక్త (స) ఆదరాభిమానాలు, ప్రేమ ప్రదర్శించేవారు. 
అనస్ 10 సంవత్సరాల వయస్సు నుండి ప్రవక్త(స) సేవలో ఉన్నారు. వారు ప్రవక్త(స) ఎన్నడు కోప్పడుట గాని ఆఖరికి “ఉప్” అనుటగాని చూడలేదు. ప్రవక్త(స) పిల్లల పట్ల అనురాగం ప్రదర్శించేవారు. వారి ప్రభావం చే అరబ్బ్లు తమ పిల్లల పట్ల ఆదరాభిమానాలు ప్రదర్సిoచసాగిరి.
బానిసలకు స్వాతంత్ర్యం :
బానిస విధానం ను బలవంతం లేదా  శాసనం ద్వారా కాక దూరం చేసిన మొదటి వ్యక్తి ప్రవక్త(స). అనాదిగా బానిస విధానం అరేబియా లో అమలులో కలదు. ప్రవక్త (స) ధనవంతులైన తన అనుచరులను బానిసలను కొని వారిని బానిసత్వం నుంచి విముక్తి చేయమనిరి. బానిసను సంహరించే వాడిని నేను సంహరిస్తాను మరియు బానిసను నపుoసకునిగా చేస్తే నేను అతనిని నపుoసకునిగా చేస్తానని ప్రవక్త(స) హెచ్చరించిరి.- ముస్లిం & బుకారి. బానిసలను హింసించుట తగదని పేర్కొనిరి.   బానిస పట్ల సోదర భావం ప్రదర్సిoచమనిరి. ఇస్లామిక్ రాజ్యం లో సాంఘికంగా, రాజకీయంగా బానిసలూ మిగతా  వారితో సమానులు. బానిసపట్ల వివక్షతను వ్యతిరేకించిరి. బానిస బిలాల్ కు అజాన్ ఇచ్చే అదృష్టం ప్రసాదిoచిరి.
స్వేఛ్చ మరియు సమానత్వం:
ప్రవక్త(స) ఎన్నడు ఇతర మానవుల మీద ఆధిక్యత ప్రదర్శించలేదు. నేను అల్లాహ్ సేవకుడిని మరియు అల్లాహ్ చే పంపబడిన సందేశహరుడిని” అని చెప్పిరి. ప్రవక్త(స) అల్లాహ్ చూపిన సత్య మార్గం లో పయనిoచిరి.సత్య మార్గం లో నడుచువారు ఆత్మ శుద్ది పొంది నరకాగ్ని నుండి దూరమగుదురు.
అబూ దర్ద్ ప్రకారం ప్రవక్త(స) దృష్టిలో బానిసను స్వేచ్చాపరుని చేయటం లో ముఖ్యమైనది ఏది? యజమాని తనకు అతి ప్రియమైన బానిసకు స్వేఛ్చ ను ఇవ్వడం. ప్రవక్త (స)స్త్రీ బానిసలను లైoగికంగా హింసించకుండా వారిని పెళ్ళాడమని యువకులను కోరిరి.  బానిస బిలాల్(ర) మదీనా మస్జిద్ లో మరియు కాబా లో   అజాన్ ఇచ్చేవారు. బిలాల్ మరణించినప్పుడు మన యజమాని ఈ ప్రపంచం ను విడినాడని ప్రవక్త(స) భాదపడిరి.
మంచి మర్యాద ద్వారా శాంతి
ఆశయం క్రియలను నిర్ణయిoచును. వర్తకులు  అబద్దమాడరాదని ప్రవక్త (స) హెచ్చరించిరి. మర్యాదగా వ్యవహరించడం మంచితనాన్ని పెంచును. ఇతరుల రహస్యాలను విశ్వాసి వెల్లడించ రాదు. వ్యక్తులను మారుపేర్లతో పిలవడాన్ని నిషేదిoచిరి. ఓపిక విశ్వాసం లో సగభాగం అనిరి.  ఓపిక స్వర్గపు ఆభరణం అనిరి. విశ్వాసం ఏమిటని ప్రశ్నించగా ఓపిక అని ప్రవక్త(స) సమాధాన మిచ్చిరి.
దయాగుణం:
మక్కాపై విజయం పొందిన తరువాత శత్రువులపై ప్రవక్త(స) ప్రతీకారం తీసుకోలేదు. వారిని క్షమించిరి. వారి దయాగుణం చే ప్రభావితులు అయిన వారు ఇస్లాం స్వికరించిరి. అందరికి సార్వత్రిక క్షమాబిక్ష ప్రసాదిoచిరి. హంజా(ర) కాలేయం ను తిన్న హిందా ను క్షమించిరి.  అబూ సుఫియాన్ ఇంటివద్ద ఆశ్రయం పొందిన వారిని క్షమించిరి. వారు అనేక నియామాలు ఏర్పరిచిరి. “ ద్రోహం చేయుట నిషేధం. సత్య మార్గమును విడుచుట నిషేధం. స్త్రీలను, పిల్లలను, వృద్దులను ముక్కలు చేయరాదు. ఖర్జురపూ వృక్షం ను నరక రాదు మరియు తగల బెట్టరాదు మరియు పారే నీటిలో మలముత్ర విసర్జన చేయరాదు.తినేటప్పుడు అల్లాహ్ కు కృతఙ్ఞతలు చెప్పవలయును. ఇవి ప్రతి విశ్వాసి పాటించవలసిన నియమాలు.
సమాజము మరియు చట్టం:
ప్రవక్త(స) అభిప్రాయం ప్రకారం పాలకుడు ప్రజలను పాలించే ఒక ట్రస్టీ మాత్రమే అతని పాలన లోని తప్పు-ఒప్పులు తీర్పు దినాన నిర్ణయిoచబడతవి. ఇస్లాం లో పాలకుడు అసమాన నైతిక  వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ప్రవక్త(స) భూమి మీద న్యాయం, సమానత్వం మరియు సౌహార్ధం ఆధారంగా అల్లాహ్ రాజ్యాన్ని స్థాపించాలి అనుకొన్నారు.
సమాజo లో మార్పుదల:
ప్రవక్త(స) అన్ని సామాజిక రుగ్మతలకు పరిష్కారం చూపారు. స్త్రీ శిశువు హత్యను నిరోధించారు. వడ్డీ ను నిషేదించారు. సారాయి, జూదం, వ్యభిచారం నిషేదించ బడినవి. ప్రవక్త(స) సూచించిన ఇస్లామిక్ రాజ్యం లో అందరు సమానులే. ఉత్తమ నైతిక ప్రవర్తన ను ప్రాధాన్యమిచ్చారు. 
అక్షరాస్యత ద్వారా సాంఘిక న్యాయ సాధన:
విద్య ద్వార సమానత్వం, సోదర భావం సాదించ వచ్చు. సమాజం లోని అన్ని వర్గాల వారు విద్య ను అబ్యసించాలి. యుద్ద ఖైదీల విడుదలకు వారు కనీసం పదిమంది విశ్వాసులకు విద్యనూ నేర్పవలేనను అన్న  షరతు విధించిరి.  ప్రవక్త(స) అనుచరులు విద్యావంతులై అనేక విషయాలపై గ్రంధాలు  రచిoచిరి. ఇస్లాం ప్రముఖ శాస్త్రవేత్తలను, నూతన ఆవిష్కారాలను ప్రోత్సహించినది.
ప్రకృతి సంరక్షణ:
ప్రవక్త(స) పర్యావరణ సంరక్షణ పై ద్రుష్టి పెట్టిరి. చెట్లను నరకడంను నిషేదిoచిరి. తేనెటీగ, కప్పలు మరియు చీమలకు హాని చేయరాదు అనిరి. ఆత్మహత్యను నిరసిoచిరి.


No comments:

Post a Comment