10 August 2016

ప్రపంచాన్ని అద్భుతపరిచిన ఎనిమిది ముస్లిం ఆవిష్కరణలు


టెక్నాలజీ మరియు ఆవిష్కరణలు అనగానే మనకు బిల్ గేట్స్ మరియు స్టీవ్ జాబ్స్ గుర్తుకు వస్తారు. కాని ముస్లింలు  కనుగొన్న ఎనిమిది గొప్ప ఆవిష్కరణలు లేకపోతే ఈ ప్రపంచ పరిస్థితి ఎలా ఉండేదో ఉహించ లేము!
 ఆల్జీబ్రా: ముహమ్మద్ ఇబ్న్ మూస అల్-ఖ్వరిజ్మి నూతన గణిత పద్దతిని కనుగొన్నాడు.  12వ శతాబ్దం లో ఒక యురోపియన్ స్కాలర్ దానిని వేకలుగులోకి తెచ్చాడు అది నేడు ఆధునిక ఆల్జీబ్రా గా పిలవబడుతుంది.
టూత్-బ్రష్: ప్రవక్త (స) ముహమ్మద్ క్రి.శ.600 లో టూత్-బ్రష్ ను కనుగొన్నారు. ప్రవక్త (స)తన దంతములను మిస్వాక్ పుల్లతో తోముకునే వారు. 
శస్త్రచికిత్స: క్రి.శ. 1000వ సంవత్సరం దరిదాపుల్లో అల్-జాహ్రవి శస్త్రచికిత్స పై 1500 పేజిల పుస్తకం రాసాడు. అది యూరప్ లో క్రి.శ. 1500వ సంవత్సరం వరకు అమలులో ఉంది. సిజేరియన్ ఆపరేషన్ చేసిన మొదటి వ్యక్తి గా అతనిని గుర్తిస్తారు. 
కాఫీ: కాఫి కి పుట్టినిల్లు యుతోపియా అయినప్పటికీ దానిని త్రాగటం ప్రారంభించినది యెమెన్ లో. అక్కడినుంచి కాఫీ ప్రపం అంత వ్యాపించినది. కాఫీ గింజలను బాగా రోస్ట్ చేసి   కాఫీ తయారిలో వాడేవారు.  
మార్చింగ్ బ్యాండ్: అతోమన్ సామ్రాజ్యం లో మార్చింగ్ బ్యాండ్ ఆలోచన ప్రారంభం అయినది. ఈ ఆలోచన క్రమంగా 13వ శతాబ్దం లో మిలిటరీ మార్చింగ్ బ్యాండ్ కు నాంది పలికినది..
టార్పేడోస్:రాకెట్ ప్రోఫెల్లెద్ టార్పేడోస్ యొక్క మొదటి ఆలోచన ఒక సిరియా సైనిక నిపుణుడి మిలిటరీ టెక్నోలాజి గ్రంధం నుండి వచ్చింది.  
గిటార్: ఆధునిక సంగిత వాయిద్యం గిటార్ 5000 సంవత్సరాల నుండి అమలులో ఉన్న “ఔద్(oud)” అనే ప్రాచిన  సంగిత పరికరం నుంచి వచ్చింది.  దానిని మొదట వేలుగు లోనికి తేచ్చింది ముస్లిమ్స్.  
వైద్యశాలలు (Hospitals)
సంచార వైద్యశాలలు మొదట బాగ్దాద్ లో అమలులో ఉండేవి. ఆధునిక వైద్యశాలలు కైరోనగరం  నుంచి ప్రారంభం అయినవి. అహ్మద్ ఇబ్న్ తులన్ 9వ శతాబ్దం లో ప్రారంభించిన వైద్యశాలలో సార్వత్రిక వైద్య సేవలు ఉచితంగా లబించేవి. 





No comments:

Post a Comment