1 August 2016

ముస్లింలు భారతదేశం లో పనిచేయని అతిపెద్ద కమ్యూనిటి



భారతదేశపు ముస్లిం జనాభా లో దాదాపు  67.42% మంది పనిచేయని (కార్మికులు కాని) non workers  వారుగా ఉన్నారని  2011 సెన్సస్ గణాంకాల విశ్లేషణ ప్రకారం తెలుస్తుంది.
మొత్తం 17.22 కోట్ల ముస్లిం సమాజం నుండి 11.61 కోట్ల మంది కార్మికులు కానివారి  జాబితా లో చేర్చబడినారు. చెల్లించే లేదా చెల్లించని గృహ విధులు లేదా వ్యవసాయ విధులు  - మొదలగు  ఏ ఆర్థిక కార్యకలాపంలో పాల్గొనని వారిని  కార్మికులు  కానివారుగా నిర్వచించడం జరిగింది.
   
ముస్లిం కమ్యూనిటి లో కార్మికులు కాని వారు పెద్ద సంఖ్యలో ఉండుటకు ప్రధాన కారణం తగిన ఉపాధి అవకాశాలు లేకపోవటం మరియు అనూహ్యంగా పనిలో పాల్గొనడం లో  పురుషులు మరియు మహిళలు మధ్య తేడా నిష్పత్తి ఎక్కువు గా ఉండటం కారణమని చెప్పబడింది. ముస్లిమ్స్ లో కేవలం15.58% మహిళలు పనిలో భాగస్వామ్యం పొందుతున్నారు అదే విషయం లో పనిలో జాతీయ మహిళా భాగస్వామ్యం సగటు 24.64% గా ఉంది.

" తక్కువ పని లో పాల్గొనే శాతం సాధారణంగా ఒక కమ్యూనిటీ పేద అని అర్థం కాదు. పని లో  పాల్గొనడం పేద, వెనుకబడిన వర్గాలలో ఎక్కువగా ఉంటుంది. కాని ముస్లింల విషయంలో కమ్యూనిటీ లో యొక్క పెద్ద విభాగం వారి మహిళలు ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంది దీనితో పని లో  తక్కువ పాల్గొవడం జరుగుతుందని”  డాక్టర్ అబ్దుల్ షాబాన్, డిప్యూటీ డైరెక్టర్ TISS చెప్పారు.

విడుదల చేసిన  జనాభా లెక్కల గణాంకాల ప్రకారం భారత దేశపు 121.08 కోట్ల జనాభా  లో కార్మికులు కాని వారి(non-workers) జనాభా 60.20% గా అనగా మొత్తం 72.89 కోట్ల గా ఉంది.  కార్మికులు కాని వారి కేటగిరి లో జైన్ కమ్యూనిటీ మొదటిగా పిదప ముస్లిం కమ్యూనిటి ఉంది. జైన్ జనాభాలో 64.47%  అనగా 0.29 కోట్ల మంది కార్మికులుకాని వారుగా ఉన్నారు. సిక్కులు 63.76% మంది హిందువులు 58.95%, క్రైస్తవులు 58.09%, బౌద్ధులు 56.85% మరియు ఇతరులు 51.50% కార్మికులు కానివారుగా ఉన్నారు.

అయితే. జనాభా విశ్లేషణ ప్రకారం కార్మికులు కాని వారి శాతం 2001 మరియు 2011 మధ్య కొద్దిగా తగ్గినది. 2001 లో 102.8 కోట్ల జనాభాలో 62.63 కోట్ల మంది అనగా 60.88% కార్మికులు కానివారు (non-workers) గా  ఉన్నారు.2011 లో మొత్తం 121.05 కోట్ల జనాభాలో 72.88 కోట్ల జనాభా అనగా 60.2% మంది కార్మికులు కాని వారు (non-workers) గా ఉన్నారు.

పై  సమాచారం ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది అని, ఇది త్వరలోనే చైనా ను మించవచ్చు అని ప్రభుత్వం చేస్తున్న ప్రచారం  తప్పు అని తేలుతుంది. నిజానికి దేశ సంపద కొన్ని చేతులలో  కేంద్రీకృతమై, ఆర్ధిక అబివృద్ధి ఫలాలు  ప్రజానీకానికి చేరుట లేదు.


No comments:

Post a Comment