25 August 2016

కేరళ లో వృద్దిచెందుతున్న ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థ


భారతదేశం లో ఇస్లామిక్ బ్యాంకింగ్ సుదీర్ఘంగా చర్చించబడినప్పటికి, దాని పెరుగుదల కు విస్తృత  అవకాసం    ఉన్ననప్పటికీ, దాని విస్తరణ  ఇంకా నవజాత దశలోనే ఉంది అనుట వాస్తవం.  అయితే కేరళ రాష్ట్రం ఈ పరిణామాలు నుండి లాభం పొందేందుకు ప్రయత్నిస్తుంది. రాష్ట్ర జనాభాలో దాదాపు ఒక వంతు భాగం ముస్లిం ప్రజలను కలిగి ఉండుట  రాష్ట్రం లో  ఇస్లామిక్ బ్యాంకింగ్ స్థాపన కు ఒక అనుకూల అంశం. ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థకు అనుకూలుడు అయిన డాక్టర్ థామస్ ఇసాక్ కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నియామకం మరియు ఇటీవల ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ కు  అనుకూలంగా ఆర్బిఐ కదలికలు, రాష్ట్రంలో ఇస్లామిక్ బ్యాంకింగ్ ఊపందుకోవటానికి  బలమైన సూచికలు గా ఉన్నాయి.

ఇటివల కోజికోడ్లో జరిగిన ఒక సెమినార్ లో ఇసాక్ మాట్లాడుతూ కేరళ  ప్రభుత్వం రాష్ట్రంలో ఇస్లామిక్ బ్యాంకింగ్ అమలుకు  చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఇసాక్ అభిప్రాయం లో "వడ్డీ తక్కువ గా ఉండటం ఈ బ్యాంకింగ్ వ్యవస్థ కు ఒక అనుకూల అంశం. మనము ఇస్లామిక్ ఫైనాన్స్ ను అందిపుచ్చు కోవటానికి ఇదే మంచి సమయం " అని  చెప్పారు.

మంత్రి ఈ విషయంలో మొదటి అడుగులు వేసారు.  తన మొదటి బడ్జెట్లో ఇసాక్ కొచీ ఆధారిత చేరమాన్ ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ (సిఎఫ్ఎస్ఎల్) కు  కేరళ రాష్ట్ర డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ (KSDP) ను 250 కోట్ల రూపాయలతో ఆధునీకరణ చేసే పనులు అప్పగించారు. భారతదేశం లో ఇస్లామిక్ ఫైనాన్స్ సూత్రాల ప్రకారం నడిచే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (NBFC) ఒక్క సిఎఫ్ఎస్ఎల్ మాత్రమే.  అది ఇస్లామిక్ ఫైనాన్స్ పద్దతుల ద్వారా నిధులు సేకరించి ఆతర్వాత  KSDP ఆధునీకరణ చేస్తుంది.

ఇస్లామిక్ ఫైనాన్స్ ఇస్లామిక్ చట్టం (షరియా) ప్రకారం  నిర్వహించ బడును. అది బ్యాంకులు, మూలధనం మార్కెట్, ఫండ్ నిర్వాహకులు మరియు పెట్టుబడి సంస్థలు కలిగిన  ఒక ఆర్థిక వ్యవస్థ అని అనవచ్చును.  ఇస్లామిక్ బ్యాంకు దాని  స్థితి, నియమాలు మరియు విధానాలు షరియా సూత్రాల ప్రకారం నడుచును మరియు తన కార్యకలాపాలపై  ఏ విధమైన రసీదు ఇవ్వని మరియు వడ్డీ చెల్లింపులపై నిషేధo చూపు  ఒక ఆర్ధిక సంస్థ అనవచ్చును.
"ఆచరణాత్మక సమస్యలు ప్రధానంగా పెట్టుబడిదారుల నుండి నిధుల పెంపు వంటివి   ఉన్నప్పటికీ  కేరళలో ఇస్లామిక్ బ్యాంకింగ్ కోసం ఒక అనుకూల వాతావరణం ఉంది," అని సిఎఫ్ఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ APM మహమ్మద్ హనిష్ చెప్పారు. సిఎఫ్ఎస్ఎల్ సంప్రదాయ బ్యాంకులు వద్ద నుండి కాక పెట్టుబడిదారులు నుంచి ఫండ్ తీసుకుంటోంది
"థామస్ ఇసాక్ యొక్క నియామకం ఇస్లామిక్ ఫైనాన్సింగ్ వాదులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది.  సిఎఫ్ఎస్ఎల్ మునుపటి ఎల్డిఎఫ్ ప్రభుత్వ హయాంలో 2011 లో థామస్ ఐజాక్ ద్వారా ఉద్భవించింది" అని సయ్యద్ రంజాన్ కొదంచేరి ప్రభుత్వ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు చెప్పారు.

ఈ సమయానికి వడ్డీ రహిత బ్యాంకులు భారతదేశం లో పని చేయడానికి అనుమతిoచబడ లేదు. 2013 లో ఆర్థిక మంత్రిత్వ శాఖ భారతదేశం లో ఇస్లామిక్ బ్యాంకింగ్ పరిచయం సాధ్యాసాధ్యాలపై తన అభిప్రాయం తెలియజేయాలని ఆర్బీఐ కు విజ్ఞప్తి చేసింది. దాని ప్రకారం ఇస్లామిక్ బ్యాంకింగ్ అంతర్ డిపార్టుమెంటల్ గ్రూప్ (IDG) ఆర్బిఐ లో స్థాపించబడినది మరియు IDG తయారుచేసిన నివేదిక ఫిబ్రవరి 2016 లో ప్రభుత్వానికి సమర్పించబడినది.  

ఈ మద్య జరిగిన ఒక ముఖ్యమైన అంతర్జాతీయ అభివృద్ధి పరిణామం  కూడా భారతదేశం లో ఇస్లామిక్ బ్యాంకింగ్ సమర్ధకులకు ఉల్లాసాన్ని తెచ్చిపెట్టింది. సౌదీ అరేబియా లో తన పర్యటన సమయంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ భారతదేశం లో ఇస్లామిక్ ఫైనాన్స్ ద్వారా వ్యాపారం మరియు పెట్టుబడిపై సౌదీ ప్రభుత్వం తో చర్చలు జరిపారు. ప్రైవేట్ సెక్టార్ అభివృద్ధి కోసం ఉన్న ఇస్లామిక్ కో-ఆపరేషన్ ఫర్  డెవలప్మెంట్ అఫ్ ప్రవేట్ సేక్టర్  (జెద్ద కు చెందిన ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ అనుబంధ సంస్థ)  ఆర్బిఐ తో చర్చలు జరిపి రూ 200 కోట్ల మూలధనము తో గుజరాత్లో చిన్న మరియు మధ్యస్థ రంగ సంస్థల సహాయం కోసం ఒక NBFC ప్రారంభించింది.

"ఈ పరిణామం కూడా సిఎఫ్ఎస్ఎల్ (దేశంలో ఎకైక షరియా ఆధారిత NBFC) కు  ఊతం ఇస్తుంది. ఇదికాకుండా ఆర్బిఐ లీజు ఫైనాన్స్ మరియు మురబః (Murabaha-దీనిలో ఒక మధ్యవర్తితో ఉచిత మరియు స్పష్టమైన టైటిల్ ఆస్తి కొనుగోలు) వంటి సంప్రదాయ బ్యాంకింగ్ ఉత్పత్తులను   పోలిన  కొన్ని ఉత్పత్తులు పరిచయం చేయుటకు  అవకాశాలు పరిశీలిస్తోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ మరియు వ్యాపార పెట్టుబడి (venture capital) వంటి ఉత్పత్తులు సంప్రదాయ బ్యాంకుల ఇస్లామిక్ ఫైనాన్సు వ్యవస్థ క్రింద ఆవిష్కరించరించ బడటం  జరుగుతుంది”. దేశంలో అతి పెద్ద బ్యాంకు భారతదేశం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఇప్పటికే వడ్డీ లేని షరియా మ్యూచువల్ ఫండ్ ప్రవేశపెట్టింది. సంప్రదాయ బ్యాంకులకు  అవసరమైన మద్దతు ప్రభుత్వం ఇస్లామిక్ కిటికీ (Islamic window) ద్వార  ఇవ్వబడుతుంది అని సయ్యద్ రంజాన్ అన్నారు. కొచీ ఆధారిత ప్రత్యామ్నాయ పెట్టుబడులు మరియు క్రెడిట్స్ లిమిటెడ్ (AICL), దాని లైసెన్స్ 2012 లో ఆర్బిఐ రద్దు  చేసిన  తరువాత ముంబై హైకోర్టులో న్యాయపోరాటం జరుపుంది,  అది (AICL) ఇస్లామిక్ ఫైనాన్స్ అనుకూలంగా ఆర్బిఐ నివేదిక ప్రయోజనాన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ పెంచడానికి అవసరమైన మద్దత్తు తేగలదు అని అయన అన్నారు.
నిపుణులు రాష్ట్రంలోని  ముస్లిం సంస్థలు సంప్రదాయ బ్యాంకింగ్ కాని ఇస్లామిక్ బ్యాంకింగ్ కొత్త సంస్కృతికి అనుకూలంగా ఉన్నారని అభిప్రాయపడుతున్నారు."సమాజానికి చెందిన కొందరు వ్యవస్థాపకులు మరియు వ్యాపారవేత్తలలో కొందరు  సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థ కు అనుకూలురు. మరి కొంతమంది సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థ కు కనీస ప్రాధాన్యత ఇస్తారు.  వారి కి ఈ మార్పు ఆనందం తెచ్చిపెడుతుందని " దారుల్ హుడా ఇస్లామిక్ యూనివర్సిటీ కు చెందిన హుదవి కొలతుర్ చెప్పారు.
అతని ప్రకారం, జమాతే ఇ ఇస్లామీ మరియు సమస్థ కేరళ సున్ని స్టూడెంట్స్ ఫెడరేషన్ (SKSSF) వంటి కొన్ని ముస్లిం సంస్థలు షరియా ఆధారిత ఆర్థిక సంస్థలు ప్రారంభించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారు నిపుణుల ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసారు మరియు కొన్ని ఆర్థిక సంస్థలతో   చర్చలు జరిపారు.


No comments:

Post a Comment