న్యూజిలాండ్ లో ముస్లింలు పసిఫిక్ దీవులు, ఆసియా
దేశాలు, మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుండి వచ్చారు.
ముస్లింలు న్యూజిలాండ్ జనాభాలో కేవలం 1% మంది ఉన్నారు మరియు చాలామంది ఈ దేశానికి
కొత్తవారని అనుకోవచ్చు. కానీ 1769 లో ఇద్దరు ముస్లింలతో ఇస్లాం మొదటిసారి న్యూజిలాండ్లో
ప్రవేశించినట్లు చారిత్రిక పత్రాల ఆధారాలు ఉన్నాయి.
పూర్వ చరిత్ర:
కొన్ని
అధికారిక పత్రాల ప్రకారం అధికారికంగా ముస్లింలను మొదటసారి ఒక గ్రూప్
గా 1840 మరియు 1874 సంవత్సరాల్లో గుర్తించినట్లు తెలుస్తుంది. అబ్దుల్లా డ్రురి ప్రకారం ప్రారంభo లో ముస్లింలు ప్రధానంగా బ్రిటీష్ ఇండియా నుండి వలస వచ్చారు.
1874 ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం ఒటాగో (16) మరియు ఆక్లాండ్ (1) లో ప్రాంతాలలో 17
మహమోటర్లు (Mahometans) లేదా ముస్లిమ్స్ నివసిస్తున్నారు.
పురాతన
పత్రాల ప్రకారం ముస్లింలను మహోమేటన్,మహోమ్మేడన్,మొహమ్మేదన్, మొహమ్మద్నానిజం
లేదా ముహమ్మదినిజo (Mahometan, Mahommedan,
Mohammedan, Mohemmadanism, or Muhammadanism) అని పిలిచే వారు. ముహమ్మద్
ప్రవక్త(స) యొక్క అనుచరలుగా వీరిని పై రకంగా గుర్తించేవారు.
వలసదారుల కుటుంబ సమస్యల పరిష్కారం (Immigrant family settlement)
వలసదారుల కుటుంబ సమస్యల పరిష్కారం (Immigrant family settlement)
19 వ
శతాబ్ద ప్రారంభంలో ఇస్లాం మరియు ముస్లిమ్స్ అనే పదాలు ఎడ్వర్డ్ లేన్ రచనల ద్వారా ఐరోపా
భాషల్లో బాగా పరిచయమయ్యాయి. అయితే
న్యూజిలాండ్లో మాత్రం ఇస్లాం
అనే పదాన్ని బహిరంగంగా ఉపయోగించడం మరింత సాధారణం అయ్యింది
ఫెడరేషన్
ఆఫ్ ఇస్లామిక్ అసోసియేషన్స్ ఆఫ్ న్యూజీలాండ్ (FIANZ) అనేది న్యూజీలాండ్
లోని ముస్లిం జాతీయ సంస్థ. వీరి ప్రకారం 1850 లలో న్యూజీలాండ్ లో
ముస్లిం వలసదారుల కుటుంబ సమస్యల పరిష్కారం
క్రిస్ట్చర్చ్ (Christchurch) లో జరిగేది. లిట్టెల్టన్
టైమ్స్ (13 మార్చి 1858) ప్రకారం క్రైస్ట్చర్చ్ శివార్లలో ఉన్న లిట్టెల్టన్ లోని సుప్రీం కోర్టులో ఒక కేసు
నమోదు అయినది. ఆ కేసులో ఇద్దరు సాక్షులు, భారతదేశం నుండి
వచ్చిన వూజీర మరియు అతని భార్య మిండియా (Wuzeera and his wife Mindia). వారు దివ్య ఖురాన్
యొక్క ఆంగ్ల అనువాదంపై ప్రమాణo చేసి సాక్షం ఇచ్చారు.
లిట్టెల్టన్
టైమ్స్ వార్తాపత్రిక కూడా మహోమేటన్ (Mahometan) అనే పదాన్ని ఉపయోగించింది. 1854 లో అక్బర్ అనే నౌక ద్వారా వూజీర మరియు
అతని భార్య మిండియా న్యూజిలాండ్ చేరినట్లు తెలుస్తుంది. వూజీర క్రిస్ట్చర్చ్ శివారు
లో నివసించే విల్సన్ కష్మెరే వద్ద పనిచేసినట్లు తెలుస్తుంది. వూజీర మరియు అతని
భార్య మిండియా కు నలుగురు పిల్లలు కలరని వారిలో చివరి ఇద్దరు క్రిస్ట్ చర్చ్ లో 1859 మరియు 1861లో జన్మించినట్లు తెలుస్తుంది.
ఇరవయ్యో
శతాబ్దం మొదట్లో న్యూజిలాండ్లో ముస్లింల సంఖ్య పెరిగిపోయింది. 1901 జనాభా గణనలో 41 మంది మహమోటర్ల/ముస్లిమ్స్ ను
గుర్తించారు. 1906 మరియు 1920 మధ్యకాలంలో
వచ్చిన ముగ్గురు గుజరాతీ ముస్లింల గురించి విలియం షెపార్డ్ వివరిoచినాడు. అతని
ప్రకారం అక్కడ వారు ఒక చిన్న దుకాణాన్ని స్థాపించారు మరియు
తమ పిల్లలను భారతదేశo నుండి తెచ్చారు. 1950 వ దశకం ప్రారంభంలో, వారి
పిల్లలు తమ కుటుంబ సభ్యులను న్యూజీలాండ్లో స్థిరపర్చడానికి తీసుకువచ్చారు. తరువాతి
తరాల వారు న్యూజిలాండ్లో పుట్టారు మరియు పెరిగారు.
21 వ
శతాబ్దంలో ముస్లిం మైనారిటీ (Muslim
minority in the 21st century)
న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ ముస్లిం అసోసియేషన్ అధ్యక్షుడు తాహీర్ నవాజ్ ప్రకారం, న్యూజిలాండ్లోని ముస్లిం మైనారిటీ జనాభా దాదాపు 60,000 మందికి చేరుకుంది. ప్రభుత్వం యొక్క ఇమ్మిగ్రేషన్ మరియు శరణార్థ విధానాలలో క్రమంగా వచ్చిన మార్పులు, ప్రత్యేకించి 1987 లో రెఫ్యూజీ కోటా ప్రోగ్రామ్ ముస్లింలకు అదనపు వలస అవకాశాలు కల్పించాయి. 1987 నాటికి, ఫిజియన్-ఇండియన్స్, ప్రొఫెషనల్ మరియు వైట్-కాలర్ ఉద్య్గోలు, అదే విధంగా న్యూజిలాండ్ యూనివర్సిటీలలో చదువుతున్న అంతర్జాతీయ ముస్లిం విద్యార్థులు అందరితో కలిపి ముస్లింల సంఖ్య 2,500 కి చేరిందని షెపర్డ్ అనే ముస్లిం వ్యవరాల నిపుణుడు నమోదు చేశాడు.
2013
జనాభా లెక్కల ప్రకారం 46,000 మంది
ముస్లింలు ఉన్నారు. వీరిలో సుమారు 75% ఆక్లాండ్లో నివసిస్తున్నారు మరియు వారిలో 25%మంది న్యూజిలాండ్లో జన్మించారు. ఈ లెక్కలు 1986 గణాంకం
ను పోలి ఉంది (అప్పటి ముస్లిమ్స్ లో న్యూజిలాండ్లో
జన్మించిన వారు 26% మంది).
నేడు న్యూజిలాండ్ ముస్లిం
జనాభాలో సగం మంది మహిళలు. 2013
జనాభా గణన ప్రకారం న్యూజిలాండ్ లోని ముస్లిమ్స్
మొత్తం సంఖ్య లో 21%మంది పసిఫిక్ ద్వీపాలలో, 26.9%, ఆసియాలో,
మధ్య ప్రాచ్యం (Middle Eas)t మరియు
ఆఫ్రికాలో 23.3% మంది జన్మించారు.
ముస్లింలు
క్రైస్తవ కేథడ్రల్ను నిర్మించటానికి సహాయం చేసారు (Muslims help build cathedral)
క్రైస్ట్చర్చ్
నగరం న్యూజిలాండ్లో ఇస్లాం ఆగమనం లో ముఖ్యమైన స్థానం వహించినది. వాస్తవానికి, న్యూజీలాండ్లో
సర్వ మత కార్యక్రమాలలో ముస్లింలు పాల్గొనేవారు. డైలీ వార్తాపత్రిక ది స్టార్ (1 మే 1902)
వూజీరాకు (బెజీర్ అనే పేరును ఉపయోగించి) ఒక సంస్మరణను ప్రచురించినది. పోర్ట్
హిల్స్ క్వారీ నుండి రాళ్ళను రవాణా చేయడం ద్వారా క్రైస్ట్చర్చ్ కేథడ్రాల్
నిర్మాణంలో అతను ఎలా సహాయపడ్డాడో వివరించింది. డ్రురీ ప్రకారం ముస్లింలు
న్యూజీలాండ్లో క్రైస్తవ నిర్మాణాలకు మొట్టమొదటి నుంచి సహకారం అందించారు. ఈ సంస్మరణ
ప్రకటన క్రైస్తవ నిర్మాణాలకు వుజెరా లేదా
వుజరా యొక్క సహకారం. తెలుపుతుంది. క్రైస్ట్చర్చ్, ఆక్లాండ్, ఒటాగో, మరియు
వాంగానుయిలోని కొన్ని స్థానిక
వార్తాపత్రికలు కూడా దీనిని పునఃప్రచురణ చేశాయి.
న్యూజిలాండ్లో ముస్లింలు ఆధునిక మరియు
ప్రశాంతమైన మైనారిటీగా చూడబడ్డారు. ముస్లిం సంస్థలు, ముఖ్యంగా FIANZ
ముస్లింలకు సంబంధించిన వివాదాస్పద అంశాలకు ప్రతిస్పందించాయి. ముస్లిం నాయకులు
మరియు సంస్థలు బహిరంగంగా తీవ్రవాదాన్ని ఖండించారు.
ముస్లిం సమాజo లో శాంతియుతమైన వాతావరణo కలదు. అక్కడ ఆధునిక ఆసియా
ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. న్యూజీలాండ్లోని ముస్లింలు అనేక దేశాల నుండి
వచ్చారు మరియు ముస్లిం సమాజం జాతిపరంగా వైవిద్యం కలది. ముస్లింలలో అధిక శాతం మంది
ఉదార భావాలు కలవారు. ఆక్లాండ్లో ఒక ఇమాం
(ముస్లిం మతాధికారి) యాంటిసెమిటిక్ వ్యాఖ్యలను చేసినప్పుడు అందరు దాన్ని ఖండించారు.
కివి ముస్లిం Being Kiwi Muslim
న్యూజిలాండ్లోని ముస్లింలు శాంతియుత స్వభావాన్ని కలిగినవారు. క్రిస్ట్
చర్చి మారణహోమం పై కోపం లేకుండా ప్రతిస్పందించారు. ఇది ఇస్లామిక్ బోధనలకు మరియు న్యూజిలాండ్
సంస్కృతికి అనుకూలంగా ఉంది. ఇది కరుణ వాతావరణాన్ని స్థాపించింది.
క్రిస్ట్ చర్చి విషాదాన్ని ఎదుర్కోవడంలో
అనేకమంది ముస్లింలు న్యూజిలాండ్ల నుండి
సానుభూతి, ప్రేమ మరియు మద్దతు పొందారు. అది భాదిత కుటుంబాలకు ప్రధాని పరామర్స, పార్లమెంట్
నివాళి,ఆర్థిక మద్దతు, విజిల్స్, రెండు నిమిషాల పాటు జాతీయ నిశ్శబ్దం, ప్రజా ప్రసార స్టేషన్ల ద్వారా ప్రార్థనకు
పిలుపు ప్రసారం మరియు బురఖా ధరించిన ముస్లిం మహిళల రూపంలో సంఘీభావం ప్రకటితమైనది.న్యూజిలాండ్లోని వారి స్వదేశీయుల నుంచి
విస్తృతమైన మద్దతును పొందిన ముస్లింలు సామూహిక కాల్పుల తర్వాత శుక్రవారం
ప్రార్ధనలో ఇమామ్ ప్రకటన ద్వారా న్యూజిలాండ్లందరికీ వారి కృతజ్ఞతా మరియు ప్రశంసలు
వ్యక్తం చేశారు..
స్థానిక మరియు అంతర్జాతీయ మీడియా ఈ సంఘటన పై ప్రతిస్పందనకు న్యూజిలాండ్ లోని ఇస్లామిక్ అధ్యయనాల నిపుణులను సంప్రదించాయి. మేము ఈ దేశంలో నివసిస్తూ ఉంటాము, న్యూజిలాండ్లో ముస్లింలుగా ఉండటం అంటే మాకు గర్వకారణం అని వారు చెప్పారు. న్యూజిలాండ్ వాసులకు కరుణ మరియు ముస్లిం స్వదేశీయుల పట్ల వారు చూపిన ప్రేమను మనం మర్చిపోలేము. ఎందుకంటే వారు ఈ విలువలతో దశాబ్దాలుగా ముస్లిమ్స్ తో సహజీవనం చేస్తున్నారు.
No comments:
Post a Comment