15 March 2019

తైవాన్ సందర్శించడానికి ముస్లిం యాత్రికులకు ఆరు ముఖ్యమైన కారణాలు (Top 6 reasons for Muslim travelers to visit Taiwan)






తైవాన్ ఎక్కువ మంది ముస్లిం పర్యాటకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుండటంతో, ఇక్కడకు ఎందుకు రావాలి అనే దానికి ఆరు అద్భుతమైన కారణాలు ఉన్నాయి

ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని సందర్శకులను ఆకర్షించడానికి తైవాన్ DPP ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సౌత్ బౌండ్  పాలసీలో భాగంగా, తైవాన్ తన ఆగ్నేయ ఆసియా పొరుగువారి పట్ల దృష్టి సారించింది.ఈ దేశాల్లో చాలామంది ముస్లిం జనాభా ఉన్నారు మరియు వారిని తైవాన్ ప్రభుత్వం తన లక్ష్యంగా చేసుకుంది.

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పర్యాటక రంగం ఒకటి. ఆధునిక కాలంలో పర్యాటక రంగం ముస్లిం ప్రయాణీకులను విశేషంగా  ఆకర్షిస్తూ ఉంది.2016 గ్లోబల్ ముస్లిం ట్రావెల్ ఇండెక్స్ 2020 నాటికి ముస్లిం యాత్రికుల  యొక్క విదేశీ ప్రయాణాల సంఖ్య 117 మిలియన్ల నుండి 168 మిలియన్లకు పెరుగుతుందని అంచనా        వేసింది. ఈ ప్రయాణికులు 2020 నాటికి 200 బిలియన్ డాలర్లు (సుమారు NT $ 6 ట్రిలియన్) ఖర్చు చేస్తారని అంచనా. పర్యాటక రంగం ఒక పెద్ద,లాభదాయకమైన మార్కెట్ గా వర్ణించబడినది. .