.
హజ్ కమిటీ ఆఫ్ ఇండియాని సెంట్రల్
హజ్ కమిటీ (CHC) అని కూడా పిలుస్తారు. ఇది భారత ప్రభుత్వం చే రుపొందించబడిన 2002 హజ్ కమిటీ చట్టం క్రింద సౌదీ అరేబియాకు ఇస్లామిక్
తీర్థయాత్రలను నిర్వహించడానికి ఏర్పాటు చేయబడినది. రాష్ట్ర హజ్ కమిటీల కోసం ఇది ఒక
నోడల్ ఏజెన్సీలాగా పనిచేస్తుంది మరియు ఇందులో 23 మంది సభ్యులు ఉంటారు.వీరిలో ఆరుగురు రాష్ట్రాల హజ్ కమిటీల చేత, నలుగురు ఎక్స్-అఫిషియో సబ్యులు,
ముగ్గురు పార్లమెంట్ సబ్యులు, ఏడుగురు కేంద్ర ప్రభుత్వo చేత నామినేట్ చేయబడతారు. మిగతా వారు ఎక్కువ సంఖ్యలో
హజ్ యాత్రికులను పంపే రాష్ట్రం నుండి ఎన్నిక చేయబడతారు.
2018 లో సౌదీ అరేబియా కు వెళ్ళే భారతదేశ ఒరిజినల్ హజ్ కోటా 128702 గా ఉంది. ఆ
సంవత్సరం హజ్ కు వెళ్ళిన మొత్తం యాత్రికుల సంఖ్య 128690 గా ఉంది.
సెంట్రల్ హజ్ కమిటీ 2011 జనాభా లెక్కల
ప్రకారం ముస్లిం జనాభా సాంద్రత ఆధారంగా రాష్ట్రల వారీగా కోటా పంపిణీ చేస్తుంది.
హజ్ కమిటీ ద్వారా మతపరమైన తీర్థయాత్రలను ఏర్పాటు చేయాలనే
సంప్రదాయం బ్రిటిష్ పాలన కాలంలో అనగా 1927 నుండి ప్రారoబించబడినది. 1927 లో పోలీసు కమిషనర్ అఫ్ బాంబే D. హేలే అద్యక్షతన 10 సభ్యుల హజ్ కమిటీని ఏర్పాటు
చేశారు. కమిటీ యొక్క మొదటి సమావేశం 1927 ఏప్రిల్ 14 న జరిగింది. 1932 లో పోర్ట్ హజ్ కమిటీ ఏర్పడినది. 1995 లో, సముద్రయానం
పూర్తిగా నిలిపివేయబడింది మరియు అందరు భారతీయ యాత్రికులు విమానయానం ద్వారా జెద్దా చేరుకోవడం ప్రారంభించారు.
1959 లో నెహ్రు
ప్రధాని కాలం లో ప్రభుత్వం చేసిన చట్ట పలితంగా 1964లో హజ్ కమిటి ఏర్పడినది. దాని మొదటి చైర్మన్ ముస్తఫా ఫకిహ్ (Mr. Mustafa Fakih).చౌదరి మెహబూబ్ ఆలీ కైసర్MP ప్రస్తుతం హజ్ కమిటీ
ఛైర్మన్గా ఉన్నారు.
మొదట్లో బొంబాయి మాత్రమె ఎమ్బార్కేషన్
(Embarkation Point) పాయింట్ గా ఉండేది. 2010 నాటికి ఎమ్బార్కేషన్ (Embarkation
Point) పాయింట్ ల సంఖ్య 21 కి పెరిగింది.
Name of Embarkation Point
|
Embarkation Started
w.e.f.
|
|
1.
|
Mumbai
|
Prior to 1983
|
2.
|
Delhi
|
1983
|
3.
|
Chennai
|
1987
|
4.
|
Kolkatta
|
1988
|
5.
|
Bangalore
|
1986
|
6.
|
Calicut
|
2000
|
7.
|
Ahmedabad
|
2000
|
8.
|
Hyderabad
|
2001
|
9.
|
Lucknow
|
2002
|
10.
|
Srinagar
|
2002
|
11.
|
Nagpur
|
2003
|
12.
|
Gaya / Patna
|
2003 / 2005
|
13
|
Jaipur
|
2004
|
14
|
Guwahati
|
2005
|
15
|
Aurangabad
|
2005
|
16
|
Varanasi
|
2007
|
17
|
Indore
|
2008
|
18
|
Ranchi
|
2009
|
19
|
Mangalore
|
2009
|
20
|
Bhopal
|
2010
|
21
|
Goa
|
2010
|
భారతదేశంలోని హజ్ కమిటీ 2019 హజ్
యాత్రకు గాను తన మొత్తం కోటా 175,025 సీట్లను హజ్కు హాజరయ్యే యాత్రికుల
కోసం పంపిణీ చేసింది. దీని ప్రకారం, మొత్తం 125,025 యాత్రికులు హాజ్ కమిటీ అఫ్ ఇండియా ద్వారా
వెళతారు, మిగిలిన 50,000 సీట్లు ప్రైవేటు టూర్ ఆపరేటర్లకు (PTO లు) కేటాయించబడ్డాయి.
భారత దేశం లోని వివిధ
రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో హజ్ యాత్రికుల సేవ, బస నిమితం మొత్తం 31 హజ్
హౌసెస్ నిర్మించబడినవి.
హజ్ సబ్సిడీ
హజ్ సబ్సిడీ అనేది భారతీయ ముస్లిం హజ్
యాత్రికులు భారతీయ ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ద్వారా రాయితీ విమాన ప్రయాణానికి
భారత ప్రభుత్వం ఇచ్చిన రాయితీ అని చెప్పవచ్చు. ఇది బ్రిటీష్ పరిపాలన కాలంలోనే
మొదలైనది. భారత ప్రభుత్వం 1959 లో చేసిన హజ్ చట్టంతో విస్తరించింది.
సౌదీ అరేబియా, సిరియా, ఇరాక్, ఇరాన్ మరియు జోర్డాన్లకు మతపరమైన
కారణాల కోసం ప్రయాణిస్తున్న భారతీయ ముస్లిం యాత్రికులకు ప్రారంభంలో రాయితీ
రాయబడింది.
1954 లో అప్పటి ప్రభుత్వo చే ముంబయి మరియు జెడ్డా మధ్య విమానయానానికి హజ్ సబ్సిడీ మొదలైంది. అదనపు విమానాశ్రయాలు తరువాతి సంవత్సరాలలో చేర్చబడ్డాయి మరియు 1984 నుంచి, భారత హజ్ ట్రాఫిక్ ను భారతదేశం మరియు సౌదీ అరేబియా యొక్క జాతీయ రవాణా సంస్థలు పంచుకున్నారు.
1954 లో అప్పటి ప్రభుత్వo చే ముంబయి మరియు జెడ్డా మధ్య విమానయానానికి హజ్ సబ్సిడీ మొదలైంది. అదనపు విమానాశ్రయాలు తరువాతి సంవత్సరాలలో చేర్చబడ్డాయి మరియు 1984 నుంచి, భారత హజ్ ట్రాఫిక్ ను భారతదేశం మరియు సౌదీ అరేబియా యొక్క జాతీయ రవాణా సంస్థలు పంచుకున్నారు.
2000 నుండి, 1.5 మిలియన్లకు పైగా ముస్లింలు రాయితీని
ఉపయోగించారు మరియు 2008 నుంచి 120,000 మందికి పైగా భారతీయ ముస్లింలు రాయితీని ఉపయోగించుకున్నారు. హజ్
సబ్సిడీ లో ఎయిర్-ఫేర్ సబ్సిడీ, మరియు భారతదేశ ప్రభుత్వం ప్రత్యేకంగా
రూపొందించిన హజ్ డిపార్చర్ విమానాశ్రయ టెర్మినల్స్ చేరడానికి అయ్యే ఖర్చు , భోజనం, వైద్య సంరక్షణ మరియు బస సహాయం కలసి ఉన్నాయి.
విమర్శ:
కొంతమంది విమర్శకుల అభిప్రాయం లో ఈ
ఎయిర్లైన్స్ సంస్థల గుత్తాధిపత్యo తో వాస్తవిక సబ్సిడీ లబ్ధిదారుడు ఎయిర్ ఇండియా
అని, సబ్సిడీ అనేది వాస్తవానికి ఓవర్ ప్రైస్డ్ ఎయిర్ ఫేర్ లో తగ్గింపుగా ప్రకటించినారు. కొoతమంది ముస్లిం పార్లమెంట్ సభ్యులతో సహా, అనేకమంది సబ్సిడీ ఇస్లాం కు వ్యతిరేకం కాబట్టి
దాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
సుప్రీం తీర్పు:
మే 2012 లో భారత సుప్రీం కోర్ట్ బెంచ్ 2022 నాటికి హజ్ సబ్సిడీ మొత్తాన్ని క్రమంగా
తగ్గిస్తు నేటి నుండి పది సంవత్సరాల వ్యవధిలో దాన్ని పూర్తిగా తొలగించాలని కేంద్ర
ప్రభుత్వాన్ని ఆదేశించింది. "సబ్సిడీ మొతాన్ని విద్య మరియు సమాజ అభివృద్ధి కి ఉపయోగించాలని
చెప్పింది.
హజ్ పై ప్రభుత్వ ప్రకటన:
2017 నవంబర్లో సెంట్రల్ హజ్ కమిటీ సమావేశంలో
2018 నుంచి హజ్ సబ్సిడీ పూర్తిగా తొలగించాలని ఆ
నిధులను ప్రత్యేకించి అల్పసంఖ్యాక వర్గానికి చెందిన అమ్మాయిల కోసం విద్యా
కార్యక్రమాలపై ఖర్చు చేయాలనీ నిర్ణయిoచబడినది. 2018 జనవరి 16 న కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ
మంత్రి ఒక ప్రకటన చేస్తు హజ్జ్ సబ్సిడీని (700 కోట్ల రూపాయలు) పూర్తిగా తీసివేశామని, ఆ మొత్తాన్ని మైనారిటీకి చెందిన పిల్లల విద్యా
అవసరాల కోసం ఉపయోగిస్తామని చెప్పారు.
సముద్ర మార్గాన హజ్ యాత్ర పున:ప్రారంభం:
2022 నాటికి విమానం ద్వారా ప్రయాణించే హజ్ యాత్రికులకు ఇచ్చే
సబ్సిడీని రద్దు చేయాలన్న 2012
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మరియు కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్రకు ఇచ్చే
సబ్సిడీని 2018 జనవరి లో ఉప సంహరించుకొన్న సందర్భం లో సముద్ర మార్గాన హజ్ యాత్ర
తిరిగి తెర మీదకు వచ్చింది.
ముంబై నుంచి జెద్దా కు
2,515 నాటికల్ మైల్స్ దూరం కలదు. ఇండియన్ హజ్ యాత్రికులు ముంబై నుంచి అరేబియా
సముద్రాన్ని దాటి గల్ఫ్ అఫ్ అదెన్ మరియు
ఎర్ర సముద్రం(Gulf of Aden and Red Sea) గుండా ప్రయాణిoచి జెద్దా
చేరతారు.
సముద్ర మార్గాన ప్రయాణం వలన ఖర్చు గణనీయంగా
తగ్గుతుంది. ఒక యాత్రికుడికి సముద్ర మార్గం ద్వారావ్యయం 60,000 రూపాయలు అవుతుంది. అదే విమాన మార్గన 2లక్షలు అవుతుంది.
మోడీ ప్రభుత్వం ప్రకటించిన నూతన హజ్ విధానం లో భాగం గా 2018 నుండి ముంబయి మరియు జెడ్డా మధ్య హజ్ యాత్రికుల కోసం
"ప్రపంచ తరగతి" (World Class Cruise)
15 క్రూజ్ పర్యటనలను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రతి యాత్రలో సుమారు
5,000 యాత్రికులు ప్రయాణిస్తారు అని యూనియన్
మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి చెప్పారు.
"క్రూజ్" ప్రపంచ స్థాయి సౌకర్యాలను
కలిగి ఉంటుంది మరియు జెడ్డా చేరుకోవడానికి కేవలం 3-4 రోజులు పడుతుంది. పేద
ముస్లింలు కూడా తమ బడ్జెట్లో యాత్రికులు చేపట్టదానికి వీలుగా కొత్త హజ్ విధానాల్లో
భాగంగా సముద్ర మార్గాన్ని పునరుద్ధరించాము అని మంత్రి అన్నారు.
జెట్డాకు సముద్ర మార్గం ద్వారా యాత్రికులు పంపే
ఎంపికను హై పవర్ కమిటీ అధ్యయనం చేసింది. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది
మరియు సౌదీ అరేబియా దానిని కూడా స్వాగతించింది," అని
నక్వి చెప్పారు, ముస్లిం సమాజం నుండి అనేకమంది ప్రజలు దీనికి
ఆమోదం తెలిపారు అని నక్వి అన్నారు.
నిజాం యొక్క రుబాత్ (Rubath) వసతి
హైదరాబాద్ యొక్క నిజాం, తన సంస్థానానికి చెందిన హజ్ యాత్రికుల ఉచిత నివాసం కొరకు మక్కా లో ఒక పెద్ద ఇల్లు కొన్నారు. తెలంగాణ ప్రభుత్వo రుబత్ (ఉచిత వసతి) లో నివసించే యాత్రికులను ఎంచుకోవడానికి ఒక లక్కి డ్రా పోటీ నిర్వహిస్తుంది. రుబాత్ క్రింద మొదట్లో 42 భవనాలు ఉన్నాయి, కానీ మక్కా యొక్క గ్రాండ్ మసీదు విస్తరణ తర్వాత కొన్ని భవనాలు మాత్రమే మిగిలిపోయాయి.
No comments:
Post a Comment