31 March 2019

జామ కాయ



 Image result for guava fruit
జామ లేదా జామి (ఆంగ్లం Guava) మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. భారతదేశంలో ఒక సాధారణమైన ఇంట్లో పెరిగే చెట్టు. దీనిని తియ్యని పండ్లకోసం పెంచుతారు. జామ పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి. ప్రపంచంలో అన్ని దేశాలలోను లభిస్తుంది .  ఆసియా దేశాలలో విసృతంగా పండుతుంది.

పోషక విలువలు అధికంగా గల 'మేలైన ఫలాలుగా' జామపళ్లను పేర్కొనవచ్చు. ఎందుకంటే వీటిలో విటమిన్‌ '' మరియు విటమిన్‌ 'సి' నిల్వలు అధికంగా ఉంటాయి. వీటి గింజలు కూడా ఒమేగా-3, ఒమేగా-6 కరుగని కొవ్వు ఆవ్లూలు, పీచు పదార్థాలు ఎక్కవగా కలిగి ఉంటాయి. వీటిలో మినరల్స్‌, పొటాషియం, మెగ్నీషియం నిల్వలు అధిక మొత్తాలలో ఉండి సాధారణంగా అవసర మైన పోషకాలు తక్కువ కేలరీలలో ఉంటాయి. జామపళ్లలో ఉండే కెరటోనాయిడ్లు, పొలీఫెనాల్స్‌- ఇవి ఆక్సికరణం కాని సహజరంగు కలిగించే గుణాలు జామ పళ్లకి ఎక్కువ ఏంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలను కలుగజేస్తాయి.

కాలరీలు 36-50, తేమ 77-86 గ్రా, పీచు 2.8-5.5. గ్రా, ప్రొటీన్స్‌ 0.9-1.0 గ్రా, క్రొవ్వు 0.1-0.5 గ్రా, యాష్‌ 0.43-0.7 గ్రా, కార్బోహైడ్రేట్లు 9.5-10 గ్రా,కాల్షియం 9.1-17 గ్రా, పాస్ఫరస్‌ 17.8.30 మి.గ్రా, ఐరన్‌ 0.30-70 మి.గ్రా, కెరోటీన్‌ (విటమన్‌ '') 200-400, ఎస్కార్బిక్‌ ఆవ్లుము (విటమిన్‌ 'సి') 200-400 మి.గ్రా, ధియామిన్‌ (విటమిన్‌ బి1) 0.046 మి.గ్రా, రిబోప్లేవిన్‌ (విటమిన్‌ బి2) 0.03-0.04 మి.గ్రా, నియాసిన్‌ (విటమిన్‌ బి3) 0.6-1.068 మి.గ్రా.

ఔషధపరమైన ఉపయోగాలు:.
Ø జామ ఆకులు, బెరడు నుంచి తయారు చేసిన పదార్థాలు కేన్సర్‌, బాక్టీరియా ద్వారా వచ్చే అంటు వ్యాధులు, వాపులు మరియు నొప్పి నివారణలో వైద్యంగా వాడుతున్నారు.
Ø  జామాకుల నుంచి తయారు చేసిన నూనెలు కేర్సర్‌లు విరుద్ధంగా పనిచేస్తున్నాయి.  జామ ఆకులను నాటు వైద్యంగా డయేరియాకి మందుగా ఉపయోగిస్తారు. బెరడు ఏంటీ మైక్రోబియల్‌, ఏస్ట్రింజంట్‌ లక్షణాన్ని కలిగి ఉంటుంది. వీటిని చక్కెర వ్యాధి తగ్గించడంలో కూడా ఉపయోగిస్తారు.
Ø వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.  శక్తివంతమైన యాంటి ఆక్షిడేంట్ గా ఉపయోగపడుతుంది, కణజాలము పొరను రక్షిస్తుంది, కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది,
Ø కమలా పండులో కంటే ఇదు రెట్లు అధికంగా విటమిను " సి " ఉంటుంది . ఆకుకూరలలో లభించే పీచు కంటే రెండింతలు పీచు జామకాయలో ఉంటుంది . చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే " కొల్లాజన్ " ఉత్పత్తికి ఇది కీలకము, కొవ్వు మెటబాలిజాన్ని ప్రభావితం జేసే " పెక్టిన్" జామలో లభిస్తుంది .
Ø ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది. జామలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు.
Ø జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చు. నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. ఇక జామపండు పై చర్మంలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది.
Ø జామకాయలో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం.
Ø జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు.
Ø జామ వంటి సీజనల్ గా లబించే పండ్లు మన శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచి రోగాలు దరిచేరకుండా దోహదపడతాయి.
Ø జామపండ్లు ఆరోగ్యానికీ అధిక లాభాన్ని చేకూరుస్తాయి. ఈ పండ్ల ముక్కలపై మిరియాలపొడి, ఉప్పు చల్లుకుని తింటే ఆరోగ్యానికి మరింత దోహదం చేస్తాయి. కానీ ఎవరికి నచ్చిన విధంగా వారు వీటిని తింటూ ఉంటారు. వీటితో జామ్‌ లు ఐస్‌క్రీమ్స్ సలాడ్స్ వంటివి తయారు చేసుకోవచ్చు. జామపళ్ళలో సి' విటమిన్ పుష్కలంగా వుంటుంది.
Ø విటమిన్‌ సి మాత్రమే కాదు. ఇందులో విటమిన్‌ ఎ, విటమిన్‌ బి, కేల్షియమ్‌, ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, ఫోలిక్‌యాసిడ్‌ వంటివి మెండుగా ఉన్నాయి. అంతేకాదు, జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్‌ ఇందులో నిండుగా ఉంది.
Ø జామకాయలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం మరి.
Ø క్యాన్సర్ నివారిణి: శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్ గా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ నివారిస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు నివారిణిగా ఉపయోగపడుతుంది.
Ø దంత క్షయం: జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. చిగుళ్ల వాపులను తగ్గించుకోవచ్చును. దంతాలు కదలటం, చిగుళ్ల నుంచి రక్తం కారటం వంటి సమస్యలను అరికడుతుంది.
Ø ఎసిడిటి: ఎసిడిటికి రోజుకో పండు తింటే మంచిది. కడుపు ఉబ్బరం, కడుపులో మంట నుండి ఉపశనం పొందేలా చేస్తుంది.
Ø కీళ్ల నొప్పులు: కీళ్లవాపు, నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు జామాకులను కొద్దిగా వేడిచేసి వాపులున్నచోట కట్టుకట్టుకోవాలి. కండరాలు గట్టిపడేలా చేస్తుంది. ఎముకల ద్రుడత్వనాకి జామకాయలో ఉండే మ్యాంగనీస్ బాగా సహాయపడుతుంది.
Ø జలుబు, దగ్గు, జ్వరం: ఐదు, ఆరు ఆకులు నీటిలో మరగబెట్టి డికాక్షన్‌ వాడితే దగ్గు, జలుబు పోతుంది. ఆకుల నుంచి లభించే తైలం యాంటీ ఆక్సిడెంట్ల చర్యలను వేగవంతం చేస్తాయి.
Ø కంటి ఆరోగ్యానికి: జామకాయలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల ఈ న్యూట్రిషియన్ ఐ సైట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
Ø సంతానోత్పత్తికి: జామకాయను బాగా నమిలి తినడం వల్ల శరీరంలో ఫిల్లెట్ బాగా ఉత్పత్తి అవుతుంది. ఈ పోషకాంశాలు గల ఫిల్లెట్ సంతానోత్పత్తిని పెంచే హార్మోలను ఉత్పత్తి చేస్తుంది
Ø థైరాయిడ్: జామకాయలో ఐయోడిన్ లేదు. అయితే ఇందులో ఉండే కాపర్, మరియు ఇతర మినిరల్స్ థైరాయిడ్ జీవక్రియలు క్రమబద్దం చేయడానికి, హార్మోనుల ఉత్పత్తికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.
Ø రుతుస్రావం: రుతుస్రావ సమస్యలను దూరం చేయడంలో, రక్తపోటును నియంత్రించడంలో, గుండె పనితీరును మెరుగు పర్చడంలో, స్కర్వీవ్యాధిని దూరం చేయడంలో, జలుబుకు విరుగుడుగా జామ సమర్థవంతంగాపనిచేస్తుంది.
Ø కాలిన గాయాలకు: కాలిన గాయాలకు గుజ్జును రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
Ø మెదడుకు: ఇందులోని కెరొటినాయిడ్స్‌, ఐసోఫావో నాయిడ్స్‌, పాలి ఫినాల్స్‌ మొదడు కణాలు చురుకుగా పనిచేయడానికి తోడ్పడతాయి.
Ø శారీరక బలానికి. బాగా పండిన జామ పండ్ల గుజ్జులోంచి గింజలు తొలగించి పాలు తేనె కలిపి తీసుకుంటే విటమిన్-సీ క్యాల్షియం మెండుగా లభిస్తాయి. పెరిగే పిల్లలు గర్భిణులు దీనిని టానిక్‌లా వాడవచ్చు. క్షయ, ఉబ్బసం, బ్రాంకైటీస్, గుండె బలహీనత,కామెర్లు,హైపటైటీస్,   జీర్ణాశయపు అల్సర్లు మూత్రంలో మంట లాంటి అనేక రకాల సమస్యల్లో శక్తి చేకూర్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
Ø జలుబు నుంచి ఉపశమనానికి..
విటమిన్-సీ అధిక మొత్తాల్లో ఉండడంతో వైరస్ కారణంగా ప్రాప్తించిన జలుబు నివారణకు జామ బాగా పని చేస్తుంది.
Ø అధిక దప్పిక తీరేందుకు..
జామ పండ్లను చిన్న సైజు ముక్కలుగా తరిగి తాగునీళ్లలో మూడు గంటల పాటు నానేసిఆ నీళ్లను దాహం తీరేంత వరకూ తాగితే అధిక దప్పిక నుంచి ఉపశమనం లభిస్తుంది.
Ø తలనొప్పి/మైగ్రెయిన్ నివారణలో..
దోర జామపండును సానరాయి మీద గంధం చేసి నుదుటి మీద లేపనంలా రాస్తే తలనొప్పి తగ్గుతుంది. మైగ్రెయిన్‌తో బాధపడేవారు దీనిని సూర్యోదయానికి ముందే ప్రయోగిస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది.




No comments:

Post a Comment