31 March 2019

బొప్పాయి




Image result for papaya 
మన దేశం లోకి  బొప్పాయి (Papaya) 400 ఏళ్ల క్రితమే ప్రవేశించింది. మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయిని మన దేశం లో ప్రధానంగా  ఆంధ్ర ప్రదేశ్‌తమిళనాడుఅస్సాంబీహార్పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. బొప్పాయిని పరందపుకాయ, పరమాత్మునికాయమదన ఆనపకాయ అని కూడా బొప్పాయిని పిలుస్తుంటారు.
వైద్య పరమైన ఉపయోగములు.

బొప్పాయి పండులో విటమిన్ "ఏ", విటమిన్ "బీ", విటమిన్ "సీ", విటమిన్ "డీ"లు తగు మోతాదులో నున్నాయి. తరచూ బొప్పాయి పండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగాలభిస్తాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన  జీర్ణక్రియ  సాఫీగా జరుగుతుంది.

ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయిపండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్యనిపుణులు. 

100 గ్రాముల బొప్పాయి ముక్కల్లో లభించేవి:
40 క్యాలరీలు
,1.8గ్రా. పీచు,9.8గ్రా కార్బోహైడ్రేట్లు,0.6గ్రా ప్రోటీన్లు,10మి.గ్రా. మెగ్నీషియం,
257మి.గ్రా. పొటాషియం
,03 మి.గ్రా. సోడియం,24 మి.గ్రా. కాల్షియం,61.8 మి.గ్రా. విటమిన్‌-సి,విటమిన్‌ ఎ (6%),బీటాకెరోటిన్‌ (3%),విటమిన్‌ బి1 (3%),బి2 (3%),బి3 (2%),బి6 (8%)ఉంటాయి
పోషకవిలువలు
·         కెరోటిన్‌, , బి, సి, ఇవిటమిన్‌లుఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు.వంటి పోషకాలు బొప్పాయిపండులోపుష్కలం.
·         మామిడిపండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనితోపాటుబి1, బి2, బి3,సి,విటమిన్లుకాల్షియంఇనుముభాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి.
·         కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండు లోని బిటాకెరోటిన్‌ (2020 ఐ.యూ.) తోడ్పడుతుంది.
·         బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి (40 మి.గ్రా.) దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగ నిరోధక శక్తికి తోడ్పడుతుంది.
·         విటమిన్‌ బి (రైబోఫ్లెవిన్‌ 250 మైక్రోగాములు) నోటి పూతతెల్లమచ్చలుపెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది.
·         బొప్పాయి'కాయ' జీర్ణానికి తోడ్పడితే, 'పండు' పోషకాల నిస్తుంది.
·         బొప్పాయి పండును చిన్నపిల్లలకు గుజ్జుగా చేసి నాలుగోనెల నుంచి తినిపించవచ్చు. యుక్త వయస్సులో ఉన్న వారు దోరగా పండిన పండును తినవచ్చు.
·         కొలెస్ట్రాల్‌ అంటే కొవ్వులేదు, క్యాలరీలూ తక్కువే. అందుకే స్థూలకాయులు సైతం హాయిగా బొప్పాయిని తినొచ్చు
ఇతరఉపయోగాలు
బొప్పాయి మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది.
·         బొప్పాయి లోని తెల్లని గుజ్జుని మొహనికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది. మొటిమలూ తగ్గుతాయి.
·         బొప్పాయి ఫేస్‌ప్యాక్‌ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది. అందుకే సబ్బులు, క్రీముల్లో కూడా ఎక్కువగా వాడుతున్నారు.
·         బొప్పాయి పండు తింటే హృద్రోగాలూ, కోలన్‌ క్యాన్సర్లూ రావు. పండు లోని బీటాకెరోటిన్‌ క్యాన్సర్‌నీ రాకుండా నిరోధిస్తుంది.
·         ఆస్తమా, కీళ్లవ్యాధుల వంటివి రాకుండా నిరోధిస్తుంది.
·         మలబద్ధకాని కి బొప్పాయి పండు మంచి మందు.
·         ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది.
·         బొప్పాయిపండు లోని పీచు మొలల్నీరానివ్వదు.
·         బొప్పాయిపండు తినడం వల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి వంటివీ తగ్గుతాయి.
·         బొప్పాయిపండు తామర వ్యాధిని తగ్గిస్తుంది.
·         పచ్చికాయ అధిక రక్తపోటుని (హైబీపీ) నియంత్రిస్తుంది.
·         శృంగార ప్రేరితం గానూ పనిచేస్తుంది.
·         గింజల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంథెల్‌ మింటిక్‌ గుణాలు మెండు. అందుకే కడుపు నొప్పికీ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లకీ వీటిని మందుగా వాడతారు.
·         కొన్నిచోట్ల ఆకుల రసాన్నిహృద్రోగాలకు ఔషదంగా ఉపయోగిస్తారు.
·         బొప్పాయి ఆకుల రసాన్ని డెంగ్యూ జ్వరము వచ్చినపుడు వాడితే ప్లేట్లెట్లు కౌంటు పెరగడానికి పనిచేస్తుంది.
·         డయాబెటిస్కారణంగా వచ్చే హృద్రోగాల్ని పచ్చి బొప్పాయి తగ్గిస్తుంది.
·         బొప్పాయి లోని పపైన్ను ట్యాబ్లెట్గా రూపొందించి జీర్ణసంబంధ సమస్యలకు మందుగా వాడుతున్నారు.
·         ఈపపైన్గాయాల్ని మాన్పుతుంది. ఎలర్జీల్ని తగ్గిస్తుంది. అందుకే గాయాల మీదా పుండ్ల పైనా బొప్పాయి పండు గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి.
·         పులియబెట్టిన బొప్పాయి నుంచి పపైన్ఆయింట్మెంట్తయారుచేస్తారు.
·         నొప్పి నివారిణి గానూ (పెయిన్కిల్లర్‌) పపైన్గొప్పదే. అందుకే నరాల మీద ఒత్తిడిని తగ్గించేందుకూ వెన్నుపూసలు జారినప్పుడూ దీన్ని ఇంజెక్ట్చేస్తారు.
·         బొప్పాయి హెమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది .
ఇతర విశేషాలు
·         ఆసియా దేశాల్లోని కొన్ని ప్రాంతాలలో బొప్పాయిపండులోని గింజల్ని ఎండబెట్టి మిరియాలకు బదులుగా వాడతారు
·         బొప్పాయి ఆకుల్ని ఉడికించి పాలకూరలా తింటుంటారు
·         శ్రీలంక, భారత్, పాకిస్థాన్‌... వంటి దేశాల్లో గర్భనిరోధానికీ, గర్భస్రావానికీ బొప్పాయిని వాడతారు
·         బొప్పాయి పండులో అన్నిరకాల విటమిన్లు, కంటి ఆరోగ్యానికి అవసరమైన బీటాకెరోటిన్ ఇందులో ఉంటాయి. విటమిన్ సి, రెబోఫ్లేవిన్ సమృద్ధిగా ఉంటాయి. చక్కెర, ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఈ పండు పైత్యాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని తొలగిస్తుంది
·         హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి కాయను కూరగా వండి తీసుకుంటే బాలింతలకు మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. బొప్పాయి పాలు, బెల్లంతో కలిపి తినిపిస్తే చిన్నారుల కడుపులో ఉండే నులి పురుగులు నశిస్తాయి. బొప్పాయి ఆకులు మెత్తగా దంచి, పసుపుతో కలిపి పట్టు వేస్తే బోదకాలు తగ్గుతుంది.

·         బొప్పాయి రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. చిగుళ్లవాపును, రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ పండులో విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది.
·         బొప్పాయి మలబద్ధకాన్ని పోగొడుతుంది. ఆహారాన్ని వెంటనే అరిగేలా చేస్తుంది.
 
టీబీని నివారిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
రక్తంలోని దోషాలను నివారిస్తుంది. రక్త ప్రసరణ పెరగడానికి దోహదపడుతుంది.
వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.
కడుపులోని యాసిడ్స్‌ను కంట్రోల్ చేస్తుంది.

·         జీర్ణక్రీయ వేగవంతం...

బొప్పాయికాయలో పపేయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మాంసాహారం త్వరగా అరగడానికి దోహదం చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
·         బ్రేక్ ఫాస్ట్‌ గా బొప్పాయి...

బొప్పాయి పండును ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే చాలా మంచిది.
బొప్పాయిపండు ముక్కలకు తేనె చేర్చి తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
బొప్పాయి ముక్కలను పాలతో ఉదయం పూట తీసుకుంటే కాలేయ సంబంధ జబ్బులు నయం చేస్తుంది.


·         నీళ్ల విరేచనాలకు
నీళ్ల విరేచనాలకు బొప్పాయి పండు బాగా పనిచేస్తుంది. కడుపు నొప్పితో నీళ్ల విరేచనాలు మొదలైతే బొప్పాయితో నయం చేయవచ్చు. పైల్స్ నివారణకు పచ్చి బొప్పాయికాయ కూర బాగా ఉపయోగపడుతుంది.
·         బీపీ తగ్గిస్తుంది

రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం పరగడుపున బొప్పాయి తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. అంతేగాకుండా కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. బొప్పాయి వేరును అరగదీసి నీటిలో కలిపి దాహం అనిపించినప్పుడల్లా తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు మాయమవుతాయి.
బాలింతలకు : బొప్పాయి ముక్కలను పాలతో కలిపి బ్రేక్‌ఫాస్టుగా తీసుకుంటే బాలింతలకు స్తన్యం ఎక్కువగా వస్తుంది.

·         ఔషధంగా...
·        అజీర్ణం, ఆకలి మందగించడం, వికారం వంటి లక్షణాలు ఉన్నప్పుడు, గుండెల్లో మంట, కడుపులో నొప్పి, ఆహారం సహించకపోవడం, నీళ్ల విరేచనాలను వెంటనే అరికడుతుంది.
·        వేళకు భోజనం చేయకపోవడం, అతిగా భుజించడం, ఆల్కహాల్ వంటివి ఎక్కువగా తాగటం, మానసిక ఒత్తిడి, మితిమీరిన టెన్షన్ వంటివి జీర్ణకోశాన్ని నష్టపరుస్తాయి. ఇలాంటి సమయంలో బొప్పాయి పండు అమోఘంగా పనిచేస్తుంది.
·        బొప్పాయి కాయలను కూరగా వండుకుని రెండు వారాలు తింటే జీర్ణకోశ వ్యాధులు నయమవుతాయి.
·        బొప్పాయిలో ఫాస్పరస్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. దీనిద్వారా మనిషి ఎదుగుదలకు, కళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
·        ఆకలి లేకపోవటం, బలహీనత వంటి వాటికి బొప్పాయి అరచెక్కను తింటే ఆకలి పెరగడమే కాకుండా బలహీనత తగ్గుతుంది. ఒక స్పూను బొప్పాయి పాలను తీసుకున్నా ఆకలి పుడుతుంది.

·         సౌందర్య సాధనంగా
బొప్పాయిపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, నునుపుగా చేస్తుంది.

డెంగీ జ్వ‌రం వ‌చ్చిన వారి శ‌రీరంలో ప్లేట్‌లెట్ల‌ను పెంచేందుకు బొప్పాయి పండు, ఆకులు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని అంద‌రికీ తెలిసిందే.

·         బొప్పాయి పండులో కొలెస్ట్రాల్‌ అంటే కొవ్వు లేదు, క్యాలరీలూ తక్కువే. అందుకే స్థూలకాయులు సైతం హాయిగా బొప్పాయిని తినొచ్చు.

కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్‌ తోడ్పడుతుంది. బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. విటమిన్‌ బి నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది.

·          కెరోటిన్‌, , బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలం. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీని వలన కొన్ని రకాల జబ్బులను కూడ తగ్గించవచ్చు.పచ్చికాయ అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది.

·          బొప్పాయి మంచి సౌందర్యసాధనం కూడా పనిచేస్తుంది. బొప్పాయిలోని తెల్లని గుజ్జుని ముఖానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది. మొటిమలూ తగ్గుతాయి. బొప్పాయి ఫేస్‌ప్యాక్‌ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది.


No comments:

Post a Comment