10 March 2019

సూఫీ సంగీతం




రూమి, హఫీజ్, బుల్లేహ్ షా, అమీర్ ఖుస్రో మరియు ఖ్వాజా గులాం ఫరీద్ వంటి సూఫీ కవుల రచనలచే ప్రభావితం అయిన ఆద్యాత్మిక లేదా భక్తిసంగీతం(devotional music)ను సూఫీ సంగీతం లేదా సూఫీ మ్యూజిక్ అని అందురు. సూఫీ సంగీతం సృష్టికర్తతో వ్యక్తికి ఉన్న బంధాన్ని సంగీతంతో మేళవించి మరింత బలపరుస్తుంది.

సూఫీ సంగీతం దైవికతతో  శ్రోతలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తుంది. సూఫీ సాహిత్యం మరియు సంగీతo సృష్టికర్త నుండి దూరం అగుట వలన కలిగే వేదనను వివరిoచును మరియు  సంగీతం లో తీవ్రంగా లీనమై భౌతిక ప్రపంచం నుండి  ఆధ్యాత్మిక విశ్వంలోకి అధిగమించడం, లేదా  పఠిస్తూ, గుండ్రంగా తిరుగుతూ  చివరకు ఆధ్యాత్మిక పారవశ్యం (wajd) తో ముగియడం సూఫీ సంగీతం యొక్క లక్షణం.

ధ్వని మరియు సంగీతం సూఫీతత్వం  యొక్క ప్రధాన అనుభవ కేంద్రంగా ఉన్నాయి ఎందుకంటే సంగీతం దైవిక దగ్గరికి చేరుకోవడానికి ఒక మార్గం అని నమ్మినవారికి సాధనంగా భావించబడుతుంది. సూఫీ సంగీతం అనేది 'ఆత్మ' మరియు 'ఆత్మ' ద్వారా 'ఆత్మ' యొక్క సంగీతంగా భావించబడుతుంది.
 
గత సహస్రాబ్ది కాలం లో  సూఫీ భావజాలం అనేక ఖండాలు మరియు సంస్కృతులు- ఆఫ్రికా ఎడారులు నుండి  అట్లాంటిక్ సముద్ర తీరం మరియు పాకిస్తాన్ మరియు ఇరాన్ పర్వతాలను దాటి వ్యాపిoచినది. సూఫీ సంగీతం  యొక్క వైవిధ్యం ఈజిప్టు పాలస్తీనా, సిరియా, టర్కీ / అనాటోలియా, పర్షియా, ఉజ్బెకిస్తాన్ మరియు భారతదేశం లో అన్ని సంస్కృతులతో సమృద్ధమైంది. సూఫీ సంగీతం  మొట్టమొదట, అరబిక్, పర్షియన్, టర్కీ మరియు తర్వాత వివిధ ప్రాంతాల మరియు సంస్కృతులలోని  వివిధ భాషల ద్వారా వ్యక్తీకరించబడింది. సూఫీ తత్వం వివిధ  కవితా రీతులు మరియు విభిన్న సంగీత శైలుల ద్వారా వ్యక్తీకరించబడినది.

దక్షిణ ఆసియా సూఫీ సంస్కృతిలో భాగమై ఉన్న  “ఖవ్వాలి” అనేది సూఫీ సంగీతం యొక్క యొక్క అత్యంత ప్రసిద్ధ రూపo.  ఇందులో తబలా. హార్మోనియం వంటి సంగీత వాయిద్యాల సహకారంతో పాటలు పాడుతుంటారు. అలాగే టర్కీ లో నెయ్ney (ఒక రీడ్ ఫ్లూట్) వంటి టర్కిష్ సాంప్రదాయిక వాయిద్యాలను కలిగి  “ఐయిన్Ayin” అని పిలువబడే సంగీత రూపానికి అనుగుణంగా గుoడ్రంగా సుడిగుండం రూపంలో తిరిగే   డెర్ర్విస్whirling dervishes యొక్క సెమSema వేడుకలకు సంగీతం  అనేది కేంద్రంగా ఉంది.

వెస్ట్ ఆఫ్రికన్ గ్నావా అనేది సూఫీ సంగీతం యొక్క మరొక రూపం. ఇండోనేషియా,ఆఫ్ఘనిస్థాన్ నుండి మొరాకోకు వరకు గల సూఫీలు వారి అభ్యాసాలకు కేంద్ర బిందువుగా సంగీతంను రూపొందించారు. 

ధ్వని మరియు సంగీతం సూఫీవాదం యొక్క అత్యంత ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు, వినడం, ధ్వనించడం chanting  మరియు సంగీతానికి అనుగుణంగా గుoడ్రంగా తిరగటం   సూఫీ సంగీతం లో  సాధారణం. మొరాకోలో రమదాన్ పవిత్ర నెల ఆరంభానికి ముందు మార్మిక  రాత్రిని  ((Derdeba దెర్దేబా) తీసుకురావడానికి గ్నావా (లేదా గ్నౌవ) Gnawa (or Gnaoua)  ఆచారానికి అనుగుణమైన మార్మిక పాటలు పాడతారు. బ్రెజిల్, క్యూబా మరియు హైతిలోని ఆఫ్రికన్ వలసదారులు కూడా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. సెనెగల్ వాసులైన మౌరైడ్స్ (Mourides) జాంగ్  (Njang) పఠనం ద్వారా దేవుడితో బంధం  పెంచుకొంటారు.

మొరాకో, ఈజిప్ట్, సెనెగల్, ఇండోనేషియా, టర్కీ, ఇరాన్, బాల్కాన్స్ మరియు కాకుసస్ Balkans and the Caucuses ప్రాంతాలలో  స్థానికంగా బాగా ప్రాచుర్యం పొందిన ఇతర సూఫీ సంగీత శైలులు "సహోదర సంగీతం /బ్రదర్హుడ్ మ్యూజిక్Brotherhood music " గా ప్రసిద్ధి చెందాయి. ట్యునీషియా, అల్జీరియా, లిబియా మరియు మొరాకో వంటి నార్త్-ఆఫ్రికన్ అరబ్ ఆండలూషియన్ సంస్కృతులలో స్థానిక సంగీత శైలి “మాల్యుఫ్ ma'louf” లో అరబిక్ కవిత్వాన్ని (కసిదాహ్ qasidah) వినిపిస్తూ, ట్రాన్స్ (wajd) కు దారితీస్తుంది. మొరాకోలో ఉన్న "బ్రదర్స్" వలయాకారం లో పరస్పరం చేతులను బంధించి పాడుతూ లయ  లేని నృత్యం చేస్తారు. సిరియా మరియు టర్కీ యొక్క దర్విష్ “ఔద్, , రబాబ్, క్వాన్యున్, నేయ్ మరియు జుక్ర Oud, Rabab, Qanun, to Ney and Zukra), Bendir and Darbuka.” వంటి సంగీత వాయిద్యాలతో పాటు, బెండిర్ మరియు ధర్భుక ( Bendir and Darbuka).” వంటి సంగీత వాయిద్యాలతో ఆత్మ లోనికి చొచ్చుకు పోయే లయతో కూడిన మేలోడిలను పాడుతూ నృత్యం చేస్తారు

ఖవ్వాలి.
సూఫీ కవుల  సోలో ప్రేమ గీతాలు తరచుగా గజల్స్  మరియు కఫీ రూపంలో హర్మోనియుం,తబలా  వంటి సంగీత వాయిద్యాల సహాయంతో  పాడబడును. ప్రస్తుతం ఈ సంగీతాన్ని సినిమాలలో ఎక్కువుగా వాడుతున్నారు. అనేకమంది గాయకులూ ఖవ్వాలి సంగీతానికి ప్రపంచ ఖ్యాతి తెచ్చారు.


సూఫీ సంగీతకారులు:


ఆధునిక కాలంలో అత్యుత్తమ సూఫీ  సంగీత గాయకురాలుగా పాకిస్తాన్ కు చెందిన “అబిదా పర్వీన్”   అత్యంత ప్రముఖ్యత పొందినది. “సనమ్ మార్విSanam Marvi అనే మరో పాకిస్తానీ గాయని ఇటీవల తన సూఫీ సంగీత  గాత్ర ప్రదర్శనలకు గుర్తింపు పొందింది. పాకిస్తాన్ మ్యూజిక్ కంపనీ “సోల్ స్పీక్స్ Soul Speaks  యజమాని  అస్రార్ షా Asrar Shah లాహోర్ ఆధారిత “కోక్ స్టూడియో పాకిస్తాన్ Coke Studio Pakistan” లో తన సూఫీ సంగీత ప్రదర్శనలకు ప్రజాదరణ పొందినాడు.

ఆస్కార్ విజేత అయిన ఇండియన్ సంగీతకారుడు A. R. రెహమాన్, సూఫీ సంగీత కళా ప్రక్రియల  నుండి ప్రేరణను పొంది అనేక ఖవ్వాలి సిని గీతాలకు సంగీత కూర్పు చేసినాడు. వాటిలో జోదా అక్బర్ చలన చిత్రం లోని  ఖ్వాజా మేరే ఖ్వాజా Khwaja Mere Khwaja” అనే గీతం, “ఫీజా” చిత్రం లోని “పియాహాజీ అలీ Piya Haji Ali in Fiza 2000”అనే గీతం  “ఢిల్లీ 6” అనే చలన చిత్రం లోని  “అర్జియాన్ Arziyan” మరియు రాక్ స్టార్Rockstar చిత్రం  లోని “కున్ ఫయా కున్ Kun Faya Kun” అనే గీతం ప్రసిద్ది చెందాయి.

శంకర్-శంభు, వడాలిబ్రదర్స్  (wadali brothers),సాబ్రి బ్రదర్స్ (Sabri brothers),  నస్త్రత్ ఫతే అలీ ఖాన్, రహత్ ఫతే అలీ ఖాన్,గులాం అలి, బడే గులాం అలీ ఖాన్,AR రహ్మాన్, రాగిణి రేను, హర్దీప్ కౌర్, సలీం సులేమాన్, రషిద్ ఖాన్ ఉస్తాద్  సుప్రసిద్ద సూఫీ సంగీత కారులు.

భారత దేశం లో హన్స్ రాజ్ హన్స్, కైలాష్ ఖేర్,అల్తాఫ్ రాజా, బంగ్లాదేశ్ లో రునా లైనా, పాకిస్తాన్ లో రేష్మా,  అనేక సూఫీ గీతాలను పాడారు.
బంగ్లాదేశ్ గాయకుడు లాలాన్ ఫకీర్ మరియు బంగ్లాదేశ్ జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం అనేక సుఫీ పాటల కర్తలు.
పాకిస్తాన్ నుండి వచ్చిన బ్యాండ్ “జునూన్”, ఆధునిక హార్డ్ రాక్ మరియు సాంప్రదాయ జానపద సంగీతాన్ని సూఫీ  కవిత్వంతో కలపడం ద్వారా కొత్త ఉరవడిని సృష్టించింది.
2005 లో, రబ్బీ షేర్గిల్Rabbi Shergill "బుల్లా కి జానాBulla Ki Jaana" అని పిలవబడే సూఫీ రాక్ పాటను విడుదల చేశాడు. ఇది భారతదేశం మరియు పాకిస్థాన్లలో జనరంజకం అయినది.  
మడోన్నాMadonna, తన  1994 రికార్డు “బెడ్ టైం స్టోరీస్Bedtime Stories, లో, "బెడ్ టైం స్టొరీBedtime Story " గా పిలువబడే ఒక పాట పాడింది.ఆ పాట వీడియో అనేక డర్విష్ డ్యాన్స్, అరబిక్ నగీషీ వ్రాత Arabic calligraphy మరియు కొన్ని ఇతర సూఫీ రీతులను చూపుతుంది.  ఆమె 1998 లో పాడిన పాట "బిట్టెర్ స్వీట్ Bittersweet " లో అదే పేరుతో ఉన్న  “రూమి” యొక్క కవితలను చదువుతుంది. తన  2001 ద్రౌండ్ వరల్డ్ టూర్ Drowned World Tour లో, మడోన్నా ఒక సూఫీ నృత్యంతో సహా పలు మతాల ఆచారాలను చూపించే పాట "సీక్రెట్ Secret " పాడింది.
గాయకుడు-పాటల రచయిత అయిన లూరీనా మక్కెనిట్Loreena McKennitt's ది మాస్క్ అండ్ మిర్రర్The Mask and Mirror (1994) అనే చిత్రం లో పాడిన  "ది మిస్టిక్స్ డ్రీమ్ The Mystic's Dream " అనే పాటను సూఫీ సంగీతం మరియు కవిత్వం ప్రభావితం చేసింది.
“మీ వితౌట్ యు me without You” అనే బ్యాండ్ వారి ఆల్బమ్ “ఇట్స్ ఆల్ క్రేజీ!ఇట్స్ అల్ ఫాల్స్! ఇట్స్  ఎ డ్రీమ్! ఇట్స్ ఆల్రైట్It's All Crazy! It's All False! It's All a Dream! It's Alright (2009)” లో కొన్ని సూఫీ కథల  ఉపమానాలు Sufi parables ఇచ్చారు.  టోరి అమోస్ అనే ఆమె తన  పాట "క్రూయల్ Cruel " లో సూఫీల గురించి ప్రస్తావించినది.
 మెర్కాన్ డేడ్ Mercan Dede ఒక టర్కిష్ స్వరకర్త, అతను సూఫీతత్వం ను తన సంగీతం మరియు ప్రదర్శనలలో  చేర్చుతాడు.
షోరే మోవేనియన్Shohreh Moavenian, అనే ఆమె ఇరానియన్ గాయకురాలు. ఆమె అనేక   రూమి యొక్క కవితలను గానం చేసింది. ఆమె "మౌలానా  & షోర 1 మరియు 2 Moulana & Shora 1 and 2" " అనే పేరుతో రెండు ఆల్బమ్స్ తయారు చేసింది. ఇందులో ఆమె పాప్ మరియు సాంప్రదాయ పర్షియన్ సంగీత రీతులను మేళవించినది.  
















No comments:

Post a Comment