ఇస్తాంబుల్ లోని ఇస్లామిక్ సైన్స్ మ్యూజియం సందర్శన సెమినార్లు,
అకాడమీలు గ్రంధాలయాలు మరియు మధ్యయుగ ఇస్లామిక్ సామ్రాజ్య ప్రయోగశాలల విక్షణానికి
అవకాసం కల్పిస్తుంది.
9 నుంచి 16 వ శతాబ్దo
వరకు ఇస్లామిక్ కాలిఫేట్స్ మరియు ముస్లిం సామ్రాజ్య
రాజవంశాల క్రింద ఉన్న ప్రాంతాలలో సైన్స్ మరియు టెక్నాలజీ వికాసం చెందిన బంగారు
కాలం. ఈ కాలంలో గ్రీకులు మరియు భారతీయుల నుండి విజ్ఞానాన్ని గ్రహించిన ప్రఖ్యాత అరబ్ శాస్త్రవేత్తలు నూతన కల్పనలు,
గణనీయమైన ఆవిష్కరణలు మరియు శాస్త్ర పరికరాలు రూపొందించారు. ఆ కాలంలో శాస్త్ర విజ్ఞానం గణనీయంగా ఇస్లామిక్ ప్రపంచం లో వికాసం పొందినది.
ఆ తరువాత కాలం లో అనేక
కారణాలవలన ముస్లిం ప్రపంచంలో విజ్ఞాన ప్రగతి క్షిణిoచినది. ముస్లిం ప్రపంచం నుండి విజ్ఞాన లాభం పొందిన
పశ్చిమ దేశాల వారు రాజకీయ మరియు సాంస్కృతిక, శాస్త్ర వికాసంతో లాభపడినారు. విజ్ఞాన ఆవిష్కరణలపై పశ్చిమ ప్రాంతం ఆధిపత్యం ప్రారంభం అయినది. క్రమంగా
ప్రస్తుత కాలం లో విజ్ఞాన,సాంకేతిక
పరిజ్ఞాన చక్రం దూర తూర్పు ప్రాంతాల వైపు అనగా జపాన్ మరియు చైనా వైపు మరలింది.
ఇస్తాంబుల్ లోని ఇంపీరియల్
స్టేబుల్ లో గల మ్యూజియం ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ఇస్లామిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ
(ఇస్లాం బిలిమ్వీ టెక్నోలాజీ తారిహి ముజీసీ Islam
Bilimve teknologi Tarihi Muzesi)) వివిధ రకాల వస్తువులు, పటాలు, వివిధ
రంగాలకు సంబంధించిన అంశాలను మరియు పరికరాలను ప్రదర్శిస్తుంది. ఈ మ్యూజియం ఇస్తాంబుల్ లోని గుల్హేన్ పార్కులో (రోజ్ గార్డెన్) ఉంది.
గుల్హేన్ పార్కు ఇస్తాంబుల్ నగరం యొక్క అత్యంత సుందరమైన భాగం. మ్యూజియం 3,500 చదరపు మీటర్స్
విస్తీర్ణం కలిగి ఉంది.ఈ కాంప్లెక్స్ లో మరో రెండు సంగ్రహాలయాలు కలవు అవి 1. పురావస్తు
మ్యూజియం మరియు 2.క్రిస్టల్ ప్యాలెస్- టైల్స్
కోసం ఒక మ్యూజియం.
మ్యూజియమ్ ఏర్పాటు ఇస్లామిక్
పండితుడు ఫ్యూత్ సేజిన్ Fuat Sezgin (1924-2018)
యొక్క ఆలోచన మరియు దానికి టర్కీ అధ్యక్షుడు (తరువాత ప్రధాన మంత్రి) రెసెప్ తయ్యప్
ఎర్డోగాన్ Recep Teyyip Erdogan మరియు
ఇస్తాంబుల్ మున్సిపాలిటీ భౌతిక మరియు ఆర్ధిక మద్దతు ఇచ్చినారు. ఇంతకుముందు ప్రొఫెసర్
సెజిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది హిస్టరీ అఫ్ అరబిక్-ఇస్లామిక్ సైన్స్ ను ఫ్రాంక్ఫర్ట్ లోని జోహన్ వోల్ఫ్గ్యాంగ్ గోథే
యూనివర్సిటీలో స్థాపించారు.
ఒక పెద్ద గ్లోబ్ మ్యూజియం ప్రవేశద్వారం
వద్ద ఉన్నది. ఖలీఫా మమునార్-రషీద్ (813-833 CE) ఆదేశాలపై
భూగోళం యొక్క మ్యాప్ తాయారు చేయబడినది. ఆనాటి
భూగోళ శాస్త్రం యొక్క కచ్చితత్వాన్ని
మ్యాప్ తెలిసినది. ఇస్తాంబుల్ మ్యూజియం అనేది గోథీ విశ్వవిద్యాలయంలో రెండు
దశాబ్దాలు పాటు ఇస్లామిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగ అధిపతిగా వ్యరించిన ప్రొఫెసర్ ఫ్యూత్ సేజిన్ Fuat Sezgin యొక్క కలలకు
తుది రూపం.
ఇస్తాంబుల్ లో టర్కిష్
ప్రభుత్వం యొక్క ఉదార సహాయంతో అతను వివిధ పరికరాలను మరియు నమూనాలను
పునర్నిర్మించినాడు. ఖగోళ శాస్త్రం, భూగోళ
శాస్త్రం, నాటిక్స్, సమయ గణన మరియు భ్రాంతి, జ్యామితి, ఆప్టిక్స్, ఔషధం, కెమిస్ట్రీ, ఖనిజశాస్త్రం, భౌతికశాస్త్రం, సాంకేతికతలు, వాస్తుశిల్పం
మరియు సైనిక యంత్రాల విభాగాలలో నిర్మించిన అనేక వస్తువులను క్రమబద్దం గా
ప్రదర్సన లో ఉంచినారు.
మ్యూజియంలో ప్రదర్శించిన
కొన్ని కళాకృతులు:
1. బాగ్దాద్
యొక్క ముస్సన్సిరియా అకాడమీ: 1227 లో
బాగ్దాద్ లోని టిగ్రిస్ నది ఒడ్డున అబ్బాసీడ్ ఖలీఫా ముస్తాన్
సర్ బిల్లాః (Mustansirbillah). ద్వారా అకాడమీ స్థాపించబడింది. ఇది బహుశా అతి పురాతన అరబిక్ -ఇస్లామీయ
అకాడమీ. ఇక్కడ నాలుగు ఇస్లామిక్ సాంప్రదాయ న్యాయ/ఫీకా పాఠశాలలు, ఔషధం
మరియు గణిత శాస్త్రాలు కూడా బోధించబడ్డాయి. ఇది 400 నిర్వహణ
పనివారిని కలిగి ఉన్నది. అకాడమీ ఒక పెద్ద లైబ్రరీని కలిగి ఉంది. బాగ్దాద్ పై
మంగోలు విజయం తరువాత ఇది దోపిడీ చేయబడింది. ఖలీఫా అకాడమీని తరచుగా సందర్శించి, విద్వాంసుల
ఉపన్యాసాలను ప్రత్యేకంగా అతని కోసం నియమించిన స్థలం నుండి వినేవారు. అప్పడప్పుడు
అక్కడ అతిథులు
కోసం అధికారిక విందులు జరిగేవి.
ఈ భవనం 1258 లో నాటి మంగోలుల
దండయాత్ర మరియు తదుపరి జరిగిన విద్వoసం ను
తట్టుకొని నిలిచినది. ఒక దశాబ్దం తరువాత అకాడమీ మరోసారి పనిచేయడం ప్రారంభించింది. అయితే
ఇది గత కొన్ని శతాబ్దాలుగా చాలా నిర్లక్ష్యం చేయబడినది. 1945 మరియు 1963 మధ్య
పునరుద్ధరణ తరువాత, భవనం ఇప్పుడు ఇస్లామిక్ సంస్కృతి మరియు కళ మ్యూజియం యొక్క భాగం గా మారినది.
2.గాలిమర (Windmill): 13 వ శతాబ్దం లో షాంస్ అల్-దిన్
అల్-డిమాష్కి (Shams al-Din al-Dimashqu)i భూగోళ శాస్త్రంపై రచించిన పుస్తకంలోని చిత్రలేఖనం మరియు వర్ణనల పై ఆధారపడి మ్యూజియమ్
లోని నమూనా రూపొందించబడింది.
3.నీటి గడియారం(వాటర్ క్లాక్): 1362 లో ఫేస్ (మారాకో) లోని ఖరావియైన్
మసీదులో నిర్మించబడిన అద్భుతమైన నీటి గడియారం ప్రతిరూపం ఇక్కడ ప్రదర్సించబడినది. ఫ్రాంక్ఫర్ట్ / మెయిన్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిస్టరీ ఆఫ్
అరబిక్-ఇస్లామిక్ సైన్స్ ద్వారా ఇటీవల ఇది పునరుద్ధరించబడింది. పారే నీటి ప్రవాహం గడియారం కి శక్తి మరియు నియంత్రణను
అందిస్తుంది. ఎగువ గ్యాలరీలోని 24 తలుపులు ప్రతి గంటకు ఒకదాని
తరువాత ఒకటి మూసుకొంటాయి. ప్రతి నాలుగు
నిమిషాలకు ఒక చిన్న మెటల్ బంతి ఒక మెటల్
గిన్నె లోకి పడిపోతుంది మరియు ఒక రకమైన ధ్వని/టోన్ వినబడుతుంది. ఎడమవైపు ఉన్న డయల్
నక్షత్రాల వాస్తవ స్థానం మరియు ఆకాశంలో గ్రహణాన్ని ప్రదర్శిస్తుంది.
4.కలావున్ హాస్పిటల్, కైరో: కైరోలో 1284 లో నిర్మించిన కలావున్ ఆసుపత్రి
మామ్లుక్ సుల్తాన్ అల్ మాలిక్ అల్-మన్సూర్ సైఫద్దిన్ ఖలావున్ చేత నిర్మించబడినది. కలావున్
ఆసుపత్రి, బాగ్దాద్ (981) లోని అదీయుస్సోపిటల్ (Adudihsopital) మరియు దమస్కుస్ (1154) లోని నూర్ద్దీన్ (Nuraddin) ఆసుపత్రి తరువాత, ఆ సమయంలో ఇస్లామిక్ ప్రపంచంలో స్థాపించబడిన మూడు ప్రధాన ఆసుపత్రులలో
అత్యంత అధునాతనమైనది. ప్రత్యేక చికిత్సలు (specialised
treatments), మానసిక అనారోగ్యం లేదా ఇన్సోమ్నియా రోగులకు సంగీతాన్ని అందిoచడం, అంతర్గత వైద్య శిక్షణ, విస్తృతమైన పరిపాలన, ఆర్ధిక లేమితో బాధపడుతున్న వారికి ఎండోమెంట్ నుండి ఆర్ధిక సహాయం వంటి సౌకర్యాలను
ఆస్పత్రి అందించేది. కలావున్ ఆసుపత్రి తరువాతి కాలంలో ఐరోపాలోని ఇతర ఆసుపత్రులకు
నమూనాగా పనిచేసినట్లు భావిస్తున్నారు.
5.వాయువ్య ఇరాన్ లోని మరఘ అంతరిక్ష పరిశీలనా కేంద్రం నుండి ఖగోళ గ్లోబ్ Celestial globe from observatory of Maragha (North-West Iran)::
1279 లో, 14.4 సెం.మీ. వ్యాసం ఉన్న ఒక ఖగోళ గ్లోబ్ను
సుప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడు ముహమ్మద్ అల్-దిన్ అల్-ఉర్ది కుమారుడైన ముహమ్మద్ అల్-ఉర్ది నిర్మించారు. ఇది కాంస్యo నుండి తయారు
చేయబడింది. ఖగోళ నక్షత్రరాశిలతో పాటు భూమధ్యరేఖ మరియు రేఖాంశ వృత్తాలు వెండి మరియు
బంగారంతో పొదగబడి ఉన్నాయి. హోరిజోన్ ను సూచించే చుట్టుప్రక్కల వృత్తాలు,
మెరిడియన్
మరియు ప్రధాన నిలువు వివిధ భౌగోళిక అక్షాంశాలకు సర్దుబాటు చేయబడినవి. గ్లోబ్ నిజానికి వాయువ్య ఇరాన్లోని మరాఘు యొక్క
ప్రసిద్ధ వేధశాలకు చెందినది, కానీ అది 1562 లో డ్రెసెన్కు బదిలీ చేయబడింది, అప్పటి నుండి అది అక్కడ భద్రపరచబడింది.
6. నార్త్-వెస్ట్ ఇరాన్ మరఘ లోని సిక్స్-సిలిండర్ పంప్ (Six-cylinder pump Maragha (NORTH-WEST IRAN)
మధ్యయుగ ఇస్లామిక్ టెక్నాలజీ యొక్క అత్యంత
సాధారణ అనువర్తనాల్లో ఒకటి ఊర్ధ తలానికి వేగంగా నీటిని పoపించటం. 13 వ శతాబ్దం లో అల్-జజారీ చేత నిర్మించబడిన రెండు సిలిండర్ల నీటి పంపులు అప్పటికే
ఉన్నప్పటికీ 1553 లో ఆరు సిలిండర్ల నీటి పంపును
ఒట్టోమన్ పాలిమత్ తఖ్ అల్-దిన్ కనుగొన్నారు. ఇది ఆ కాలం లో మరింత అభివృద్ధి
చేయబడిన ఆవిష్కరణ గా పరిగణించ బడింది. ఒక
కంషాఫ్ట్ మరియు ఆరు సిలిండర్ల సహాయం తో నీటిని వేగంగా పైకి పంప్ చేయటం జరుగుతుంది.
7.యెమెన్ సుల్తాన్ అల్-అష్రాఫ్ యొక్క
ఆస్ట్రోలాబ్ (Astrolabe of the Yemeni
Sultan al-Ashraf)
మధ్యయుగ
ఇస్లామిక్ ప్రపంచం లోని అనేక ప్రాంతాల్లో చాలామంది పాలకులు మరియు ఉన్నతాధికారులు
శాస్త్రీయ పరిశోధన మరియు శాస్త్ర పరికరాల నిర్మాణంలో చురుకుగా పాల్గొన్నారు. 1295 నుండి 1296 వరకు యెమన్ సుల్తాన్గా పనిచేసిన అల్-అష్రాఫ్
ఉమర్ దీనికి ఒక ఉదాహరణ. ఈ మ్యూజియం అల్-అష్రాఫ్ 1291 లో
నిర్మించిన ఆస్ట్రోలాబ్ యొక్క ప్రతిరూపం కలిగి ఉంది, ఒరిజినల్ అస్త్రోలబ్ ఇప్పుడు
న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో ఉంది. అల్-అష్రాఫ్ అస్త్రోలబ్స్ నిర్మాణం గురించిన వివరాలను ఒక గ్రంధం లో వివరించాడు. మరియు
దాని విశిస్టతను ఆనాటి పండితులు
శ్లాఘించారు. ఈ మ్యూజియంలో కాలక్రమానుసారం 31
ఆస్ట్రోలాబ్ ప్రదర్శించబడుతున్నాయి.
No comments:
Post a Comment