29 March 2019

ఆరోగ్యం, శారీరక వ్యాయాయం, శాఖాహారం పై మహాత్మా గాంధీ మార్గదర్శకాలు.




 Mahatma

మహాత్మా గాంధీ శారిరిక దృడత్వ పిపాసి (Physical fitness freak), సమత్యుల  ఆహార  సమర్ధకుడు మరియు శాఖాహార మార్గదర్శి అని చెప్పవచ్చు.  

మహాత్మా గాంధీ బోధించిన మంచి ఆరోగ్య సూత్రాలు: నడక, శారీరక శ్రమ, తాజా కూరగాయలు మరియు పండ్లు, తక్కువ చక్కెర, ఉప్పు మరియు కొవ్వులు(Fats), పొగాకు మరియు ఆల్కహాల్ పై పూర్తి నిషేధo,  పరిసరాల పరిశుభ్రత మరియు  వ్యక్తిగత శుభ్రత.  పై ఆరోగ్య సూత్రాలు  అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ/ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణకు సూచించే మార్గదర్శకాలు గా కన్పించవచ్చు కానీ వాస్తవానికి ఇవే సూత్రాలను మంచి ఆరోగ్యానికి సంబంధించిన సిద్ధాంతాల రూపంలో భారత జాతి పిత మహాత్మా గాంధీ ఒక శతాబ్దం క్రితం బోధించారు.

అనేక మంది పోషకాహార నిపుణులు మరియు మరియు ప్రజా ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ ఆరోగ్య సూత్రాలు శాస్త్రీయ ఆధారత కలిగి ఉన్నాయి. పోషకాహార లోపం, హృదోగం వంటి ఆరోగ్య సమస్యలపై విజయం సాధించడానికి ఇవి సహాయపడతాయి.

అపరిమితంగా ఆహారం భూజించడం, చాలా తరచుగా భోజనం చేయడం  మరియు ఎక్కువ సాంద్రత గల పిండిపదార్ధాలు మరియు చక్కెర వినియోగం  అనారోగ్యకరమైనది  మరియు అది వ్యాధుల కు దారి తీయును అని గాంధీ భావించెను. గాంధీ సాధ్యమైనంత వరకు తీపి పదార్ధాల వినియోగం ను తగ్గించి చిన్న పరిమాణంలో గోర్ (బెల్లం) వినియోగంను సూచించేను.

గాంధీ  పోలిష్ బియ్యం లేదా రిఫైనింగ్ గోధుమ పిండి యొక్క వినియోగమును వ్యతిరేకించెను. గాంధీ "గోధుమ పిండి యొక్క పోలిష్(sieving)ను వ్యతిరేకించెను.అట్లు చేయుట వలన  పోషక రూపంలో  చాలా విలువైన లవణాలు మరియు విటమిన్లు పుష్కలంగా వుండే భుసి/ ఊక లేదా పెరికార్ప్ తొలగించబడును. "అని అన్నారు.

ఈ సూచనలు అన్ని ప్రస్తుత పోషకాహార నియమాలకు తగినట్లుగా ఉన్నాయని ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (IJMR) వారి జర్నల్ స్పెషల్ ఇష్యూ లో హైదరాబాద్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN)కు చెందిన పోషకాహార నిపుణులు సుబ్బారావు, ఆర్. హేమలత ప్రచురించిన ఒక పేపర్  లో పేర్కొన్నారు.    వారి ప్రకారం "ఆహారం లో కొవ్వులు / నూనెల (fats/oils) అవసరం గాంధీ గుర్తించారు. నేటికి కూడా, NIN చే అభివృద్ధి చేయబడిన ఆహార మార్గదర్శకాల ప్రకారం  మొత్తం రోజువారీ కేలరీల్లో 10%, కనిపించే కొవ్వుల (visible fats) నుండి ఉండాలని సూచిస్తున్నాయి." అని అన్నారు.

గాంధీ జీ చేసిన  కొన్ని ఆహారపదార్ధాల సిఫార్సులు ఈ రోజుకు  కూడా వర్తిoచును అని  పరిశోధకులు గమనించారు. "నేడు, మన ఆహార అలవాట్లు,  మన జీవన శైలి పై ఆధార పడి ఉన్నాయి. నేడు 'స్థానికంగా పెరిగిన(Locally Grown)', 'తక్కువ నూనె మరియు ఉప్పు', 'తక్కువ చక్కెర,' ' తాజా వ్యవసాయ (farm fresh)’', తక్కువ కొవ్వు(Less Fat) ' అనే   పదాలు తరుచుగా వినిపిస్తున్నాయి. న్యూట్రిషన్ సైన్స్ తాజా కూరగాయలు, పండ్లు లేదా పెరుగు యొక్క ప్రోబైయటిక్ సంభావ్యత కు ప్రాధాన్యత ఇచ్చి  చక్కెర,ఉప్పు  మరియు శుద్ధిచేసిన ఫ్లోర్/పిండి యొక్క  దుష్ప్రభావాలను తెల్పుతుంది. వాకింగ్, రెగ్యులర్ గా వ్యాయామం మరియు వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుబ్రత అలవాట్లు అనేవి ఆరోగ్య రీత్యా మంచివి. గాంధీ జీ ప్రభోదించిన మరియు పాటించిన ఈ నియమాలు చాలా మంచివి అని పరిశోధకులు ప్రచురించిన పేపర్   నిర్ధారించింది.

శాస్త్రవేత్తలతో జరిపిన చర్చలలో గాంధీ తన జ్ఞానమును పంచుకొన్నాడు మరియు బ్రిటీష్ ఇండియాలో కొంత మేరకు వైద్య పరిశోధనను కూడా ప్రభావితం చేశాడు. గాంధీ పాలు సేవించరాదనీ ప్రతిజ్ఞ చేశాడు. ఆహారం మరియు ఆహారపదార్థాలపై వాడకం పై ముఖ్యంగా పాలు వాడటం పై  NIN యొక్క మొదటి డైరెక్టర్ అయిన రాబర్ట్ మెక్కార్రిసన్ తో గాంధీ సుదీర్ఘ సంభాషణలు జరిపినాడు. "ఆ చర్చల పలితం పోషకాహార రంగంలో పరిశోధనలను  వేగవంతం చేసినదని " ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ అభిప్రాయపడ్డారు.

అంటువ్యాదుల నివారణ  రంగంలో గాంధీ దోమల పెంపకం కేంద్రాలను (mosquito breeding sites) నాశనం చేయడం, దోమలు సంతానోత్పత్తి నిరోధించడానికి మరియు మలేరియా వ్యాప్తిని అరికట్టడానికి నీటి కంటైనర్లను పర్యవేక్షించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. క్వినైన్ మాత్రల పంపిణీ కంటే గాంధీ ఈ పద్ధతులను అనుసరించడం  మరింత ప్రభావవంతంగా ఉంటుందని భావించారు. కుష్ఠురోగం మరియు క్షయవ్యాధి వచ్చిన వారిని ఏకాంతంగా దూరంగా ఉంచడం కంటే  మానవ పరిసరాలలో ఆ  వ్యాధుల తొలగింపుకు  గాంధీ ప్రాధ్యాన్య మిచ్చారు.

గాంధీ ఒక ఫిట్నెస్ ఫ్రీక్. జర్నల్ లో ప్రచురించబడిన అతని ఆరోగ్య నివేదికల ప్రకారం జాతి పిత శరీర బరువు 46.7 kg మరియు అతని ఎత్తు5 అడుగుల  5 అంగుళాలు.  అతని బాడీ మాస్ ఇండెక్స్17.1 అనగా అతను తక్కువ  బరువును కలిగి ఉన్నాడు. అతను 40 సంవత్సరాల పాటు  ప్రతిరోజూ 18 కిలోమీటర్లు నడిచేవాడు. 1913 నుండి 1948 వరకు తన రాజకీయ ప్రచార సమయంలో మొత్తం 79,000 కిలోమీటర్ల దూరం నడిచాడు. అది భూమి చుట్టూ రెండు సార్లు నడవటానికి సమానం.

నిజానికి గాంధీజీ   అనేక ఆరోగ్య సమస్యలతో -ప్లురసితో  (1914), మలేరియాతో  (1925, 1936 మరియు 1944), గ్యాస్ట్రిక్ ఫ్లూ తో (1939) మరియు ఇన్ఫ్లుఎంజాతో  (1945) బాధపడ్డారు.  పైల్స్   (1919) మరియు అపెండిసైటిస్  (1924) తొలగించడానికి అతనికి ఆపరేషన్లు జరిగినవి.  అయినా అతను నడకను విడువలేదు. క్రమశిక్షణా జీవనశైలి లో భాగంగా భౌతిక దృఢత్వo మరియు సమతుల్య ఆహారం మీద గాంధి  దృష్టి పెట్టినారు.

"గాంధీ అలోపతి, వైద్యాస్ మరియు హకీమ్స్ ను వ్యతిరేకిoచనప్పటికి  అతని ప్రాధాన్యత ప్రకృతి వైద్య మందులతో (naturalistic medicines) ఉంది. ప్రకృతివైద్యం అతని అభిరుచి. అయన ప్రకారం ప్రకృతి సూత్రాలను  పాటించ నందువలన జబ్బులు వస్తాయి.   ప్రకృతే దానిని సరిచేసుకోగలదని ఆయన భావించారు.  యాభై కన్నా ఎక్కువ సంవత్సరాలు ఆయన ప్రకృతి వైద్యాన్ని అభ్యసించారు "అని భార్గవ చెప్పారు. "అతను ఏ రకమైన ఆరోగ్య విధానాలకు వ్యతిరేకం కాదు. కానీ నివారణ సంరక్షణ మరియు చికిత్స అందు నమ్మకం ఉంచాడు ," అని భార్గవ చెప్పారు.  


No comments:

Post a Comment